పాక్ బోర్డుపై నిప్పులు చెరిగిన షోయబ్ అఖ్తర్!
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ నిప్పులు చెరిగాడు. క్రికెట్ సంబంధాలను మెరుగుపరుకునేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వెనక పడవద్దని షోయబ్ సూచించాడు. దానికి బదులుగా జాతీయ జట్టును ప్రపంచ స్థాయి జట్టుగా రూపొందించాలని పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డుకు విజ్క్షప్తి చేశాడు.
ఛాంపియన్స్ లీగ్ ట్వెంటీ20 టోర్నమెంట్ లో పాల్గొనే పాకిస్థాన్ జట్టు ఫైసలాబాద్ ఊల్వ్స్ జట్టుకు వీసా దరఖాస్తులను నిరాకరించిన నేపథ్యంలో షోయబ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫైసలాబాద్ జట్టుకు వీసాలను నిరాకరించడం ఆశ్చర్యం కలిగిందన్నాడు.
ఇరుదేశాల ప్రభుత్వాల మధ్య సాధారణ పరిస్థితులు లేనప్పుడు పాకిస్థాన్ కు భారత్ ఎలా మద్దతిస్తుందని షోయబ్ ప్రశ్నించాడు. ఐపీఎల్ కాని, ఛాంపియన్స్ లీగ్ గాని, ఏ విషయంలోనైనా భారత్ ను అడుక్కోవాల్సిన అవసరం లేదని తాను ఎన్నో మార్లు చెప్పానని షోయబ్ ఘాటుగా స్పందించాడు.