చాబాలలో ‘రానా’ సందడి
వజ్రకరూరు : మండలంలోని చాబాల పరిసర ప్రాంతంలో గురువారం సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై తేజ దర్శకత్వంలో రానా హీరోగా నటిస్తున్న చిత్ర షూటింగ్ సందడి చేసింది. సినిమా షూటింగ్ జరుగుతుందనే సమాచారంతో అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. చిత్రానికి సంబంధించిన పలు సన్నివేశాలను చిత్రీకరించారు. చిత్రంలో రానాతో పాటు హీరోయిన్ కాజల్, మరో నటుడు నవదీప్ కూడా నటిస్తున్నారు.