టామ్కామ్ చైర్మన్గా బోయపల్లి రంగారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ (టామ్కాం) చైర్మన్గా బోయపల్లి రంగారెడ్డిని నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ జిల్లాకు చెందిన రంగారెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, బ్యాంకు ఉద్యోగి గా పని చేశారు. 1969 తెలంగాణ తొలి దశ, మలి దశ ఉద్యమాల్లో పాలుపంచు కున్నారు. 2009 నుంచి టీఆర్ఎస్లో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఉన్నారు.