పైసల్లేవ్!
► బ్యాంకుల్లో నిండుకున్న నగదు
► ఏటీఎంలు ఖాళీ
► డబ్బుల కోసం సామాన్యుల పాట్లు డిపాజిట్లకే పరిమితం
కరీంనగర్ బిజినెస్ : జిల్లాలోని పలు బ్యాంకుల్లో నగదు నిల్వలు నిండుకున్నారుు. ఏటీఎంలు కూడా ఖాళీ కావడంతో డబ్బుల కోసం జనం నానాపాట్లు పడ్డారు. ఆంధ్రాబ్యాంకు శాఖలు, తెలంగాణ గ్రామీణ బ్యాంకులకు చెందిన పలుశాఖలు, మానకొండూర్‌లోని ఎస్‌బీఐ శుక్రవారం ఉదయమే ఖాళీ అయ్యారుు. దీంతో ప్రజలు నిరాశతో వెనుదిరిగారు. శంకరపట్నం మండలం కేశవపట్నం ఆంధ్రాబ్యాంకులో నగదు నిండుకోవడంతో పది రూపాయల కారుున్లు ఇచ్చారు. కొత్త రూ.2000 నోట్లు రెండు రోజులుగా లేవు. శుక్రవారం ఒక్కరోజే పాత నోట్లు రూ.5.80 కోట్లు డిపాజిట్ చేశారు. ఈనెల 23 వరకు కొత్త నోట్లు రావని బ్యాంక్ మేనేజర్ హరిబాబు తెలిపారు.
నగదు మార్పిడి తగ్గింపుతో తంటా..
ఇన్ని రోజులుగా రూ.నాలుగు వేల వరకు నగదు మార్పిడి అవకాశం ఉండగా శుక్రవారం నుంచి రూ.రెండు వేలకు కుదించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పోస్టాపీసుల్లో డబ్బు లేకపోవడం, బ్యాంకుల్లోనూ తక్కువగా ఇస్తుండడంతో జనం అసహనానికి గురయ్యారు. ఏటీఎంలు సైతం తక్కువ సంఖ్యలోనే పనిచేస్తున్నారుు. నగదు మార్పిడి పరిమితిపై పలుచోట్ల జనం బ్యాంకర్లను ప్రశ్నించడం కనిపించింది. బ్యాంకులన్నీ సమన్వయ పరచుకుని అన్ని శాఖల్లో నగదు నిల్వలు ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ శుక్రవారం బ్యాంకర్లకు సూచించారు. కలెక్టర్ సూచనలతో డబ్బులేని బ్యాంకులకు శనివారం నగదు చేరే అవకాశాలు కనిపిస్తున్నారుు.