యోగాతో ఆరోగ్య పరిరక్షణ
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: మానవుల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణకు యోగ చక్కటి మార్గదర్శకమని లలితాపీఠం స్వస్వరూపానందస్వామి తెలిపారు. ప తంజలి యోగ సమితి, భారత్స్వామియాన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఎస్వీ హైస్కూల్ క్రీడా మైదానంలో యోగ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన జ్యోతిప్రజ్వలన చేసి యోగ మహోత్సవాన్ని ప్రారంభించారు. ముందుగా దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులకు పుష్పమాలలతో నివాళులర్పించారు.
ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని చక్కదిద్దుకునేందుకు దైనందిన కార్యక్రమంలో యోగ సాధనను ఒక భాగం చేసుకోవాలన్నారు. కృష్ణానందస్వామి మాట్లాడుతూ మని షిలో అలవాట్లు అతని ఆలోచనా ధోరణిపై ఆధారపడి ఉంటాయన్నారు. దేహంలోని భాగాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే యోగ, ప్రాణాయామం, ధ్యానం వంటివి దోహదపడుతాయని తెలిపారు. పతంజలి యోగ సమితి జిల్లా అధ్యక్షుడు కైలాస్సింగ్ రాజ్ పురోహిత్ మాట్లాడుతూ చక్కటి ఆరోగ్యం కోసం యోగ సాధన ఒక్కటే మార్గమని, అందుకు పతంజలి యోగ సమితి ఉచిత యోగ శిబిరాలు నిర్వహిస్తోందని చెప్పా రు.
ప్రజలకు యోగ, ప్రాణాయామం, ధ్యానం వంటి అంశాలపై అవగాహన కల్పించడమేగాక శిక్షణ ఇచ్చారు. ఆధ్యాత్మిక భజనలు చేయించారు. ఈ కార్యక్రమంలో భారత్ స్వాభిమాన్ కార్యదర్శి వెంకటరెడ్డి, పతంజలి యోగ సమితి నాయకులు హరికుమార్, సింగార బాలమురళీకృష్ణ, భాగ్యలక్ష్మి, యోగ శిక్షకులు తంగరాజ్, యుగంధర్, కృష్ణమరాజు, ప్రభాకర్‌శెట్టి, కృష్ణయ్య, లక్ష్మణ్, విశ్వనాథ్, బాలాజి, నరసింహారెడ్డి, శివరాముడు పాల్గొన్నారు.