ముందు సెల్... తర్వాతే భోజనం!
అలవాటు
భోజనం చేసే సమయంలో ఎక్కువగా మాట్లాడకుండా, వేరే విషయాల గురించి ఆలోచించకుండా శ్రద్ధగా తినాలని పెద్దలు చెబుతారు. కానీ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఈ సెల్‌ఫోన్ కాలంలో భోజనం చేయడం మీద కంటే సెల్ఫోన్ల మీ జనం ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.
మంచిచెడులు మాట్లాడుకోవడానికి, అందరూ ఒక చోట కలుసుకోవడానికి డిన్నర్ టేబుళ్లు కేంద్రంగా ఉండేవి. ఇప్పుడు మాత్రం అలా లేదు. ఒకే టైమ్‌లో ఒకే చోట భోజనానికి కూర్చున్నప్పటికీ...తమ సెల్ఫోన్లపై మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తున్నారని వ్యూ రిసెర్చ్ సెంటర్(బ్రిటన్) అధ్యయన కేంద్రం చెబుతోంది. ముఖ్యంగా 16 - 34 ఏళ్ల మధ్య వయసులో ఉన్నవారు తాము భోజనం చేస్తున్నప్పుడు, భోజనం మీద దృష్టి పెట్టకుండా సెల్ఫోన్లో మెసేజ్‌లు చూడడం, మెసేజ్‌లు పంపడం, సోషల్ మీడియా సైట్లు చెక్ చేయడం, మిత్రులతో మాట్లాడడంలాంటివి చేస్తున్నారు. అమెరికా, బ్రిటన్లలోనే కాదు చాలా దేశాల్లోనే ఇదే పరిస్థితి ఉంది. కొద్దిమంది మాత్రమే భోజన సమయంలో సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండగలుగుతున్నారట.!