Check Dam Construction
-
సూర్యకళ: రైతుల అక్కయ్య.. నేల రుణం తీర్చుకుందాం!
సూర్యకళ పుట్టింది పెరిగింది హైదరాబాద్ నగరంలో. ఆమె సాంత్వన పొందుతున్నది మాత్రం గ్రామసీమల్లో. ప్రకృతిమాత కోసం మొదలు పెట్టిన సేవను రైతుల సేవతో పరిపూర్ణం చేస్తున్నారామె. హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన సూర్యకళ రెండు దశాబ్దాలుగా కార్పొరేట్ కంపెనీల్లో ఉన్నతస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ‘ఆ ఉద్యోగం బతకడానికి మాత్రమే. గ్రామాలు, రైతుల కోసం చేస్తున్న పని జీవితానికి ఒక అర్థం, పరమార్థం’ అంటారామె. ఆమె తన ఫార్మర్ ఫ్రెండ్లీ జర్నీ గురించి ‘జాతీయ రైతు దినోత్సవం’ సందర్భంగా సాక్షితో పంచుకున్న వివరాలివి. ‘‘రైతును బతికించుకోకపోతే మనకు బతుకు ఉండదు. నేలను కాపాడుకోక పోతే మనకు భూమ్మీద కాలం చెల్లినట్లే. మనిషిగా పుట్టిన తరవాత మన పుట్టుకకు అర్థం ఉండేలా జీవించాలి. ఎంతసేపూ మనకోసం మనం చేసుకోవడం కాదు, మనకు బతుకునిస్తున్న నేలకు కూడా పని చేయాలి. మనం పోయిన తర్వాత కూడా మనం చేసిన పని భూమ్మీద ఉండాలి. మన స్ఫూర్తి మిగిలి ఉండాలి. ఇదీ నా జీవిత లక్ష్యం. నా లక్ష్యం కోసం నేను పని చేస్తున్నాను. ఒక దశాబ్దకాలంగా మొదలైందీ మిషన్. తెలంగాణ జల్లాల్లో 2016 నుంచి యాభైకి పైగా రైతు శిక్షణ సదస్సులు నిర్వహించాను. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతుల ఇళ్లకు వెళ్లి, వాళ్లందరినీ ఒక గొడుగు కిందకు తెచ్చాను. రైతు సేవల నిలయం భావసారూప్యత ఉన్న వాళ్లందరం కలిసి నల్గొండ జిల్లా, మర్రిగూడలో గ్రామ భారతి హార్టికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆవరణలో రైతు శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం. మార్చి నాటికి ఒక రూపానికి వస్తుంది. రైతులకు ఉపయోగపడేవిధంగా పాలేకర్ మోడల్, సుథారియా అభివృద్ధి చేసిన గోకృపామృతం మోడల్, చౌరాసియా మోడల్ వంటి వివిధ రకాల మోడల్స్‌ని మరింతగా అభివృద్ధి చేయడం ఈ శిక్షణాకేంద్రం ఉద్దేశం. రైతులకు ఉపయోగపడే సేవలను ఒక గొడుగు కిందకు తీసుకురావడమన్నమాట. వ్యవసాయం కోసం చెక్ డ్యామ్‌ల నిర్మాణం, మొక్కల పెంపకం కోసం లక్షల్లో సీడ్ బాల్స్ తయారు చేయించి ఖాళీ నేలల్లో విస్తరింపచేయడం వంటి పనుల్లో నాకు సంతృప్తి లభిస్తోంది. నింగి– నేలకు బంధం ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతు తన కాళ్ల మీద తాను నిలబడడం అంత సులువు కాదు. అందుకే సమాజంలో ఆర్థిక పరిపుష్టి కలిగిన వాళ్లు ఒక్కొక్కరు ఒక్కో రైతును దత్తత తీసుకోవలసిందిగా కోరుతున్నాను. నా అభ్యర్థన మేరకు కొంతమంది విదేశాల్లో ఉన్న వాళ్లు ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మన రైతులకు సహాయం చేస్తున్నారు కూడా. వ్యవసాయంలో మంచి దిగుబడులు తెస్తూ నలుగురికి ఆదర్శంగా నిలిచిన రైతులకు రైతు దినోత్సవం నాడు ఐదేళ్లుగా సన్మానం చేస్తున్నాం. మొదట్లో చిన్న చిన్న ఖర్చులు సొంతంగా పెట్టుకున్నాం. రైతు శిక్షణ కేంద్రం నిర్మాణం కోసం మా కొలీగ్స్, స్నేహితులతోపాటు కార్పొరేట్, మల్టీనేషనల్ కంపెనీల నుంచి ఆర్థిక సహకారం తీసుకుంటున్నాం. ప్రకృతి సేద్యం చేస్తున్న రైతుకు సహాయం చేయడమంటే ఒక వ్యక్తికి సహాయం చేయడం కాదు. మనం కంచంలో ఆరోగ్యకరమైన అన్నానికి చేయూతనివ్వడం. మనల్ని బతికిస్తున్న నేల రుణం తీర్చుకోవడం’’ అన్నారు సూర్యకళ. మనదేశ మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్‌సింగ్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రైతుల కోసం పని చేయడంలో జీవిత పరమార్థాన్ని వెతుక్కుంటున్న సూర్యకళ పుట్టింది కూడా ఇదే రోజు కావడం విశేషం. రైతులను కలుపుతున్నారు రెండున్నరేళ్ల కిందట సిద్ధిపేటలో గోకృపామృతం రూపకర్త గోపాల్ భాయ్ సుథారియా గారి మీటింగ్‌కి వెళ్లాను. ఆ సదస్సును నిర్వహించిన సూర్యకళ మేడమ్ అప్పుడే పరిచయమమ్యారు. రైతుల సమావేశాలు, కరోనా సమయంలో జూమ్ మీటింగ్‌లు ఏర్పాటు చేశారు. వారి సూచనలతో రెండెకరాల్లో వరి సాగుతోపాటు పండ్ల మొక్కల పెంపకం కూడా మొదలు పెట్టాను. – పద్మాల రాజశేఖర్, శిర్నాపల్లి గ్రామం, మండలం ఇందల్వాయి, నిజామాబాద్ జిల్లా నీటి నిల్వ నేర్పించారు మేము ఎనిమిది ఎకరాల్లో సేద్యం చేస్తున్నాం. అప్పట్లో మాకు పొలంలో నీళ్లు లేవు. సూర్యకళ మేడమ్‌కి మా పరిస్థితి తెలిసి, శర్మ గారనే రిటైర్డ్ ఇంజనీర్ గారిని మా పొలానికి పంపించారు. ఆయన మాకు నీటిని నిల్వ చేసుకునే పద్ధతులు నేర్పించారు. అలాగే ప్రకృతి సేద్యం చేయడానికి ప్రోత్సహించడంతోపాటు మేము పండించిన పంటను కొనుక్కునే వారిని మాతో కలిపారు. అలా రైతులకు– వినియోగదారులను అనుసంధానం చేస్తూ ఒక నెట్వర్క్ రూపొందించారు మా మేడమ్. – వాకాటి రజిత, చౌటుప్పల్, నల్గొండ జిల్లా పంట వేయకముందే ఆర్డర్లు మూడున్నర ఎకరాల్లో వరి, కూరగాయలు, పశువుల కోసం నాలుగు రకాల గ్రాసం వేస్తుంటాను. ఈ ఏడాది 60 కొబ్బరి మొక్కలు కూడా పెట్టాను. మా పంటలు అమ్ముకోవడానికి వాట్సప్ గ్రూప్‌లున్నాయి. మాకు తెలియని పంట పెట్టడానికి ప్రయత్నం చేసి సందేహాలు అడిగితే, ఆ పంటలు సాగు చేస్తున్న రైతు సోదరులతో కలుపుతారు. సూర్యకళ అక్కయ్య మమ్మల్నందరినీ కలపడం కోసం ‘రైతులతో భోజనం’ వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. రైతు దినోత్సవం రోజు సన్మానాలు చేస్తారు. మంచి దిగుబడి తెచ్చినందుకు నాకూ ఓ సారి సన్మానం చేశారు. – ఒగ్గు సిద్దులు, ఇటికాలపల్లి, జనగామ జిల్లా – వాకా మంజులారెడ్డి -
ఇంజినీర్ చిన్నాలమ్మ!.. చదువు లేకపోయినా సంకల్ప బలంతో..
