bikini shoot
-
డేంజరస్: జలపాతం అంచున బికినీ షూట్
వాషింగ్టన్: మోడల్ అన్నాక ఫొటోషూట్లు సర్వసాధారణం. వెరైటీ డ్రెస్సులతో కొత్త కొత్త స్టిల్స్‌తో ఫొటోలు క్లిక్‌మనిపిస్తూనే ఉంటారు. అయితే అమెరికాకు చెందిన ఓ యంగ్ మోడల్ మాత్రం బికినీలో ఫొటోషూట్ చేయాలనుకుంది. అది కూడా అందనంత ఎత్తులో! అవును. పెన్సిల్వేనియాకు చెందిన 25 ఏళ్ల అమైరీస్ రోజ్ గతేడాది డిసెంబర్లో హాలీడేస్‌కు జాంబియా వెళ్లింది. అక్కడ ప్రపంచంలోనే అత్యంత పొడవైన విక్టోరియా జలపాతాన్ని సందర్శించింది. డెవిల్స్ పూల్‌గా పేరుగాంచిన ఈ జలపాతాన్ని చూసి ముచ్చటపడిపోయిన ఆమె అక్కడ బికినీ ఫొటోషూట్‌కు సిద్ధమైంది. 1640 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు నేలమీదకు దూకే అంచులో పడుకుని కెమెరాకు పోజులిస్తూ ఫొటోలు దిగింది. వీటితోపాటు ఓ వీడియోను సైతం అభిమానులతో పంచుకుంది. "అంచుల్లో జీవితం.. ఇక్కడ చాలా బాగుంది" అంటూ క్యాప్షన్ పొందుపరిచింది. అప్పటి పోస్టు తాజాగా మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతోంది. (చదవండి: ఇలాంటి ఫ్యామిలీని ఎక్కడా చూసుండరు) ఈ సందర్భంగా చాలామంది ఆమె డేంజరస్ స్టంట్‌ను విమర్శించారు. 'ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది' అని హెచ్చరిస్తూనే 'ఫాలోవర్లను సంపాదించుకోవడం కోసం ఇలాంటి పిచ్చిపనులు అవసరమా?' అని నిందించారు. దీనిపై అమైరీస్ స్పందిస్తూ.. 'ఫొటోషూట్ చాలా ప్రశాంతంగా, జాగ్రత్తగా జరిగింది. నేనేమీ భయపడలేదు. పైగా జలపాలతం అంచున ఉండటం నాకు కిక్కిచ్చింది' అని బదులిచ్చింది. అయినా సరే నెటిజన్లు మాత్రం ఆమెను విమర్శించడం మానుకోలేదు. 'పిచ్చెమ్మ తెలివి వెర్రెమ్మ మెచ్చుకోవాలి కానీ ఈ చేష్టలను మేమెందుకు మెచ్చుకుంటాం?' అని బుగ్గలు నొక్కుకుంటున్నారు. కొద్దిమంది మాత్రం ఆమె తెగువను పొగడకుండా ఉండలేకపోతున్నారు. అంత పెద్ద ఎత్తులో ఉండే వాటర్ ఫాల్స్ చిట్టచివరకు వెళ్లాలంటే మాటలు కాదు, దానికి దమ్ముండాలి అంటూ ఆమె సాహసాన్ని ప్రశంసిస్తున్నారు.(చదవండి: దొంగతనం చేసిందే కాక మహిళకే క్లాస్ పీకాడు!) -
ఫేస్బుక్ ప్రొఫైల్‌తోనే అవకాశాల వెల్లువ..
గురుగ్రామ్: క్రికెటర్ యువరాజ్ సింగ్ కుటుంబంపై తీవ్ర ఆరోపణలుచేసి వార్తల్లో నిలిచిన టాప్ మోడల్ ఆకాంక్ష శర్మ తన కుటుంబ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు మీడియాతో పంచుకున్నారు. సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ రియాలిటీ షోతోపాటు ఇండియాస్ నెక్స్ట్ టాప్ మోడల్ షోలోనూ తన ప్రతిభచాటుకున్న ఆమె.. తాను పుట్టింది బాలీవుడ్ తారగా వెలిగిపోడానికేనని చెప్పింది. మిగతా మోడల్స్ లాగా తాను ఏజెన్సీల చుట్టూ తిరగలేదని, ఫేస్ బుక్ ఫ్రొఫైల్ చూసి వాళ్లే(ఇండియాస్ నెక్స్ట్ టాప్ మోడల్ నిర్వాహకులు) తనను సంప్రదించారని ఆకాంక్ష తెలిపారు. ఆ షోలో భాగంగా టూపీస్ బికినీతో షూటింగ్ చేసినప్పుడూ పేరెంట్స్ తనతోనే ఉన్నారని, ఆ దుస్తులు ధరించడంపట్ల తల్లిదండ్రులు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని ఆమె చెప్పారు. అమ్మానాన్నల ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచి స్కూల్, కాలేజీల్లో కరికులర్ యాక్టివిటీల్లో చురుగ్గా పాల్గొనేదాన్నని, ఇప్పుడు మోడల్ గా ఎదగడానికి కూడా వాళ్లు తోడ్పడుతున్నారని ఆకాంక్ష పేర్కొన్నారు. ప్రస్తుతం గురుగ్రామ్(ఢిల్లీ)లో ఆర్కిటెక్చర్ కోర్సు చేస్తున్నానని, ముంబై నుంచి అవకాశాలు వెల్లువలా వస్తున్నా చదువు పూర్తయ్యేదాక సొంత ఊరిని విడిచిపెట్టనని ఆకాంక్ష అన్నారు. చాలా మంది అబ్బాయిలు ‘మీరు నాకు తెలుసు’అని అంటూటారని, నిజానికి టీవీ షోలో చూడటం తప్ప నా గురించి వాళ్లకేమీ తెలియదని వ్యాఖ్యానించారు. నెల రోజుల కిందట బిగ్ బాస్ షోలో ఆకాంక్ష మాట్లాడుతూ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోదరుడు జోరావర్ తో పెళ్లి పెటాకులు కావడానికి కారణం అతని తల్లేనని ఆరోపించారు. విడిపోయిన తర్వాత భరణంగా నెలకు రూ.3 వేలు మాత్రమే ఇస్తున్నారని వాపోయారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ యువరాజ్ తల్లి శబ్నం ఏకంగా కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. మొదటి పెళ్లి నుంచి ఎంతో నేర్చుకున్నానని, ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్నీ మోడలింగ్, బాలివుడ్ చుట్టూ తిరుగుతున్నాయని ఆకాంక్ష చెప్పారు.