8న కోలారు-చిక్కబళ్లాపురం రైలు ప్రారంభం
కోలారు, న్యూస్‌లైన్ : కోలారు, చిక్కబళ్లాపురం జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన కోలార్ - చిక్కబళ్లాపురం రైలును ఈ నెల 8న ప్రారంభిస్తున్నట్లు కేంద్ర మంత్రి కే హెచ్ మునియప్ప తెలిపారు. సోమవారం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహం లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సుమారు రూ. 450 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రాడ్‌గేజ్ లైన్‌ను ఈ నెల 8న కేంద్ర రైల్వే మంత్రి మల్లిఖార్జున్ ఖర్గే ప్రారంభిస్తారన్నారు. మైసూరు మహారాజ్‌లు ప్రారంభించి న రైళ్లను కొనసాగించాలని స్థానికుల నుంచి వచ్చిన డిమాండుకు అనుగుణంగా బ్రాడ్ గేజ్‌గా మార్చామన్నారు.
అదే విధంగా కోలారు - వైట్‌ఫీల్డ్, కోలారు- ముళబాగిలు, కేజీఎఫ్-కుప్పం, బంగారుపేట-మారికుప్పం, శ్రీనివాసపురం - మదనపల్లి తదితర రైల్వేలైన్లకు సంబంధించి భూ స్వాధీనం, సర్వే పనులు జరుగుతున్నాయన్నారు. విలేకరుల సమావేశంలో బంగారుపేట ఎమ్మెల్యే నారాయణస్వామి, మాజీ మంత్రి నిసార్ అహ్మద్, డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్, జెడ్పీ మాజీ అధ్యక్షుడు జన్నఘట్ట వెంకటమునియప్ప పాల్గొన్నారు.