విద్యార్థి మృతిపై విచారణ
-
శాయంపేట బీసీ గురుకులాన్ని సందర్శించిన డీడీ నర్సింహస్వామి
-
పాఠశాలలో మౌలిక వసతులపై అసంతృప్తి
-
మరుగుదొడ్ల కొరతపై తల్లిదండ్రుల ఫిర్యాదు
-
విచారణ నివేదిక కలెక్టర్‌కు..
శాయంపేట : ఆరుబయట బహిర్భూమికి వెళ్లి నీటి గుంతలో పడి విద్యార్థి కొలిపాక విష్ణు మృతిచెందిన ఘటనపై జిల్లా బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్(డీడీ) నర్సింహస్వామి మంగళవారం విచారణ చేశారు. ప్రమాద సంఘటన నేపథ్యంలో స్థానిక మహాత్మా జ్యోతి బాపూలే బీసీ గురుకుల పాఠశాలను ఆయన సందర్శిం చారు. ఈసందర్భంగా విద్యార్థి మృతి చెందిన నీటి గుంతను పరిశీలించారు. బడిలోని మరుగుదొడ్లను పరిశీలించి, నిర్వహణ తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. 40 మరుగుదొడ్లకుగానూ 20 మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నా రు. విద్యార్థుల సౌకర్యార్ధం ఫ్యాన్లు అమర్చకపోవడంపై పాఠశాల బాధ్యులను నిలదీశారు. భోజనాలను కట్టెల పొయ్యి పై ఎందుకు వండుతున్నారంటూ సం బంధిత సిబ్బందిని డీడీ ప్రశ్నించారు. అనంతరం ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టికలను పరిశీలించారు. విద్యార్థుల సౌకర్యార్ధం 120 మరుగుదొడ్లను నిర్మించేందుకు ప్రణాళిక రూపొం దించి కలెక్టర్‌కు నివేదిస్తామన్నారు. ఏ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైనా వివరాలను నివేదికలో పొందుపరుస్తామన్నారు. విచారణ సం దర్భంగా పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలు తరు చూ అనారోగ్యానికి గురవుతున్నట్లు డీడీ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆరాతీయ గా పాఠశాలకు సమీపంలోని డాంబర్ ప్లాంట్ నుంచి వెలువడే విష వాయువుల కారణంగా విద్యార్థులు అలర్జీ, ఆస్తమా బారిన పడుతున్నారని పలువురు పేర్కొన్నారు. ఈవిషయాన్ని కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని డీడీ నర్సింహస్వామి చెప్పారు. కాగా, విద్యార్థి విష్ణు మృతిచెందిన విషయం తెలియడంతో.. పలువురు తల్లిదండ్రులు మంగళవారం గురుకులానికి చేరుకొని తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లారు. ఈక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల తీరుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొగుళ్లపల్లి విద్యార్థులను శాయంపేట పాఠశాలలో విద్యా బోధన చేస్తుండటం వల్లే ఇన్ని అసౌకర్యాలు ఎదురవుతున్నాయన్నారు.