ఆ వృద్ధురాలికి చదువు లేదు.. సంకల్ప బలం ఉంది ఇంజినీర్లు సైతం సాధ్యం కాదన్నారు.. చిన్నాలమ్మ మాత్రం సాధ్యం కానిదేదీ లేదని నిరూపించింది. అధికారులు సాంకేతిక కారణాలతో చెక్ డ్యాం నిర్మించలేమన్నారు.. ఆ కారణాలకు ‘చెక్’పెడుతూ ‘డ్యాం’ నిర్మించారు.. చేయాలన్న తపన ఉంటే సాధ్యం కానిది లేదని నిరూపించారు. తన ఇద్దరు కుమారులతో కలిసి పంట పొలాలకు నీరందించే భగీరథులయ్యారు. చదవండి: లోకేష్‌తో ప్రేమ పెళ్లి.. అత్తారింటికి వెళ్లి.. భార్యను ఇంటికి తీసుకెళ్తానని చెప్పి.. సాక్షి, పాడేరు: పెదబయలు మండలంలోని మారుమూల కిముడుపల్లి పంచాయతీకి చెందిన కోడా చిన్నాలమ్మ అనే మహిళా రైతు తోటి గిరిజన రైతులకు ఉపకారిగా నిలిచారు. తనతో పాటు మరికొంత మంది గిరిజన రైతుల సాగు భూములకు నిత్యం అన్ని కాలాల పాటు సాగు నీరు అందే లక్ష్యంగా కంబాలబయలు సమీపంలోని గేదెగెడ్డ వాటర్‌ఫాల్ ప్రాంతంలో మినీ చెక్‌డ్యాంను నిర్మించారు. పూర్వం నుంచి ఈ గెడ్డ వద్ద వృథాగా పోతున్న నీటిని పంట కాలువల ద్వారా దిగువ భూములకు సాగు నీటిని అందించాలని గిరిజనులు కోరుతున్నారు. అయితే వాటర్‌ఫాల్ ప్రాంతం ఎత్తుగా ఉండడంతో పాటు అక్కడ చెక్‌డ్యాం నిర్మించడం కష్టమని గతంలోనే ఇంజినీరింగ్ అధికారులు పేర్కొన్నారు. పలుమార్లు ఇక్కడ చెక్‌డ్యాం మంజూరైనప్పటికి సాంకేతిక కారణాలతో పనులు జరగలేదు. గేదెగెడ్డ వాటర్పాల్కు ఆనుకుని నిర్మించిన మిని చెక్‌డ్యాం అయితే కోడా చిన్నాలమ్మ, ఆమె ఇద్దరు కుమారులు కోడా సింహాద్రి, కోడా వరహనందంలు ఇక్కడ మినీ చెక్‌డ్యాం నిర్మాణానికి గత ఏడాది శ్రీకారం చుట్టారు. సుమారు రూ.3లక్షలకు పైగానే సొంత నిధులు ఖర్చుపెట్టి వాటర్ఫాల్కు ఆనుకుని మినీ చెక్‌డ్యాంను నిర్మించారు. వాటర్‌ఫాల్ నుంచి దిగువుకు పోయే నీటిలో కొంత ఈ చెక్‌డ్యాం చానల్లోకి వస్తుంది. అక్కడ నుంచి సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న పంట భూములకు కాలువ ద్వారా నీటిని మళ్లించారు. మట్టి కాలువ తవ్వడంతో పాటు కొంత భాగంలో సిమెంట్ కాంక్రీట్‌తో ప్రధాన కాలువను కూడా నిర్మించారు. ఆ సిమెంట్ కాలువ దిగువున చిన్నపాటి వంతెన కూడా నిర్మించడంతో ఈ మొత్తం నిర్మాణమంతా అద్భుతంగానే ఉందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణదారులైన కోడా చిన్నాలమ్మకు చెందిన భూములకు కూడా సాగు నీరు అందుతోంది. అలాగే సమీపంలోని మిగిలిన గిరిజనుల భూములకు కూడా సాగునీరు అందుబాటులోకి వచ్చింది. ఈ పంట కాలువను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తే చేదుపుట్టు సమీపంలోని పంట భూములకు వేసవిలో కూడా సాగునీరు అందించవచ్చని గిరిజనులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం నిర్మించిన చెక్‌డ్యాం, కాలువ ద్వారా 60 ఎకరాల భూములకు సాగునీరు పుష్కలంగా అందుతుందని, వర్షాలు కురవకపోయిన పంటలు పండించవచ్చని స్థానిక గిరిజనులు పేర్కొంటున్నారు. దశాబ్దాల కల నెరవేరింది : కంబాల బయలు శివారున తమతో పాటు అనేక మంది గిరిజనులకు వ్యవసాయ భూములున్నాయి. పూర్వం నుంచి అక్కడ భూములకు గేదెగెడ్డ నుంచి సాగు నీరును అందించేందుకు చెక్‌డ్యాం నిర్మించాలని అధికారులను అనేకసార్లు కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. తన కుమారుల సహాయంతో సొంతంగానే మిరీ చెక్‌డ్యాం, పంట కాలువలు నిర్మించడం సంతోషంగా ఉంది. చెక్‌డ్యాం నిర్మించాలనే తమ కల ఇన్నాళ్లకు నెరవేరింది. ప్రధాన పంట కాలువ ద్వారా అందరి అవసరాలకు సాగునీరును మళ్లిస్తాం. –కోడా చిన్నాలమ్మ, నిర్మాణ దాత, కిముడుపల్లి -
పని చేస్తున్నారా.. ఇంట్లో పడుకుంటున్నారా ?!
సాక్షి, వరంగల్: రూ.కోట్ల కొద్ది నిధులతో నిర్మిస్తున్న చెక్ డ్యాం పనులును పరిశీలించకుండా ఇరిగేషన్ అధికారులు ఇంట్లో పడుకుంటున్నారా అని ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు సమీప పాకాలవాగుపై నిర్మిస్తున్న చెక్ డ్యాం పనులను బుధవారం ఎమ్మెల్యే పరిశీలించారు. అంతకుముందు వడ్డెరగూడెం సమీపంలోని చెక్ డ్యాం నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఖంగుతిన్నారు. ఇవేం పనులు.. అంటూ ఇరిగేషన్ డీఈ ఉపేందర్, ఏఈలు నిహారిక, శేఖర్‌ను పిలిచి ఆరా తీశారు. ‘అసలు మీరేం చేస్తున్నారు? మొత్తం మట్టి కనిపిస్తుంది. సిమెంట్‌తో కడుతున్నారా.. మట్టితోనా’ అని ప్రశ్నించారు. ‘మీరసలు పనుల వద్దకు వస్తున్నారా.. కమీషన్లు తీసుకొని ఇంటి వద్దనే ఉంటున్నారా’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో డీఈ ఉపేందర్ కలగచేసుకుని ఇంతకాలం మరో డీఈ ఉండేవారని, తాను కొత్తగా వచ్చినట్లు చెప్పగా ఏఈలపై ఆగ్రహం చేశారు. మరో రెండు వారాల్లో డ్యాం చుట్టూ కట్టే రాతి కట్టడాలలో సిమెంట్ నింపి కట్టాలని, ఇలా మట్టితో కాదని సూచించారు. మళ్లీ వచ్చి చూసే వరకు నాణ్యత లేకుంటే బిల్లులు ఆపిస్తానని హెచ్ఛరించారు. చదవండి: భిక్కనూరులో పాజిటివ్.. నిజామాబాద్‌లో నెగెటివ్ -
మానేరు సజీవం
సాక్షి, హైదరాబాద్: గోదావరికి ఉపనదిగా ఉన్న మానేరు నదిని ఏడాదంతా పూర్తిగా సజీవం చేసే ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశాలకు అనుగుణంగా మొత్తంగా మానేరు నదిపై 29 చెక్‌డ్యామ్‌ల నిర్మించేలా ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేయగా, వాటికి టెండర్లు పిలిచి, పనులు మొదలు పెట్టే దిశగా అధికారులు కసరత్తులు మొదలు పెట్టారు. మానేరు నది మొత్తం పొడవు 180 కిలోమీటర్లు కాగా, ఇందులో 40 కిలోమీటర్ల మేర ఎప్పుడూ నీటితో ఉంటుంది. ప్రస్తుతం మరో 40 కిలోమీటర్ల మేర నదిలో నీటి నిల్వలు నిత్యం ఉండేలా 29 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేయాలని సీఎం సూచించారు. వీటికి సంబంధించి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. వీటితో పాటే మూలవాగుపై మరో 12 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి సీ ఎం గ్రీ¯Œ సిగ్నల్ ఇచ్చారు. వీటి ద్వారా 30 కిలోమీటర్ల మేర నీటి నిల్వలు పెరగనున్నా యి. మొత్తం 41 చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి రూ.582 కోట్లు ఖర్చు అవుతుందని లెక్కతేల్చారు. వీటికి పరిపాలనా అనుమతి ఇవ్వాల్సి ఉం ది. పూర్వ కరీంనగర్ జిల్లా నేతలతో ఈ చెక్‌డ్యామ్‌ల నిర్మాణంపై ప్రగతిభవ¯Œ లో అతి త్వరలోనే సమీక్ష నిర్వహించి, చర్చించిన అనంతరం వీటికి అనుమతులిచ్చే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. -
చెక్‌డ్యామ్‌ల దారెటు?
