cash exchange
-
అప్పులు తీర్చేందుకు సీఐ అడ్డదారులు
బంజారాహిల్స్: నగదు మార్పిడి కేసులో నిందితుడు రాజశేఖర్ అప్పులు తీర్చుకునేందుకే అడ్డదారులు తొక్కినట్లు తెలుస్తోంది. నాలుగేళ్ల క్రితం సినిమాల మీద మోజుతో స్నేహితులతో కలిసి సినిమాను తీసి అప్పులపాలయ్యాడు. వాటిని కట్టేందుకు అక్రమ మార్గాలకు అలవాటు పడ్డాడు.నాంపల్లి ఇన్ స్పెక్టర్‌గా పని చేస్తున్న సమయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకీ చిక్కాడు. తిరిగి పోస్టింగ్ దక్కించుకునేందుకు భారీగానే ఖర్చు చేయాల్సి వచ్చింది. అప్పటి హైదరాబాద్ మంత్రి అండదండలతో ఉద్యోగం దక్కించుకున్నాడు. ఇందుకై చేసిన అప్పులు తడిసి మోపెడవుతుండటంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే కరెన్సీ మార్పిడిని అవకాశంగా తీసుకున్న తన స్నేహితుడు కాంగ్రెస్ నేత తిరుమలేష్నాయడు పక్కా పథకాన్ని రూపొందించాడు. ఈ నెల 1న ఫిలింనగర్‌లోని గెస్ట్‌హౌస్‌లో కొత్త కరెన్సీ మార్పిడి జరుగుతుండగా అక్కడికి వెళ్లిన రాజశేఖర్ రూ.1.20 కోట్లను ఎత్తుకెళ్లాడు. ఆ మొత్తాన్ని తిరుమలేష్ నాయుడుకు అప్పగించగా, అందులో తన వాటాగా రూ.20 లక్షలు ఇస్తానని తిరుమలేష్ చెప్పడంతో అలిగి వెళ్లిపోయాడు. మరునాడు టప్పాచబుత్ర స్టేషన్లో తన కారును అప్పగించి బయటకు వచ్చాడు. సాయంత్రానికి అతనిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనట్లు తెలుసుకున్న రాజశేఖర్ మొదట విజయవాడకు వెళ్లి అక్కడి నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరిగాడు. జూబ్లీహిల్స్ క్రైం ఇన్ స్పెక్టర్ ముత్తు ఆధ్వర్యంలో గాలింపు చేపట్టిన పోలీసులు యానాంలో తన స్నేహితుడి ఇంట్లో తలదాచుకుంటున్న రాజశేఖర్‌ను పట్టుకున్నారు. అప్పులు తీర్చేందుకే ఈ పని చేసినట్లు అతను అంగీకరించాడు. విజయవాడలో ఒక భార్య, ఆమెకు తెలియకుండా హైదరాబాద్‌లో మరో భార్యను కలిగి ఉన్న రాజశేఖర్ విధినిర్వహణలోనూ నిర్లక్ష్యం వహిస్తుండటంతో సీఎం క్యాంపు కార్యాలయానికి అటాచ్ చేశారు. డబ్బు చోరీ చేసిన రోజు సాయంత్రం 5 గంటలకు డ్యూటీ ముగియాల్సి అవకాశం ఉండగా అరగంట ముందు డ్యూటీ దిగిన అతను నేరుగా ఫిలింనగర్ గెస్ట్‌హౌస్‌కు వెళ్లి భ యపెట్టి డబ్బులతో పరారయ్యాడు. కాగా అతను తీసిన సినిమా ఇంత వరకు విడుదలకు నోచుకోకపోవడం గమనార్హం. -
నిరీక్షణ!
