Comprehensive land survey
-
సమగ్ర భూ సర్వే పై చంద్రబాబు యూటర్న్
సాక్షి, అమరావతి : సమగ్ర భూ సర్వేపై సీఎం చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. రాష్ట్రంలో సమగ్ర భూ రీ సర్వే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు గతంలో ప్రకటించిన చంద్రబాబు.. మళ్లీ దాన్ని కొనసాగించేందుకు సిద్ధమయ్యారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో సమగ్ర భూ సర్వేకి శ్రీకారం చుట్టగా. ఇప్పుడు అదే సర్వేని కొనసాగించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు సమగ్ర భూ సర్వేపై రెవెన్యూ శాఖ మంత్రి అనగానికి సత్యప్రసాద్ స్పందించారు. సమగ్ర సర్వేను మిగిలిన గ్రామాల్లోనూ చేపడతామని మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. గతంలో చేసిన సర్వేపై గ్రామ సభలు పెట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు.. ‘రీ సర్వే 7 వేల గ్రామాల్లో పూర్తి అయ్యింది. 5 శాతం మంది ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తాం. ఆ తర్వాత మళ్ళీ రీ సర్వేని ముందుకు తీసుకుని వెళతాం’ అని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ వెల్లడించారు.గతంలో సమగ్ర సర్వేపై చంద్రబాబు ఏమన్నారంటేరాష్ట్రంలో సమగ్ర భూ రీ సర్వే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు గతంలో నారా చంద్రబాబు ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తన హయాంలో ఒకసారి రీ సర్వే చేయాలని భావించామని, కెనడా నుంచి హెలికాప్టర్లు తెప్పించి సర్వే చేస్తే హద్దులు మారిపోతుండటంతో ముందుకు వెళ్లలేదని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు కూడా రీసర్వే తలపెట్టి విఫలమైందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం శాశ్వత భూహక్కు–భూరక్ష పథకం పేరుతో అనాలోచితంగా రీ సర్వేను చేపట్టిందని విమర్శించారు. ఇకపై భూ యజమానులు వచ్చి తమ హద్దులు నిర్ణయించాలని కోరితే మినహా ఎవరికీ సర్వే చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు అదే సమగ్ర భూ సర్వేపై చంద్రబాబు యూటర్న్ తీసుకోవడం గమనార్హం. -
సమగ్ర భూ సర్వే రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సమగ్ర భూ రీ సర్వే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తన హయాంలో ఒకసారి రీ సర్వే చేయాలని భావించామని, కెనడా నుంచి హెలికాప్టర్లు తెప్పించి సర్వే చేస్తే హద్దులు మారిపోతుండటంతో ముందుకు వెళ్లలేదని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు కూడా రీసర్వే తలపెట్టి విఫలమైందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం శాశ్వత భూహక్కు–భూరక్ష పథకం పేరుతో అనాలోచితంగా రీ సర్వేను చేపట్టిందని విమర్శించారు. ఇకపై భూ యజమానులు వచ్చి తమ హద్దులు నిర్ణయించాలని కోరితే మినహా ఎవరికీ సర్వే చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.భూములు, సహజ వనరులకు సంబంధించి సోమవారం వెలగపూడిలోని సచివాలయంలో సీఎం శ్వేతపత్రం విడుదల చేసి మాట్లాడారు. రాష్ట్రంలో భూ యజమానులకు రక్షణ కలి్పంచేందుకు గుజరాత్ తరహాలో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తెస్తామని చెప్పారు. ఈ చట్టం ప్రకారం కబ్జాదారులే భూమి తమదని నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. తమ భూములు కబ్జాకు గురైనట్లు బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే వెంటనే వారి భూములను వెనక్కి ఇప్పిస్తామన్నారు.ల్యాండ్ టైట్లింగ్ చట్టం పేరుతో గత సర్కారు భూ దోపిడీకి కుట్రలు పన్నితే తాము రద్దుకు క్యాబినెట్లో తీర్మానం చేశామన్నారు. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం దేశంలో ఎక్కడా అమలులో లేదన్నారు. ప్రజల భూములు లాక్కునేందుకే ఏపీలో అమలు చేశారన్నారు. అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేయడంతో పేదలకు హక్కులు కలి్పంచినట్టే చేసి వైఎస్సార్ సీపీ నాయకులు దోచేశారన్నారు. భూ దందాలపై ప్రజలు ఫిర్యాదులు చేసేందుకు త్వరలోనే టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెస్తామన్నారు. రూ.35 వేల కోట్ల భూ దోపిడీ వైఎస్సార్ సీపీ హయాంలో భూములతో పాటు ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. విశాఖ, ఒంగోలు, చిత్తూరులో భూములు కబ్జాలకు గురయ్యాయన్నారు. రీ సర్వేతో భూ హద్దులు మార్చేశారన్నారు. అసైన్మెంట్, అసైన్డ్, చుక్కల, నిషేధిత భూముల విషయంలో కొత్త రకం దోపిడీకి పాల్పడ్డారన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీలో మార్కెట్ కంటే ఐదు రెట్లు అధిక ధర చెల్లించి భూములు కొన్నారని ఆరోపణలు చేశారు. వైఎస్సార్ సీపీ కార్యాలయాలకు రూ.300 కోట్ల విలువైన 40.78 ఎకరాలను కేటాయించుకున్నారని చెప్పారు.తమకున్న సమాచారం మేరకు రూ.35 వేల కోట్ల భూ దోపిడీ జరిగినట్లు అంచనా వేస్తున్నామన్నారు. ఒంగోలు భూ కబ్జాలపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు. 22–ఏలో భూములను చేర్చి అక్రమాలు చేశారని, అసైన్డ్ భూములను వైఎస్సార్సీపీ నాయకులు దోచేసి పట్టాలు పొందారని ఆరోపించారు. పుంగనూరులో భూ వ్యవహారాలను పునఃపరిశీలన చేస్తున్నామన్నారు. మైనింగ్, క్వారీ లీజుల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నారు.బెదిరింపులు, భారీ జరిమానాలతో లీజులను లాక్కుని గనులు కొల్లగొట్టారన్నారు. అధికారులను డిప్యూటేషన్లపై తెచ్చి పథకం ప్రకారం దోపిడీ చేశారన్నారు. ఇసుక, లేటరైట్, ఇతర ఖనిజ నిక్షేపాలతో రూ.19 వేల కోట్లు దారి మళ్లించారన్నారు. తమ హయాంతో పోలిస్తే ఎర్ర చందనం విక్రయాల ద్వారా గత ఐదేళ్లలో 27 శాతం మాత్రమే ఆదాయం వచి్చందన్నారు. వీటన్నింటిపై ప్రజల్లో, అసెంబ్లీలో విస్తృతంగా చర్చించిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు.. రూ.500 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రుషికొండపై భవంతులు కట్టారని సీఎం చంద్రబాబు విమర్శించారు. వాటిని ఇప్పుడు ఏం చేయాలో తనకు అర్థం కావట్లేదన్నారు. మద్యం, గంజాయికి బానిసలై సంఘ విద్రోహ శక్తులుగా మారిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రాజకీయ వివక్షకు తావులేకుండా తప్పు చేసిన ప్రతి ఒక్కరినీ చట్ట ప్రకారం శిక్షిస్తామన్నారు. ఒక్క కిలో కూడా ఖనిజం దోపిడీకి గురికాకుండా అడ్డుకుంటామన్నారు. గతంలో దోపిడీని ప్రశి్నస్తే దాడులు చేశారని, మడ అడవులను కబ్జా చేసి ఇళ్ల స్థలాలిచ్చారని చెప్పారు.తప్పులు చేసిన అధికారులను తొలగిస్తే దోమల మందు కొట్టించేందుకు కూడా ఎవరూ ఉండరని వ్యాఖ్యానించారు. విశాఖలో రామానాయుడు స్టూడియో భూమిలో వాటా కొట్టేయాలని చూశారన్నారు. దసపల్లా భూముల్లో అక్రమంగా అపార్ట్మెంట్లు నిరి్మంచారని చెప్పారు. హయగ్రీవ భూముల్ని మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కొట్టేయాలని చూశారని చెప్పారు. టీడీఆర్ బాండ్లలోనూ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. శారదా పీఠానికి ఎకరా రూ.లక్షకే 15 ఎకరాలు ఇచ్చారని చెప్పారు. ఒంగోలులో రూ.101 కోట్ల ఆస్తులు, తిరుపతిలో మఠం భూములనూ కొట్టేశారన్నారు.చిత్తూరు జిల్లాలో 982 ఎకరాలు 22ఏ జాబితా నుంచి తొలగించి రిజి్రస్టేషన్ చేసుకున్నారని చెప్పారు. భూ కబ్జాలపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇళ్ల పట్టాల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన 10 వేల ఎకరాలు లాక్కున్నారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో సిలికా శాండ్ లీజ్ ఓనర్లను బెదిరించి వైఎస్సార్సీపీ నాయకులకే అమ్మేలా ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. క్వార్జ్, లేటరైట్‌ను దోచేసి సొంత సిమెంట్ ఫ్యాక్టరీలకు సరఫరా చేసుకున్నారన్నారు. పెద్దిరెడ్డి మనుషులకు ఇష్టానుసారం లీజులిచ్చారన్నారు. పోలవరం కుడి కాల్వ పనుల్లో రూ.800 కోట్ల మట్టిని తరలించారని ఆరోపించారు. -
Andhra Pradesh: పాలనలో నయా పంథా
సాక్షి, అమరావతి: కేవలం నాలుగేళ్లలోనే సంస్కరణల ద్వారా పరిపాలన వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్రం చిరునామాగా మారింది. సామాజిక బాధ్యతగా విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ రంగాల్లో అందించాల్సిన సేవల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు, సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పాలనా వ్యవస్థల్లో మార్పులు కొట్టొచ్చినట్లు కనిపించేలా చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్ సర్కారుకే దక్కుతుంది. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని, 73వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకే అధికారాలు, విధులు అప్పగించాలనే మాటలను సాక్షాత్కరింప చేసిన ఏకైక రాష్ట్రంగా నిలిచింది ఏపీనే. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల చెంతకే ప్రభుత్వ సేవలు, పథకాలను అందిస్తోంది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే (2019) కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేసి, చేతులు దులుపుకోకుండా.. వాటి ద్వారా ప్రభుత్వ సేవలు, పథకాలు అందించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు ఉద్యోగులు, సిబ్బందిని భర్తీ చేసింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలతో పక్కా వ్యవస్థ ఏర్పాటు చేసింది. వీటిలో 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలను సృష్టించి.. భర్తీ చేసింది. ప్రతి 50 ఇళ్లకు వలంటీర్ చొప్పున ప్రజల చేయి పట్టుకుని నడిపించే సేవా వ్యవస్థను తెచ్చింది. సచివాలయాలతో అనుసంధానమై 2.65 లక్షల మంది వలంటీర్లుగా పనిచేస్తున్నారు. తద్వారా 600 పౌర సేవలు లంచాలు, వివక్షకు తావు లేకుండా అందుతున్నాయి. మారుమూల పల్లెల్లో సైతం ఎక్కడ చూసినా పౌర సేవల్లో గొప్ప విప్లవం కనిపిస్తోంది. రేషన్ డోర్ డెలివరీతో రోల్ మోడల్ పేదల ఇంటి వద్దకే రేషన్ డోర్ డెలివరీ చేయడంలో ఏపీ రోల్ మోడల్‌గా నిలిచింది. ఏ పల్లెలో అయినా, పట్టణంలో అయినా రేషన్ బియ్యం మన వీధికి, మన ఇంటి ముంగిటకే అందించే వ్యవస్థ దేశంలో ఏపీలోనే అమల్లో ఉంది. మిగతా రాష్ట్రాలు ఈ వ్యవస్థను అమలు చేసేందుకు యత్నిస్తున్నాయి. రేషన్ షాపుల దగ్గర గంటల తరబడి క్యూలో నిలబడే దుస్థితిని నివారించి రాష్ట్ర వ్యాప్తంగా 9,260 డెలివరీ వ్యాన్లతో నాణ్యమైన సార్టెక్స్ బియ్యాన్ని డెలివరీ చేస్తున్న ప్రభుత్వం దేశంలో ఏపీ ఒక్కటే. అవ్వాతాతల ఇంటికే ప్రతి నెలా పెన్షన్ దేశంలో ఎక్కడా లేని విధంగా పేద అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు, దీర్ఘ వ్యాధిగ్రస్తుల ఇంటికే ప్రతి నెలా పెన్షన్‌ను వలంటీర్ల ద్వారా అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రతీ నెలా ఒకటో తేదీన సూర్యోదయానికి ముందే వలంటీర్ ఇంటింటికీ వచ్చి లబ్ధిదారుల చేతిలో పెన్షన్ సొమ్ము పెట్టే కార్యక్రమం సజావుగా సాగుతోంది. ‘ఫ్యామిలీ డాక్టర్’తో ఆరోగ్యానికి భరోసా రాష్ట్రంలో 10,592 గ్రామ, పట్టణ హెల్త్ క్లినిక్స్ ద్వారా ఆయా గ్రామాల్లోని ప్రజలకు ఉచితంగా వైద్య చికిత్సలను అందుబాటులోకి తెస్తూ ప్రభుత్వం ఈ రంగంలో గొప్ప మార్పులు తెచ్చింది. ఈ క్లినిక్స్‌ల్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ 24 గంటలూ అందుబాటులో ఉంటారు. 105 రకాల మందులు ఉంటున్నాయి. 14 రకాల పరీక్షలు చేస్తూ.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌తో అనుసంధానమై అక్కడే సేవలందిస్తూ కనిపిస్తున్నారు. గతానికి ఇప్పటికి వ్యవస్థలో ఇదో స్పష్టమైన మార్పు. కొత్తగా మరో 13 జిల్లాలు రాష్ట్రంలో 2019 నాటికి 13 జిల్లాలు ఉంటే జిల్లా పాలన వికేంద్రీకరణలో భాగంగా ప్రభుత్వం కొత్తగా మరో 13 జిల్లాల ఏర్పాటు ద్వారా మొత్తం 26 జిల్లాలను చేసింది. 51 డివిజన్లను 78కి, 679 మండలాలను 691కి పెంపు ద్వారా మరింతగా పాలనను వికేంద్రీకరణ చేసింది. ఆఖరికి చంద్రబాబు నియోజకవర్గం కేంద్రమైన కుప్పంను రెవెన్యూ డివిజన్‌గా చేసింది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వమే. ప్రజలకు జిల్లా, డివిజన్, మండల పాలన సేవలను మరింత చేరువ చేయడంలో భాగంగా వికేంద్రీకరణ చేపట్టింది. ఇది పరిపాలన రంగంలో గొప్ప సంస్కరణగా నిలుస్తోంది. సమగ్ర భూ సర్వేతో వివాదాలకు స్వస్తి భూ వివాదాలకు శాశ్వత ముగింపు దిశగా వందేళ్ల తర్వాత సమగ్ర భూ సర్వే చేపట్టి గ్రామ స్థాయిలో గొప్ప మార్పునకు నాంది పలికింది. సమగ్ర భూ సర్వే కోసం గ్రామాలు, పట్టణాల్లో ఏకంగా 10,185 మంది సర్వేయర్లను నియమించింది. 40 డ్రోన్లు కొనుగోలు చేసింది. కబ్జాలకు, భూ వివాదాలకు శాశ్వతంగా స్వస్తి పలుకుతూ.. ప్రజల భూములపై శాశ్వత భూ హక్కును కల్పిస్తూ స్పష్టమైన భూ రికార్డులకు ప్రభుత్వం నాంది పలికింది. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల అమలుకు శ్రీకారం చుట్టడం ద్వారా గొప్ప మార్పులను చేపట్టింది. టెండర్ల విధానంలో పారదర్శకత జ్యుడిషియల్ ప్రివ్యూతో పాటు రివర్స్ టెండర్ ద్వారా టెండర్ల విధానంలో పారదర్శకతకు పెద్ద పీట వేసింది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా తొలిసారి జ్యుడిషియల్ ప్రివ్యూను ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాలు (తొలుత న్యాయ పరమైన సమీక్ష ద్వారా పారదర్శకత) చట్టం–2019ను అమల్లోకి తెచ్చింది. రూ.100 కోట్లు పైబడిన పనుల టెండర్లన్నీ జ్యుడిషియల్ ప్రివ్యూకు వెళ్తున్నాయి. రివర్స్ టెండర్ విధానం ద్వారా ప్రజా ధనం ఆదాకు పెద్ద పీట వేస్తూ టెండర్ల రంగంలో చేపట్టిన సంస్కరణలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. ‘స్పందన’తో ప్రజా సమస్యల పరిష్కారం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండల, గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో ప్రజా సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి ‘స్పందన’ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాన్ని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో సంబంధిత ఉన్నతాధికారులు స్వయంగా నిర్వహిస్తున్నారు. 1902కు ఫోన్ చేసి సమస్యను చెబితే.. దాన్ని నమోదు చేసుకుని నిర్ణీత సమయంలోగా పరిష్కరించే ఏర్పాటు చేశారు. దీన్ని మరింత నాణ్యతతో అమలు చేయడంలో భాగంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం జగనన్నకు చెబుదాం కార్యక్రమంగా మార్చారు. దీన్ని జిల్లా కలెక్టర్లతో పాటు నేరుగా సీఎం కార్యాలయం పర్యవేక్షిస్తోంది. ఇది ప్రజల సమస్యల పరిష్కారానికి వ్యవస్థలో తీసుకొచ్చిన గొప్ప మార్పుగా నిలుస్తోంది. వ్యవసాయం పండుగైంది దేశంలోనే తొలిసారిగా రైతుల కోసం 10,778 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటు చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు కనిపిస్తున్నాయి. ఈ కేంద్రాలు విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి సేవలోనూ రైతన్నకు తోడుగా ఉంటూ, వారి చేయి పట్టుకుని నడిపిస్తున్నాయి. ఆర్బీకేలలో 10,778 మంది అగ్రికల్చర్, హార్టికల్చర్ గ్రాడ్యుయేట్లు పని చేస్తూ రైతులకు తోడుగా ఉన్నారు. ఉన్న ఊరిలోనే ప్రభుత్వ సేవలు ప్రజలు పనుల నిమిత్తం మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలకు తిరగాల్సిన అవసరం లేకుండా ఉన్న ఊరిలోనే ప్రభుత్వ సేవలు, పథకాలు అందుతున్నాయి. దీంతో గతంలో ఎక్కడకో వెళ్లి దరఖాస్తు చేయడం, రాజకీయ నేతల చుట్టూ తిరగడం, లంచాలు ఇవ్వడం.. ఇలాంటి కష్టాలన్నింటికీ బ్రేక్ పడింది. ఉన్న ఊరిలో గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే అర్హత ఉంటే చాలు.. ఎవరి సిఫార్సు లేకుండానే సేవలు, పథకాలు అందుతున్నాయి. గతంలో రూపాయి ఇస్తే పావలా మాత్రమే లబ్ధిదారులకు చేరేది. ఇప్పుడు నేరుగా నగదు బదిలీ ద్వారా రూపాయి ఇస్తే రూపాయి లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళుతోంది. గత నాలుగేళ్లలో నవరత్నాల పథకాల ద్వారా రూ.2.11 లక్షల కోట్లు లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదు జమ అయింది. రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు, పెన్షన్, ఇంటి జాగా ఇలా ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా.. లేదా ఏ ప్రభుత్వ సేవలు కావాలన్నా గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందుతున్నాయి. గతానికి, ఇప్పటికీ ఇదో గొప్ప మార్పు. చేతల్లో సుపరిపాలన గత ప్రభుత్వాలు ఏవీ కూడా అధికారాలను, విధులను స్థానిక సంస్థలకు అప్పగించడానికి ఇష్టపడలేదు. తొలిసారిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి.. ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన, పౌర సేవలను ధైర్యంగా తీసుకువెళ్లారు. గత ప్రభుత్వాలు విద్య, వైద్య రంగాలను ప్రైవేట్‌కు అప్పగించడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తే.. సీఎం జగన్.. ప్రభుత్వ రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడం ద్వారా ఆ రంగాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి బలోపేతం చేశారు. సమగ్ర భూ సర్వే అనేది మరో విప్లవాత్మక చర్య. కరణం, మునసబుల వ్యవస్థను రద్దు చేశాక గ్రామాల్లో భూ రికార్డుల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. భూముల లిటిగేషన్లతో చాలా మంది ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. దీనికి పరిష్కారంగా వందేళ్ల తర్వాత తొలిసారిగా సమగ్ర భూ సర్వే చేపట్టారు. విద్యుత్ రంగంలో రెన్యువబుల్ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని వల్ల కొంత కాలం తర్వాత ఉత్పత్తి వ్యయం తగ్గి, ప్రజలకు మేలు చేకూరుతుంది. పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. మొత్తంగా వేగవంతమైన అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు. – అజేయ కల్లం, సీఎం ముఖ్య సలహాదారు మహిళా సాధికారత దిశగా అడుగులు మహిళలకు ప్రభుత్వ నామినేట్ పనులు, నామినేట్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏకంగా చట్టాలు చేసి, అమలు చేస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ మహిళల కోసం ఇలాంటి చట్టాలు చేసిన దాఖలాల్లేవు. జెండర్ బేస్డ్ బడ్జెట్ పేరుతో మహిళలకు, పిల్లలకు బడ్జెట్ ప్రత్యేక కేటాయింపులు చేస్తోంది. 31 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలను మహిళల పేరిట ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఇదే. మహిళా సాధికారత దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో స్థాపించే పరిశ్రమలు, కంపెనీల్లో స్థానిక యువతకు ఉద్యోగాల్లో 75 శాతం ఇవ్వాలని ప్రత్యేకంగా చట్టం చేసి, అమలు చేస్తోంది. స్థానికంగా యువతకు ఎక్కువగా ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగాలను ప్రోత్సహిస్తోంది. మారిన విద్య, వైద్య రంగాల ముఖ చిత్రం ప్రజలకు విద్య, వైద్యం అందించాల్సిన కనీస సామాజిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. ఈ రెండు రంగాల్లో సీఎం వైఎస్ జగన్ భారీ మార్పులకు శ్రీకారం చుట్టడంతో ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలోని విద్య, వైద్య సంస్థలను వేగంగా బలోపేతం చేస్తున్నారు. మారుతున్న సాంకేతికతతో పాటు భవిష్యత్‌లో అవసరమైన రంగాల్లో మానవ వనరులను అభివృద్ధి చేసేందుకు బోధనా పద్ధతుల్లో, పాఠ్యాంశాల్లో మార్పులు తెచ్చారు. నైపుణ్యాలతో కూడిన యువతను తయారు చేయడానికి బాటలు వేశారు. వైద్య రంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మార్పులు తెచ్చారు. గత రెండేళ్లలోనే 48,639 మంది వైద్యులు, వైద్య సిబ్బందిని నియమించడం ద్వారా అన్ని స్థాయి వైద్య సంస్థల్లో మెరుగైన వైద్య చికిత్సలను అందుబాటులోకి తీసుకు వచ్చారు. -
భూ వివాదాల పరిష్కారానికి శాశ్వత ట్రిబ్యునళ్లు
సాక్షి, అమరావతి: భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించడంతోపాటు లంచాలకు తావులేకుండా వ్యవస్థలో జవాబుదారీతనాన్ని పెంపొందించడంలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భూ వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటైన ట్రిబ్యునళ్లను సమగ్ర భూ సర్వే ముగిసిన తర్వాత కూడా కొనసాగించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. భూముల రీ సర్వే సందర్భంగా తలెత్తే వివాదాలు, అభ్యంతరాల పరిష్కారానికి ఏర్పాటైన మొబైల్ ట్రిబ్యునళ్లను ఆ తరువాత కూడా రెవెన్యూ డివిజన్లలో పూర్తి స్థాయిలో కొనసాగించాలని సూచించారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకంపై మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ.. వివాదాల పరిష్కారానికి సమర్థ యంత్రాంగం భూముల సర్వే సందర్భంగా తలెత్తే వివాదాల పరిష్కారానికి సరైన యంత్రాంగం ఉండాలి. మొబైల్ ట్రిబ్యునల్ యూనిట్లపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలి. భూ వివాదాల పరిష్కారానికి రాష్ట్రంలో అత్యుత్తమ వ్యవస్థను తెచ్చి శాశ్వత ప్రాతిపదికన ప్రతి రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాలి. దీనివల్ల న్యాయపరంగా దక్కే హక్కులను వేగంగా పొందేందుకు వీలుంటుంది. వివాదాల్లో కూరుకుపోయి తరతరాలుగా హక్కులు పొందలేని పరిస్థితి ఉండకూడదు. సర్వే సందర్భంగా ప్రభుత్వంతో వివాదాలు, వ్యక్తిగత వివాదాలను అంశాలవారీగా గుర్తించాలి. సర్వే నంబర్ల జాబితాలో ఈ వివాదాలను కూడా పేర్కొనాలి. దీనివల్ల భూమి లీగల్‌గా క్లియర్‌గా ఉందా? లేదా? అన్నది కొనుగోలుదారులకు తెలుస్తుంది. అదే సమయంలో వివాదాలను పరిష్కరించే ప్రయత్నం సమాంతరంగా జరగాలి. అప్పీళ్లపై థర్డ్ పార్టీ పర్యవేక్షణ సర్వేలో నాణ్యత చాలా ముఖ్యం. వివాదాల పరిష్కారంలో నాణ్యతతో కూడిన ప్రక్రియ ఉండాలి. సమగ్ర సర్వే సందర్భంగా వచ్చే అప్పీళ్లపై థర్డ్ పార్టీ పర్యవేక్షణ ఉండాలి. దీనివల్ల హక్కుదారులకు ఎలాంటి నష్టం ఉండదు. తప్పులకు పాల్పడే సిబ్బందిపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. థర్డ్ పార్టీ పర్యవేక్షణ వల్ల పక్షపాతం, వివక్ష, అవినీతికి తావుండదు. సిబ్బందిలో కూడా జవాబుదారీతనం పెరుగుతుంది. ఎవరైనా ఓ వ్యక్తి తన భూమిలో సర్వే కోసం దరఖాస్తు చేసుకుంటే, కచ్చితంగా సర్వే చేయాలి. నిర్ణీత సమయంలోగా సర్వే చేయకుంటే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం ఎస్వోపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) రూపొందించాలి. వేగం పెరగాలి.. నెలకు వెయ్యి గ్రామాల చొప్పున ఏరియల్, డ్రోన్ ఫ్లైయింగ్ చేస్తున్నట్లు అధికారులు పేర్కొనగా ఈ లక్ష్యాన్ని పెంచాలని సీఎం ఆదేశించారు. మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో కూడా సర్వేను వేగవంతం చేయాలని సూచించారు. 2023 సెప్టెంబరు నెలాఖరు నాటికి సమగ్ర సర్వేను పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. సమావేశంలో విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) జి.సాయిప్రసాద్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, సర్వే సెటిల్మెంట్స్, ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్దార్ధ జైన్, సీసీఎల్ఏ కార్యదర్శి అహ్మద్ బాబు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. సీఎం జగన్‌ను కలిసిన టెక్ మహీంద్ర ఎండీ గుర్నాని రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు ఐటీ, హై ఎండ్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి పెంపుపై టెక్ మహీంద్ర ఎండీ, సీఈవో సీపీ గుర్నాని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చించారు. మంగళవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ అయిన గుర్నాని ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యంతో వీటిని అమలు చేసి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు చెప్పారు. విశాఖలో టెక్ మహీంద్ర కార్యకలాపాల విస్తరణపై వివరించారు. అనంతరం టెక్ మహీంద్రతో కలిసి పని చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో టెక్ మహీంద్ర గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ (అడ్మినిస్ట్రేషన్) సీవీఎన్ వర్మ, సీనియర్ బిజినెస్ హెడ్ రవిచంద్ర కొల్లూరు, రిక్రూట్మెంట్ లీడర్ శ్రీనివాస్ రెడ్డి వీరంరెడ్డి, అడ్మిన్ మేనేజర్ (విజయవాడ) జయపాల్, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన గుర్నాని ఏపీలో టెక్ మహీంద్ర కార్యకలాపాలు, విస్తరణపై చర్చించిన విషయం విదితమే. -
సమగ్ర భూ సర్వేలో వేగం పెంచండి
సాక్షి, అమరావతి: సమగ్ర భూ సర్వేలో వేగం పెంచాలని, అక్టోబర్ నాటికి కనీసం 2 వేల గ్రామాల్లో సర్వే పూర్తి చేసే లక్ష్యంతో పని చేయాలని ఉన్నతాధికారులను మంత్రుల కమిటీ ఆదేశించింది. వెలగపూడి సచివాలయంలో జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకం అమలు తీరును కమిటీకి నేతృత్వం వహిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సభ్యులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లం మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. సర్వేను పట్టణ ప్రాంతాల్లోనూ వేగంగా చేయాలని చెప్పారు. తాడేపల్లిగూడెం మునిసిపాలిటీలో ప్రయోగాత్మకంగా చేపట్టిన సర్వేను ఎప్పటికప్పుడు సమీక్షించుకుని ఎదురయ్యే అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ప్రతి జిల్లాలోనూ అర్బన్ ప్రాంతాల్లో సర్వేను ప్రారంభించేందుకు కనీసం రెండు రోవర్లు, డ్రోన్లు కేటాయిస్తామని తెలిపారు. గ్రామ కంఠాల సమస్యను కూడా ప్రభుత్వం సానుకూలంగానే పరిశీలించిందని, అర్హులైన వారికి యాజమాన్య హక్కు పత్రాలను జారీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తానని హామీ ఇచ్చారని, అందుకోసం చేపట్టాల్సిన చర్యలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సమగ్ర సర్వేలో అన్ని అంశాలు క్షుణ్ణంగా పరిశీలించకపోతే వివాదాస్పద భూములు, అటవీ భూములకు పట్టాలు ఇచ్చే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. దొంగ సర్టిఫికెట్లతో పెద్దఎత్తున అటవీ భూములను ఆక్రమించుకుని అనుభవిస్తున్నారని, ఈ భూముల విషయంలో రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించాలని చెప్పారు. -
అటవీ భూముల ఆక్రమణలను గుర్తించాలి
సాక్షి, అమరావతి: భూ వివాదాలకు తెర దించుతూ శాస్త్రీయ పద్ధతుల్లో చేపట్టిన సమగ్ర భూ సర్వేను వేగవంతం చేయాలని జగనన్న శాశ్వత భూహక్కు–భూరక్ష పథకంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ అధికారులకు సూచించింది. ప్రభుత్వ భూములు, అటవీ భూముల్లో ఆక్రమణలను గుర్తించేందుకు అవసరమైతే రెవెన్యూ, అటవీశాఖల సంయుక్త ఆధ్వర్యంలో సర్వే చేయాలని స్పష్టం చేశారు. తొలుత అటవీ భూముల సరిహద్దులను నిర్దిష్టంగా గుర్తించాలన్నారు. సబ్ కమిటీ గురువారం పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో సమావేశమై పలు సూచనలు చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీసీఎల్ఎ నీరబ్ కుమార్ ప్రసాద్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ (మున్సిపల్) శ్రీలక్ష్మి, ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, సర్వే అండ్ సెటిల్ మెంట్ కమిషనర్ సిదార్ధ్ జైన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ ఎం.ఎం.నాయక్, డీఎంజీ వెంకటరెడ్డి, డీటీసీపీ డైరెక్టర్ రాముడు తదితరులు పాల్గొన్నారు. కాపాడకుంటే పర్యావరణ సమస్యలు.. దేశంలో తొలిసారిగా అత్యంత శాస్త్రీయ విధానాన్ని అనుసరిస్తూ తొలిదశలో 51 గ్రామాల్లో సమగ్ర భూ సర్వే పూర్తి కాగా ఈ ఏడాది చివరి నాటికి 11,501 గ్రామాల్లో పూర్తి చేసే లక్ష్యంతో కృషి చేయాలని కేబినెట్ సబ్ కమిటీ సూచించిది. అటవీశాఖ భూములు పెద్ద ఎత్తున అన్యాక్రాంతం, నకిలీ ధ్రువపత్రాలతో ఆక్రమించుకున్నట్లు ఆరోపణలున్నాయన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకున్న సందర్భాల్లో న్యాయస్థానాల్లో కేసులు దాఖలు చేస్తున్నారని చెప్పారు. అటవీ భూములను కాపాడుకోకుంటే పర్యావరణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. వీటిని నివారించేందుకు శాస్త్రీయంగా ఆక్రమణలను గుర్తించాలన్నారు. సర్వే పనులు ఇలా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,000 కోట్ల వ్యయంతో 4,500 సర్వే బృందాలతో పథకాన్ని అమలు చేస్తున్నట్లు సబ్ కమిటీ పేర్కొంది. ఇప్పటికే 37 గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభమైనట్లు తెలిపింది. 70 కార్స్ బేస్ స్టేషన్లు, 2 వేల రోవర్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమగ్ర భూసర్వే జరుగుతోందన్నారు. 2023 జూన్ నాటికి దశలవారీగా రీసర్వే పూర్తి కావాలన్న లక్ష్యం మేరకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇప్పటివరకు 1,287 గ్రౌండ్ ట్రూతింగ్ లో భాగంగా 1,287 ఆవాస ప్రాంతాల్లో డ్రోన్ సర్వే పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. 606 గ్రామాల్లో తొలివిడత మ్యాపింగ్, 515 హ్యాబిటేషన్లలో గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. 161 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ వాలిడేషన్ ముగిసింది. అన్ని శాఖల సమన్వయంతో రీసర్వేను లక్ష్యం మేరకు పూర్తి చేసేలా చర్యలు చేపట్టామన్నారు. -
భూ వివాదాలు బంద్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేతో వివాదాలకు పూర్తిగా తెరపడుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. సబ్ డివిజన్, మ్యుటేషన్ ప్రక్రియ ముగిశాకే రిజిస్ట్రేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్‌కు అనుగుణంగానే రికార్డుల్లో మార్పులు చేయాలని స్పష్టం చేశారు. సాదా బైనామాల క్రమబద్ధీకరణ పారదర్శకంగా, తక్కువ రుసుముతో చేయాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా భూ వ్యవహారాల్లో శాశ్వతంగా నిలిచిపోయే పారదర్శక విధానాలు అమలు చేయాలని, వివాదాలు, అభ్యంతరాల పరిష్కారానికి గ్రామ సచివాలయాల స్థాయిలో యంత్రాంగం ఉండాలని నిర్దేశించారు. గడువులోగా సర్వే పూర్తి చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. 2023 జూన్ నాటికి పథకాన్ని పూర్తి చేస్తామని, రెవెన్యూ డివిజన్‌కు మూడేసి డ్రోన్లు ఏర్పాటు చేస్తున్నామని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి డ్రోన్ల ద్వారా సర్వే పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు. పారదర్శకతకు పెద్దపీట భూ వ్యవహారాల్లో పారదర్శకతకు అత్యంత పెద్దపీట వేయాలి. విక్రయించిన వారు, కొనుగోలు చేసినవారు మోసాలు, ఇబ్బందులకు గురి కాకూడదు. భూమి రిజిస్ట్రేషన్ అయ్యే నాటికి సబ్ డివిజన్, మ్యుటేషన్ ప్రక్రియలు పూర్తి చేయాలి. దీనివల్ల వివాదాలు, సమస్యలు లేకుండా రికార్డుల్లో స్పష్టత ఉంటుంది. స్పష్టమైన సబ్ డివిజన్, రికార్డుల్లో మార్పులు, సర్వహక్కులతో కొనుగోలుదారులకు భూమి దఖలు పడాలి. దీనిపై అధికారులు సమగ్ర విధానాన్ని సిద్ధం చేయాలి. వివాదాలు కొనసాగుతుంటే జీవితాంతం భూ యజమానులను, కొనుగోలు చేసిన వారిని వెంటాడతాయి. ఇప్పుడున్న విధానాలను ప్రక్షాళన చేసి ప్రజలకు మంచి విధానాలు అందుబాటులోకి తీసుకురావాలి. విధానాలే శాశ్వతం.. భూ రికార్డుల్లో సంస్కరణలు తేవాలి. రాజకీయాలతో సంబంధం లేకుండా అత్యంత పారదర్శకంగా ఈ వ్యవస్థ ఉండాలి. రికార్డుల క్రమబద్ధీకరణలో పారదర్శకతకు పెద్దపీట వేసి చిరకాలం నిలిచిపోయేలా విధానాలు ఉండాలి. తమకు ఇష్టం లేదని రికార్డుల్లో పేర్లు తొలగించడం, నచ్చినవారి పేర్లను చేర్చడం లాంటి వాటికి ఇకపై చోటు ఉండకూడదు. ఎవరు అధికారంలో ఉన్నా అనుసరిస్తున్న విధానాలు శాశ్వతంగా నిలిచిపోయేలా ఉండాలి. నామమాత్రపు రుసుముతో.. గిఫ్ట్‌లు, వారసుల మధ్య పంపకాలకు రిజిస్ట్రేషన్‌ను ప్రోత్సహించాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియను బలోపేతం చేయడం, రికార్డులు సమర్థవంతంగా నిర్వహించడం, గిఫ్టు రూపేణా వచ్చిన భూమిపై న్యాయపరంగా అన్ని హక్కులు సంక్రమించేందుకు ఇది ఉపకరిస్తుంది. సాదా బైనామాలను క్రమబద్ధీకరించేందుకు తగిన విధానాలు తీసుకురావాలి. దీనివల్ల రికార్డుల ప్రక్షాళనకు అవకాశం లభిస్తుంది. వీటికోసం విధించే రుసుములు నామమాత్రంగా ఉండాలి. దీనిపై అధికారులు కార్యాచరణ రూపొందించాలి. చుక్కల భూముల వివాదాలకు పరిష్కారం దీర్ఘకాలంగా తేలని చుక్కల భూముల వివాదాలను పరిష్కరించాలి. లేదంటే ఈ వివాదాలు తరతరాలుగా ప్రజలను వేధిస్తాయి. భూ వివాదాలు, అభ్యంతరాలపై ఎప్పటికప్పుడు పరిష్కారాలు చూపేందుకు గ్రామ సచివాలయాల స్థాయిలో యంత్రాంగం ఏర్పాటుపై ఎస్వోపీ రూపొందించాలి. నిర్దిష్ట కాల పరిమితితో వివాదాలు పరిష్కారం కావాలి. అంతేకాకుండా ఆ వివరాలు రికార్డుల్లో నమోదు కావాలి. లంచాలకు ఎక్కడా ఆస్కారం ఉండకూడదు. రికార్డులు తారుమారు చేయలేని విధంగా విధానాలు ఉండాలి. రిజిస్ట్రేషన్లకు సంబంధించి సచివాలయాల సిబ్బందికి తగిన శిక్షణ, అవగాహన కల్పించాలి. -
ఇకపై డూప్లికేట్ రిజిస్ట్రేషన్లకు చెక్: సీఎం జగన్
-