రాష్ట్ర పరివాహకంలో కురిసే ప్రతి నీటిబొట్టు ఒడిసిపట్టేందుకు గోదావరి, కృష్ణా నదులపై చేపడుతున్న ప్రాజెక్టుల కాల్వల పరిధిలో నీటి నిల్వలు పెంచేలా చెక్‌డ్యామ్‌లను నిర్మించాలని నిర్ణయించినా అడుగు మాత్రం ముందుకు పడలేదు. మహారాష్ట్ర మాదిరి చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో నీటి నిల్వలను పెంచి గరిష్ట ఆయకట్టుకు నీరందించాలన్న లక్ష్యం కాస్తా నిధుల్లేక నీరసించి పోతోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నదులు, ఉపనదులు, వాగులు, వంకలపై కలిపి మొత్తంగా 1,200 చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని నిర్ణయించి పరిపాలనా అనుమతులు ఇచ్చినా పనులు మాత్రం ముందుకు సాగక చతికిల పడుతోంది. – సాక్షి, హైదరాబాద్ నిధుల్లేక నీరసం రాష్ట్రానికి ప్రధాన నీటి వనరులైన కృష్ణా నది కింద 299 టీఎంసీలు, గోదావరిలో 954 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశముంది. ఇందులో చిన్న నీటివనరుల కింద కృష్ణాలో 89 టీఎంసీలు, గోదావరిలో 165 టీఎంసీల కేటాయింపులున్నాయి. అయితే కృష్ణా బేసిన్లో ఎగువ కర్ణాటక, మహారాష్ట్ర ప్రాజెక్టులు నిండితే కానీ దిగువకు ప్రవాహాలులేని కారణంగా దిగువన తెలంగాణలో వాటా మేర నీటి వినియోగం జరగడం లేదు. దీనికితోడు కృష్ణానీటి కట్టడికి మహారాష్ట్ర ఏకంగా వందల సంఖ్యలో చెక్‌డ్యామ్‌ల నిర్మా ణం చేయడంతో దిగువకు నీటి కష్టాలు తప్పడం లేదు. గోదావరిలోనూ 165 టీఎంసీల మేర కేటాయింపులున్నా.. గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ ధ్వంసం కావడంతో అనుకున్న మేర అవి నిండటం లేదు. ఈ నేపథ్యంలో గోదా వరి బేసిన్లో ప్రధాన ఉపనదులైన మంజీరా, మానేరు, తాలిపేరు, లెండి, పెన్‌గంగ, కిన్నెరసాని వంటి వాగులు, కృష్ణాలో మూసీ, ఊకచెట్టువాగు, పెద్దవాగు, డిండి వాగు, పాలేరు, తుంగపాడు వంటి వాగులపై 1,200 చెక్‌డ్యామ్‌లను నిర్మించాలని నిర్ణయించింది. వీటికి రూ.3,826 కోట్ల మేర నిధులకు ఏప్రిల్‌లో పరిపాలనా అను మతి సైతం ఇచ్చింది. పనులు మొదలు పెట్టిన 6 నెలల్లో వీటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే మాంద్యం ఉండటంతో సాగునీటి శాఖకు బడ్జెట్ తగ్గింది. ఈ పనులకు నిధుల కొరత లేకుండా కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే రుణాలు తీసుకునేలా నిర్ణయించినప్పటికీ అది సాధ్యపడలేదు. దీంతో కేవలం 80 చెక్‌డ్యామ్‌లకు మాత్రమే సాంకేతిక అనుమతులిచ్చిన అధికారులు మిగతావాటికి నిధుల్లేక నిలిపివేశారు. సాంకేతిక అనుమతులు ఇచ్చిన చెక్‌డ్యామ్‌ల్లోనూ టెండర్లు పిలిచిన చెరువులు కేవలం పదుల సంఖ్యలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చెక్‌డ్యామ్‌లపై ఎలా ముందుకు వెళ్లాలన్న అయోమయం నెలకొంది. ప్రస్తుతం సాగునీటి శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ చూస్తుండటంతో ఆయనే వీటిపై మార్గదర్శనం చేస్తే కానీ పనులు ముందుకు కదిలే అవకాశం లేదు. -
కాళేశ్వరంతో జీవనదిగా హల్దీవాగు
సాక్షి, వర్గల్(గజ్వేల్): కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో జిల్లాలో సుప్రసిద్ధమైన నాచారం గుట్ట శ్రీలక్ష్మీ నృసింహక్షేత్రం వద్ద హల్దీ వాగు జీవనదిగా మారనుందని రాష్ట్ర ఆర్థికశాఖామాత్యులు తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం వర్గల్ మండలం నాచారం గుట్ట పుణ్యక్షేత్రం వద్ద రూ 7.48 కోట్ల వ్యయంతో హల్దీవాగుపై చెక్‌డ్యాం నిర్మాణ పనులకు ఆయన, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో భాగంగా గతంలో ఇచ్చిన మాట ప్రకారం హల్దీవాగుపై చెక్‌డ్యాం నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. చెక్‌డ్యాం నిర్మాణంతో 350 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుందన్నారు. దేవస్థానం ముందు హల్దీవాగు త్వరలోనే కాళేశ్వరం నీళ్లు, గోదావరి జలాల ప్రవాహంగా మారనుందన్నారు. కాలమైనా, కాకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో ఎగువన ఉన్న మల్లన్న సాగర్, కొండ పోచమ్మ రిజర్వాయర్ల ద్వారా హల్దీవాగు మీదుగా నిజాంసాగర్ ప్రాజెక్టును నింపనున్నామని స్పష్టం చేశారు. హల్దీవాగు ఇక జీవనదిగా మారనుందని, రైతులు మొగులుకు మొఖం పెట్టి చూసే రోజులు పోతాయని, ప్రతిరైతు కళ్లలో ఆనందం చూడటమే సీఎం కోరిక అన్నారు. సీఎం ఆదేశాలు, సూచనలతో ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రతిపాదనలు రూపొందించి ఈ ప్రాంత రైతాంగానికి సాగు నీరు అందించడంతోపాటు భక్తులకు సౌకర్యాలు చేకూరేలా చర్యలు తీసుకుంటామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ఈ పనుల వల్ల రైతులకు ఎంతో మేలు చేకూరి వేలాది ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. నాచారం గుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాస్టర్‌ప్లాన్ రూపొందించి ఆలయ అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. నాచారం గుట్ట ఆలయ సమీప హల్దీవాగు సుందరీకరణ, చెక్‌డ్యాం నిర్మాణంతోపాటు బతుకమ్మ ఘాట్లు, స్నానపుఘాట్లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. సుందరీకరణలో భాగంగా రూ 3.62 కోట్లతో చెక్‌డ్యాం, రూ 2.21 కోట్లతో స్నానపుఘాట్లు, రూ 14.5 లక్షలతో వాగులో పూడికతీతకు నిధులు వెచ్చించినట్లు వివరించారు. చెక్‌డ్యాం నిర్మాణంలో ఎల్ఎస్ ప్రొవిజన్స్ కింద రూ 150.50 లక్షలు కలిపి మొత్తం చెక్‌డ్యాం నిర్మాణానికి రూ. 