buchireddy
-
బీజేపీకి షాక్.. కీలక నేత రాజీనామా
సాక్షి, సంగారెడ్డి : ఎన్నికల వేళ సంగారెడ్డిలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బుచ్చిరెడ్డి, మరికొంత మంది కార్యకర్తలు రాజీనామా చేశారు. పార్టీలో పనిచేసిన వారికి సరైన గుర్తింపు లేకుండా పోయిందని, అందుకే రాజీనామా చేస్తున్నామని బుచ్చిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ రెండు సార్లు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. సిద్దాంతాలకు కట్టుబడి పనిచేశాను. సంగారెడ్డి టికెట్ నాకే వస్తుందని ఆశ పడ్డాను. కానీ కొంత మంది రాకుండా అడ్డుపడ్డారు. బీజేపీలో కూడా డబ్బులు ఉంటేనే పనులు జరుగుతున్నాయి. పని చేసిన వారిని గుర్తించకకోవడం బాధగా ఉంది. రాజకీయాలు లేకపోతే వ్యవసాయం చేస్తూ బతుకుతా. వేరే పార్టీలోకి చేరేది లేనిది తర్వాత తెలియజేస్తా’ అని చెప్పారు. -
జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా బుచ్చిరెడ్డి ఎంపిక
మిడ్జిల్: జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు మండలంలోని దోనూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బుచ్చిరెడ్డి ఎంపికైనట్లు పీఆర్టీయూ మండల అధ్యక్షుడు ఎల్లయ్య తెలిపారు. మండలలోని గుడిగాన్‌పల్లి గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి గతేడాది రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ ఏడాది జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక కావడంపై మండల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తంచేశారు. అవార్డును సెప్టెంబర్ 5వ తేదీన డిల్లీలో రాష్ట్రపతి చేతులమీదుగా అందుకోనున్నారని ఆయన తెలిపారు. -
శిక్షణ పొందుతూ కానిస్టేబుల్ మృత్యువాత
వరంగల్: వరంగల్ మామునూరులో బెటాలియన్ కేంద్రంలో శిక్షణకు వచ్చిన ఒక కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న బుచ్చిరెడ్డి గత కొన్ని రోజులుగా సహచరులతో పాటు మామునూరులో శిక్షణ పొందుతున్నారు. గురువారం ఉదయం ఆయన శిక్షణ కార్యక్రమంలో ఉండగానే గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించేలోగానే కన్నుమూశారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ఆటో, టాటా ఏస్ ఢీ తొమ్మిది మందికి తీవ్రగాయాలు ఒకరి పరిస్థితి విషమం దైవదర్శనం చేసుకుని వస్తుండగా ప్రమాదం కొండగట్టు అంజన్న దర్శనం చేసుకుని వస్తుండగా ధర్మపురి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఏఎస్సై బుచ్చిరెడ్డి, బాధితుల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని సీసీనస్పూర్ కాలనీకి చెందిన పది మంది భక్తులు కొండగట్టుకు గురువారం ఆటోలో బయల్దేరారు. రాత్రి కొండగట్టులో బసచేశారు. శుక్రవారం ఉదయం అంజన్న దర్శనం చేసుకొని తిరుగుప్రయాణమయ్యారు. మధ్యాహ్నం.. ధర్మపురి జాతీయ రహదారి పక్కనున్న సబ్‌స్టేషన్ సమీపంలో ఎదురుగా రాయపట్నం వైపు నుంచి వస్తున్న టాటా ఏస్ ఢీకొట్టింది. రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. క్షతగాత్రులు చెల్లాచెదురుగా పడిపోయారు. ఆస్పత్రికి తరలించాలని వేడుకున్నా త్వరగా సహాయక చర్యలు లభించలేదు. 108 సేవలు అందలేదు. టాటా ఏస్‌లో ఇరుక్కున్న డ్రైవర్ నరేశ్ గంట నరకయాతన పడ్డాడు. తర్వాత జాకీ సహాయంతో ఆయనను బయట కు లాగారు. స్థానికులు, పోలీసుల సహాయంతో ట్రాక్టర్లో ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యలో నస్పూర్కాలనీవాసి ఆత్మకూరి సాయిరాజ్(16) మృతిచెందారు. క్షతగాత్రుల వివరాలు.. ఆటోలో ఉన్న పోల అనిల్, కంచెర్ల రమేశ్, కూనారపు రంజిత్, దొమ్మటి వినయ్, వరిపాటి వెంకటేశ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. టాటా ఏస్‌లో వెదురుగట్ల నుంచి తుమ్మెనాలలో అత్తవారింటికి వెళ్తున్న డ్రైవర్ నరేశ్, అతడి భార్య పద్మ, కుమారుడు రిషిలతో పాటు రాయపట్నంకు చెందిన బూర్లగడ్డ గాయత్రిలకు తీవ్రగాయాలయ్యాయి. వీరిలో డ్రైవర్ నరేశ్ పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు సాయిరాజ్ తండ్రి నర్సయ్య సింగరేణి ఉద్యోగి. క్షతగాత్రులను ధర్మపురి, జగిత్యాల ఆస్పత్రులకు తరలించారు. కాగా, క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినా సత్వర సేవలు అందించడంలో వైద్యులు నిర్లక్ష్యం చేశారని స్థానికులు మండిపడ్డారు.