ఇకపై డూప్లికేట్ రిజిస్ట్రేషన్లకు చెక్: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఇకపై డూప్లికేట్ రిజిస్ట్రేషన్లకు చెక్ పెడతామని.. దళారీ వ్యవస్థ రద్దు అవుతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన 37 గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సేవలను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తాన క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గ్రామ కంఠాల్లోని స్థిరాస్తుల సర్వే, యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు ఇస్తామని.. అన్ని గ్రామ సచివాలయాల్లోనే స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుందన్నారు. చదవండి: రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించిన సీఎం జగన్ వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా మంచి కార్యక్రమానికి మళ్లీ ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. దేశంలో తొలిసారిగా అత్యంత శాస్త్రీయ పద్దతిలో సమగ్ర భూసర్వే తొలి దశలో 51 గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేశామన్నారు. 11,501 గ్రామాల్లో డిసెంబర్ 2022 నాటికి రీసర్వే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ రోజు నుంచి 37 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. భవిష్యత్‌లో వివాదాలకు తావు లేకుండా సమగ్ర సర్వే చేపట్టామన్నారు. మీ ఆస్తులు లావాదేవీలు మీ గ్రామంలో కనిపించే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. ఇటువంటి మంచి సంస్కరణ నేటి నుంచి అమల్లోకి తెస్తున్నామని సీఎం అన్నారు. ‘‘భూములకు సంబంధించి ట్యాంపరింగ్ జరుగుతోందన్న ఫిర్యాదులు వచ్చాయి. పట్టాదారు పాస్ బుక్‌లకు ఆశించినంత లాభం జరగలేదు. భూమికి చెందిన నిర్ధిష్టమైన హద్దులు, హక్కులు ఇప్పటివరకు లేవు. కేవలం 90 శాతం కేసులు సివిల్ వివాదాలకు సంబంధించినవే.. శాస్త్రీయ పద్దతుల్లో భూములకు నిర్థిష్టంగా మార్కింగ్ చేసి ప్రతి ఒక్కరికీ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తే ల్యాండ్ వివాదాలకు చెక్ పెట్టొచ్చు. 2023 కల్లా సమగ్ర రీ సర్వే చేసి యూనిక్ ఐడీ కార్డ్, డేటా అప్డేట్ ఇస్టాం. తొలి దశలో 51 గ్రామాల్లోని.. 29,563 ఎకరాల భూముల రీసర్వే చేశాం. ఎమ్మార్వోల ద్వారా భూ యజమానుల అభ్యంతరాలను పరిష్కారం చేశాం. ప్రతి భూ కమతానికి ఉచితంగా భూ రక్ష హద్దు రాళ్లు ఇస్తామని’’ సీఎం పేర్కొన్నారు. -
మీ కళ్ల ముందే మీ ఆస్తుల రిజిస్ట్రేషన్: సీఎం జగన్
-
రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించనున్న సీఎం జగన్
-
రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించిన సీఎం జగన్
Time: 11:41 AM రాష్ట్రవ్యాప్తంగా భూములు, ఆస్తుల రక్షణకు ప్రభుత్వం చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకంలో భాగంగా రీసర్వే పూర్తయిన భూములకు సంబంధించిన సమగ్ర భూసర్వే రికార్డులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ప్రజలకు అంకితం చేశారు. అలాగే 37 గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సేవలను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించారు. Time: 11:27 AM వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ద్వారా మంచి కార్యక్రమానికి మళ్లీ ప్రభుత్వం ముందడుగు వేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సేవల ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతూ, దేశంలో తొలిసారిగా అత్యంత శాస్త్రీయ పద్దతిలో సమగ్ర భూసర్వే తొలి దశలో 51 గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేశామన్నారు. 11,501 గ్రామాల్లో డిసెంబర్ 2022 నాటికి రీసర్వే పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ రోజు నుంచి 37 గ్రామాల్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. భవిష్యత్‌లో వివాదాలకు తావు లేకుండా సమగ్ర సర్వే చేపట్టామన్నారు. మీ ఆస్తులు లావాదేవీలు మీ గ్రామంలో కనిపించే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. ఇటువంటి మంచి సంస్కరణ నేటి నుంచి అమల్లోకి తెస్తున్నామని సీఎం అన్నారు. భూములకు సంబంధించి ట్యాంపరింగ్ జరుగుతోందన్న ఫిర్యాదులు వచ్చాయి. పట్టాదారు పాస్ బుక్‌లకు ఆశించినంత లాభం జరగలేదు. భూమికి చెందిన నిర్ధిష్టమైన హద్దులు, హక్కులు ఇప్పటివరకు లేవు. కేవలం 90 శాతం కేసులు సివిల్ వివాదాలకు సంబంధించినవే.. శాస్త్రీయ పద్దతుల్లో భూములకు నిర్థిష్టంగా మార్కింగ్ చేసి ప్రతి ఒక్కరికీ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తే ల్యాండ్ వివాదాలకు చెక్ పెట్టొచ్చు. చదవండి: టీడీపీ కుట్ర బట్టబయలు.. చంద్రబాబు ఆడియో లీక్.. సాక్షి, అమరావతి: వందేళ్ల తర్వాత దాదాపు రూ.1,000 కోట్ల ఖర్చుతో 4,500 సర్వే బృందాలు, 70 కార్స్ బేస్ స్టేషన్లు, 2 వేల రోవర్లతో అత్యాధునిక సాంకేతికతను వినియోగించి దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూసర్వేను చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మొదటి దశలో 51 గ్రామాల్లోని 12,776 మంది భూ యజమానులకు చెందిన 21,404 భూ కమతాలను అధికారులు రీసర్వే చేశారు. ఇందులో భాగంగా వారికి చెందిన 29,563 ఎకరాల భూములను రీసర్వే చేసి.. 3,304 అభ్యంతరాలను పరిష్కరించారు. ఈ భూమి రికార్డులను సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తారు. జూన్ 2023 నాటికి దశలవారీగా రాష్ట్రంలో మిగిలిన భూముల రీసర్వేను కూడా పూర్తి చేయనున్నారు. తర్వాత రీసర్వే పూర్తయిన గ్రామాల్లో అవసరమైన ప్రక్రియను పూర్తి చేసి ఆయా గ్రామ సచివాలయాల్లో స్థిరాస్తులను రిజిస్ట్రేషన్ చేస్తారు. భూ రికార్డుల ప్రక్షాళన భూకమతం ఒక సర్వే నంబర్ కింద ఉండి, కాలక్రమేణా విభజన జరిగి.. చేతులు మారినా సర్వే రికార్డులు అప్డేట్ కాకపోవడంతో వస్తున్న భూవివాదాలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బందులకు ప్రభుత్వం ఇక చెక్ పెట్టనుంది. భూ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రతి భూ కమతానికి (సబ్ డివిజన్‌కు కూడా) విశిష్ట గుర్తింపు సంఖ్యను కేటాయించనుంది. ప్రతి భూ కమతానికి విడిగా అక్షాంశ, రేఖాంశాలు, విశిష్ట గుర్తింపు సంఖ్య, సమగ్రంగా భూ వివరాలు తెలిపే క్యూఆర్ కోడ్‌తో కూడిన భూపటాన్ని యజమానులకు జారీ చేస్తుంది. గ్రామ స్థాయిలోనే భూరికార్డులను క్రోడీకరించడం వల్ల మ్యాపులు (భూ కమతాలతో కూడిన గ్రామ పటం), ఇతర భూ రికార్డులు ఇక గ్రామాల్లోనే అందుబాటులో ఉంటాయి. శాశ్వత భూ హక్కు సర్వే ప్రతి అడుగులో భూ యజమానులను భాగస్వాములను చేశారు. మండల మొబైల్ మెజిస్ట్రేట్ బృందాల ద్వారా అభ్యంతరాలను పరిష్కరించారు. ప్రతి భూకమతానికి ఉచితంగా భూరక్ష హద్దు రాళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సమగ్ర భూసర్వే పూర్తయిన వాటికి సంబంధించి సింగిల్ విండో పద్ధతిలో ప్రతి ఆస్తికీ ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూహక్కు పత్రం జారీ దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. శాశ్వత భూహక్కు పత్రం ఉండటం వల్ల ఇకపై భూలావాదేవీలు పారదర్శకంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. దీంతో నకిలీ రిజిస్ట్రేషన్లకు చెక్ పడుతుంది. దళారీ వ్యవస్థ రద్దవడంతోపాటు లంచాలకు చోటు ఉండదు. భూ యజమానులకు తెలియకుండా రికార్డుల్లో ఎలాంటి మార్పులు వీలుపడవు. ఇకపై గ్రామ సర్వేయర్ల ద్వారానే ఎఫ్ లైన్ దరఖాస్తులను 15 రోజుల్లో, పట్టా సబ్ డివిజన్ దరఖాస్తులను 30 రోజుల్లో పరిష్కరిస్తారు. భూ సమాచారాన్ని ఎవరైనా, ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా పొందొచ్చు. ప్రభుత్వ హామీతో కూడిన శాశ్వత భూమి హక్కు పత్రం అందడం వల్ల భూములు, ఆస్తులు సురక్షితంగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ భూవివాదాలు తలెత్తవు. భూ లావాదేవీల ఆధారంగానే భూ రికార్డుల్లో మార్పులుంటాయి. పారదర్శకంగా ఉండటం వల్ల భూ యజమానులు రుణాలు పొందడం కూడా సులభం కానుంది. ఇక గ్రామ సచివాలయాలే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని గ్రామ సచివాలయాల్లోనే సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులనే సబ్ రిజిస్ట్రార్లుగా నియమించింది. రెవెన్యూ శాఖ(స్టాంపులు, రిజిస్ట్రేషన్లు) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఈ మేరకు సోమవారం రెండు నోటిఫికేషన్లు ఇచ్చారు. భూరికార్డులను సులభంగా తనిఖీ చేసుకునేలా రిజిస్ట్రేషన్ సేవలను గ్రామ సచివాలయాల స్థాయిలో వికేంద్రీకరిస్తున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయిలోనే రిజి స్ట్రేషన్ సేవలందించేందుకు సచివాలయాల్లో సబ్ డిస్ట్రిక్ట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాలను ప్రస్తుతం ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి వేరు చేసి ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో సబ్ డిస్ట్రిక్టులుగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొత్త సబ్ డిస్ట్రిక్టులు ఇవే.. శ్రీకాకుళం జిల్లా.. శింగన్నవలస, డోల, విజయనగరం జిల్లా.. సోంపురం, పెదమనపురం, విశాఖపట్నం జిల్లా.. నునపర్తి, చింతపల్లి–1, తూర్పుగోదావరి జిల్లా.. పాలగుమ్మి, మాధవపురం, గుడివాడ, భూపాలపట్నం–2, తాళ్లపొలం, బండపల్లి, రంగాపురం, తోగుమ్మి, పెదపుల్లేరు, కృష్ణా జిల్లా.. పోతిరెడ్డిపాలెం, లింగవరం, మర్రిబంధం, షేర్ మహ్మద్‌పేట, గుంటూరు జిల్లా.. తుమ్మలపాలెం, నడికుడి–3, ఉన్నవ, దుగ్గిరాల–1, ప్రకాశం జిల్లా.. శివరామపురం, కొప్పోలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.. నువ్వూరుపాడు, దుండిగం, భీమవరం, మొగల్లూరు, చిత్తూరు జిల్లా.. అగరమండళం, రామభద్రాపురం, విట్టలం, నర్సింగపురం, వైఎస్సార్ జిల్లా.. రేగిమానుపల్లె, మొయిళ్లకాల్వ, కర్నూలు జిల్లా.. ముసనహల్లి, పందిపాడు గ్రామ సచివాలయాల్లోనే కొత్త సబ్ డిస్ట్రిక్ట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలోకొస్తాయన్నారు. పంచాయతీ, వార్డు పరిపాలన కార్యదర్శులను కొత్త సబ్ డిస్ట్రిక్ట్‌లకు సబ్ రిజిస్ట్రార్లుగా నియమిస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆయా సచివాలయాల పరిధిలోని ఆస్తుల రిజిస్ట్రేషన్ల వ్యవహారాలను వీరే నిర్వహిస్తారని స్పష్టం చేశారు. -
సమగ్ర భూ సర్వేకు సర్కారు కసరత్తు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 6 నెలల్లో 5 వేల గ్రామాల్లో సమగ్ర భూ సర్వేను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే రెవెన్యూ డివిజన్‌కు ఒక గ్రామం చొప్పున 51 గ్రామాల్లో సర్వేను పూర్తిచేసి భూ యజమానులకు హక్కు పత్రాలను కూడా ఇచ్చారు. జనవరి నెలాఖరు నాటికి మరో 650 గ్రామాల్లో సర్వేను పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇదే వేగంతో వచ్చే జూన్ నాటికి ఐదు వేల గ్రామాల్లో సర్వేను పూర్తి చేసి హక్కు పత్రాలు జారీ చేయాలనే లక్ష్యంతో సర్వే సెటిల్మెంట్ శాఖ పనులు ముమ్మరం చేసింది. జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కింద చేపట్టిన సర్వేలో కీలకమైన డ్రోన్ సర్వే సుమారు 1,100 గ్రామాల్లో పూర్తయింది. మిగిలిన 3,900 గ్రామాల్లో ఈ సర్వే పూర్తి చేసేందుకు అధికారులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రోన్ సేవల కోసం టెండర్లు డ్రోన్ల లభ్యత కొంచెం ఇబ్బందిగా మారినా ఆ సేవలను అందించే కంపెనీలతో ఒప్పందం చేసుకుని ఈ పనిని త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం డ్రోన్ సేవలు అందించే సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించారు. త్వరలో డ్రోన్ సర్వే పనులను మరింత ముమ్మరం చేసి గడువులోపు సమగ్ర సర్వేను పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో రెవెన్యూ యంత్రాంగం ముందుకెళుతోంది. డ్రోన్ సర్వే పూర్తయిన 433 గ్రామాల్లో క్షేత్ర స్థాయి నిజనిర్థారణ (గ్రౌండ్ ట్రూతింగ్) సైతం పూర్తయింది. సాధ్యమైనంత త్వరగా మిగిలిన గ్రామాల డ్రోన్ మ్యాపులను సర్వే బృందాలకు అందించి వాటి ద్వారా గ్రౌండ్ ట్రూతింగ్‌ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. డ్రోన్ సర్వే, గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తయితే మిగిలిన పనులు సర్వే బృందాల చేతిలోనే సులువుగా అయ్యేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు సమగ్ర సర్వే జరుగుతున్న తీరుపై మంత్రుల కమిటీ 15 రోజులకు ఒకసారి కచ్చితంగా సమీక్ష జరుపుతుండటంతో రెవెన్యూ అధికారులు దీనిపై సీరియస్‌గా పనిచేస్తున్నారు. -
చురుగ్గా భూ సర్వే
సాక్షి, అమరావతి: రెండో దశ సమగ్ర భూ రీ సర్వే (వైఎస్సార్ జగనన్న భూరక్ష, శాశ్వత భూ హక్కు) పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 650 గ్రామాల్లో వచ్చే జనవరికల్లా రీ సర్వేను పూర్తి చేసే లక్ష్యంతో సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డుల శాఖాధికారులు పనిచేస్తున్నారు. 646 గ్రామాల డ్రోన్ చిత్రాలు ఇప్పటికే అధికారులకు అందాయి. వాటి ద్వారా సర్వే కొనసాగిస్తున్నారు. 92 గ్రామాల్లో ఇప్పటికే రీ సర్వే చివరి దశకు చేరుకొంది. వీటికి కొత్త సరిహద్దులు నిర్ణయిస్తూ ఇచ్చే 13 నోటిఫికేషన్లు త్వరలో జారీ చేయనున్నారు. ఈ గ్రామాల తుది భూ రికార్డులను తయారు చేస్తున్నారు. 44 గ్రామాల్లో భూ యజమానుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. 140 గ్రామాల్లో భూముల పట్టాదార్ పాస్ పుస్తకాలు, వెబ్‌ల్యాండ్ అడంగల్ తదితరాల పరిశీలన జరుగుతోంది. 439 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ (క్షేత్ర స్థాయి నిజనిర్థారణ) జరుగుతోంది. డ్రోన్ చిత్రాల ఆధారంగా కొత్తగా తయారు చేసిన సరిహద్దులతో ఆ సర్వే నెంబర్ల భూమిని భూ యజమానుల సమక్షంలో కొలతలు వేస్తారు. గ్రామాల్లోని సచివాలయ సర్వేయర్లతో ఈ పని చేయిస్తున్నారు. మరో నాలుగు గ్రామాల డ్రోన్ చిత్రాలు త్వరలో అందనున్నాయి. ఇవికాకుండా 5,500 గ్రామాల్లో అడంగల్, ఆర్ఎస్ఆర్తో సరిదిద్దడం, భూయజమానుల రికార్డులతో సరిపోల్చడం వంటి పనులు జరుగుతున్నాయి. -
650 గ్రామాల్లో... తుది దశకు సమగ్ర భూసర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వతంగా తెరదించేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష’ పథకం ద్వారా భూముల రీ సర్వే ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే పలు గ్రామాల్లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతం కాగా తాజాగా మరో 650 గ్రామాల్లో సమగ్ర భూసర్వే ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. సర్వే ముగింపునకు సంబంధించి నెంబర్ 13 ముసాయిదా నోటిఫికేషన్లు డిసెంబర్ 22వతేదీలోపు ఇచ్చేందుకు సర్వే, సెటిల్మెంట్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం అన్ని జిల్లాల్లో ప్రత్యేక బృందాలను నియమించారు. అభ్యంతరాల పరిశీలన.. సర్వే ఆఫ్ ఇండియా అందచేసిన డ్రోన్ ఫొటోలు, క్షేత్ర స్థాయిలో భూ యజమానులు చూపించిన సరిహద్దులను సరిచూసి కొలతలు వేసే పనిని ఇప్పటికే పూర్తి చేశారు. ఆయా గ్రామాల సరిహద్దులు, గ్రామ కంఠాలు, ప్రభుత్వ భూములు, పట్టా భూముల సర్వే దాదాపుగా పూర్తైంది. వీటి ప్రకారం కొత్తగా రూపొందించిన కొలతలపై భూ యజమానుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తున్నారు. వీటిని అక్కడికక్కడే పరిష్కరించేందుకు మొబైల్ మెజిస్ట్రేట్లు చర్యలు తీసుకుంటున్నారు. అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత రైతుల ఆమోదంతో తుది రికార్డులు రూపొందిస్తారు. ఈ పనులన్నీ డిసెంబర్ 22లోపు పూర్తి చేసి నెంబర్ 13 నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది. ప్రయోగాత్మక సర్వేతో పూర్తి స్పష్టత రెవెన్యూ డివిజన్‌కు ఒక గ్రామం చొప్పున మొత్తం 51 గ్రామాల్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా నిర్వహించిన రీ సర్వే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తైనట్లు సర్వే శాఖ అధికారులు తెలిపారు. ఆయా గ్రామాల్లో కొత్తగా భూమి రిజిష్టర్లు, మ్యాప్‌లు అందుబాటులో ఉంచారు. ప్రతి భూమికి ఒక విశిష్ట సంఖ్య కూడా కేటాయించారు. ప్రతి గ్రామంలో సగటున ఒక ఎకరం తేడా కూడా లేకుండా కొత్త సరిహద్దులు నిర్ణయించారు. రెండు చోట్ల మాత్రం 3 ఎకరాలకు పైబడి తేడా ఉండడంతో రైతుల ఆమోదంతో వివాదాలకు ఆస్కారం లేకుండా హద్దులను నిర్ణయించారు. రీ సర్వేకు ముందు ఈ గ్రామాల్లో మొత్తం 6,405 సర్వే నెంబర్లు ఉండగా సర్వే తర్వాత రూపొందించిన కొత్త రికార్డుల ప్రకారం 21,374 ఎల్పీ (ల్యాండ్ పార్సిల్స్)గా నమోదు చేశారు. ఈ రికార్డుల ప్రకారమే ఇకపై భూముల రిజిస్ట్రేషన్లు చేసేందుకు అవసరమైన కార్యాచరణపై కసరత్తు ప్రారంభించారు. మొత్తంగా 51 గ్రామాల్లో జరిగిన ప్రయోగాత్మక సర్వేతో రీసర్వేపై పూర్తి స్పష్టత వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన గ్రామాల్లో సర్వేను వేగవంతం చేశారు. -
ఉద్యోగులూ.. శభాష్
గ్రామ, వార్డు సచివాలయాల్లో మౌలిక సదుపాయాల విషయమై నెలలో నాలుగు బుధవారాల్లో ఒక్కో వారం ఒక్కో దశలో (సచివాలయాలు, మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో) ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలి. తద్వారా గ్రామ, వార్డు వలంటీర్లకు గౌరవ వేతనం వస్తుందా.. లేదా? ఫింగర్ ప్రింట్ స్కానర్ పనిచేస్తుందా.. లేదా? సచివాలయంలో కనెక్టివిటీ ఉందా.. లేదా? అన్నది తెలుస్తుంది. ఎక్కడైనా లోపం ఉంటే వెంటనే సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుంది. సమగ్ర భూ సర్వే తొలి దశలో నిర్ణీత కాల పరిమితితో 5,500 గ్రామాల్లో సర్వే పూర్తవుతుంది. 2023 జూన్ నాటికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే ప్రక్రియ ముగుస్తుంది. సర్వే అవగానే రికార్డులు అప్డేట్ అవుతాయి. యజమానులకు కొత్త పాసుపుస్తకాలు ఇస్తాం. ఆ తర్వాత ప్రతి గ్రామ సచివాలయంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వస్తుంది. ఈ దృష్ట్యా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు అంకిత భావంతో దీన్ని అమలు చేయాలి. ఈ కార్యక్రమం పూర్తయ్యే నాటికి చరిత్రలో మీ పేరు నిలిచిపోతుంది. సాక్షి, అమరావతి : రాష్ట్రంలో దాదాపు 80 శాతం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు మంచి పనితీరు కనబరుస్తున్నారని తనిఖీల ద్వారా వెల్లడైందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మిగిలిన 20 శాతం మంది పనితీరును కూడా మెరుగు పరిచేలా వారికి తోడ్పాటు అందించాలని సూచించారు. నూటికి నూరు శాతం గ్రామ, వార్డు సచివాలయాలు మంచి పనితీరును చూపించేలా సిబ్బందికి తగిన చేయూత ఇవ్వాలని, ఈ విషయంలో కలెక్టర్లే బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామ, వార్డు వలంటీర్ల సేవలపై దృష్టి పెట్టాలని, వారు మెరుగైన సేవలు అందించేలా కౌన్సెలింగ్ చేయాలని సూచించారు. వారు అప్‌గ్రేడ్ అయ్యేలా చేయూతనిచ్చి, తీర్చిదిద్దాలని చెప్పారు. అప్పటికీ సేవలు అందించడంలో ప్రమాణాలను అందుకునే రీతిలో లేకపోతే వారిని తొలగించి కొత్తవారిని పెట్టాలని, ఖాళీగా ఉన్న వలంటీర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ‘స్పందన’పై సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిర్యాదులు పరిష్కరించాలి ► గ్రామ, వార్డు సచివాలయాలకు అందుతున్న విజ్ఞాపనలు, వినతుల పరిష్కారంపై దృష్టి పెట్టండి. ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం సమర్థవంతంగా ఉండాలి. ► అక్టోబర్ 29, 30 తేదీల్లో సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమం చేపట్టాలి. ప్రతి నెలా చివరి శుక్ర, శనివారాల్లో ఈ కార్యక్రమం కొనసాగాలి. సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు.. బృందాలుగా వారి పరిధిలోని ప్రతి కుటుంబాన్ని కలవాలి. సచివాలయాల్లో మౌలిక సదుపాయాలు ► ప్రతినెలలో తొలి బుధవారం గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో కచ్చితంగా సమావేశాలు జరగాలి. సిబ్బంది, వలంటీర్లు కూడా ఈ సమావేశాల్లో పాల్గొనాలి. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాలి. మొబైల్స్, గౌరవ వేతనం, సీఎఫ్ఎంఎస్ ఐడీలు, సిమ్‌కార్డులు, ఫింగర్ ప్రింట్ స్కానర్లు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించాలి. ► నెలలో రెండో బుధవారం మండలం లేదా యూఎల్బీ స్థాయిలో సమావేశం జరగాలి. నెలలో మూడో బుధవారం కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో సమావేశం కావాలి. నాలుగో బుధవారం రాష్ట్ర స్థాయిలో సచివాలయాల విభాగానికి చెందిన కార్యదర్శి సమావేశం కావాలి. అప్పుడే మనకు ప్రతి సచివాలయంలో వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు మెరుగుపడ్డాయి. దీనిని కొనసాగించాలి. తనిఖీలకు వెళ్లినప్పుడు రిజిస్టర్ పరిశీలన తప్పనిసరి. గతంలో వ్యక్తం చేసిన సమస్యలను పరిష్కరించామా? వాటిని సరిచేశామా.. లేదా? అన్నది చూడాలి. ► ఏటా జూన్, డిసెంబర్లో పెన్షన్లు, రేషన్‌కార్డులు, పట్టాలు తదితర పథకాలకు సంబంధించి మంజూరు కచ్చితంగా అమలు చేయాలి. సమగ్ర భూ సర్వే విప్లవాత్మకం ► జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకం విప్లవాత్మకమైనది. 100 సంవత్సరాల తర్వాత సర్వే, రికార్డులను అప్డేట్ చేస్తున్నాం. సర్వే పూర్తయితే గ్రామాల్లో భూ వివాదాలకు పూర్తిగా చెక్ పడుతుంది. ► గ్రామ సచివాలయాల్లో సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసు ఉంటుంది. పైలట్ ప్రాజెక్టుగా 51 గ్రామాల్లో జరుగుతోంది. ఇది పూర్తవగానే జాతికి అంకితం చేస్తాం. సమగ్ర సర్వే పూర్తి చేసి, కొత్త పాసుపుస్తకాలు, రికార్డులు ఇస్తాం. మరో 650 గ్రామాల్లో డిసెంబర్‌కల్లా పూర్తవుతుంది. గృహ హక్కులతో 47.4 లక్షల మంది పేదలకు లబ్ధి ► జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం వల్ల 47.4 లక్షల మంది లబ్ధి పొందుతారు. దీనిపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. డిసెంబర్ 21న ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ► ఉపాధి హామీ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టండి. ► గ్రామాల్లో తొలి విడతలో 4,314 వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీలను నిర్మిస్తున్నాం. వీటిపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ► అక్టోబరు 26న రైతు భరోసా రెండో విడత కార్యక్రమం, 2020 ఖరీఫ్‌కు సంబంధించిన సున్నా వడ్డీ పంట రుణాల కార్యక్రమం ఉంటుంది. అర్హులెవరూ మిగిలిపోకూడదు. నవంబర్‌లో విద్యా దీవెనకు సంబంధించి కూడా వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. 10 రోజుల పాటు ఆసరా కార్యక్రమాలను బాగా నిర్వహించిన కలెక్టర్లు, అధికారులందరికీ అభినందనలు. -
సమగ్ర భూసర్వే పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం
సాక్షి, అమరావతి: అస్తవ్యస్తంగా మారిన భూముల రికార్డులను ప్రక్షాళన చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ సర్వే పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైంది. తొలుత 51 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సర్వే దాదాపు పూర్తయింది. ఈ గ్రామాల కొత్త సర్వే రికార్డులను భూ సర్వే శాఖ త్వరలో విడుదల చేయనుంది. దీనికి ముందు సర్వే ముగింపునకు సంబంధించిన నంబర్ 13 ముసాయిదా నోటిఫికేషన్లను ముద్రించనుంది. 51 గ్రామాల రీసర్వేలో ఎదురైన సమస్యల్ని పరిష్కరించి.. తుది రికార్డులను రూపొందించామని అధికారులు తెలిపారు. తద్వారా మిగిలిన గ్రామాల్లో రీసర్వే పూర్తి చేయడానికి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒక గ్రామం పైలట్ ప్రాజెక్ట్ కోసం ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒక గ్రామాన్ని ఎంపిక చేశారు. ఈ 51 గ్రామాల్లో 63,433 ఎకరాలను రీసర్వే చేశారు. సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన డ్రోన్ చిత్రాలు, భూ యజమానులు వాస్తవంగా చూపించిన సరిహద్దులను పోల్చి కొలతలు వేశారు. తొలుత ఆ గ్రామాల సరిహద్దులు, గ్రామ కంఠాలు, ప్రభుత్వ భూములను సర్వే చేశారు. ఆ తర్వాత పట్టా భూముల సర్వే నిర్వహించారు. కొత్తగా వచ్చిన కొలతలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు జీఎన్ఎస్ఎస్ రోవర్‌తో మళ్లీ సర్వే చేశారు. ఈ గ్రామాల్లో రెవెన్యూ వ్యవహారాలకు సంబంధించి 588 వినతులు, సర్వేకి సంబంధించి 1,564 వినతులు వచ్చాయి. వాటిలో 95%కిపైగా వినతుల్ని మొబైల్ సర్వే బృందాలు పరిష్కరించాయి. రైతుల ఆమోదంతో తుది రికార్డులను రూపొందిస్తున్నారు. సాంకేతికతతో కచ్చితమైన కొలతలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న భూముల రికార్డులు వందేళ్ల క్రితం బ్రిటిషర్ల హయాంలో తయారుచేసినవి. అప్పట్లో చైన్ ద్వారా కొలిచి.. భూముల హద్దులు నిర్ణయించి రికార్డులు రూపొందించారు. వాటి ఆధారంగానే ఆ భూములు ఎన్నో తరాలుగా చేతులు మారుతూ వస్తున్నాయి. వాటిని కొనుగోలు చేసి తమ పేరున రిజిస్టర్ చేయించుకున్న వ్యక్తులు అధికారికంగా కొలతలు వేయించుకోవడం అరుదుగా జరిగేది. పాత రికార్డుల్లో ఉన్న హద్దుల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు జరిగేవి. దీంతో కొలతలు మారిపోయి సరిహద్దు తగాదాలు, ఇతర సమస్యలు ఏర్పడుతున్నాయి. అడంగల్‌లో పాత రికార్డుల కొలతలు, ఇప్పటి కొలతలకు చాలా తేడాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రీసర్వేలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కచ్చితమైన కొలతలతో ఈ 51 గ్రామాల్లో సరిహద్దులు నిర్ణయించారు. వాటి ఆధారంగా భూముల రిజిస్టర్లు, గ్రామ మ్యాప్‌లను రూపొందించారు. ఈ వివరాలనే అడంగల్‌లో నమోదు చేస్తారు. చివరిగా ప్రతి భూమికి సంబంధించి ఒక విశిష్ట సంఖ్యను ఇవ్వనున్నట్లు సర్వే సెటిల్మెంట్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ కెజియాకుమారి తెలిపారు. పైలట్ ప్రాజెక్టుతోపాటే తొలి దశలో 5,500 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియను గతంలోనే ప్రారంభించారు. అందులో 2,500 గ్రామాల్లో ప్రీ డ్రోన్ కార్యకలాపాలు జరుగుతున్నాయి. మిగిలిన గ్రామాల్లో సర్వే పనుల్ని ముమ్మరం చేశారు. పైలట్ ప్రాజెక్ట్ గ్రామాల్లో విజయవంతంగా సమగ్ర సర్వే పూర్తికావడంతో రాష్ట్రవ్యాప్తంగా సర్వే ప్రక్రియ ఊపందుకుంటుందని అధికారులు చెబుతున్నారు. -
ఏపీ: సర్వ సమగ్రంగా సర్వే.. వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా..
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష’ పథకం కింద రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేను 2023 జూన్ నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకునేలా ముందుకు సాగాలని, ఇందుకు అవసరమైన పరికరాలు, వనరులను సమకూర్చుకోవాలని స్పష్టం చేశారు. డ్రోన్లు సహా ఎన్ని అవసరమో అన్నీ కొనుగోలు చేయాలని, తగిన సాఫ్ట్వేర్ సమకూర్చుకోవడంతోపాటు సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ ఇవ్వాలని సూచించారు. సర్వే త్వరితగతిన పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు. సమగ్ర భూ సర్వే ప్రక్రియలో ఎక్కడా కూడా అవినీతికి తావు ఉండకూడదని, ఆదర్శవంతంగా సర్వే ప్రక్రియ ఉండాలని సీఎం స్పష్టం చేశారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం అమలుపై సీఎం జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వందేళ్ల తర్వాత దేశంలో తొలిసారిగా... వందేళ్ల తర్వాత దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో భూముల సమగ్ర సర్వే చేపడుతున్నామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. నిర్దేశిత గడువులోగా సమగ్ర సర్వే పూర్తయ్యేలా అత్యంత ప్రాధాన్య అంశంగా చేపట్టాలని ఆదేశించారు. పారదర్శకంగా, ఆదర్శంగా సర్వే ప్రక్రియ ఉండాలని స్పష్టం చేశారు. సర్వే కాగానే రైతులకు భూమి కార్డులు సర్వే చేసిన వెంటనే గ్రామాలవారీగా మ్యాపులతో సైతం రికార్డులు అప్డేట్ కావాలని, భూమి కార్డులను రైతులకు ఇవ్వాలని సీఎం సూచించారు. అనుకున్న సమయంలోగా సర్వేను పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. వనరులన్నీ సమకూర్చుకోవాలని, డ్రోన్లు సహా ఇతర టెక్నికల్ మెటీరియల్‌ను అవసరమైన మేరకు కొనుగోలు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సాప్ట్వేర్ సమకూర్చుకుని సిబ్బందికి అత్యుత్తమ శిక్షణ ఇచ్చేందుకు నిపుణుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలగరాదు.. ఇంత పెద్దఎత్తున భూముల సర్వే ప్రాజెక్టును చేపడుతున్నందున అవసరమైన మౌలిక సదుపాయాలు, సిబ్బంది, శిక్షణ.. ఇలా అన్ని అంశాలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సర్వే సందర్భంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రతి వారం కేబినెట్ సబ్ కమిటీ సమీక్ష సమగ్ర భూసర్వేపై ఏర్పాటైన కేబినెట్ సబ్‌కమిటీ ప్రతివారం కచ్చితంగా సమావేశం కావాలని, సర్వే ప్రక్రియపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ‘స్పందన’లో భాగంగా కలెక్టర్లతో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో కూడా దీనిపై సమీక్ష నిర్వహిస్తానని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రతి నాలుగు వారాలకు ఒకసారి సంబంధిత విభాగాల అధికారులతో సమగ్ర సర్వేపై సమీక్ష చేస్తానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి సమగ్ర భూ సర్వేను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, నిర్దేశించుకున్న గడువు లోగా ప్రాజెక్టు పూర్తి కావాల్సిందేనని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. సర్వే ఆఫ్ ఇండియాతో సమన్వయం చేసుకుని వారి సహకారా>న్ని కూడా తీసుకోవాలని సూచించారు. సర్వే రాళ్లకు కొరత లేకుండా చూడాలని, సకాలంలో వాటిని అప్పగించాలని భూగర్భ గనులశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. నవంబర్ నుంచి సర్వే రాళ్ల తయారీ.. నాలుగు ప్లాంట్లలో నవంబర్ నుంచి సర్వే రాళ్ల తయారీ ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు. రోజుకు ఒక్కో ప్లాంట్ నుంచి నాలుగు వేలు చొప్పున నిత్యం 16 వేల సర్వే రాళ్లు తయారవుతాయని భూగర్భ గనుల శాఖ అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్‌కుమార్ ప్రసాద్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనులశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, రెవెన్యూశాఖ కమిషనర్ సిద్దార్ధజైన్, ఏపీఎండీసీ వీసీ అండ్ ఎండీ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కచ్చితంగా గడువులోగా పూర్తి చేస్తాం అనుకున్న సమయానికి సమగ్ర భూసర్వేను కచ్చితంగా పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్ధానంలో నిలబెడతామని ముఖ్యమంత్రికి తెలియచేశారు. సమగ్ర భూ సర్వే పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. -
సమగ్ర భూ సర్వేలో 'సచివాలయ' సర్వేయర్లు
సాక్షి, అమరావతి: సమగ్ర భూ సర్వేలో గ్రామ, వార్డు సచివాలయాల సర్వేయర్లు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్)లోని కమ్యూనిటీ సర్వేయర్లను ఉపయోగించుకోవాలని మంత్రివర్గం ఉపసంఘం అధికారులకు సూచించింది. ఈ మేరకు వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం అమలు కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా సర్వేలో భాగంగా ఒక గ్రామాన్ని యూనిట్‌గా తీసుకుని మొత్తం ప్రక్రియ పూర్తి అవ్వడానికి ఎంత సమయం పడుతుందో అధ్యయనం చేయాలని సూచించింది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సర్వే రాళ్లకు సంబంధించి గుంతలు తవ్వడం తదితర పనులను వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని ఆదేశించింది. గ్రామకంఠం సమస్యపై ప్రభుత్వం ఇప్పటికే సానుకూలంగా ఉందని తెలిపింది. ఎక్కడా పొరపాట్లు లేకుండా యాజమాన్య హక్కు సర్టిఫికెట్లను అందించే ప్రక్రియను చేపట్టాలని సూచించింది. భూరికార్డులను ఆధునికీకరించే ప్రక్రియను ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో పూర్తి చేయాలని కోరింది. ఇందుకు అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకోవాలని పేర్కొంది. కాగా, ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా వంద గ్రామాల్లో గ్రామకంఠం పరిధిలో అర్హులైన వారికి భూయాజమాన్య హక్కు కార్డులను జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. అక్టోబర్ 2 నాటికి వెయ్యి గ్రామాల్లో పంపిణీకి సన్నాహాలు చేస్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో తాడేపల్లిగూడెంలో పైలట్ ప్రాజెక్ట్‌గా సర్వే ప్రక్రియను నిర్వహిస్తున్నామని చెప్పారు. 762 గ్రామాలకు విలేజ్ మ్యాప్‌లు సిద్ధంగా ఉన్నాయన్నారు. సకాలంలో సర్వేను పూర్తి చేయాలంటే కనీసం 51 డ్రోన్లు అవసరమవుతాయన్నారు. దీనిపై మంత్రులు స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డ్రోన్ కార్పొరేషన్ ద్వారా డ్రోన్లను సమకూర్చుకునే అంశాన్ని పరిశీలించాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, కృష్ణదాస్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీసీఎల్ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
సమగ్ర భూ సర్వే అమలుకు మంత్రుల కమిటీ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు–భూ రక్ష (సమగ్ర భూ సర్వే) పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ముగ్గురు మంత్రులతో కూడిన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. డిప్యుటీ సీఎం (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్, మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. సభ్య కార్యదర్శిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమగ్ర భూ సర్వే మరింత ఉధృతంగా, సమర్థవంతంగా అమలు, పురోగతిపై మంత్రుల కమిటీ వారానికి ఒకసారి సమీక్ష నిర్వహించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సర్వే పురోగతితో పాటు ఏమైనా సమస్యలుంటే సమీక్షించి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకునే బాధ్యతను మంత్రుల కమిటీకి అప్పగించారు. పురోగతితో పాటు తీసుకున్న చర్యలపై ఎప్పటికప్పుడు కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
Land Survey: సమగ్ర 'భూ సర్వే' పరుగెత్తాలి
సమగ్ర భూ సర్వే ఆలస్యం కాకూడదు. మారుమూల ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో సర్వేకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోండి. అక్కడ సిగ్నల్స్ సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోండి. సర్వే పనులకు ఇబ్బంది కలగకుండా కావాల్సిన వాటి కోసం ఆర్డర్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ 2023 జూన్ నాటికి రాష్ట్రంలో సమగ్ర భూసర్వే పూర్తి కావాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: కోవిడ్ కారణంగా రాష్ట్రంలో మంద గమనంలో ఉన్న సమగ్ర భూ సర్వే పనులను ఇక నుంచి పరుగులు పెట్టించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 2023 జూన్ నాటికి రాష్ట్రం అంతటా సమగ్ర భూసర్వే పూర్తి కావాల్సిందేనని స్పష్టం చేశారు. సర్వే చురుగ్గా ముందుకు సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. అనుకున్న సమయంలోగా లక్ష్యం చేరాల్సిందేనని, క్రమం తప్పకుండా దీనిపై సమీక్షలు చేయాలన్నారు. అధికారులు సమన్వయంతో, అంకిత భావంతో ముందుకు సాగాలని సూచించారు. ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకం’పై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టణాల్లో కూడా సమగ్ర సర్వేను వేగవంతం చేసేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సర్వే పూర్తి అయితే అన్నింటికీ క్లియర్ టైటిల్స్ వస్తాయని, దీంతో ఎక్కడా భూ వివాదాలకు అవకాశం ఉండదని చెప్పారు. సచివాలయాల్లో అన్ని రకాల సేవలు ప్రజలకు అన్ని రకాల సేవలు అందించేలా గ్రామ, వార్డు సచివాలయాలు తయారు కావాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు. ప్రస్తుతం అందిస్తున్న జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో సహా ప్రజలకు అన్ని రకాల సర్టిఫికెట్లు సచివాలయాల్లోనే అందేలా చూడాలన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సచివాలయాల్లో కూడా కొనసాగాలని, సిబ్బంది శిక్షణ కార్యక్రమాల మాన్యువల్‌ను డిజిటల్ ఫార్మాట్లో పెట్టాలని ఆదేశించారు. ఎప్పుడు కావాలంటే.. అప్పుడు డౌన్లోడ్ చేసుకుని సందేహాలు తీర్చుకునేలా దీనిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. యూజర్ మాన్యువల్, తరచుగా వచ్చే ప్రశ్నలకు సందేహాలు, అన్ని రకాల శిక్షణ కార్యక్రమాల వివరాలు డిజిటల్ ఫార్మాట్ ద్వారా సిబ్బందికి అందుబాటులో ఉంచాలన్నారు. ఒక డిజిటల్ లైబ్రరీని కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. తొలి దశలో 4,800 గ్రామాల్లో సర్వే ► రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేకు సంబంధించి ఇప్పటికే 70 బేస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, అవి పూర్తి కచ్చితత్వంతో పని చేస్తున్నాయని అధికారులు వెల్లడించారు. సర్వే ఆఫ్ ఇండియా సహకారంతో మరి కొన్ని గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని, అవసరమైనన్ని డ్రోన్లను రంగంలోకి దించుతామని చెప్పారు. ► సర్వేలో పైలట్ ప్రాజెక్టు ఇప్పటికే దాదాపు పూర్తి కాగా, తొలి దశలో 4,800 గ్రామాల్లో సర్వే చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ఆ గ్రామాల్లో సమగ్ర సర్వే అనంతరం, డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు రికార్డుల ప్యూరిఫికేషన్ పూర్తి చేసి, ముసాయిదా ముద్రిస్తామని చెప్పారు. ► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ మంత్రి) ధర్మాన కృష్ణదాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నగరాలు, పట్టణాల్లో సర్వే ఇలా.. పట్టణాలు, నగరాల్లో కూడా సమగ్ర భూ సర్వేకు సంబంధించి ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో సర్వే మొదలు పెట్టామని మున్సిపల్ అధికారులు సీఎంకు వివరించారు. మిగిలిన పట్టణాలు, నగరాలకు సంబంధించి మూడు దశల్లో స్పష్టమైన కార్యాచరణ రూపొందించామని చెప్పారు. ఫేజ్–1: 2021 జూన్‌లో ప్రారంభమై,2022 జనవరి నాటికి 41 పట్టణాలు, నగరాల్లో పూర్తి. ఫేజ్–2: 2022 ఫిబ్రవరిలో ప్రారంభమై, 2022 అక్టోబర్ నాటికి 42 పట్టణాలు, నగరాల్లో పూర్తి. ఫేజ్–3: 2022 నవంబర్‌లో ప్రారంభమై, 2023 ఏప్రిల్ నాటికి 41 పట్టణాలు, నగరాల్లో పూర్తి. -
సమగ్ర భూ సర్వేలో వైఎస్సార్ జగనన్న కాలనీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పేదల కోసం కొత్తగా నిర్మించనున్న వైఎస్సార్ జగనన్న కాలనీలను కూడా సమగ్ర భూ సర్వేలో చేర్చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. మ్యాపుల తయారీలో ఈ కాలనీలను పరిగణనలోకి తీసుకోవాలని, ప్రతి ఇంటికీ యూనిక్ ఐడీ నంబరు ఇవ్వాలని సూచించారు. ఒక గ్రామంలో సమగ్ర భూ సర్వే పూర్తయిన తర్వాత సంబంధిత గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభం కావాలని స్పష్టం చేశారు. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంపై ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమగ్ర భూ సర్వే ప్రక్రియకు సంబంధించి సర్వేయర్ నుంచి జేసీ వరకూ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) లు ఉండాలని, వారు కచ్చితంగా బాధ్యత వహించాలన్నారు. మొబైల్ ట్రిబ్యునల్స్‌పై ఎస్ఓపీలను రూపొందించాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమర్ధత పెంపొందించేందుకు శిక్షణ, పరీక్షలు నిర్వహించాలన్నారు. లంచాలకు తావులేని వ్యవస్థను తెచ్చే ప్రయత్నంలో భాగంగానే సరికొత్త విధానాలని తెలిపారు. సచివాలయ సిబ్బంది సర్వేలో పాల్గొంటున్న సమయంలో రోజూ కనీసం 2 గంటల పాటు ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 30వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. పరీక్షలతో మెరుగైన పనితీరు.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు సంబంధిత అంశాల్లో పరిజ్ఞానం, సమర్థత పెంచేందుకు క్రమం తప్పకుండా అవగాహన కార్యక్రమాలు, శిక్షణ, పరీక్షలు నిర్వహించాల్సిందిగా సీఎం సూచించారు. పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యే వరకూ శిక్షణ ఇవ్వడం వల్ల పనితీరులో సమర్థత పెరిగి ప్రజా సమస్యల పరిష్కారంలో మెరుగైన ప్రతిభ కనపరుస్తారన్నారు. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కార్యాచరణను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పనితీరును గ్రామ సచివాలయాల సిబ్బంది స్వయంగా పరిశీలించి నేర్చుకునేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగానే సిబ్బంది సందేహాల నివృత్తికి నిపుణులు, సీనియర్ అధికారులతో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. అధికారులతో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 30 వరకూ ఇళ్ల పట్టాల పంపిణీ పొడిగింపు.. పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జనవరి 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ప్రతి లబ్ధిదారుడికి నేరుగా పట్టా పత్రం అందిస్తున్నామని, ఇంటి స్థలం ఎక్కడుందో చూపిస్తున్నామని దీనికి కొంత సమయం పడుతోందని అధికారులు వివరించారు. లబ్ధిదారులకు సంతృప్తి కలిగేలా కార్యక్రమం కొనసాగాలని, ఇళ్ల పట్టాల పంపిణీని జవనరి నెలాఖరు వరకూ పొడిగించాలని సీఎం సూచించారు. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియని, అర్హులైన వారికి దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోగా పట్టా ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని సీఎం పేర్కొన్నారు. ఈ విధానం సమర్థంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దఫాలుగా సర్వే సిబ్బందికి శిక్షణ సమగ్ర సర్వేలో పాల్గొంటున్న సిబ్బందికి దఫాలుగా శిక్షణ ఇస్తున్నామని, రెండో స్థాయిలో 92 శాతం మంది ఉత్తీర్ణులయ్యారని అధికారులు వివరించారు. మిగిలినవారికి అవగాహన కల్పించేలా, పరిజ్ఞానం పెంచేలా శిక్షణ ఇస్తున్నామని, ఫిబ్రవరిలో మూడో స్థాయి పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. సీఎం సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, సీఎం ముఖ్య సలహాదారు నీలం సాహ్ని, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ ఎం.గిరిజా శంకర్, సర్వే, సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్దార్ధ జైన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
దేశంలోనే అతి పెద్ద సర్వేకి నేడు సీఎం జగన్ శ్రీకారం
సాక్షి, అమరావతి, సాక్షి, మచిలీపట్నం/జగ్గయ్యపేట: పొలం గట్ల తగాదాలు, భూ వివాదాలకు శాశ్వతంగా తెరదించేందుకు ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకం’ ద్వారా భూముల సమగ్ర రీసర్వే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం శ్రీకారం చుడుతోంది. పల్లె సీమల్లో శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరిసేలా వందేళ్ల చరిత్రలో దేశంలోనే అతి పెద్ద రీసర్వేను తలపెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు నుంచి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పైలట్ ప్రాజెక్టు కింద ఇప్పటికే రీసర్వే పూర్తయిన తక్కెళ్లపాడులో స్థిరాస్తి హక్కు పత్రాలు (క్యూఆర్ కోడ్‌తో కూడిన కార్డులు), భూమి హక్కు పత్రాలను యజమానులకు సీఎం జగన్ అందజేస్తారు. అనంతరం ఇక్కడ సరిహద్దు రాయిని ప్రారంభించి 13 జిల్లాలకు చెందిన సర్వే బృందాలకు పచ్చజెండా ఊపడం ద్వారా రీసర్వేకి గ్రీన్‌సిగ్నల్ ఇస్తారు. మంగళవారం ప్రతి జిల్లాలో ఒక గ్రామంలో రీసర్వే పనులు ప్రారంభమవుతాయి. తదుపరి వారం రోజుల్లో ప్రతి రెవెన్యూ డివిజన్లో ఒక గ్రామంలోనూ, ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో ప్రతి మండలంలో ఒకటి చొప్పున 670 గ్రామాల్లో రీసర్వే ప్రారంభమవుతుంది. తదుపరి మొదటి విడత నిర్ణయించిన 5,122 గ్రామాల్లో ఈ ప్రక్రియ ఆరంభమవుతుంది. రెండో దశలో 6000, మూడో దశలో మిగిలిన గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి 2023 ఆగస్టు నాటికి రాష్ట్రమంతా రీసర్వే పూర్తి చేసేలా ప్రభుత్వం కాల వ్యవధితో ప్రణాళిక రూపొందించింది. దీర్ఘకాలంగా నెలకొన్న భూ వివాదాలను పరిష్కరించి యజమానులకు స్థిరాస్తులపై శాశ్వత హక్కులు కలి్పంచాలనే ఉదాత్త ఆశయంతో ముఖ్యమంత్రి ల్యాండ్ టైట్లింగ్ బిల్లు – 2020ని శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదింప చేశారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించగానే ల్యాండ్ టైట్లింగ్ చట్టం – 2020 గెజిట్‌లో ప్రచురిస్తారు. 1.26 కోట్ల హెక్టార్లలో ప్రతి అంగుళం కొలత రాష్ట్రవ్యాప్తంగా అటవీ ప్రాంతం మినహా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఆస్తులు (ఇళ్లు, స్థలాలు) ప్రతి అంగుళం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొలుస్తారు. 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల (1.26 కోట్ల హెక్టార్ల ) పరిధిలో ప్రతి సెంటు భూమి/ స్థలం కొలిచి సరిహద్దులు నిర్ణయిస్తారు. మ్యాపులు తయారు చేస్తారు. రైతులకు ఎంతో మేలు: మంత్రి పెద్దిరెడ్డి సమగ్ర భూసర్వేతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రోడ్డు మార్గం ద్వారా గరికపాడు, అనుమంచిపల్లి, షేర్‌మహ్మద్‌పేట మీదుగా జగ్గయ్యపేట చేరుకుని ఎస్జీఎస్ కళాశాలలో సోమవారం ఉదయం జరిగే బహిరంగసభలో పాల్గొంటారని తెలిపారు. గట్టురాయి వివాదం పరిష్కారం నాకు సర్వే నంబర్ 65/2లో 2.49 ఎకరాలుంది. గట్టు రాళ్లు లేకపోవడం, పాతిన రాళ్లు కదిలిపోవడం వల్ల తరచూ పొరుగు రైతులతో వివాదాలు తలెత్తేవి. పైలట్ ప్రాజెక్టుగా మా గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రీ సర్వేతో భూముల సరిహద్దు సమస్య పరిష్కారమైంది. నా పొలంలోనే నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సరిహద్దు రాయి ఏర్పాటు చేయనుండటం సంతోషంగా ఉంది. – బజారు రవికుమార్, రైతు, తక్కెళ్లపాడు, కృష్ణా జిల్లా -
భూ వివాదాల్ని తొలగించేందుకే రీ సర్వే
తక్కెళ్లపాడు (జగ్గయ్యపేట): రాష్ట్రంలో భూ వివాదాలను పూర్తిగా తొలగించేందుకే సమగ్ర భూముల రీ సర్వే నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాన్ని 2023 నాటికి పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామం నుంచి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 21న ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభానుతో కలిసి శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. కృష్ణదాస్ మాట్లాడుతూ వందేళ్ల అనంతరం సీఎం జగన్ చొరవతో రాష్ట్రంలో భూముల రీ సర్వే జరుగుతోందన్నారు. ఏళ్ల తరబడి గ్రామాల్లో భూ సమస్యలు, భూ సంబంధ కోర్టు కేసులు వంటివి భూముల రీ సర్వే ద్వారా పరిష్కారమవుతాయని తెలిపారు. 13 జిల్లాల సర్వే బృందాలకు ముఖ్యమంత్రి జెండా ఊపి సర్వేను ప్రారంభిస్తారన్నారు. ప్రభుత్వ విప్ ఉదయభాను మాట్లాడుతూ తక్కెళ్లపాడులో రీ సర్వే ప్రారంభించిన అనంతరం జగ్గయ్యపేటలోని ఎస్జీఎస్ కళాశాలకు రోడ్డు మార్గం ద్వారా వస్తారన్నారు. -
5 నిమిషాల్లోనే ల్యాండ్ రికార్డులు
సాక్షి, అమరావతి: దేశంలో వందేళ్ల తరువాత ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సమగ్ర రీసర్వేని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత పకడ్బందీగా, లోపరహితంగా పూర్తిచేస్తామని సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ జనరల్ గిరీష్‌కుమార్ చెప్పారు. దార్శనికతతో కూడిన ఈ బృహత్తర కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అన్ని విధాలా సాంకేతిక సహకారం అందించడంతోపాటు సర్వే సిబ్బందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కూడా ఇస్తామని ప్రకటించారు. విజయవాడలో బుధవారం ఆయన రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నీరబ్‌కుమార్‌ప్రసాద్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణిలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో భూసర్వే చేపట్టి జాతీయ స్థాయిలో సర్వే మ్యాపులు రూపొందించే పనిలో ప్రపంచంలోనే పురాతన సంస్థగా సర్వే ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ అతి పెద్ద సర్వే కార్యక్రమంలో తమను భాగస్వాములను చేయడం చాలా గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రత్యేకంగా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రీసర్వే కోసం నాలుగు రకాలైన సహకారం అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 14 వేలమంది సర్వేయర్లు ఉన్నారని, వారికి శిక్షణ ఇస్తే రాష్ట్రంలో నైపుణ్యంగల మానవ వనరులు పుష్కలంగా ఉన్నట్లవుతుందని తెలిపారు. ఇందుకోసం విశాఖపట్నం కేంద్రంగా సర్వే ఆఫ్ ఇండియా కార్యాలయం ఏర్పాటు చేశామన్నారు. అంతర్జాతీయ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేపట్టడం అభినందనీయమని చెప్పారు. దీనివల్ల అక్షాంశాలు, రేఖాంశాల ప్రాతిపదికగా కొలతలు అత్యంత లోపరహితంగా వస్తాయన్నారు. తిరుపతిలో సర్వే అకాడమీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం వల్ల ప్రయివేటు సర్వేయర్లకు కూడా శిక్షణ ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో రీసర్వేలో వినియోగించిన పరికరాలు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందినవేనని, వీటిలో ఎలాంటి లోపం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ల్యాండ్ పార్సిల్‌కు విశేష గుర్తింపు సంఖ్య భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నీరబ్‌కుమార్‌ప్రసాద్ మాట్లాడుతూ అటవీ భూములు మినహా పొలాలు, గ్రామకంఠాలు, పట్టణ ఆస్తులను సర్వేచేసి ప్రతి ల్యాండ్ పార్సిల్‌కు విశేష గుర్తింపు సంఖ్య ఇస్తామని తెలిపారు. భూ రికార్డులు స్వచ్ఛీకరించి మూడుదశల్లో సర్వే పూర్తి చేస్తామన్నారు. ఇప్పటికే 3,500 గ్రామాల్లో స్వచ్ఛీకరణ చివరిదశకు వచ్చిందని తెలిపారు. ఈ సర్వేవల్ల సరిహద్దులు పక్కాగా తెలుస్తాయని, 30 –40 ఏళ్ల వరకు భూ వివాదాలకు ఆస్కారం ఉండదని చెప్పారు. ప్రజలకు మేలు చేయాలనే ఉన్నతాశయంతోనే సీఎం జగన్మోహన్రెడ్డి భారీ ఖర్చుకు వెనుకాడకుండా రీసర్వేకి శ్రీకారం చుట్టారని తెలిపారు. రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి మాట్లాడుతూ ప్రజలపై నయాపైసా కూడా భారం మోపకుండా సర్వే చేయడంతోపాటు సర్వే రాళ్లను కూడా ప్రభుత్వ ఖర్చుతోనే ఏర్పాటు చేయాలని సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశించారని తెలిపారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో పైలట్ ప్రాజెక్టుగా రీసర్వే చేసినందున ఈనెల 21న రీసర్వేని ప్రారంభించి రైతులకు పట్టాలు పంపిణీ చేస్తామని చెప్పారు. ఆ గ్రామంలో 800 మంది రైతులుండగా 35 మంది మాత్రం కొలతలపై అభ్యంతరం తెలిపారన్నారు. జాయింట్ కలెక్టరు సంప్రదింపులు జరపగా 17 మంది సమ్మతించారని, 18 మంది మాత్రమే అభ్యంతరం చెబుతున్నారని తెలిపారు. సమగ్ర భూసర్వేకి సర్వే ఆఫ్ ఇండియా సహకారం సీఎం సమక్షంలో ఎంవోయూ రాష్ట్రంలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్ష పథకం కింద చేపడుతున్న సమగ్ర భూసర్వేకి సర్వే ఆఫ్ ఇండియా సంపూర్ణ సహాయ సహకారాలు అందించనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, సర్వే ఆఫ్ ఇండియా మధ్య అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం జగన్ సమక్షంలో సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కుమార్, రాష్ట్ర సర్వే సెటిల్మెంట్ కమిషనర్ సిద్ధార్థ జైన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ సాహ్ని, సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లం, రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ నీరబ్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి పాల్గొన్నారు. -