7.48 కోట్లు వెచ్చిస్తున్నట్లు వివరించారు. దాదాపు 700 మీటర్ల ఈ చెక్‌డ్యాంలో నీరు నిలిచి ఉంటుందన్నారు. మంత్రికి పూర్ణకుంభ స్వాగతం నాచారం గుట్ట సందర్శించిన మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిలకు ఆలయ ఈఓ సుధాకర్‌రెడ్డి, వేదపండిత పరివారంతో కలిసి పూర్ణకుంభ స్వాగతం పలికారు. నృసింహస్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు, మహదాశీర్వచనం పొందారు. అనంతరం అక్కడి నుంచి శరన్నవరాత్రోత్సవ శోభతో అలరారుతున్న వర్గల్ శ్రీవిద్యాసరస్వతి క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి, ఎంపీలకు ఆలయం తరపున ఘన సన్మానం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. మహదాశీర్వచనం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం చైర్మన్ భూపతిరెడ్డి, బూరుగుపల్లి ప్రతాప్‌రెడ్డి, కొట్టాల యాదగిరి, మామిండ్ల బాలమల్లు యాదవ్, మల్లేషం, జాలిగామ లత రమేష్‌గౌడ్, దేవగణిక నాగరాజు, నాచారం సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ వెంకటేష్‌గౌడ్, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
అసలిచ్చి.. కొసరు మరిచి!
రైతులు దేశానికి వెన్నెముక వంటి వారు.. అలాంటి వారికి ఉపయోగపడే ప్రాజెక్టులను కూడా రాజకీయ లబ్ధి కోసం శంకుస్థాపన చేయడం బాధాకరమని పశ్చిమ ప్రాంత వాసులు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి పనులకు అట్టహాసంగా శంకుస్థాపనలు చేసి నిధులు మంజూరు చేయకపోవడాన్ని అన్నదాతలు తప్పుబడుతున్నారు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని..అన్న చందంగా ఉంది మార్కాపురం గుండ్లకమ్మ నది ఒడ్డున ఏర్పాటు చేసిన చెక్‌డ్యామ్ పరిస్థితి. చెక్‌డ్యామ్ ఎట్టకేలకు పూర్తయినా నీళ్లు నిల్వ ఉండేందుకు గేట్లు నిర్మించకపోవడంతో నీరంతా వృథాగా పోతోంది. వేలాది ఎకరాలు బీళ్లుగా మారుతున్నాయి. రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. సాక్షి, మార్కాపురం రూరల్ (ప్రకాశం): మార్కాపురం పట్టణ సమీపంలోని పెద్ద నాగులవరం గ్రామ ఇలాకాలో గుండ్లకమ్మపై నాలుగేళ్ల క్రితం రూ.9 కోట్లతో భారీ చెక్‌డ్యామ్ నిర్మించారు. మెకానికల్ గేట్లు అమర్చలేదు. చెక్‌డ్యామ్ నిర్మించినా ఉపయోగం లేకుండా కేవలం అలంకార ప్రాయంగా ఉంది. ఇటీవల ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో ఒక్కసారిగా గుండ్లకమ్మకు నీరు చేరింది. చెక్‌డ్యామ్ నిండి కూడా గుండ్లకమ్మ నీరు దిగువ ప్రాంతానికి వెళ్లిపోయింది. ఆ చెక్ డ్యామ్‌కు గేట్లు నిర్మించకకోవడంతో నీరంతా దిగువ ప్రాంతానికి వృథాగా పోయింది. ప్రజలు ఆశలు ఒక్కసారిగా ఆవిరయ్యాయి. సాగు చేసి నాలుగు గింజలు పండిద్దామన్న రైతుల కల నెరవేరలేదు. చెక్‌డ్యామ్ కెపాసిటీ దాదాపు 80 మిలియన్ క్యూబిక్ పీట్స్ అంటే 0.08 టీఎంసీల వరకు నీరు నిల్వ చేసుకోవచ్చు. అంటే దాదాపు 800 ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాలతో పాటు పట్టణంలోని బోర్లకు నీరు అందించవచ్చు. చెక్‌డ్యామ్‌తో పట్టణంలోని బోర్లకు భూగర్భ జలాలు పెరిగి ప్రజలకు నీటి సమస్య ఉండదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో చెక్‌డ్యామ్ చుక్క నీరు నిల్వ ఉండని పరిస్థితి దాపురించింది. అరకొరగా చేపట్టిన చెక్‌డ్యామ్ నిర్మాణ పనులపై అప్పట్లో ప్రజలు ఇరిగేషన్ అధికారుల తీరును తప్పుపట్టారు. ఇటు ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి చెక్‌డ్యామ్‌ను సందర్శించి వెంటనే రింగ్ బండ ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు. చెక్‌డ్యామ్ ఇరువైపులా ఉన్న మట్టి ఇప్పటికే జారిపోతోందని, పైన మట్టి నెర్రెలు బారిందని, ఇరువైపులా రివింట్మెంట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఏం..ఉపయోగం? ఎట్టకేలకు రింగ్ బండను ఏర్పాటు చేసినా ఉపయోగం లేకుండాపోయింది. అది కాస్తా కొద్దిపాటి వర్షానికే కొట్టుకుపోయింది. కేవలం ప్రజాప్రతినిధులు ఏదో అడిగారు.. చేశామని చందంగా ఆ రింగ్ బండ్‌ను ఏర్పాటు చేశారు. రింగ్ బండ ఏర్పాటు చేసేటప్పుడు మట్టిపోసి దానిపై నీళ్లు చల్లి రోలింగ్ తిప్పాలి. కానీ అదేమీ చేయకుండా చెక్‌డ్యామ్‌లోని మట్టిని ట్రాక్టర్‌తో తెచ్చి గ్యాప్ పూడ్చారు. రూ.66 లక్షలు అవసరం పెద్దనాగులవరం చెక్‌డ్యామ్‌లో నీరు నిల్వ ఉండేందుకు సుమారు మూడు మెకానికల్ గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అందుకు రూ.66 లక్షలు అవసరం కానున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఉదాసీనతతో నిధులు కూడా మంజూరు కాలేదు. ఇటీవల మార్కాపురం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు మంత్రి లోక్ష్ దరిమడుగు సమీపంలో కొత్త చెక్‌డ్యామ్ నిర్మాణానికి రూ.28.09 కోట్లతో శంకుస్థాపన చేశారు. చెక్ డ్యామ్‌ల నిర్మాణ ముఖ్య ఉద్దేశం పట్టణంలోని బోర్లకు నీరు సంవృద్ధిగా అందించడం. సమీపంలోని పొలాలకు నీరు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేశారు. చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయడం తప్పు కాదుగానీ తప్పుడు హామీలతో ప్రజలను మభ్యపెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఐదు నెలలవుతున్నా ప్రారంభించని పనులు నిర్మాణానికి రూ.28.09 కోట్లు మంజూరు చేశామని చినబాబు చెప్పారు. చెప్పి కూడా దాదాపు ఐదు నెలలు కావస్తున్నా ఇంత వరకు అతీగతీ లేదు. పనులు చేపట్టలేదు కదా అసలు టెండర్లే జరగలేదు. పట్టణ ప్రజలు, దరిమడుగు గ్రామ ప్రజలకు ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల కోసం హడావుడి కోసం శంకుస్థాపన చేసి ఎవరిని మోసం చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉన్నదానికి ఉపయోగం లేకుండా కొత్త వాటి నిర్మాణానికి కోట్లు మంజూరు చేస్తారా..అంటూ ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రజలను మోసం చేసేందుకే శంకుస్థాపనలు ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి చంద్రబాబునాయుడు వచ్చారు. ఇక చినబాబు మార్కాపురం ప్రాంతంలో పలు రకాల పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో పెద్ద నాగులవరం చెక్‌డ్యామ్ పూర్తి అయినా దానికి మెకానికల్ గేట్లు ఏర్పాటుకు రూ.66 లక్షలు మంజూరు చేయాలి. ఇప్పటికీ దిక్కు లేదుగానీ కొత్తగా రూ.28 కోట్లతో మరొకదానికి దరిమడుగ గ్రామ సమీపంలో శంకుస్థాపన చినబాబు చేశారు. ఇది కేవలం ప్రజలను మోసం చేసేందుకే. - జవ్వాజి వెంకట రంగారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు రైతులతో రాజకీయం చేయడం సిగ్గుచేటు గుండ్లకమ్మ నది ఒడ్డున పెద్ద నాగులవరం చెక్ డ్యామ్ పూర్తి చేసి కూడా రైతులకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. దానికి గేట్లు నిర్మిస్తే చుట్టుపక్కల రైతుల బోర్లకు నీరు పూర్తిగా వస్తుంది. మంత్రి లోకేష్ శంకుస్థాపనలు చేసిన విధానం చూస్తుంటే రాజకీయ లబ్ధి కోసమే శంకుస్థాపన చేసినట్లు ఉంది. - సీహెచ్ తిరుపతిరెడ్డి, దరిమడుగు, రైతు గేట్లు నిర్మించాలి పెద్ద నాగులవరం చెక్ డ్యామ్ పూర్తయి దాదాపు 15 నెలలు కావస్తున్నా ఇంత వరకు గేట్లు నిర్మించకపోవడం సిగ్గుచేటు. గేట్లు పెట్టి ఉంటే ఆరు నెలల క్రితం గుండ్లకమ్మ నది ఎగువన కురిసిన వర్షానికి నీరు నిల్వ ఉండి ఉపయోగపడేవి. కానీ దిగువకు పోయి కేవలం ఆ చెక్‌డ్యామ్ అలంకార ప్రాయంగా మిగిలిపోయింది. చెక్‌డ్యామ్ విషయంలో రాజకీయం చేయకుండా త్వరగా గేట్లు నిర్మించాలి. - తురకా ఏడుకొండలు, సీపీఎం నాయకుడు, పెద్ద నాగులవరం -
ఆక్వా చెరువుల కోసం అన్నదాతల కడుపు కొట్టారు..!
సాక్షి, సింగరాయకొండ: ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు కాదు..చెడు మాత్రం చేయకూడదు. కానీ అధికార పార్టీ నేతలు మాత్రం మంచి అన్న పదాన్ని మర్చిపోయారు. తమ స్వార్థం కోసం ఎంతకైనా వెనుకాడలేదు. వేల మంది రైతులకు ఉపయోగడే చెక్ డ్యాం నిర్మాణాన్ని నిర్ధాక్షిణ్యంగా అడ్డుకొని అన్నదాతల కడుపుకొట్టారు. వీరికి ఎమ్మెల్యే స్వామి మద్దతు పలకడంతో చెక్‌డ్యాం నిర్మాణం నిలిచిపోయి వేల ఎకరాల భూములు సాగుకు నోచుకోలేదు. రైతులకు ఆసరాగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు ఆక్వా రైతులకు అండగా ఉండటంతో చివరకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు మంజూరైనా.. పాకల సమీపంలో పాత పాలేరుపై చెక్‌డ్యాం నిర్మాణానికి 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు రూ.1.53 కోట్లు మంజూరుచేసింది. ఈ చెక్‌డ్యాం నిర్మాణం పూర్తయితే బీడులుగా ఉన్న 250 ఎకరాల సాగులోకి రావడంతో పాటు కొత్త చెరువు కింద ఉన్న సుమారు 1300 ఎకరాల ఆయకట్టులో పంటలు పుష్కలంగా పండుతాయి. పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ రూ.4.80 లక్షల పనులు చేసిన తరువాత ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి. ఆ తరువాత తనను గెలిపిస్తే చెక్‌డ్యాంను పూర్తి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అయితే ఆ తరువాత టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో దామచర్ల కుటుంబానికి చెందిన బంధువులకు సంబంధించిన ఆక్వా చెరువులకు ఇబ్బందులు ఏర్పడతాయని భావించి చెక్‌డ్యాం పనులను అడ్డుకుని ఎమ్మెల్యే స్వామి తన స్వామి భక్తిని చాటుకొని మా నోట్లో మట్టి కొట్టారని రైతులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. అనుమతులన్నీ ఉన్నా.. పాత పాలేరుపై చెక్‌డ్యాం నిర్మాణానికి అన్ని శాఖల నుంచి పూర్తి స్థాయిలో అనుమతులు ఉన్నాయి. అయితే అధికార పార్టీ నేతలు మాత్రం కుంటిసాకులు చెబుతూ పనులను అడ్డుకున్నారు. చెక్‌డ్యాం నిర్మాణానికి ఫారెస్టుతో సహా అన్ని శాఖల అనుమతులు ఉన్నా పనులు అడ్డుకుంటున్నారని, దీంతో తామేం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నామని సాక్షాత్తు జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులే చెప్పారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామం మునిగిపోతుందంటూ పుకార్లు.. అధికార పార్టీ నేతలు చెక్‌డ్యాం నిర్మాణాన్ని అడ్డుకునేందుకు సరికొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు. చెక్‌డ్యాం పూర్తయితే సమీపంలోని టంగుటూరు మండలం రాయివారిపాలెం గ్రామం మునిగిపోతుందని పుకార్లు పుట్టించారు. వాస్తవానికి రొయ్యల చెరువుల కట్టలు 6 అడుగుల ఎత్తులో ఉండగా, చెక్‌డ్యాం ఎత్తు కేవలం 4 అడుగులు మాత్రమేనని, అటువంటప్పుడు ఊరు ఏ విధంగా మునుగుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. అవసరం లేకున్నా నిర్మాణం.. పాకల సమీపంలో పాత పాలేరుపై చెక్‌డ్యాం నిర్మాణాన్ని అడ్డుకున్న అధికార పార్టీ నేతలు..అవసరం లేని ప్రాంతంలో రూ.10 లక్షల చొప్పున చెక్‌డ్యాంలు నిర్మించారు. వీటి వల్ల ఎటువంటి ఉపయోగం లేదని రైతులు పేర్కొంటున్నారు. కేవలం అధికార పార్టీ కోసమే వీటిని నిర్మించారని రైతులు పేర్కొంటున్నారు. చెక్‌డ్యాంతో ఎంతో ప్రయోజనం పాత పాలేరుపై చెక్‌డ్యాం నిర్మిస్తే సుమారు 1500 ఎకరాల్లో ఏటా నీటి ఎద్దడి తీరి పంటలు బాగా పండతాయి. మరో 250 ఎకరాలు సైతం సాగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది సరైన వర్షాలు లేక కేవలం 10 ఎకరాల్లో మాత్రమే పంటలు వేసుకున్నాం. - గండవరపు పిచ్చిరెడ్డి, రైతు, పాకల చెక్‌డ్యాం నిర్మాణంతో మా కష్టాలు తీరుతాయి చెక్‌డ్యాం పూర్తయితే ఏటా రెండు పంటలు పండించుకోవచ్చు. చెక్‌డ్యాంకు నిధులు మంజూరైతే కష్టాలు తీరతాయని ఆశించాం. అయితే నాలుగేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో పంటలు పండించుకోలేపోయాం. - బత్తుల భాస్కరరెడ్డి, రైతు, పాకల -
మంత్రివర్యా.. దయ చూపండి!
♦ పెండింగ్‌లో ‘చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి’ ♦ ఎత్తిపోతల చివరిదశ పనులు ♦ ఇంకా మొదలుకాని పెద్దవాగు ♦ చెక్‌డ్యాంల నిర్మాణాలు మోర్తాడ్: మోర్తాడ్, కమ్మర్పల్లి మండలాల వ్యవసాయ భూములకు సాగునీరు అందించడానికి నిర్దేశించిన చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం చివరి దశ పనులు ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అన్న విధంగా సాగుతున్నాయి. చివరి దశ పనులు పూర్తయితే ఎత్తిపోతల పథకం పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. ఎత్తిపోతల పథకం నిర్వహణ, పెండింగ్ పనులు పూర్తి చేయడం కోసం బడ్జెట్లో నిధులు కేటాయించినా పనులు ఆశాజనకంగా సాగడం లేదు. ఎత్తిపోతల పథకం పనులను పర్యవేక్షించే అధికారులు బదిలీ కావడం, కాంట్రాక్టు ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తులు సరిగా స్పందించకపోవడంతో చివరి దశ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఎత్తిపోతల పథకంలో చేర్చిన రామన్నపేట్‌కు నీరు అందించడానికి కాలువలను తవ్వాల్సి ఉంది. అంతేకాక చౌట్పల్లి నుంచి అమీర్‌నగర్, నర్సాపూర్, ఇనాయత్ నగర్ గ్రామాలకు కూడా పైప్‌లైన్ పనులు చేపట్టాల్సి ఉంది. సుంకెట్‌కు నీరు అందించడానికి దోన్పాల్ నుంచి కాలువ తవ్వకం చేపట్టాల్సి ఉంది. అటవీశాఖకు సంబంధించిన భూములు ఉండటంతో అటవీశాఖ అనుమతి పొందిన తరువాతనే పనులు మొదలయ్యే అవకాశం ఉంది. అయితే ఎత్తిపోతల పథకం నిర్వహణ, పెండింగ్ పనులను పూర్తి చేయడం కోసం 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.కోటి కేటాయించారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2కోట్లు బడ్జెట్లో కేటాయించారు. నిధులను కేటాయించినా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. ఎత్తిపోతల పథకంను ఎప్పుడో ప్రారంభించాల్సి ఉన్నా పనులు అసంపూర్తిగా నిలచిపోవడంతో ట్రయల్న్ ్రదశలోనే పథకం ఆగిపోయింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఈ వర్షాకాలం ఆశించిన స్థాయిలో నీరు వస్తే వచ్చే రబీ సీజనులో ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీటిని అందించవచ్చు. కాని ఎత్తిపోతల పథకం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయింది. చెక్‌డ్యాంల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ లభించేనా...? వరదల వల్ల పెద్దవాగులో చేరే నీటిని భూగర్భంలో అభివృద్ధి పరచడానికి ప్రతిపాదించిన చెక్‌డ్యాంల నిర్మాణానికి నిధులు మంజూరు అయినా ఇంకా పనులు మొదలు కాలేదు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పర్యటనతోనైనా చెక్‌డ్యాంల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ లభిస్తుందా అని రైతాంగం ఆశతో ఎదురుచూస్తోంది. మోర్తాడ్ మండలంలోని దొన్కల్, గాండ్లపేట్ల శివారులో ఉన్న పెద్దవాగులో చెక్‌డ్యాం నిర్మించడానికి రూ.4.84 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వేల్పూర్, రామన్నపేట్ల మధ్య ఉన్న పెద్దవాగులో చెక్‌డ్యాం నిర్మాణం కోసం రూ.4.14 కోట్లు, గోనుగొప్పుల వద్ద చెక్‌డ్యాం నిర్మాణం కోసం రూ.3.53 కోట్లు, భీమ్‌గల్ వద్ద చెక్‌డ్యాం నిర్మాణం కోసం రూ.4.95 కోట్లు మంజూరు అయ్యాయి. నాలుగు చోట్ల చెక్‌డ్యాంల నిర్మాణం కోసం రూ.17.56 కోట్లు మంజూరు అయ్యాయి. గడచిన ఆర్థిక సంవత్సరంలోనే నిధులు మంజూరు అయినా పనులు ఇంతవరకు మొదలుకాలేదు. వర్షాలు కురువకముందు చెక్‌డ్యాంల నిర్మాణం పూర్తి అయితే వర్షపు నీరు వాగులో ఇంకి భూగర్బ జలాలు అభివృద్ధి చెందుతాయి. నీటిపారుదల శాఖకు సొంత భవనాల కొరత... తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ కాకతీయ పథకం బాధ్యతలు నిర్వహిస్తున్న నీటిపాదుల శాఖకు సొంత భవనాల కొరత వేధిస్తోంది. తొమ్మిది సబ్ డివిజన్ కార్యాలయాకు గాను నాలుగు చోట్ల సొంత భవనాలు లేక అద్దె భవనాల్లోనే కార్యాలయాలు కొనసాగుతున్నాయి. మండల కేంద్రాలలో ఏఈఈ, జేఈ ఇతర సిబ్బంది ఉండటానికి సెక్షన్ కార్యాలయాలను నిర్మించాల్సి ఉంది. సెక్షన్ కార్యాలయాలకు స్థలాలు చూపకపోవడంతో నిధులు ఉన్నా సొంత భవనాల నిర్మాణం మొదలు కాలేదు. కొన్నిచోట్ల గతంలో నిర్మించిన భవనాల్లో సెక్షన్ కార్యాలయాలు, సబ్ డివిజనల్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. మంత్రి హరీశ్‌రావు జిల్లా పర్యటనలో ఈ సమస్యలపై దృష్టి సారించి పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. -
నిధులున్నా.. పనులేవీ...
