ఆంధ్రుల సమగ్ర చరిత్రకు గ్రామాలే పునాదులు
► శాసనసభ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్
► జలదంకి చెన్నకేశవ దేవాలయం చరిత్ర శాసనాలు పుస్తకావిష్కరణ
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆంధ్రుల సమగ్ర రచనకు గ్రామాల చరిత్రే పునాదులని శాసనసభ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం జమ్మిచెట్టు సెంటర్ సమీపంలో ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతిలో ‘జలదంకి చెన్నకేశవ దేవాలయం చరిత్ర–శాసనాలు’ పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.
కార్యక్రమంలో పుస్తక రచయిత, కల్చరల్ సెంటర్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డితో పాటుగా మానసిక వైద్య నిపుణుడు ఇండ్ల రామసుబ్బారెడ్డి, శ్రీచెన్నకేశవ భక్త మండలి ట్రస్ట్ చైర్మన్ ఎం.రంగయ్య, ఉపా«ధ్యక్షుడు డి.బ్రహ్మారెడ్డి, ఆంధ్రా ఆర్ట్స్ అకాడమీ కార్యదర్శి నారాయణ, లయోల కళాశాల వైస్స్ ప్రిన్సిపాల్ సాంబశివరావు, అధ్యాపకులు మువ్వా శ్రీనివాస రెడ్డి, వల్లభరావు పాల్గొన్నారు.
బుద్ధవిహార ప్రాజెక్టు నమూనా చిత్రపటం ఆవిష్కరణ
జిల్లాలోని ఘంటశాలలో రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన బుద్ధ విహార ప్రాజెక్టు నమూనా చిత్రపటాన్ని శాసనసభ డెప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ శనివారం ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ అండ్ అమరావతిలో ఆవిష్కరించారు. ఘంటసాల గ్రామానికి చెందిన ఎన్నారై రంగనాథబాబు స్థాపించిన గొర్రెపాటి ఉదయ భాస్కరమ్మ, వెంకట్రాయుడు ట్రస్ట్ తరఫున ఈ ప్రాజెక్టుకు రెండున్నర ఎకరాల స్థలాన్ని ఉచితంగా ఇచ్చారని ప్రాజెక్టు రూపశిల్పి రేగుళ్ల మల్లికార్జునరావు తెలిపారు. 100 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు, 60 అడుగుల ఎత్తులో ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు వచ్చే వారం ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు.