ఒలింపిక్ పార్క్‌లో ప్రమాదం
రియో డి జనీరో: ఒలింపిక్స్‌లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఒలింపిక్ పార్క్‌లో ఏర్పాటు చేసిన భారీ టీవీ స్క్రీన్ సోమవారం ప్రమాదవశాత్తు నేలకూలింది. దీంతో ఏడుగురికి గాయాలయ్యాయి. రియో ఒలింపిక్ పార్క్‌ను పైనుంచి చిత్రీకరించేందుకు బ్లాక్ కెమెరా పేరిట స్పైడర్ క్యామ్‌ను ఏర్పాటు చేశారు. అయితే కెమెరా బరువును తక్కువగా అంచనా వేసి ఏర్పాటు చేసిన కేబుల్ వైర్లు తెగిపోవడంతో బాస్కెట్ బాల్ స్టేడియం బయట ఈ ఘటన చోటు చేసుకుంది.
ఓ చిన్నసైజు మోటర్‌బైక్ పరిమాణంలో ఉన్న కెమెరా చాలా ఎత్తు నుంచి కింద పడుతున్నట్టు వీడియో ఫుటేజిలో కనిపించింది. మరో వీడియోలో గాయపడిన ఇద్దరు మహిళలు కనిపించారు. కెమెరా బరువు అధికంగా ఉండడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఒలింపిక్ బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ (ఓబీఎస్) పేర్కొంది.