మొదలుకాని జంపన్నవాగు చెక్‌డ్యాంల నిర్మాణం జాతర సమయంలోనే హడావుడి గతంలో స్నానఘట్టాల్లోనూ ఇదే తీరు ఆలస్యమైతే మరో రెండేళ్లు నిరీక్షణే.. సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు మేడారం వచ్చే భక్తులు స్నానాలు చేసేందుకు వీలుగా జంపన్నవాగులో నిర్మించాల్సిన చెక్‌డ్యాం నిర్మాణ పనులు ప్రారంభం కావడం లేదు. గత ఏడాది డిసెంబర్ లో ఈ చెక్‌డ్యాంల నిర్మాణానికి నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం పాలన అనుమతి మంజూరు చేసింది. జాతర సమయానికే పనులు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ నెల గడిచినా ఇంత వరకు ఉలుకూపలుకు లేదు. ఈ పనులు చేపట్టాల్సిన చిన్ననీటి పారుదల శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారు. హన్మకొండ : తాడ్వారుు మండలంలోని మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు జంపన్న వాగులో తప్పనిసరిగా స్నానం చేస్తారు. ఈ వాగు ఒడ్డునే తల నీలాలు సమర్పిస్తారు. జంపన్నవాగులో వర్షాకాలం మినహా మిగిలిన సమయాల్లో స్నానం చేసేందుకు సరిపడా నీరు ప్రవహించదు. జాతర జరిగే సమయంలో లక్నవరం జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తారు. ఇలా జంపన్నవాగులోకి చేరిన నీటిలో భక్తులు స్నానం చేసేందుకు వీలుగా ఇసుక కట్టలతో తాత్కాలిక చెక్‌డ్యాంలు ఏర్పాటు చేస్తారు. ఈ ఇబ్బందులు తొలగించేందుకు 2016 జాతర కల్లా జంపన్నవాగులో పుణ్యస్నాణాలు చేసేందుకు వీలుగా జంపన్నవాగులో చెక్‌డ్యామ్‌లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రూ. 13.96 కోట్ల నిధులు మంజూరు చేస్తూ 2015 డిసెంబరు 21న ఉత్తర్వులు జారీ చేసింది. యుద్ధప్రతిపాదికన చెక్‌డ్యాం నిర్మాణ పనులు ప్రారంభించి జాతర సమయానికి కల్లా పూర్తి చేయాలంటూ ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. జాతర ముగిసినా.. జంపన్నవాగుపై ఊరట్టం, పడిగాపూర్, రెడ్డిగూడెం, మేడారం వద్ద నాలుగు చెక్‌డ్యాంలు నిర్మిం చాల్సి ఉంది. జాతర సమయానికి నిర్మించాలని ప్రభుత్వం ఆదేశించినా ఉత్తర్వులు విడుదలైన రోజు నుంచి జాతర వరకు అందుబాటులో ఉన్న 57 రోజుల వ్యవధిలో టెండర్లు నిర్వహించినా పనులు పూర్తి చేయలేమని చిన్ననీటిపారుదల శాఖ అధికారులు చేతులెత్తేశారు. జాతర ముగి సిన తర్వాత పనులు ప్రారంభిస్తామన్నారు. జా తర ముగిసి నెల గడుస్తున్నా ఇంతవరకు చెక్‌డ్యాం నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. చెక్‌డ్యామ్‌ల నిర్మాణంపై ఉలుకుపలుకు లేకుండా పోయింది. జాతర ముగిసి నెల దాటిన టెండర్ల నిర్వహించేందుకు ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోలేదు. ఇటీవల ఈ చెక్‌డ్యాంల టెండర్లు ని ర్వహించేందుకు సాంకేతిక మంజూరు కోసం ప్ర భుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. గతంలో ఇదే తంతు 2014 మేడారం జాతర సందర్భంగా జంపన్నవాగు వెంట ఊరట్టం, రెడ్డిగూడెం సమీపంలో స్నానఘట్టాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులు రెండు విడతల్లో చేపట్టాలని పేర్కొంది. దీని ప్రకారం జాతరకు ముందు రెడ్డిగూడెం, ఊరట్టం కాజ్వే వద్ద తొలి విడత పనులు చేపట్టారు. జాతర ముగిసిన తర్వాత ఊరట్టం కాజ్వే, చిలకలగుట్ట వద్ద రూ.10 కోట్లతో చేపట్టాల్సిన పనులను ప్రారంభించలేదు. రెండేళ్ల తర్వాత 2016 జాతర సందర్భంగా మంజూరైన నిధులతోనే రెండో విడత స్నానఘట్టాల పనులు పూర్తి చేశారు. గతంలో స్నానఘట్టాల విషయంలో జరిగినట్లుగానే చెక్‌డ్యామ్‌ల విషయంలో ఆలస్యం జరిగేందుకు ఆస్కారం ఉందని భక్తులు సందేహిస్తున్నారు. గతంలో పోల్చితే సమ్మక్క-సారలమ్మను దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగింది. ఆదివారాలు, సెలవు దినాల్లో వందల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా చెక్‌డ్యామ్‌ల నిర్మాణం ఈ వేసవిలో ప్రారంభమైతే వర్షకాలం వరకు పూర్తవుతుంది. చెక్‌డ్యామ్‌లలో నిల్వ ఉండే నీరు ఇటు రైతులకు ఉపయోగపడటమే కాకుండా భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు అక్కరకు వచ్చేది. -
భువనచంద్ర చెక్‌డ్యాం నిర్మాణాన్ని నిలిపివేయాలి
నిర్వాసితుల డిమాండ్ స్పీకర్, మంత్రిని అడ్డుకున్న రైతులు, మహిళలు రాజుపాలెం: గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో భువనచంద్ర చెక్‌డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వచ్చిన స్పీకర్ కోడెల శివప్రసాదరావు, భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు నిర్వాసితుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ చెక్‌డ్యాం నిర్మాణాన్ని నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. చెక్‌డ్యాం వల్ల భూములను కోల్పోతున్న రైతులు, మహిళలు శంకుస్థాపన పనులను శనివారం అడ్డుకున్నారు. శంకుస్థాపనకు ఉపయోగించిన పూజా సామాగ్రి, రాళ్లను బయటకు విసిరేశారు. బలిజేపల్లికి చెందిన నిర్వాసితులు, మహిళలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తీవ్ర గందరగోళం, తోపులాట చోటుచేసుకున్నాయి. నిర్వాసితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ ప్రాణాలు పోయినా ఇక్కడ చెక్‌డ్యాం కట్టడానికి ఒప్పుకోబోమని తేల్చిచెప్పారు. రైతులు, మహిళలను పోలీసులు చెదరగొట్టారు. చివరకు పోలీసు బందోబస్తు మధ్య స్పీకర్ కోడెల, మంత్రి ఉమా.. భువనచంద్ర చెక్‌డ్యాంకు శంకుస్థాపన చేశారు. నిర్వాసిత రైతులతో స్పీకర్ కోడెల మాట్లాడారు. చెక్‌డ్యాం వల్ల భూములు మునిగిపోతే, తామంతా బజారున పడుతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చెక్‌డ్యాంతో తమ గ్రామానికి ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. న్యాయం చేస్తానంటూ స్పీకర్ వారికి హామీ ఇచ్చారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వాసితులు అడ్డుకుంటారని తెలుసుకున్న అధికారులు బలిజేపల్లి గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోని గణపవరంలో శిలాఫలకాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు. -
అ‘ధనం’
