Bapatla railway station
-
రైల్వేస్టేషన్లో మహిళ దారుణ హత్య
బాపట్ల (గుంటూరు) : గుంటూరు జిల్లా బాపట్ల రైల్వేస్టేషన్లో పట్టపగలే ఓ మహిళ హత్యకు గురైంది. వివరాల ప్రకారం.. బాపట్ల సివిల్ రోడ్డులో నివాసం ఉండే సీత(35) శనివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో రైల్వేస్టేషన్ రెండో నంబర్ ప్లాట్ ఫాం వద్ద కూర్చుని ఉండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. ఆమె వద్దకు వెళ్లి మాట్లాడుతూనే వెంట తెచ్చుకున్న బ్లేడుతో గొంతు కోశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. కొద్దిదూరంలో కూర్చుని ఉన్న ప్రయాణికులు చూస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర రక్తస్రావం కావటంతో సీత అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ ఘోరం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. -
నకిలీ టీసీ అరెస్టు
రైల్లో టీసీ కనిపించారా.. మీకు టికెట్ లేదనో, జనరల్ టికెట్ తీసుకుని రిజర్వేషన్ బోగీలో ప్రయాణిస్తున్నారనో బెదిరించారా? ఫైన్ రాయాలంటే వెయ్యి రూపాయలవుతుంది, నాకు 500 ఇస్తే సరేనన్నారా? అయితే ఒక్కసారి ఆ టీసీగారి గుర్తింపు చూపించమని అడగండి. ఎందుకంటే, ఇప్పుడు రైళ్లలో నకిలీ టీసీల బెడద కూడా ఎక్కువైపోయింది. గుంటూరు జిల్లాలో ఇలాంటి నకిలీ టీసీయే ఒకరిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. తెనాలి నుంచి ఒంగోలు వెళ్తున్న ప్యాసింజర్ రైల్లో ఇలా ప్రయాణికులను బెదిరిస్తున్న నకిలీ టీసీని బాపట్ల రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. -
ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఆత్మహత్య
బాపట్లటౌన్, న్యూస్‌లైన్ : ఏపీఎస్పీ కానిస్టేబుల్ పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బాపట్ల రైల్వేస్టేషన్లో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండల కేంద్రానికి చెందిన ఈపూ రి శ్రీనివాసరావు(40) 12వ బెటాలియన్‌కు చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్. హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తూ రెండు రోజుల క్రితం సెలవుపై గ్రామానికి వచ్చారు. శనివారం రాత్రి తిరిగి హైదరాబాద్ బయలుదేరారు. చెన్నై ఎక్స్‌ప్రెస్ వచ్చే సమయమైందం టూ రాత్రి 9 గంటలకే ఇంటి నుంచి బాపట్ల రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. రైలు వచ్చింది నేను వెళ్తున్నా అని ఫోన్లో భార్య, పిల్లలకు చెప్పారు. అయితే ఆదివారం తెల్లవారుజామున పురుగుమందు తాగి బాపట్ల రైల్వేస్టేషన్లో పడి ఉన్నాడని, బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించామని స్థానికులు కుటు ంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. వచ్చి చూసే సరికి శవమై కనిపించాడంటూ కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. మృతుడికి భార్య వెంకటలక్ష్మి, కుమార్తె సంధ్య, కుమారుడు మనోజ్గోపి ఉన్నారు. మాకు దిక్కెవరు...? తమకు దిక్కెవరంటూ శ్రీనివాసరావు తల్లిదండ్రులు చంద్రరావు, ప్రమీల కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఓ కుమారుడు శంకర్ రెండేళ్ల క్రితమే అనారోగ్యంతో మరణించాడని, రెండో కుమారుడు కూడా మృతి చెందడంతో వృద్ధాప్యంలో ఇక తమను చూసేదెవరని విలపిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.