‘భూ’ చరిత్రలో సువర్ణాధ్యాయం
అదే ఊళ్లోనే సర్వేయర్ ఉంటాడు. రికార్డులన్నీ డిజిటల్ రూపంలోనూ భద్రంగా ఉంటాయి. యజమానికి హార్డ్ కాపీ ఇస్తారు. ఏవైనా వివాదాలు తలెత్తినా ప్రతి మండలంలో ఓ ట్రైబ్యునల్ ఉంటుంది. భవిష్యత్తులో అదే ఊళ్లోనే క్రయవిక్రయాలు జరుపుకోవచ్చు. అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. శాశ్వత హక్కులు కల్పించాక ఎలాంటి వివాదాలు వచ్చినా ప్రభుత్వమే బాధ్యత తీసుకుని హక్కుదారుడికి నష్ట పరిహారం చెల్లిస్తుంది. భూముల రీ సర్వే చరిత్రాత్మక కార్యక్రమం. ఇంటి స్థలం, పొలం.. ప్రతి స్థిరాస్తిని పక్కాగా సర్వే చేసి, రికార్డుల్లో నమోదు చేసి.. తొలుత యజమానులకు దానిపై తాత్కాలిక హక్కు (టెంపరరీ టైటిల్) ఇస్తాం. రెండేళ్ల పాటు ఈ రికార్డు గ్రామ సచివాలయంలో ఉంచి, ప్రజల నుంచి అభ్యంతరాలు ఆహ్వానిస్తాం. ఎవరి నుంచి అభ్యంతరాలు రానిపక్షంలో ఆ భూములపై యజమానులకు శాశ్వత హక్కులు (పర్మినెంట్ టైటిల్) ఇస్తాం. సాక్షి, అమరావతి: దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అతి పెద్ద సమగ్ర భూ రీసర్వే కార్యక్రమం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం – సర్వే ఆఫ్ ఇండియా కలిసి భారీ స్థాయిలో చేపడుతున్న ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూరక్ష’ కార్యక్రమానికి ఈనెల 21న శ్రీకారం చుట్టనున్నామని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ అంశాలపై మార్గనిర్దేశం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్థిరాస్తిని సర్వే చేసి, హద్దులు నిర్ణయించి.. శాశ్వత హక్కు (కంక్లూజివ్ టైటిల్) కల్పించే ఈ కార్యక్రమం ప్రతి దశలో పకడ్బందీగా జరిగేలా చూడాల్సిన కీలక బాధ్యత కలెక్టర్లపై ఉందని స్పష్టం చేశారు. రీసర్వే తర్వాత అన్ని రకాల రెవిన్యూ, రిజిస్ట్రేషన్ సేవలు వార్డు, గ్రామ సచివాలయాల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. దేశంలో ఎక్కడా, ఎప్పుడూ ఇంత పెద్ద స్థాయిలో సర్వే జరగలేదని, గ్రామాల్లో తరతరాలుగా పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలు ఈ బృహత్తర కార్యక్రమంతో పరిష్కారమవుతాయని చెప్పారు. దీంతో భూ వివాదాలకు తావుండదని, ఫలితంగా గ్రామాల్లో శాంతియుత వాతావరణం ఏర్పడుతుందని వివరించారు. భూ యజమానులకు న్యాయమైన, చట్టబద్ధమైన శాశ్వత హక్కులు లభిస్తాయని, భావితరాలకు సైతం మంచి వ్యవస్థ అందుబాటులోకి వస్తుందన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. బృహత్తర కార్యక్రమానికి అంకురార్పణ ► ఒక మంచి బృహత్తర కార్యక్రమం మొదటి దశకు మనం ఈనెల 21న శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, సర్వే ఆఫ్ ఇండియా కలిసి 70 బేస్ స్టేషన్లు పెడుతున్నాయి. సర్వే ఆఫ్ ఇండియా నెట్‌వర్క్‌లో ఇవి భాగంగా ఉంటాయి. కొలతల్లో అత్యంత కచ్చితత్వం వస్తుంది. (ఒక పాయింట్‌ను బేస్‌గా తీసుకుంటే ఎన్నిసార్లు మార్చినా 2 సెంటీమీటర్లు అటు ఇటుగా అనగా అతిసూక్ష్మ తేడా మాత్రమే ఉంటుంది) ► ఇందుకోసం అత్యాధునిక కార్స్ టెక్నాలజీ, డ్రోన్లు, రోవర్లు వాడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల మేరకు సర్వే చేస్తున్నాం. ఈనెల 21న 5 వేల గ్రామాల్లో శ్రీకారం ► మొదటి దశ కింద ప్రతి మండలంలో కొన్ని చొప్పున రాష్ట్రంలోని 5 వేల రెవెన్యూ గ్రామాల్లో ఈనెల 21వ తేదీన రీసర్వే ప్రారంభించి వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తి చేస్తాం. ► రెండో దశ కింద ప్రతి మండలంలో కొన్ని చొప్పున ఆగస్టు 2021న 6,500 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే ప్రారంభించి 2022 ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తాం. ► మిగిలిన గ్రామాల్లో మూడో విడత కింద జూలై 2022న ప్రారంభించి జూన్ నెలకు పూర్తి చేస్తాం. దీంతో రాష్ట్రమంతా రీసర్వే పూర్తవుతుంది. ► మొదటి విడత సర్వే పూర్తయిన గ్రామాల్లోని సచివాలయాల్లో ఈ రికార్డుల ప్రకారం రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభిస్తారు. అక్కడే రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి. కలెక్టర్లది కీలక బాధ్యత ► ఈ కార్యక్రమంలో కలెక్టర్లపై కీలక బాధ్యత ఉంది. వీటన్నింటినీ కలెక్టర్లు దగ్గరుండి చూసుకోవాలి. సర్వేకు సన్నద్ధతపై జాగ్రత్తలు తీసుకోవాలి. ల్యాండ్ టైటిలింగ్ అథారిటీని రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం. జిల్లా స్థాయిలో ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేయాలి. అప్పిలేట్ ట్రైబ్యునల్స్‌ను కూడా రిటైర్డ్ న్యాయమూర్తులతో ఏర్పాటు చేస్తాం. ► డ్రోన్ల ద్వారా సర్వే మొదలుపెట్టే సమయానికి గ్రామాల సరిహద్దులు, వాటి మార్కింగ్స్‌ను పూర్తి చేయాలి. ప్రతి మండలంలో ఒక డ్రో¯Œన్, డేటా ప్రాసెసింగ్, రీసర్వే బృందాలను కలెక్టర్లు ఏర్పాటు చేయాలి. ► సర్వే వల్ల జరిగే మేలు గురించి ప్రతి ఒక్కరికీ తెలియజెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. భూ వివాదాలకు రీసర్వే, ల్యాండ్ టైట్లింగ్ శాశ్వత పరిష్కార మార్గాలు. వీటి వల్ల ప్రజలకు ఎంతో మంచి జరుగుతుంది. ► గ్రామ, వార్డు వాలంటీర్ల సహాయంతో ప్రతి ఒక్కరికీ ఈ విషయాలు తెలియజెప్పే కార్యక్రమాన్ని ఈనెల 11వ తేదీ వరకు కొనసాగించండి. ఈ నెల 14 నుంచి 19 వరకు గ్రామ సభలు పెట్టండి. ► వారికి కావాల్సిన వ్యక్తి ముఖ్యమంత్రి కాలేదన్న బాధతో ఎల్లో మీడియా సమగ్ర సర్వేకు వ్యతిరేకంగా దుష్ప్రచారం సాగిస్తోంది. రీసర్వే జరగడం, ప్రభుత్వానికి మంచిపేరు రావడం ఎల్లో మీడియాకు, విపక్షానికి ఇష్టం లేనందున ఇలా చేస్తున్నాయి. అందువల్ల ఈ పథకం ప్రయోజనాలను ప్రజలకు తెలియజేసి, ప్రజల భాగస్వామ్యంతో ముందుకు సాగాలి. ► ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ నీలం సాహ్ని, సీసీఎల్ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్, సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ జనరల్ గిరీష్ కుమార్, వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వివాదాల పరిష్కారానికి మొబైల్ ట్రైబ్యునళ్లు ► వందేళ్ల తర్వాత రీసర్వే జరుగుతుండటం వల్ల కొన్ని చోట్ల కొన్ని వివాదాలు వస్తాయి. అందువల్ల వీటి పరిష్కారానికి ప్రతి మండలంలో ఒక మొబైల్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తాం. 660 మొబైల్ మెజిస్ట్రేట్ ట్రైబ్యునల్స్ అక్కడికక్కడే సమస్యలను పరిష్కరిస్తాయి. ► 100 ఏళ్ల తర్వాత ఈ సర్వే జరుగుతోంది. గత వందేళ్లలో జనాభా నాలుగైదు రెట్లు పెరిగింది. కుటుంబాలు విడిపోయాయి. పెద్దలు చనిపోయి వారి వారసులు భూములు అనుభవిస్తున్నారు. ఈ మేరకు రికార్డులు అప్డేట్ కాలేదు. క్షేత్ర స్థాయిలో ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. ► రికార్డుల స్వచ్ఛీకరణ ద్వారా మొత్తం రికార్డుల్లో నమోదు చేస్తాం. సర్వే చేసి సరిహద్దు రాళ్లు నాటిస్తాం. ఆ కార్డులో క్యూర్ఆర్ కోడ్ ఉంటుంది. హార్డ్ కాపీ కూడా ఇస్తారు. ప్రతి ల్యాండ్ పార్సిల్‌కు ఒక నంబరు కేటాయిస్తాం. ల్యాండ్ పార్సిళ్లు, మ్యాపులు కూడా గ్రామంలో అందుబాటులో ఉంచుతాం. ► రికార్డులన్నింటినీ డిజిటలైజేష¯Œన్ చేస్తాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో స్థిరాస్తుల మ్యాపులు, డిజిటల్ రికార్డులు అందుబాటులో ఉంచుతాం. ► 14 వేల మంది సర్వేయర్లును ప్రభుత్వం నియమించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న వీరందరికీ అత్యాధునిక సర్వేపై శిక్షణ కార్యక్రమం సాగుతోంది. ఇప్పటికే 9,400 మందికి శిక్షణ పూర్తయింది. మిగిలిన వారికి వచ్చే ఏడాది జనవరి 26 నాటికి శిక్షణ కార్యక్రమం పూర్తి చేస్తాం. -
శరవేగంగా సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు– భూరక్ష పథకం’ కింద రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ రీసర్వేకి రెవెన్యూ శాఖ శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రికార్డుల స్వచ్ఛీకరణ కార్యక్రమం సాగుతోంది. కంటిన్యుయస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ (కార్స్) టెక్నాలజీ, డ్రోన్ కెమెరాలతో రీసర్వే చేసేందుకు వీలుగా సర్వే సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 21.21 కోట్లు విడుదల చేసింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వందేళ్ల తర్వాత భూముల సమగ్ర రీసర్వే చేపడుతున్నందున దీనిపై గ్రామ సచివాలయాల ద్వారా ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికి తగ్గట్లు అధికారులు కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. రీసర్వే సందర్భంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం మొబైల్ కోర్టులను కూడా ప్రభుత్వంఏర్పాటు చేయనుంది. ఎన్నో ఉపయోగాలు – ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూరక్ష పథకం’తో భూ యజమానులకు తమ భూములపై వేరొకరు సవాల్ చేయడానికి వీలులేని శాశ్వత హక్కులు లభిస్తాయి. దీనివల్ల భూ వివాదాలు తగ్గిపోతాయి. – అస్తవ్యస్తంగా ఉన్న రికార్డులను స్వచ్ఛీకరిస్తున్నారు. దీంతో చనిపోయిన వారి పేర్లతో ఉన్న భూములు వారి వారసుల పేర్లతో రికార్డుల్లో నమోదు అవుతాయి. – వాస్తవంగా ఉన్న భూముల విస్తీర్ణం ప్రకారం రికార్డులు సవరిస్తారు. – భూములు తమ పేర్లతో రికార్డుల్లోకి ఎక్కడంవల్ల వడ్డీలేని పంట రుణాలకు అవకాశం కలుగుతుంది. – రాష్ట్రంలో ప్రస్తుతం సర్వే నంబర్ల వారీగా హద్దు రాళ్లు లేవు. దీంతో సరిహద్దుల తగాదాలు ఎక్కువగా ఉన్నాయి. రీసర్వేతో ప్రతి సర్వే నంబరుకు హద్దులు నిర్ధారణ అవుతాయి. – గత పాలకుల హయాంలో రైతులు భూమిని కొలత వేయించుకోవాలంటే నిర్దిష్ట రుసుం చెల్లించడంతోపాటు ముడుపులివ్వాల్సి వచ్చేది. ప్రస్తుతం ప్రభుత్వమే ఉచితంగా భూమిని కొలత వేసి సరిహద్దు రాళ్లు నాటిస్తుంది. – ప్రజలకు ఆధార్ ఉన్నట్లే ప్రతి భూభాగానికి భూధార్ అనే విశిష్ట గుర్తింపు సంఖ్యను ప్రభుత్వం కేటాయిస్తుంది. – ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రకారమే క్రయవిక్రయ రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రికార్డుల్లో అప్డేట్ (మార్పులు) చేస్తారు. దీంతో మోసపూరిత రిజిస్ట్రేషన్లకు, రికార్డుల ట్యాంపరింగ్‌కు అవకాశం ఉండదు. ఒకరి భూమిని మరొకరు రిజిస్ట్రేషన్ చేయడానికి ఏమాత్రం ఆస్కారం ఉండదు. – ప్రతి సర్వే నంబర్‌ను డ్రోన్ కెమెరాతో ఫొటో తీసి సర్వే రికార్డులతో మ్యాచ్ చేస్తారు. వీటిని డిజిటలైజ్ చేస్తారు. దీంతో రికార్డులు భద్రంగా ఉంటాయి. – కొన్ని చోట్ల కొందరికి సంబంధించి రికార్డుల్లో భూమి ఒకచోట ఉంటే అనుభవిస్తున్న భూమి మరోచోట ఉంది. ఇలాంటివి కూడా బయటకు వస్తాయి. – ఆక్రమణల్లోని ప్రభుత్వ భూములు బయటపడతాయి. ఇదో సాహసోపేత నిర్ణయం – ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ భూవివాదాల పరిష్కారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమగ్ర భూసర్వే చేయాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దేశంలో వందేళ్ల తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వమే ఈ యజ్ఞం లాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. దీనిని పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లు చేస్తున్నాం. దీని కోసం రికార్డుల స్వచ్ఛీకరణ కార్యక్రమం సాగుతోంది. రెవెన్యూ కోర్టుల్లో ఉన్న 52,866 కేసులు, వెబ్‌ల్యాండ్‌లో సవరణలో కోసం వచ్చిన 79,405 అర్జీలను స్పెషల్ డ్రైవ్ ద్వారా పరిష్కరిస్తాం. మూడు దశల్లో.. ► ఈనెల 21వ తేదీన భూముల సమగ్ర రీసర్వే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంఛనంగా ప్రారంభిస్తారు. ► దేశంలోనే మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో కార్స్ టెక్నాలజీని వినియోగించనున్నారు. ► రాష్ట్రంలో 90 లక్షల మంది పట్టాదారులు ఉన్నారు. వారికి చెందిన 1.96 కోట్ల సర్వే నంబర్ల పరిధిలో 2.26 కోట్ల ఎకరాల భూమిని రీసర్వే చేయాల్సి ఉంది. మూడు దశల్లో దీనిని పూర్తి చేస్తారు. ► మొదటి దశలో 5 వేల గ్రామాల్లోనూ, రెండో దశలో 6,500, మూడో దశలో 5,500 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ చేపడతారు. ► 2023 ఆగస్టు నాటికి మొత్తం సర్వే ప్రక్రియ పూర్తి చేస్తారు. రీసర్వే కోసం రాష్ట్ర వ్యాప్తంగా 4,500 బృందాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. -
సమగ్ర భూ సర్వేతో శాశ్వత భూ హక్కు
వందేళ్ల తర్వాత ఈ సర్వే జరుగుతోంది. దీనివల్ల రాష్ట్రంలో భూ రికార్డుల డిజిటలైజేషన్ పక్కాగా అవుతుంది. అత్యాధునిక టెక్నాలజీ, డ్రోన్లు, రోవర్స్ ఉపయోగించి దేశంలో తొలిసారిగా ఈ సర్వే నిర్వహిస్తున్నాం. అనంతరం హార్డ్ కాపీని సంబంధిత భూ యజమానికి అందజేస్తాం. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: శాశ్వత భూ హక్కు కల్పనే ధ్యేయంగా సమగ్ర భూ సర్వే చేపడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ సర్వేను పక్కాగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు అనుకుంటున్నట్లు వచ్చే ఏడాది జనవరి 1న భూ సర్వే మొదలు కావాలని, నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో సమగ్ర భూ సర్వేపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు వెల్లడించిన అంశాలు, సీఎం ఆదేశాలు, సూచనలు ఇలా ఉన్నాయి. రికార్డుల ట్యాంపర్‌కు అవకాశం ఉండదు ► రాష్ట్ర వ్యాప్తంగా 1.22 లక్షల చదరపు కిలోమీటర్లలోని వ్యవసాయ భూములు, గ్రామ కంఠాలు, మున్సిపాలిటీలలో ఈ సర్వే కొనసాగుతుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ, పక్కాగా సర్వే చేస్తాం. ► గతంలో రికార్డులు ట్యాంపర్ చేయడానికి చాలా అవకాశం ఉండేది. ఆ పరిస్థితిని పూర్తిగా మారుస్తూ డిజిటలైజేషన్ జరుగుతుంది. ►త్వరలో సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయి కాబట్టి, ఆ మేరకు సర్వేయర్లు కూడా ఉండాలి. సచివాలయాల్లో ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. 4,500 బృందాలతో సర్వే ► ప్రతి మండలంలో మూడు బృందాల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 4,500 బృందాలు పని చేస్తాయని అధికారులు సీఎంకు వివరించారు. భౌగోళిక సమాచార వ్యవస్థ (జీఐఎస్) ద్వారా శాటిలైట్ ఫొటోలు పొందడం, ఆ ఇమేజ్ను ప్రాసెస్ చేయడం, క్షేత్ర స్థాయి పరిశీలన, ఆ తర్వాత సమగ్ర సర్వే సెటిల్మెంట్ కొనసాగుతుందని, డ్రోన్ల ద్వారా గ్రామ కంఠాలను స్పష్టంగా ఫొటో తీస్తామని చెప్పారు. ►వచ్చే ఏడాది జనవరి 1న ప్రారంభమయ్యే సమగ్ర భూ సర్వే రెండేళ్లలో అంటే జనవరి 2023 నాటికి మూడు దశల్లో పూర్తవుతుందన్నారు. ►ఇందు కోసం 70 కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్(బేస్ స్టేషన్లు) ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఇప్పటికే కొన్ని ఏర్పాటయ్యాయని చెప్పారు. మొబైల్ (విలేజ్) కోర్టులు కూడా ఏర్పాటు అవుతున్నందున వివాదాలు ఎక్కడికక్కడే వేగంగా పరిష్కారమవుతాయన్నారు. ►సర్వే ఏర్పాట్లు, టైటిల్ తదితర వివరాలతో కృష్ణా జిల్లా తక్కెళ్లపాడు, రామచంద్రునిపేటలో ప్రయోగాత్మకంగా చేపట్టిన భూ సర్వే వివరాలను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ►ఈ కార్యక్రమానికి ‘వైఎస్సార్–జగనన్న సమగ్ర భూ సర్వే’ లేదా ‘రాజన్న–జగనన్న సమగ్ర భూ సర్వే’ అని పేరు పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ►ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, సీఎస్ నీలం సాహ్ని, సీసీఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ ప్రసాద్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ అండ్ ఐజీ సిద్థార్థజైన్, రెవెన్యూ శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
రికార్డుల స్వచ్ఛీకరణ సవాలే!
సాక్షి, అమరావతి: వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భూముల సమగ్ర రీసర్వేకు ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో తప్పుల తడకగా ఉన్న భూ రికార్డుల స్వచ్ఛీకరణ ప్రక్రియ రెవెన్యూ శాఖకు అతి పెద్ద యజ్ఞంలా మారింది. ప్రస్తుత ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమం కేవలం స్వచ్ఛీకరణ కాదని, ఇది రికార్డుల ప్రక్షాళన ప్రక్రియ అని రెవెన్యూ శాఖ మాజీ మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ధర్మాన ప్రసాదరావు పలుమార్లు పేర్కొన్నారు. దీనిని పకడ్బందీగా చేస్తే చాలా వరకు భూ వివాదాలు పరిష్కారమవుతాని రెవెన్యూ, న్యాయ రంగాల నిపుణులు విశ్లేషిస్తున్నారు. పక్కాగా, లోప రహితంగా రికార్డులను అప్డేట్ చేయాలంటే రెవెన్యూ ఉద్యోగులు జవాబుదారీతనంతో పని చేయాల్సి ఉంటుంది. కష్టమైన ప్రక్రియే.. ► రాష్ట్రంలో 4 కోట్ల ఎకరాలకు (1.63 లక్షల చదరపు కిలోమీటర్ల) పైగా ప్రభుత్వ, ప్రయివేటు భూములున్నాయి. 17,460 గ్రామాల పరిధిలో 1.96 కోట్ల సర్వే నంబర్ల పరిధిలో 2.26 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి 90 లక్షల మంది రైతుల చేతుల్లో ఉంది. ► మొత్తం 3 కోట్ల ల్యాండ్ హోల్డింగ్స్ ఉండగా, వీటిలో ప్రభుత్వానికి చెందినవి 43 లక్షలు. ఇందులో లక్షలాది ఎకరాలు ఆక్రమణదారుల గుప్పెట్లో ఉన్నాయి. ► చాలా చోట్ల భూ అనుభవ రికార్డులు (అడంగల్), భూ యాజమాన్య రికార్డులు (1బి)లను మార్చి వేశారు. అసైన్మెంట్ రిజిష్టర్లను మాయం చేశారు. ప్రభుత్వం వివిధ అవసరాల కోసం సేకరించిన భూమి చాలా చోట్ల ఇప్పటికీ ప్రయివేటు వ్యక్తుల పేర్లతోనే ఉంది. అక్రమాల పుట్టలు.. ► రెవెన్యూ రికార్డులు అక్రమాల పుట్టలుగా మారాయి. ఏటా జరపాల్సిన రెవెన్యూ జమా బందీ దశాబ్దాలుగా నిర్వహించకపోవడం ఇందుకు ప్రధాన కారణం. ► ఒకే భూమికి ఇద్దరు ముగ్గురికి దరఖాస్తు (డీకేటీ) పట్టాలు ఇచ్చిన సంఘనటలు కోకొల్లలుగా ఉన్నాయి. కొందరు రిటైర్డు రెవెన్యూ ఉద్యోగులు కూడా ఇలా నకిలీ పత్రాలు సృష్టించి మోసాలకు పాల్పడ్డారు. ► ఒక సర్వే నంబరులో 10 ఎకరాల భూమి ఉంటే 20 ఎకరాలకు డీకేటీ పట్టాలు/ అడంగల్స్ ఉన్నవి కూడా చాలా చోట్ల ఉన్నాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు లెక్కే లేదు. దశాబ్దాలుగా మార్పులే లేవు ► ఎప్పటికప్పుడు రికార్డుల్లో మార్పులు చేర్పులు (అప్డేట్) చేయడాన్నే స్వచ్ఛీకరణ (మ్యుటేషన్) అంటారు. దురదృష్టవశాత్తు దశాబ్దాలుగా భూ రికార్డులు అప్డేట్ చేయకుండా వదిలేశారు. దశాబ్దాల కిందట చనిపోయిన వారి పేర్లతో లక్షలాది ఎకరాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వాస్తవ భూమి విస్తీర్ణానికీ, రికార్డుల్లో ఉన్న దానికి మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ► ఇలా రికార్డుల్లో తేడా ఉన్న సర్వే నంబర్లలోని భూమి యజమానులతో మాట్లాడి ఒప్పించి ఆయా వ్యక్తుల పేర్లతో ఉన్న భూమి విస్తీర్ణాన్ని ఆర్ఎస్ఆర్ ప్రామాణికంగా తగ్గించడం చాలా క్లిష్టమైన సమస్య. ► తల్లిదండ్రులు చనిపోయినా వారి పిల్లలు భాగపరిష్కారాలు చేసుకోకుండా తలా కొంత దున్నుకుంటున్నారు. రికార్డుల్లో చనిపోయిన తల్లిదండ్రుల పేరుతోనే భూమి ఉంది. ► చాలా చోట్ల భూమి కొన్న వారి బదులు అమ్మిన వారి పేర్లతోనే అడంగల్, 1బీలో భూమి ఉంది. వీటిని సరిచేయాల్సి ఉంది. ► భూమిలేని పేదల పేరుతో ప్రభుత్వం అసైన్మెంట్ పట్టాలు ఇస్తోంది. భూముల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో అసైన్మెంట్ రిజిస్టర్లను మాయం చేసి చాలా మంది ప్రభుత్వ భూములను అసైన్మెంట్ పట్టాలంటూ దున్నుకున్నారు. మరికొందరు నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందాల ద్వారా అమ్ముకున్నారు. పకడ్బందీగా ఏర్పాట్లు సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి భూ రికార్డులను పకడ్బందీగా, పారదర్శకంగా స్వచ్ఛీకరించాల్సి ఉంది. జనవరి ఒకటో తేదీ నుంచి తొలి విడత రీసర్వే చేపట్టనున్న 6,500 గ్రామాల్లో రికార్డులు ముందు పెట్టుకుని టేబుల్ వెరిఫికేషన్ చేయాలని ఇప్పటికే రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఆర్ఎస్ఆర్, అడంగల్ మధ్య విస్తీర్ణంలో తేడాలు ఇక్కడ చాలా వరకు తేలే అవకాశం ఉంది. భూ రికార్డుల స్వచ్ఛీకరణకు ఒకపక్క, భూముల సమగ్ర రీసర్వేకు మరో పక్క చకచకా ఏర్పాట్లు చేస్తున్నాం. – వి.ఉషారాణి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్ఎస్ఆర్ అడంగల్ మధ్య 33.54 లక్షల ఎకరాల తేడా రెవెన్యూ శాఖలో అత్యంత ప్రామాణికమైనది రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్). బ్రిటిష్ కాలంలో దేశవ్యాప్తంగా మొత్తం భూమిని సర్వే చేసినప్పుడు సర్వే నంబర్ల వారీగా ఎంతెంత భూమి ఉందో ఆర్‌ఎస్‌ఆర్‌లో నమోదు చేశారు. అయితే ఆర్ఎస్ఆర్, అడంగల్ మధ్య 33.54 లక్షల ఎకరాలకుపైగా వ్యత్యాసం ఉండటం రెవెన్యూరికార్డులు తప్పుల తడకలుగా ఉన్నాయనడానికి నిదర్శనం. అడంగల్, భూమి కొలతల పుస్తకం (ఎఫ్ఎంబీ) మధ్య కూడా ఇలాగే భారీ తేడా ఉంది. భూమి ఎవరిదో రెవెన్యూకే తెలియదు! రాష్ట్రంలో చాలా కుటుంబాలకు వంశ పారంపర్యంగా భూమి సంక్రమించి ఉంటుంది. ఇలాంటి వారిలో కొందరి వద్ద భూమి తమదేననడానికి రాత పూర్వకమైన ఆధారాలు ఉండకపోవచ్చు. రెవెన్యూ శాఖ వద్ద కూడా చాలా వరకు రికార్డులు లేవు. అందుకే వెబ్‌ల్యాండ్, అడంగల్‌లో చాలా భూమి అన్‌సెటిల్డ్ అని, తెలియదు అని ఉంది. ఇలాంటి భూమి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా ఉంది. -
ఏపీలో జనవరి1 నుంచి సమగ్ర భూ సర్వే
-
జనవరి 1న సమగ్ర భూ సర్వేకు శ్రీకారం
సమగ్ర భూ సర్వేపై గ్రామ సచివాలయాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలి. ప్రతి గ్రామ సచివాలయంలో భూ సర్వే ప్రయోజనాలపై పోస్టర్లు అతికించాలి. 1930 తర్వాత చేపడుతున్న తొలి భూముల రీసర్వే అయినందున గ్రామ సభల ద్వారా ప్రజలు, రైతుల్లో అవగాహన కల్పించాలి. ప్రజలకు సమగ్ర సమాచారం అందించడంతో పాటు, రీసర్వే వల్ల భూ యజమానులకు కలిగే మేలు గురించి అవగాహన కల్పించాలి. సమగ్ర భూ సర్వే చేసిన తర్వాత నాటే నంబరు రాళ్లన్నీ వెంటనే గుర్తించడానికి వీలుగా ఒకే డిజైన్‌లో ఉండాలి. అర్బన్ ప్రాంతాల్లో కూడా సర్వే చేయాలి. అందువల్ల ప్రస్తుతమున్న 4,500 సర్వే బృందాలను పెంచుకోవాలి. సర్వే చేస్తున్న సమయంలో వచ్చే వివాదాలను వెంటనే పరిష్కరించేలా యంత్రాంగాన్ని క్రియాశీలకంగా రూపొందించుకోవాలి. సర్వే ప్రారంభం అయ్యే నాటికే మొబైల్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన పరికరాలు, డ్రోన్లు, రోవర్లు, బేస్ స్టేషన్లు, సర్వే బృందాలకు అవసరమైన వాహనాలు సమకూర్చుకోవాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై సర్వేయర్లకు, అవసరమైన అంశాలపై గ్రామ సచివాలయాల సిబ్బందికి పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వాలి. సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా భూముల సమగ్ర రీసర్వే ప్రాజెక్టును వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీన ప్రారంభించి 2023 ఆగస్టు నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. సోమవారం తన అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో జరిగిన రెవెన్యూ శాఖ ఉన్నత స్థాయి సమీక్షలో భూముల సమగ్ర రీసర్వేపై సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభించాలని, పట్టణ ప్రాంతాలకు కూడా సమగ్ర రీసర్వేను అమలు చేసేందుకు వీలుగా సర్వే బృందాలను పెంచాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభించడం వల్ల రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయని, ఎక్కడా పొరపాట్లకు తావు ఉండదని సీఎం వివరించారు. భూ సర్వే కోసం కొనుగోలు చేసిన పరికరాలన్నీ గ్రామ సచివాలయాల్లో ఉంచాలని ఆదేశించారు. దీనివల్ల ఎప్పుడు ఎలాంటి అవసరమున్నా వినియోగించుకోవడానికి వీలవుతుందన్నారు. సమగ్ర రీసర్వేకు అత్యుత్తమ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. సమీక్షలో అధికారులు సీఎంకు వివరించిన అంశాలు ఇలా ఉన్నాయి. సమగ్ర భూ సర్వేపై జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్. చిత్రంలో మంత్రి ధర్మాన తదితరులు ఎక్కడికక్కడ వివాదాలు పరిష్కరించేలా చర్యలు ► సర్వే సందర్భంగా వచ్చే వివాదాలను ఎక్కడికక్కడే పరిష్కరించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో ప్రయోగాత్మకంగా భూ సర్వే పూర్తి చేశాం. ఈ గ్రామంలో గతంలో 182 కమతాలు ఉండగా, నేడు వీటి సంఖ్య 631కి చేరింది. ఇప్పుడు కూడా కమతాల కంటే సర్వే నంబర్లు ఎక్కువగా ఉన్నాయి. 631 కమతాలు ఉండగా 829 సర్వే నంబర్లు ఉన్నాయి. ► రికార్డుల స్వచ్ఛీకరణ వల్ల రైతులకు మేలు జరుగుతుంది. దశాబ్దాలుగా ఉన్న సమస్యలు తొలగిపోవడంతోపాటు భూ యజమానులు/ రైతులకు ప్రస్తుతమున్న ఊహాజనిత హక్కుల స్థానే శాశ్వత హక్కులు లభిస్తాయి. ► సర్వే సందర్భంగా తలెత్తే సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించేందుకు మొబైల్ ట్రిబ్యునల్స్ ఉంటాయి. వివాదాలకు తావు లేకుండా భూ సమస్యలను పరిష్కరించడానికి ఇవి సహాయ పడతాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమగ్ర భూ సర్వే చేస్తున్న తొలి రాష్ట్రం మనదే. ► భూ సర్వే చేయగానే రోవర్ నుంచి నేరుగా ఆన్లైన్ పద్ధతుల్లో కంప్యూటర్లో పూర్తి వివరాలు నమోదవుతాయి. మధ్యలో ఏ వ్యక్తీ వాటిలో మార్పులు చేర్పులు చేయలేరు. ► ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న భూ వివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. రెవెన్యూ కోర్టుల్లో 52,866 వివాదాలు ఉన్నాయి. వెబ్ ల్యాండ్ పొరపాట్లకు సంబంధించిన 79,405 రికార్డుల స్వచ్ఛీకరణకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. ► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నీరబ్ కుమార్ ప్రసాద్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ సిద్ధార్థ జైన్, పలువురు అధికారులు పాల్గొన్నారు. (ఇతర రాష్ట్రాల్లో ఆస్తి పన్ను విధానాలపై అధ్యయనం) -
భూముల సమగ్ర సర్వే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, భూ వివాదాలు, పొలం గట్ల సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా భూముల సమగ్ర రీసర్వే ప్రాజెక్టును వీలైనంత త్వరగా ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని 17,000 రెవెన్యూ గ్రామాల్లో 3.32 కోట్ల ఎకరాల భూమిని పూర్తిగా రీసర్వే చేసి ప్రతి సర్వే నంబరుకు పక్కాగా సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రీసర్వే కోసం రైతులపై నయాపైసా కూడా భారం మోపవద్దని, దీనికోసం అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్పష్టం చేశారు. సర్వే నంబర్లవారీగా నాటే నంబరు రాళ్ల ఖర్చును కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. భూముల సమగ్ర రీసర్వేపై తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సోమవారం సమీక్షించారు. నాలుగు దశల్లో రీ సర్వే పూర్తి చేద్దామని రెవెన్యూ అధికారులు ప్రతిపాదించగా ప్రజాప్రయోజనాల రీత్యా ఇది చాలా ముఖ్యమైన, అత్యవసరమైన ప్రాజెక్టు కాబట్టి మూడు విడతలకు కుదించి త్వరగా పూర్తి చేద్దామని సీఎం పేర్కొన్నారు. సుదీర్ఘంగా సాగిన తన పాదయాత్రలో భూ వివాదాలకు సంబంధించి ప్రజల నుంచి పలు ఫిర్యాదులు అందాయని సీఎం గుర్తు చేసుకున్నారు. మొదటి విడత కింద 3,000 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే చేపట్టనున్నారు. రెండు, మూడు విడతల్లో 7 వేల చొప్పున రెవెన్యూ గ్రామాల్లో సర్వే నిర్వహిస్తారు. సమగ్ర రీసర్వే ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయం తీసుకోవడానికి కారణాలు, దీనివల్లే ఒనగూరే ప్రయోజనాలు, రాష్ట్రంలో భూ రికార్డుల పరిస్థితి తదితర అంశాలపై సమావేశంలో సుదీర్ఘ చర్చ సాగింది. ఇందులో ముఖ్యాంశాలు ఇవీ... స్వాతంత్రానికి పూర్వం సర్వే,.. ► 1900 – 1920 మధ్య బ్రిటీష్ హయాంలో దేశంలో భూములను సర్వే చేసి రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్) రూపొందించారు. తర్వాత భూముల క్రయ విక్రయాలు, వారసత్వ మార్పులు లక్షల సంఖ్యలో జరిగినా సరిగా నమోదు కాలేదు. కొందరు రికార్డులను ట్యాంపరింగ్ కూడా చేశారు. ► తప్పుల తడకలుగా ఉన్న రికార్డుల ప్రక్షాళన/ స్వచ్ఛీకరణ, భూముల సరిహద్దు వివాదాల పరిష్కారానికి రీసర్వే తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ► రాష్ట్రంలో వాస్తవంగా ఉన్న భూమికి, రెవెన్యూ రికార్డుల్లో గణాంకాలకూ మధ్య భారీ వ్యత్యాసం ఉంది. రెవెన్యూ శాఖ అత్యంత ప్రామాణికంగా పరిగణించే రీసర్వే సెటిల్మెంట్ రిజిష్టర్ (ఆర్ఎస్ఆర్), భూ అనుభవ రిజిష్టర్ (అడంగల్) మధ్య కూడా చాలా తేడా ఉంది. భూకమతాలు, సబ్డివిజన్ల మధ్య కూడా వ్యత్యాసం ఉంది. ► ఈ సమస్యలన్నిటినీ పరిష్కరించి రికార్డులను ప్రక్షాళన చేయటం కోసం రాష్ట్రంలో భూములన్నీ సమగ్రంగా రీ సర్వే చేసి భూ యజమానులందరికీ శాశ్వత హక్కులు కల్పిస్తామని వైఎస్సార్ సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. ఈ హామీ అమలులో భాగంగా శాశ్వత భూ హక్కుల చట్టాన్ని తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రీ సర్వేకు ప్రణాళిక రూపొందించింది. భూముల