పాత పనులకు అదనపు కేటాయింపులు రెట్టింపు ప్రతిపాదనలతో నిధులు మంజూరు పూర్తయిన పనులకు పెరుగుతున్న నిధులు చెక్‌డ్యాంల నిర్మాణంలో అక్రమాలు మిషన్ మర్మం 5 మద్దూరు మండలం దూల్మిట్లలో పెద్దవాగుపై చెక్‌డ్యాం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2011 జూన్ 11న ఉత్తర్వులు జారీ చేసింది. రూ.3.12 కోట్లతో నిర్మాణం పూర్తి చేయాలని పేర్కొంది. 2015 జనవరి 1న అధికారులు కొత్తగా రూపొందించారు. నిర్మాణం వ్య యం అంచనాను రూ.55.48 లక్షలు పెంచాలని ప్రతిపాదించారు. పెరిగిన అంచనా మేరకు చెక్‌డ్యాం నిర్మాణం కోసం రూ.3.67 కోట్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 25న ఉత్తర్వులు జారీ చేసిం ది. ఏడాది క్రితం దీని నిర్మాణం పూర్తయ్యింది. అయినా దీని నిర్మాణం అంచనాలు పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. కొడకండ్ల మండలం ఏడునూతలలోని పెద్ద చెరువు పునరుద్ధరణ కోసం రూ.67 లక్షలు మంజూరు చేస్తూ 2012 సెప్టెంబర్ 3న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చెరువు పునరుద్ధరణ చేయకుండా కేవలం గండ్లు పూడ్చి సరిపెట్టారు. ఇదే చెరువు పునరుద్ధరణ కోసం రూ.3.82 కోట్లు అవసరమవుతాయని చిన్ననీటి పారుదల శాఖ తాజాగా అంచనాలు వేసింది. 2015 జనవరి 13న పెరిగిన అంచనాలతో ప్రభుత్వానికి నివేదించింది. మిషన్ కాకతీయ కింద రాష్ట్ర ప్రభుత్వం ఇంతే మొత్తాన్ని మంజూరు చేస్తూ ఏప్రిల్ 21న ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల క్రితం లక్షల రూపాయల్లో ఉన్న చెరువు పునరుద్ధరణ నిధులు ఇప్పుడు కోట్ల రూపాయలకు పెరగడం విమర్శలకు దారితీస్తోంది. వచ్చిన పనులు చేయకుండా జాప్యం చేయడం.. పాత పనులనే అంచనాలు పెంచుకోవడం.. భారీగా ప్రభుత్వ నిధులు తీసుకోవడం చిన్ననీటి పారుదల శాఖలో జోరుగా జరుగుతోంది. అధికారులు-కాట్రాక్టర్ల మధ్య సమన్వయం బాగా ఉంది. పూర్తయిన పనులకు కూడా పెంచిన అంచనాలతో నిధులు కేటాయించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్తున్నాయి. అధికారులు పంపిన అంచనాల ఆధారంగా ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు విడుదల చేస్తోంది. మొత్తంగా నిర్మాణాల అంచనాల వ్యయం భారీగా పెరుగుతోంది. జిల్లాలో మూడు నెలలుగా ఇది ఎక్కువగా జరుగుతోంది. చిన్ననీటి పారుదల శాఖలోని చెక్‌డ్యాం నిర్మాణాల కోసం గతంలో మంజూరు చేసిన నిధులకు రెట్టింపు స్థాయిలో కేటాయిస్తూ వరుసగా ఉత్తర్వులు వస్తున్నాయి. కాంట్రాక్టర్లను మెప్పించేందుకు అంచనాలను పెంచుతున్న అధికారులు పనుల నాణ్యతను పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. భూపాలపల్లి నియోజకవర్గం చిట్యాల వద్ద చలివాగుపై ఆనకట్ట నిర్మాణం కోసం రూ.2.26 కోట్లు మంజూరు చేస్తూ 2008 సెప్టెంబర్ 6న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2012 జూన్‌లో ఈ ఆనకట్ట నిర్మాణం అంచనాలను పెంచారు. అప్పుడు పెంచిన అంచనాల మేరకు పనులు చేశారు. నిర్మాణం పూర్తి కావడంతో 2013లో అప్పటి ప్రభుత్వ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఇలా ప్రారంభించిన ఆనకట్టకు అదనపు నిర్మాణ వ్యయం అయ్యిందనే కారణంతో అంచనాలు పెంచారు. ఏకంగా రూ.5.72 కోట్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2015 మార్చి 14న ఉత్తర్వులు జారీ చేసింది. ఆనకట్టకు ముందు నీటి నిల్వ కోసం లోతుగా ఉండాల్సిన ప్రదేశం మొత్తం ఇసుక మేటతో నిండింది. ఇక్కడ నీరు ఆగే పరిస్థితి లేదు. ఇలాంటి నిర్మాణానికి మళ్లీ నిధులను పెంచారు. జనగామ నియోజకవర్గం మ ద్దూరు మండలం గాగిల్లాపూర్-లింగాపూర్ మధ్యలో పెద్ద వాగుపై చెక్‌డ్యాం నిర్మాణం గతేడాది పూర్తయింది. నిర్మాణం పూర్తయిన ఈ చెక్‌డ్యాం కోసం అంచనాలు పెంచారు. 2009 జూన్ 9న ఈ చెక్‌డ్యాం నిర్మాణం కోసం ప్రభుత్వం ఉత్తర్వులు చేసింది. రూ. 2.34 కోట్లతో ఈ చెక్ డ్యాం నిర్మాణం పూర్తి చేయాలని పేర్కొంది. 2014 మార్చి 3న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అధికారులు ఈ చెక్‌డ్యాం నిర్మాణ వ్యయాన్ని పెంచారు. పెరిగిన అంచనాల మేరకు అప్పటి ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. మళ్లీ 2014 నవంబర్ 17న ఉన్నతాధికారులు పెరిగిన అంచనాలను ఖరారు చేశారు. తాజాగా ఈ చెక్‌డ్యాం నిర్మాణం కోసం రూ.2.73 కోట్లకు పెంచుతూ ఫిబ్రవరి 13న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం కల్లెడలో ఆకేరు వాగు పై చెక్ డ్యాం ని ర్మించాలని ప్రభుత్వం నిర్ణయిం చిం ది. దీని నిర్మాణం కోసం రూ.45.90 లక్షలు మంజూ రు చేస్తూ 2006 నవంబరు 24న ఉత్తర్వు లు జారీ చేసింది. కాంట్రాక్టరు పనులు చేయకుండా జాప్యం చేశాడు. తర్వాత అంచనాలు పెంచే విధంగా రాజకీయంగా ఒత్తిడి తెచ్చాడు. కాంట్రాక్టరు సూచన మేరకు అధికారులు 2014 ఫిబ్రవరిలో కొత్త ప్రతిపాదనలు తయారు చేశారు. ఈ ప్రతిపాదలనపై ఉన్నతాధికారులు అదే ఏడాది మార్చి 6న కొత్త ఆదేశాలు వచ్చాయి. చెక్‌డ్యాం నిర్మాణం కోసం రూ.2.46 కోట్లను మంజూరు చేశారు. హడావుడిగా ఎన్నికలకు ముందు పనులు ప్రారంభించారు. కాంట్రాక్టరు మళ్లీ పనులు జరపలేదు. అధికారులు తాజాగా మళ్లీ ప్రభుత్వానికి అంచానలపై ప్రతిపాదనలు పంపారు. అదే మొత్తానికి పనులు చేసేలా 2015 ఫిబ్రవరి 19న ఉత్తర్వులు జారీ అయ్యాయి. భారీగా అంచనా వ్యయం పెంచిన అధికారులు పనుల నాణ్యతను ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. కాంట్రాక్టరు ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. -
ప్రతిపాదనలే.. పనుల్లేవు!
వీరఘట్టం:తోటపల్లి కాలువల ఆధునికీకరణ పనుల ప్రతిపాదనలను అధికారులు తీరిగ్గా ఇప్పుడు పంపడంతో పనులు ఎప్పటికి జరుగుతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. నాలుగేళ్లుగా ఆయకట్టు రైతులు ఆధునికీకరణ కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో రూ.139 కోట్లతో ప్రతిపాదించిన తోటపల్లి కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ పనులకు పాలకొండ మండలం నవగాం వద్ద అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా మూడేళ్ల కిందట రూ.7 కోట్లతో పనులు ప్రారంభించారు. అలాగే ఓనిగెడ్డ వద్ద రూ.7 కోట్లతో చెక్‌డ్యామ్ నిర్మాణం చేపట్టారు. మిగిలిన రూ.124 కోట్లతో ఇప్పుడు ప్రతిపాదనలు రూపొందించి ఫైలును రెండు రోజుల క్రితమే ప్రభుత్వానికి పంపించినట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. కాగితాలకే పరిమితం ఆధునికీకరణ పనులకు గతంలో ఆమోదించిన ప్రతిపాదనలే కార్యరూపం దాల్చలేదు. వాటిని పట్టించుకోకుండా అధికారులు కొత్త ప్రతిపాదనలు సిధ్ధం చేశారు. ఎప్పటికప్పుడు చేస్తున్న ప్రతిపాదనలు కాగితాలకు పరిమితమవుతున్నాయే తప్ప పనులు జరగడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత నాలుగేళ్లుగా కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టు భూములకు సాగునీరు నామమాత్రంగా అందుతోంది. ఆధునీకరణ ప్రక్రియ తెరపైకి రావడంతో కాలువల నిర్వహణను, చిన్న చిన్న మరమ్మతులను సైతం అధికారులు గాలికొదిలేశారు. దీంతో కాలువల పరిస్థితి దయనీయంగా మారింది. తుప్పలు, పూడికలతో నీరు చివరి ప్రాంతానికి చేరడం గగనమవుతోంది. 32 కి లోమీటర్ల పొడవున్న ఎడమ కాలువ, 20 కిలోమీటర్ల పొడవున్న కుడి కాలువలో రెండు అడుగుల మేర పూడిక పేరుకుపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రతిపాదనలు పంపితే పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు.. ఖరీఫ్‌కు ఎలా నీరి స్తారని రైతులు ఆందోళనతో ప్రశ్నిస్తున్నారు.