కాన్సెప్ట్.. సమకాలీన అన్వయంతోనే సక్సెస్
సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలో జనరల్ స్టడీస్ పేపర్ చాలా కీలకమైనది. ఇందులో అడిగే 100 ప్రశ్నల్లో జనరల్ సైన్స, పర్యావరణం అంశాల నుంచి 26 నుంచి 30 ప్రశ్నల వరకు క్రమం తప్పకుండా వస్తున్నాయి. కాబట్టి ఈ రెండు సబ్జెక్ట్‌లను మంచి స్కోరింగ్ విభాగాలుగా భావించవచ్చు. జనరల్ సైన్స విభాగంలోని జీవశాస్త్రంపై పట్టు ఉంటేనే.. ఆవరణ శాస్త్రం లోని అంశాలపై సమగ్ర అవగాహన పొందడం సాధ్యమవుతుంది. ప్రిలిమినరీలో నెగెటివ్ మార్కింగ్ ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు కాన్సెప్ట్ (ఇౌఛ్ఛిఞ్ట) ఓరియెంటెడ్ ప్రిపరేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు విస్తృతంగా చదవాల్సి ఉంటుంది. ఎలిమినేషన్‌కు తావులేకుండా నిర్వహించే ఇటువంటి పరీక్షలో విజయం సాధించాలంటే పైపై విషయ పరిజ్ఞానం ఏమాత్రం సరిపోదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.జనరల్ సైన్సలో జీవశాస్త్రం ఫిజిక్స్, కెమిస్ట్రీ అంశాలు ఉంటాయి. అదే సమయంలో టెక్నాలజీకి సంబంధించిన ప్రశ్నలను కూడా ఇస్తారు. అయితే వీటిని సమకాలీన దృక్పథంలో అడుగుతారనే విషయాన్ని గమనించాలి. జీవావరణ శాస్త్రంలో స్థూలంగా, ఆవరణశాస్త్ర భావనలు, పర్యావరణ కాలుష్యం, శీతోష్ణస్థితి మార్పు, గ్లోబల్ వార్మింగ్, జీవ వైవిధ్యం తదితర అంశాలు ఉంటాయి.
జీవశాస్త్రం:
జీవశాస్త్రంలో అభ్యర్థులు వృక్ష-జంతు వర్గీకరణ, వాటి లక్షణాలు, ప్రత్యేకతలపై దృష్టి సారించాలి. అదేవిధంగా మానవ శరీర ధర్మశాస్త్రం, వ్యాధులు వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. శరీర అవయవాల పనితీరు, వాటికి సంక్రమించే వ్యాధులపై ప్రశ్నలు వస్తాయి. జీవశాస్త్రంతో ముడిపడిన సమకాలీన అంశాలపై కూడా అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రబలుతున్న ఫ్లూ, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (కజీఛీఛ్ఛీ ఉ్చట్ట ఖ్ఛటఞజీట్చ్టౌటడ డఛీటౌఝ్ఛ), అధికమవుతున్న కాలేయ, జీర్ణకోశ సమస్యలు, క్యాన్సర్లు, వాటి చికిత్స, వాడాల్సిన ఔషధాలు, టీకాలు, నోబెల్ పురస్కార గ్రహీతలు- వారి పరిశోధనలు వంటివి చాలా ముఖ్యమైనవి.
అప్లైడ్ అంశాలు-పెరుగుతున్న ప్రశ్నలు:
భౌతికశాస్త్రంలో అన్వయంతో కూడిన (అప్లైడ్) అంశాలు ఎక్కువగా అడుగుతున్నారు. వివిధ భౌతిక ప్రక్రియల సూత్రాల ఆధారంగా పని చేస్తున్న యంత్రాలపై ప్రశ్నలు వస్తాయి. మైక్రోవేవ్, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండీషనింగ్, విద్యుత్ ఉత్పతాదన మెకానిక్స్, ప్రమాణాలు మొదలైన అంశాలను క్షుణ్నంగా చదువుకోవాలి. రసాయన శాస్త్రంలో కూడా అడిగే ప్రశ్నల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దైనందిన జీవితంలో మానవుడు ఉపయోగించే వివిధ రసాయనాలు (కాస్మొటిక్స్, టాయ్‌లెట్రీస్, ఫార్మస్యూటీకల్స్) అదే విధంగా ప్లాస్టిక్, పాలిమర్స కాంపొజిట్స్‌కు సంబంధించిన సమాచారాన్ని తప్పనిసరిగా సేకరించాలి. వీటికి అదనంగా లోహ సంగ్రహణ శాస్త్రం, ఆవర్తన పట్టిక, డైమండ్, బంగారం, రంగురాళ్లు, రత్నాలు మొదలైన వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి.
సమకాలీన అంశాలతో:
2010 నుంచి సివిల్స్ ప్రిలిమ్స్‌లో ప్రత్యేకంగా పర్యావరణం, జీవ వైవిధ్యం, అంతరించే ప్రమాదం ఉన్న జీవజాతులు, శీతోష్ణస్థితి మార్పు, పర్యావరణ కాలుష్యానికి సంబంధించిన అంశాలపై ప్రశ్నలు క్రమం తప్పకుండా వస్తున్నాయి. ఆవరణ శాస్త్ర పరిభాష, ప్రాథమిక అంశాలైన జీవుల అనుకూలనాలు , ఆవరణ వ్యవస్థ, రకాలు, ఆహార శృంఖాలు, బయో జియో కెమికల్ సైకిల్స్ (ఆజీౌజౌ్ఛ ఛిజ్ఛిఝజీఛ్చి ఛిడఛ్ఛిట), ఆహార వల వంటి అంశాలపై విస్తృత స్థాయిలో ప్రిపరేషన్ సాగించాలి. జీవ వైవిధ్యానికి సంబంధించి వాటి స్థాయి, రకాలు, జీవ వైవిధ్యానికి గల కారణాలు, ఏర్పడుతున్న ప్రమాదాలు, జీవ వైవిధ్య హాట్‌స్పాట్స్, పరిరక్షణ పద్ధతులు, సమస్యలు మొదలైన వాటి గురించి క్షుణ్నంగా చదువుకోవాలి. గతంలో ఈ విభాగంలో అడిగిన ఒక ప్రశ్నను పరిశీలిస్తే..
దేశంలో రాబందుల సంఖ్య తగ్గడానికి కారణం? దీనికి సమాధానం.. పశువుల్లో అతిగా వాపు నివారణకు మందుగా ఉపయోగించే డై క్లోఫినాక్ అనే రసాయనం. దీని ద్వారా మనకు అవగాహన కావాల్సిన విషయం.. జీవ వైవిధ్యానికి ప్రమాదాలు అని ప్రస్తావించినప్పుడు.. ప్రస్తుతం సమకాలీనంగా చోటు చేసుకుంటున్న సంఘటనల (వార్తల్లో అంశాలు)పై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఉదాహరణకు గతేడాది బట్ట క్రిటికిల్లీ ఎండేంజరడ్ జాబితాలో చేర్చింది. ఈ నేపథ్యంలో సంబంధిత సమాచారాన్ని .. ఆ పక్షి విస్తరణ, దానికి ప్రత్యేకంగా ఏర్పడుతున్న ప్రమాదాలు, దాని శాస్త్రీయ నామం -వంటి అంశాల ఆధారంగా సేకరించడం ఉపయుక్తంగా ఉంటుంది. ఇదే దృక్పథాన్ని సమకాలీనంగా చోటు చేసుకుంటున్న మిగతా అన్ని సంఘటనలకు అన్వయించుకోవడం ప్రయోజనకరం.
జాతీయ స్థాయిలో:
జాతీయ స్థాయిలో వన్యజీవుల, జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి క్షుణ్నంగా చదువుకోవాలి. దేశంలో జీవ వైవిధ్యం, ఇక్కడికే పరిమితమైన జీవ జాతులు, వాటి ఆవాసాలు, సమస్యల గురించి అవగాహన పెంచుకోవాలి. ప్రాజెక్ట్ టైగర్, క్రోకోడైల్, ప్రాజెక్ట్ ఎలిఫెంటా, జాతీయ పార్కులు, అభయారణ్యాలు, బయోస్ఫియర్ (ఆజీౌటఞజ్ఛిట్ఛ ఖ్ఛట్ఛటఠ్ఛిటట) పై విస్తృత స్థాయిలో సమాచారాన్ని సేకరించుకోవాలి. వాటి మధ్య భేదాలు, దేశంలో ఎక్కడెక్కడ ఏయే పార్కులు, అభయారణ్యాలు ఉన్నాయి. వాటిల్లో వేటిని ప్రధానంగా సంరక్షిస్తున్నారు అనే అంశాలు చాలా కీలకమైనవి.
సదస్సులు-ఒప్పందాలు:
గతేడాది వార్సాలో జరిగిన యునెటైడ్ నేషన్స్ ఫ్రేమ్ కన్వేన్షన్ ఆన్ క్లైమెట్ ఛేంజ్ (United Nations Frame Convention on Climate Change)కు చెందిన ఇౌఞృ19 సమావేశం, క్యోటో ప్రోటోకాల్‌కు కొనసాగింపుగా తీసుకురావాలనుకుంటున్న కొత్త ఒప్పందం, ఈ ఏడాది పెరూలో జరగనున్న ఇౌఞృ20పై అవగాహన పెంచుకోవాలి. కార్బన్ క్రెడిట్, కార్బన ఫుట్ ప్రింట్, క్లీన్ డెవలప్మెంట్ మెకానిజం మొదలైన అంశాలపై సమాచారం అవసరం.
గతేదాది విశ్లేషణ
ఫిజిక్స్‌కు సంబంధించిన ప్రశ్నలు తేలిగ్గా సమాధానాలు గుర్తించేవిగా ఉన్నాయి. ప్రాథమిక అంశాలపైన ఎక్కువగా అడిగారు. ఫ్రిక్షన్, ఆప్టికల్ ఇల్యూజన్, రెయిన్బో తదితర అంశాలపై ప్రశ్నలు వచ్చాయి. సమకాలీన అంశమైన హిగ్స్ బోసన్ పార్టికల్పై ప్రశ్న వచ్చింది. ఏపీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు సిద్ధమవుతున్న వారు సైతం గుర్తించగలిగేలా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి.సైన్స్ అండ్ టెక్నాలజీ, కెమిస్ట్రీకి సంబంధించి ప్రశ్నలు దాదాపు కనుమరుగయ్యాయి. బయాలజీ విభాగం నుంచి ప్రశ్నలు కఠినంగా వచ్చాయి. కాన్సెప్ట్లపై పట్టున్న వారు మాత్రమే సమాధానాలు గుర్తించగలిగేలా ఉన్నాయి.
ప్రిలిమ్స్ టు మెయిన్స్
మరో కీలక అంశం.. ప్రిలిమినరీ ప్రిపరేషన్‌ను మెయిన్సకు అనుసంధానించడం. ప్రధానంగా పర్యావరణం కాలుష్యం, ఆవరణ శాస్త్రం, జీవ వైవిధ్యం, శీతోష్ణస్థితి మార్పు అనే అంశాలకు ప్రిపేరవుతున్నప్పుడు, మెయిన్స జనరల్ స్టడీస్-3 పేపర్లోని ఆయా అంశాలను దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ సాగించడం ప్రయోజనకరంగా ఉంటుంది. కస్తూరి రంగన్ కమిటీ రిపోర్ట, ఎకాలజికల్లీ సెన్సెటివ్ ఏరియాస్ (Ecologically Sensitive Areas) అంటే ఏమిటి? దేశంలో పర్యావరణ ప్రభావ అంచనా (ఉఠిజీటౌఝ్ఛ్ట ఐఝఞ్చఛ్టి అటట్చజీఝ్ఛ్ట)లో లోపాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? పర్యావరణం పరిరక్షణతో కూడిన అభివృద్ధి వివరాలు? వాటి ఆవశ్యకత వంటి అంశాలను మెయిన్స కోణంలో చదవడం ఉపయుక్తం.