బాపట్ల (గుంటూరు) : గుంటూరు జిల్లా బాపట్ల రైల్వేస్టేషన్‌లో పట్టపగలే ఓ మహిళ హత్యకు గురైంది. వివరాల ప్రకారం.. బాపట్ల సివిల్ రోడ్డులో నివాసం ఉండే సీత(35) శనివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో రైల్వేస్టేషన్ రెండో నంబర్ ప్లాట్ ఫాం వద్ద కూర్చుని ఉండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. ఆమె వద్దకు వెళ్లి మాట్లాడుతూనే వెంట తెచ్చుకున్న బ్లేడుతో గొంతు కోశాడు.
అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. కొద్దిదూరంలో కూర్చుని ఉన్న ప్రయాణికులు చూస్తుండగానే ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర రక్తస్రావం కావటంతో సీత అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ ఘోరం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
రైల్వేస్టేషన్‌లో మహిళ దారుణ హత్య
Published Sat, Sep 5 2015 5:13 PM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM
Advertisement
Advertisement