ఆగని అక్రమ కట్టడాలు
కార్పొరేషన్ సూచనలు బేఖాతరు
రాజకీయ అండతోనే నిర్మాణాలు
చర్యలకు ఉపక్రమించని అధికారులు
రీ సర్వేతోనైనా తీరు మారుతుందా!
నిజామాబాద్ అర్బన్ : నగరంలోని ఎల్లమ్మగుట్ట రైల్వేకమాన్ సమీపంలో ఓ ఐదంతస్తుల భవన నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా జరిగింది. సెట్ బ్యాక్ ఏ మాత్రం లేదు. భవనం డ్రైనేజీని ఆనుకొని రోడ్డుపైకి చేరింది. అడ్డంగా ఉన్న ట్రాన్స్‌కో విద్యుత్ స్తంభాన్ని తొలగించారు. అగ్నిమాపక శాఖ నిబంధనలు అమలు కాలేదు. ఇలాంటి భవనాలు నగరంలో వెలుస్తునే ఉన్నాయి. నిర్మాణదారులు బల్దియూ అ ధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నారు. అక్రమ నిర్మాణాల వ్యవహరం ప్రభుత్వ దృష్టికి వెళ్లినా వారు చలించడం లేదు. అపార్టమెంట్లు, భవనాల నిర్మాణాలు జోరుగా కొనసాగుతూనే ఉన్నాయి. కార్పొరేషన్ అధికారులు కఠి నంగా వ్యవహరించకపోవడం కూడా ఇందుకు కారణమనే భావన వ్యక్తమవుతోంది.
ముడుపుల ఆరోపణలతో
అక్రమకట్టడాలకు సంబంధించి ముడుపుల ఆరోపణలు రావడంతో హడావుడి చేసిన అధికారులు చర్యలకు మాత్రం ఉపక్రమించడం లేదు. సుభాష్‌నగర్‌లో ని ఓ బ్యాంకు సమీపంలో అక్రమంగా అపార్టమెంట్ వెలిసినా స్పందించడం లేదు. ఖలీల్‌వాడి ప్రాంతంలో పోచమ్మగల్లికి వెళ్లే దారిలో ఐదంతస్తుల భవనం, మాడ్రన్పబ్లిక్ స్కూల్ సమీపంలో మరో భవనం వెలిసాయి. బస్టాండ్ ప్రాంతం లో షాపింగ్ కాంప్లెక్స్, వినాయక్‌నగర్ రోడ్డులోని మూడు భవనాలు సెల్లా ర్ లు లేకుండా ఉన్నాయి. గంగస్థాన్, ఆ ర్యనగర్, వినాయక్‌నగర్ ప్రాంతాలలో నూతనంగా అపార్ట్మెంట్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి.
ఇందులో కొన్నిం టికి అనుమతి ఉన్నప్పటికీ,నిబంధనల ప్రకారం నిర్మాణాలు కొనసాగడం లే దు. అధికారులు ఇటువైపు పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం వినాయక్‌నగర్‌లో ఓ అ పార్టమెంట్‌లో నలుగురు కార్మికులు మృతి చెందారు. అప్పుడు హుటాహుటిన స్పందించిన కార్పొరేషన్ అధికారు లు 104 భవనాలకు నోటీసులు జారీ చేశారు. చర్యలు తీసుకోవడంలో ముం దుకు సాగడం లేదు. రాజకీయ ఒత్తిడే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం అక్రమిత స్థలాలలో దుకాణాలను తొలగిస్తున్న అధికారులు అక్రమ అపార్టమెంట్ల, భవనాల నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని పలువురు పేర్కొంటున్నారు. బడాబాబులపై చర్య లు తీసుకుంటే అక్రమ నిర్మాణాలు నిలి చిపోయే అవకాశం ఉంది. ఇటీవల అ ర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త, మే యర్ ఆకుల సుజాత, కమిషనర్ వెంకటేశ్వర్లు అక్రమ కట్టడాలకు సంబంధిం చి సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్రమ కట్టడాలను గుర్తించి నివేదిక త యారు చేయాలని అధికారులను ఆదేశించారు. రీ సర్వే చేపట్టాలని నిర్ణయిం చారు. దీని ఆధారంగానైనా అధికారు లు చర్యలకు కదులుతారా!