► బ్యాంకుల్లో తగ్గని రద్దీ ►అరకొర సేవలతో ఏటీఎంలు ►తగ్గని జనం ఇబ్బందులు కరీంనగర్ బిజినెస్ : ల్లో నగదు కోసం ఖాతాదారుల కష్టాలు ఏమాత్రం తగ్గడం లేదు. నగదు మార్పిడి నిలిపివేతతో రద్దీ కొద్దిగా తగ్గిన క్యూలైన్లో నిరీక్షణ మాత్రం తప్పడం లేదు. ఏటీంఎంలు పూర్తి స్థారుులో పనిచేయడం లేదు. పనిచేసిన చోట్ల గంటల్లోనే డబ్బు ఖాళీ అవుతుండడంతో డబ్బులందని వారు నిరాశతో వె నుదిరుగుతున్నారు. ప్రైవేట్ బ్యాంకుల ఏటీఎంలు తెరుచుకోవడం లేదు. బ్యాంకుల్లోకి నగదు కొంత సమకూరడంతో సోమవారం పరిస్థితి కాస్త కుదుటపడింది. ఇన్ని రోజులు రూ.ఆరు వేల వరకు చెల్లింపులు చేసిన బ్యాంకు లు రూ.పదివేలకు పెంచారుు. ఒకటో తేదీ సమీపించడంతో చాలా బ్యాంకులు ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొ ని ప్రత్యేకంగా నగదును పక్కనపెట్టినట్లు తెలిసింది. మరికొన్ని బ్యాంకుల్లో అత్యవసరం ఉండి అధికారులతో మొరపెట్టుకున్న వారికి రూ.10వేల వరకు చెల్లింపులు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుల సేవలు మెరుగుపడలేదు. గంటల తరబడి క్యూలో నిలుచున్నా అరకొరగానే చెల్లింపులు జరుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరాలలో బ్యాంకులు, ఏటీఎంల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అదే గ్రామీణ ప్రాంతా ల్లో వాటి సంఖ్య తక్కువగా ఉండడంతో ప్రజల కనీస అవసరాలు తీరడం లేదని తెలుస్తుంది. ఏటీఎంలలో కేవలం రెండు వేల నోట్లు రావడంతో చిల్లర కష్టాలు తప్పడం లేదు. కొత్త రూ.500 నోట్ల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. పాత వెరుు్య నోట్లున్న వారు చేసేదేమి లేక బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తున్నారు. -
పోస్టాఫీసుల్లో నగదు మార్పిడి ఉండదు
అనంతపురం రూరల్ : కేంద్రం పెద్దనోట్ల రద్దు చేసిన నేపథ్యంలో పోస్టాఫీసుల్లో పాతనోట్లను తీసుకుని కొత్త నోట్లు ఇచ్చేవారు. ఈప్రక్రియ నిలిపివేసినట్లు తపాలా శాఖ ఎస్పీ చంద్రశేఖర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుంచి పోస్టాఫీసుల్లో ఖాతాలు కలిగిన వారు మాత్రం పెద్దనోట్లను తమ సేవింగ్ ఖాతాల్లో జమ చేసుకోవచ్చన్నారు. -
పైసల్లేవ్!
► బ్యాంకుల్లో నిండుకున్న నగదు ► ఏటీఎంలు ఖాళీ ► డబ్బుల కోసం సామాన్యుల పాట్లు డిపాజిట్లకే పరిమితం కరీంనగర్ బిజినెస్ : జిల్లాలోని పలు బ్యాంకుల్లో నగదు నిల్వలు నిండుకున్నారుు. ఏటీఎంలు కూడా ఖాళీ కావడంతో డబ్బుల కోసం జనం నానాపాట్లు పడ్డారు. ఆంధ్రాబ్యాంకు శాఖలు, తెలంగాణ గ్రామీణ బ్యాంకులకు చెందిన పలుశాఖలు, మానకొండూర్‌లోని ఎస్బీఐ శుక్రవారం ఉదయమే ఖాళీ అయ్యారుు. దీంతో ప్రజలు నిరాశతో వెనుదిరిగారు. శంకరపట్నం మండలం కేశవపట్నం ఆంధ్రాబ్యాంకులో నగదు నిండుకోవడంతో పది రూపాయల కారుున్లు ఇచ్చారు. కొత్త రూ.2000 నోట్లు రెండు రోజులుగా లేవు. శుక్రవారం ఒక్కరోజే పాత నోట్లు రూ.5.80 కోట్లు డిపాజిట్ చేశారు. ఈనెల 23 వరకు కొత్త నోట్లు రావని బ్యాంక్ మేనేజర్ హరిబాబు తెలిపారు. నగదు మార్పిడి తగ్గింపుతో తంటా.. ఇన్ని రోజులుగా రూ.నాలుగు వేల వరకు నగదు మార్పిడి అవకాశం ఉండగా శుక్రవారం నుంచి రూ.రెండు వేలకు కుదించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోస్టాపీసుల్లో డబ్బు లేకపోవడం, బ్యాంకుల్లోనూ తక్కువగా ఇస్తుండడంతో జనం అసహనానికి గురయ్యారు. ఏటీఎంలు సైతం తక్కువ సంఖ్యలోనే పనిచేస్తున్నారుు. నగదు మార్పిడి పరిమితిపై పలుచోట్ల జనం బ్యాంకర్లను ప్రశ్నించడం కనిపించింది. బ్యాంకులన్నీ సమన్వయ పరచుకుని అన్ని శాఖల్లో నగదు నిల్వలు ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ శుక్రవారం బ్యాంకర్లకు సూచించారు. కలెక్టర్ సూచనలతో డబ్బులేని బ్యాంకులకు శనివారం నగదు చేరే అవకాశాలు కనిపిస్తున్నారుు.