సమగ్ర రీసర్వేపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోర్టు కేసుల్లో 60 శాతానికిపైగా భూ వివాదాలే ► భూ రికార్డులు అస్తవ్యస్తంగా మారడం, సరిహద్దులు చెరిగిపోవడంవల్ల భూ వివాదాలు భారీగా పెరిగాయి. కోర్టు కేసుల్లో 60 శాతానికిపైగా భూవివాదాలకు సంబంధించినవే ఉన్నాయి. ► ముఖ్యమంత్రి, రెవెన్యూ అధికారులు ప్రతివారం నిర్వహించే స్పందన ఫిర్యాదుల్లో అత్యధికం భూ, సర్వే సమస్యలకు సంబంధించినవే ఉంటున్నాయి. ► ప్రతి 30 ఏళ్లకు రీసర్వే చేసి సర్వే సెటిల్మెంట్ – ల్యాండ్ రికార్డులు స్వచ్ఛీకరించాల్సి ఉన్నా భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం కావడంతో ఏ ప్రభుత్వం కూడా ఇందుకు సాహసించలేదు. దీనివల్ల వివాదాలు జటిలమై సివిల్ వివాదాలు కాస్తా క్రిమినల్ కేసులుగా మారుతున్నాయి. ► వాస్తవంగా ఉన్న భూమికి, రికార్డుల్లో ఉన్న దానికి మధ్య తేడాలను పక్కాగా గుర్తించి వాస్తవ విస్తీర్ణానికి అనుగుణంగా రికార్డులను సరిచేయకుంటే వివాదాలు ఇంకా పెరుగుతాయి. అందువల్ల రీసర్వే తప్పనిసరని పేర్కొంటూ ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ► సమావేశంలో ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, సర్వే, ల్యాండ్ రికార్డ్స్ ఇన్‌ఛార్జి కమిషనర్ సిద్ధార్థ జైన్, రాష్ట్ర భూ పరిపాలన సంయుక్త కమిషనర్ చెరుకూరు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ‘కార్స్’ టెక్నాలజీని వినియోగిస్తున్న తొలి రాష్ట్రం ఏపీ... ► ఇప్పటికే ఉన్న సుమారు 2,200 మంది సర్వేయర్లతోపాటు కొత్తగా నియమించిన 11,158 మంది గ్రామ సర్వేయర్లకు అధునాతన ‘‘కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్ (కార్స్)’’ టెక్నాలజీపై ప్రభుత్వం శిక్షణ కూడా ఇప్పించింది. ► ఇప్పటివరకు మలేషియా, సింగపూర్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో మాత్రమే ఈ టెక్నాలజీని వినియోగించారు. ► మన దేశంలో ఈ టెక్నాలజీని వినియోగిస్తున్న తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం గమనార్హం. ► రాష్ట్రంలోని మొత్తం 17,000 రెవెన్యూ గ్రామాల్లో 3.32 కోట్ల ఎకరాల భూమిని కచ్చితంగా కొలతలు వేసి సర్వే నంబర్ల వారీగా నంబరు రాళ్లు పాతుతారు. ఈ వివరాలను డిజిటలైజ్ చేసి భద్రపరుస్తారు. దీంతో ట్యాంపరింగ్ చేయడానికి వీలుకాదు. ► కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో 25 గ్రామాల పరిధిలోని 66,761 ఎకరాల రీసర్వే పైలెట్ ప్రాజెక్టు పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. దీన్ని పరిశీలించి రాష్ట్రమంతా అమలు చేస్తారు. ► భూముల అమ్మకాలు, కొనుగోళ్ల రిజిస్ట్రేషన్ల ప్రకారం నిర్దిష్ట సమయంలో మ్యుటేషన్ చేస్తారు. దీంతో ఎప్పటికప్పుడు రికార్డులు అప్డేట్ అవుతుంటాయి. ► గ్రామ సచివాలయాలవారీగా భూముల సమగ్ర రీసర్వే ప్రక్రియ అమలు చేస్తారు. ► సర్వే సందర్భంగా వివాదాలు తలెత్తితే పరిష్కరించేందుకు డిప్యూటీ కలెక్టర్లతో మొబైల్ కోర్టులు ఏర్పాటు చేస్తారు. డిజిటల్ రికార్డులు.... ► రికార్డుల స్వచ్ఛీకరణ/ ప్రక్షాళన సర్వే వివరాలు ఎప్పటికప్పుడు డిజిటల్ పద్ధతిలో భద్రపరిచే ఏర్పాటు చేస్తారు. ► డేటాను తారుమారు చేయడానికి వీల్లేని విధంగా మూడు నాలుగు చోట్ల భద్రపరిచే వ్యవస్థ ఏర్పాటు చేస్తారు. ► భూముల క్రయ విక్రయ రిజిస్ట్రేషన్లు జరిగిన వెంటనే నిర్దిష్ట సమయంలో ఆటో మ్యుటేషన్ (రెవెన్యూ రికార్డుల్లో మార్పులు) చేస్తారు. -
మూడు విడతల్లో సర్వే చేయండి: సీఎం జగన్
-
సమగ్ర భూ సర్వేలో ఆలస్యం వద్దు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆలస్యం లేకుండా సమగ్ర భూ సర్వే మొదలు పెట్టి, మూడు విడతల్లో సర్వే చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూశాఖలో భూముల రీ సర్వేపై సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం, ల్యాండ్ అండ్ ఎండోమెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణి తదితర అధికారులు పాల్గొన్నారు. ఇది అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్ అని, మండలాల వారీగా సర్వే చేయాలని, సర్వే హద్దు రాళ్ల ఖర్చు కూడా ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సమగ్ర భూ సర్వే కోసం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. (కరణం బలరాం సంచలన వ్యాఖ్యలు) గ్రామ సచివాలయాల పరిధిలో సర్వే చేస్తామని.. ఈ సర్వే సందర్భంగా ఏమైనా వివాదాలు వస్తే పరిష్కరించడానికి మొబైల్ కోర్టులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. డిప్యూటీ కలెక్టర్ల స్థాయిలో మొబైల్ కోర్టులు నడుస్తాయని, దీంతో రికార్డుల ప్రక్షాళన అవుతుందని అధికారులు సీఎంకు తెలిపారు. సర్వే వివరాలను ఎప్పటికప్పుడు డిజిటల్ పద్ధతిలో భద్రపరుస్తామని, ఈ డిజిటల్ సమాచారాన్ని పూర్తిగా ఎన్‌క్రిప్ట్ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ డేటాను ఎవ్వరూకూడా తారుమారు చేయలేని విధంగా ఒకే చోట కాకుండా మూడు నాలుగు చోట్ల భద్రపరుస్తామని తెలిపారు. అంతే కాకుండా భూ విక్రయాలు, బదలాయింపులు కూడా సులభంగా ఉంటాయని, రిజిస్ట్రేషన్ల ఆటో మ్యుటేషన్ జరుగుతుందని వెల్లడించారు. తద్వారా భూమిపై యాజమాన్యపు హక్కులు కూడా మారిపోతాయని పేర్కొన్నారు. సమగ్ర భూ సర్వేకోసం వినియోగిస్తున్న కార్స్ నెట్వర్క్ పని విధానాన్ని అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. (ఏపీ ప్రభుత్వ పథకాలకు జాతీయస్థాయి ప్రశంసలు) -
సమగ్ర భూ సర్వేకు సంసిద్ధం
భూసేకరణ రికార్డుల మోడలైజేషన్ 1950 నుంచి 2014 వరకు వివరాల సేకరణ వచ్చే మార్చి 30 నాటికి శాటిలైట్ సర్వే పూర్తి ఏప్రిల్ నుంచి ప్రత్యక్ష పరిశీలన సర్వే పూర్తయితే భవిష్యత్తులో వివాదాలకు చోటుండదు సర్వేయర్ అండ్ ల్యాండ్ ఆర్డీడీ కందుల వెల్లడి నూజివీడు రూరల్ : భవిష్యత్‌తో భూవివాదాలు నెలకొనకుండా ఉండేలా సమగ్ర భూసర్వేకు సంసిద్ధమవుతున్నామని సర్వేయర్ అండ్ ల్యాండ్ రీజనల్ డిప్యూటీ డెరైక్టర్ కందుల వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నేషనల్ ల్యాండ్ రికార్డు మోడలైజేషన్ ప్రాజెక్టు కింద సమగ్ర భూసర్వేకు కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా 1950 నుంచి 2014 వరకు ఇచ్చిన అసైన్డ్ భూముల వివరాలను సేకరించి సమగ్ర మార్పులు చేస్తున్నామన్నారు. భూసేకరణ రికార్డులను తీసివేసి మోడలైజేషన్ చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఒక సర్వే నంబర్లో ఎన్ని సబ్డివిజన్లు ఉన్నాయనే సమాచారం సేకరించి.. గతంలో ఉన్న సబ్డివిజన్లకు ప్రస్తుతం ఉన్న సబ్డివిజన్లను నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2015 మార్చి 30 నాటికి శాటిలైట్ సర్వే వివరాలను పూర్తిచేసి ఏప్రిల్ నుంచి ప్రత్యక్ష పరిశీలన ప్రారంభించాల్సి ఉందన్నారు. ప్రత్యక్ష భూపరిశీలనకు ఒక్కొక్క మండలానికి ఐదుగురు సర్వేయర్లు, ఇద్దరు వీఆర్వోలు, ముగ్గురు లెసైన్స్ సర్వేయర్లు అవసరమవుతారని చెప్పారు. భూ సర్వేకు ఇబ్బందిగా మారనున్న సర్వేయర్ల కొరత ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రత్యక్ష భూసర్వేలు నిర్వహించడానికి సర్వేయర్ల కొరత ఇబ్బందికరంగా మారుతుందని ఆర్డీడీ చెప్పారు. రీజనల్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలోని 277 మండలాలకు గాను 92 మండలాల్లో సర్వేయర్లను ప్రభుత్వం నియమించలేదన్నారు. భవిష్యత్‌లో భూవివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం నిర్వహించే ప్రత్యక్ష భూసర్వేకు సుమారు రూ.400 కోట్లు ఖర్చవుతుందని, కాని అందుకు తగినట్లుగా సర్వేయర్ల నియామకం లేకపోవడం ఇబ్బందికరంగా మారుతుందని చెప్పారు. అందుకు సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులకు అందజేశామన్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యక్ష భూసర్వే నిర్వహించారని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూసర్వేకు సిద్ధమవుతోందని ఆయన వివరించారు. ప్రభుత్వం నిర్వహించే సమగ్ర భూసర్వే పూర్తయితే భవిష్యత్‌లో భూవివాదాలకు చోటుండదని ఆయన తెలిపారు. -
ఇక సమగ్ర భూసర్వే
- 17 నుంచి గ్రామాలవారీగా ప్రారంభం - ఒక్కో ఊళ్లో నెలరోజులు - పాల్గొననున్న రెవెన్యూ సిబ్బంది - అక్కడికక్కడే సమస్యల పరిష్కారం - ఏడాది తర్వాత అంతా ఆన్లైన్లోనే.. చొప్పదండి : సర్వే నంబర్ ఒకటైతే రికార్డుల్లో మరోతీరు.. రికార్డుల్లో ఒకరకంగా ఉంటే.. సర్వే నంబర్లో తేడాలు.. వాటిని సరిచేసుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరిగే రైతులు.. అవి సక్రమమా..? లేక అక్రమమా..? తేల్చడంలో అధికారులకు తలనొప్పులు.. ఇది ఇన్నాళ్లూ జిల్లాలోని భూములకు సంబంధించి రెవెన్యూ అధికారులకు ఎదురవుతున్న అనుభవాలు. ఇక నుంచి ఇలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఎందుకంటే.. ఏనాడో నిజాంకాలం నాటి అస్తవ్యస్త రికార్డులను సరిచేసేందుకు సమగ్ర భూ సర్వే చేపట్టేందుకు జిల్లా రెవెన్యూశాఖ సమగ్ర భూ సర్వే చేయాలని నిర్ణయించింది. పహణీలు, సర్వే నంబర్లలో తేడాలను సరిచేయించేందుకు రెవెన్యూ అధికారులనందరినీ గ్రామాల్లోనే మకాం వేయించి అక్కడికక్కడే పరిష్కరించేందుకు నడుం బిగించింది. పూర్తి వివరాలతో ఏడాదిలోపు మొత్తం వివరాలు ఆన్లైన్లో ఉంచాలని భావిస్తోంది. దీనికి ఈనెల 17 నుంచే శ్రీకారం చుట్టనుంది. ఈ ప్రక్రియ పూర్తయితే రైతులకు కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులు తొలగిపోనున్నాయి. జిల్లా రెవెన్యూ అధికారులు ప్రతి మండలంలోని ఓ గ్రామంలో నెలపాటు సమగ్ర భూసర్వే నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. ఈనెల 17న సర్వే ప్రారంభించాలని తహశీల్దార్లకు జిల్లా రెవెన్యూ కార్యాలయం నుంచి ఆదేశాలు కూడా అందాయి. మొదటిసారి చొప్పదండి మండలం కోనేరుపల్లిలో సమగ్ర భూసర్వే కార్యక్రమం చేపట్టనున్నారు. గ్రామ రెవెన్యూ అధికారులతోపాటు ఇతర అధికారులు మొత్తం గ్రామంలోనే మకాం వేసి మొత్తం భూములను సర్వే చేయనున్నారు. ఏడాది తర్వాత భూముల వివరాలన్నీ 1బీ రిజిస్టర్‌తో సహా ఆన్లైన్ చేయనున్నారు. గ్రామాల్లో గుర్తించిన రెవెన్యూ సమస్యలను ఆయా గ్రామంలోనే తహశీల్దార్ నేతృత్వంలో అక్కడికక్కడే పరిశీలించి, సర్వేలు చేసి రైతులకు పరిష్కారం చూపుతారు. ఈ మేరకు గ్రామల్లో విస్తృత ప్రచారం చేసి రైతులకు అవగాహన కల్పిస్తారు. ఆ గ్రామంలో భూములు కలిగి ఉన్న ప్రక్క గ్రామాల రైతులకు కూడా సమాచారం చేరవేస్తారు. సర్వే ఇలా.. ► ప్రతి గ్రామంలో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుత వీఆర్వోతోపాటు ఆ గ్రామంలో గతంలో పనిచేసిన వీఆర్వో, పక్కగ్రామ వీఆర్వోతో బృందం ఏర్పాటు చేస్తారు. ►నిత్యం ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం 3 వరకు ఈ బృందాలు గ్రామంలోనే ఉండి సర్వేలో పాల్గొంటాయి. ► గ్రామంలోని ఒకటో సర్వే నంబర్ నుంచి చివరి సర్వే నంబర్ వరకు మోఖాపై ఈ బృందాలు పరిశీలిస్తాయి. ►సర్వేయర్‌తోపాటు రెవెన్యూ పరిశీలకులు సర్వే నంబర్ల హద్దులు పరిశీలిస్తారు. అనంతరం తహశీల్దార్ పర్యటించి 1బీ రిజిష్టర్‌తో, పహణీలకు గల తేడాలు పరిశీలిస్తారు. ఏవైనా ప్రొసీడింగ్ సమస్యలుంటే అక్కడికక్కడే జారీ చేస్తారు. ►సర్వే సందర్భంగా కబ్జాపై ఏర్పడే సమస్యలు, సర్వేనంబర్‌లో తేడా, సరిహద్దు సమస్య, రికార్డులో భూమికి, కబ్జాలో ఉన్న భూమికి తేడాలు, వివాదాల్లో ఉన్న భూములు, కోర్టు తగాదాల్లో ఉన్న భూములను ప్రత్యేకంగా గుర్తించి ప్రత్యేక రికార్డులు నమోదు చేస్తారు. తహశీల్దార్ ప్రత్యేక దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. ► గ్రామంలో సర్వే చేస్తున్న సమయంలో ఆ గ్రామానికి సంబంధించిన రెవెన్యూ రికార్డులైన 1బీ రిజిష్టర్, పహణీ, గ్రామ నక్షలు వీఆర్వోల వద్ద ఉంటాయి. ప్రభుత్వ భూముల రిజిష్టర్, లావోణి పట్టాలు ఇచ్చిన రికార్డు, ఇనాం భూముల రిజిష్టర్ వంటివి వెంటనే ఉంటాయి. ► సర్వే విజయవంతానికి ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డుసభ్యులు, పీఏసీఎస్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులకు, బ్యాంకర్లకు ముందుగా అవగాహన కల్పిస్తారు. ►ఇనాం భూములు, దేవాలయాలు, ఇతర సంస్థల భూములు... రికార్డుల్లో ఇతరుల పేరిట నమోదైన లేదా అక్రమంగా పట్టా మార్పు అయినవాటిని రిజిష్టర్‌లో నమోదు చేస్తారు. ►రికార్డుల్లో మార్పు చేయాల్సి వస్తే ప్రతీ సర్వేనంబర్‌వారీగా నివేదికలు తయారు చేస్తారు. దీని వెంట సంబంధిత రైతు అర్జీ లేదా వాంగ్మూలము లేదా పంచనామాను చేరుస్తారు. ►గ్రామాల్లో సీలింగ్ ఆస్తులు, భూములు, ప్రభుత్వ భూములు, లావోణీ పట్టాలు ఇచ్చినవి... క్రయవిక్రయాలు జరిగి ఉండే అవకాశాలుండటంతో వాటిపై పరిశీలన జరిపి వివరాలు రిజిష్టర్‌లో నమోదు చేసుకుంటారు. సర్వే సందర్భంగా వచ్చే ఫిర్యాదులను కూడా స్వీకరిస్తారు. రైతులు సహకరించాలి : బైరం పద్మయ్య, తహశీల్దార్ ప్రతి రైతుకు వారి భూసర్వేకు ముందే సమాచారం అందిస్తాం. ఆ రోజు తప్పకుండా హాజరు కావాలి. ఈనెల 17న చొప్పదండి మండలం కోనేరుపల్లిలో సర్వే ప్రారంభిస్తాం. రైతుల సమస్యలు పరిష్కరించి భవిష్యత్తులో మా కార్యాలయానికి రాకుండా చేస్తున్నాం. తహశీల్దార్ స్థాయిలో పరిష్కారం కాని వాటిని ఆర్డీవోకు పంపి అక్కడ పరిష్కారమయ్యేలా కృషి చేస్తున్నాం.