bc welfare deputy director
-
బీసీ జాబితాలో మరో 30 కులాలు
సాక్షి, అంబర్‌పేట: వెనుకబడిన కులాల జాబితాలో మరో 30 కులాలను చేర్చేందుకు సమాయత్తమయ్యామని, కొత్తగా చేరే కులాలకు చెందిన వారికి ఏవైనా ఆక్షేపణలు ఉంటే జూలై 5లోపు తుది గడువుగా నిర్ణయించామని హైదరాబాద్ జిల్లా బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ విమలాదేవి వెల్లడించారు. గురువారం అంబర్‌పేట గోల్నాకలోని బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ చట్టంలోని 9(1)వ విభాగం ద్వారా ఈ నెల 15న నిర్వహించిన సమావేశంలో నిర్ణయించిన బీసీ జాబితాలోకి చేర్చే కులాల పేర్లను ఆమె వెల్లడించారు. కాకిపడగల, మందెచ్చెల సన్నాయోళ్లు/బత్తిన, మాసయ్యలు/ పటంవారు, సాధనశూరులు, రుంజ, పాపల, పనస, పెక్కర, పాండవులవారు, గౌడజెట్టి, ఆదికొడుకులు, తెరచీరల, సారోళ్లు, అరవ కోమటి, ఆహీర్ యాదవులు, గౌవిలి తదితర ముప్పై కులాలు వెనుకబడిన తరగతుల కులాల జాబితాలోకి చేరనున్నాయని ఆమె తెలిపారు. పైన పేర్కొన్న కులాలకు చెందిన వారు ఏవైనా ఆక్షేపణలు, అభ్యంతరాలతో పాటు సలహాలు, సూచనలు ఉంటే ఈ నెల 28 నుంచి జూలై 5 వరకు (సెలవు రోజులు మినహాయించి) హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ కార్యాలయంలో అఫిడవిట్‌తో పాటు తగిన ఆధారాలతో తెలియపరచాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సమావేశంలో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారులు మురళి, వరలక్ష్మి, సుధాకర్, రాధాకిషోరి పాల్గొన్నారు. -
విద్యార్థి మృతిపై విచారణ
శాయంపేట బీసీ గురుకులాన్ని సందర్శించిన డీడీ నర్సింహస్వామి పాఠశాలలో మౌలిక వసతులపై అసంతృప్తి మరుగుదొడ్ల కొరతపై తల్లిదండ్రుల ఫిర్యాదు విచారణ నివేదిక కలెక్టర్‌కు.. శాయంపేట : ఆరుబయట బహిర్భూమికి వెళ్లి నీటి గుంతలో పడి విద్యార్థి కొలిపాక విష్ణు మృతిచెందిన ఘటనపై జిల్లా బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) నర్సింహస్వామి మంగళవారం విచారణ చేశారు. ప్రమాద సంఘటన నేపథ్యంలో స్థానిక మహాత్మా జ్యోతి బాపూలే బీసీ గురుకుల పాఠశాలను ఆయన సందర్శిం చారు. ఈసందర్భంగా విద్యార్థి మృతి చెందిన నీటి గుంతను పరిశీలించారు. బడిలోని మరుగుదొడ్లను పరిశీలించి, నిర్వహణ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. 40 మరుగుదొడ్లకుగానూ 20 మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నా రు. విద్యార్థుల సౌకర్యార్ధం ఫ్యాన్లు అమర్చకపోవడంపై పాఠశాల బాధ్యులను నిలదీశారు. భోజనాలను కట్టెల పొయ్యి పై ఎందుకు వండుతున్నారంటూ సం బంధిత సిబ్బందిని డీడీ ప్రశ్నించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టికలను పరిశీలించారు. విద్యార్థుల సౌకర్యార్ధం 120 మరుగుదొడ్లను నిర్మించేందుకు ప్రణాళిక రూపొం దించి కలెక్టర్‌కు నివేదిస్తామన్నారు. ఏ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైనా వివరాలను నివేదికలో పొందుపరుస్తామన్నారు. విచారణ సం దర్భంగా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలు తరు చూ అనారోగ్యానికి గురవుతున్నట్లు డీడీ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆరాతీయ గా పాఠశాలకు సమీపంలోని డాంబర్ ప్లాంట్ నుంచి వెలువడే విష వాయువుల కారణంగా విద్యార్థులు అలర్జీ, ఆస్తమా బారిన పడుతున్నారని పలువురు పేర్కొన్నారు. ఈవిషయాన్ని కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని డీడీ నర్సింహస్వామి చెప్పారు. కాగా, విద్యార్థి విష్ణు మృతిచెందిన విషయం తెలియడంతో.. పలువురు తల్లిదండ్రులు మంగళవారం గురుకులానికి చేరుకొని తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. ఈక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల తీరుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొగుళ్లపల్లి విద్యార్థులను శాయంపేట పాఠశాలలో విద్యా బోధన చేస్తుండటం వల్లే ఇన్ని అసౌకర్యాలు ఎదురవుతున్నాయన్నారు.