Cyberabad Police Cyber Crime
-
ఆడు మగాడ్రా బుజ్జి..! అమ్మాయి కాదు రా!!
Cyber Crimes Wing Cyberabad: ‘ఏంజెల్ ప్రియా’.. ఈ పేరు గురించి తెలుసు కదా!.. ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్ల పుట్టుకకు ఒకరకంగా ఆజ్యం పోసింది ఈ పేరే. అయితే సరదాగా మొదలైన ఈ వ్యవహారం ఆ తర్వాతి కాలంలో మోసాలకు తెర లేపింది. ముఖ్యంగా మగవాళ్లే ఆడవాళ్ల పేర్లతో ఫేస్బుక్ యూజర్లను ముగ్గులోకి దించడం, కట్టుకథలు చెప్పి అందినంత దోచుకోవడం లాంటి నేరాలు బోలెడు నమోదు అయ్యాయి. ఈ తరుణంలో కొంతకాలం తగ్గాయనుకున్న ఈ తరహా నేరాలు.. ఇప్పుడు మళ్లీ పుంజుకున్నాయట!!. సైబరాబాద్ సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు తాజాగా ట్విటర్లో ఫన్ అండ్ అవేర్నెస్ పోస్ట్ ఒకటి వేశారు. తివిక్రమ్-మహేష్ బాబు ‘అతడు’లోని ఓ ఫేమస్ డైలాగ్ మీమ్‌ను వాడేశారు. ‘ఒక అమ్మాయి తనకు ఫ్రెండ్‌రిక్వెస్ట్ పంపి తెగ ఛాటింగ్ చేస్తుంద’ని కొడుకు మురిసిపోతుంటే.. ‘ఆడు మగాడ్రా బుజ్జి.. అమ్మాయి కాదు రా’ అంటూ తండ్రి ఆ కొడుక్కి షాక్ ఇస్తాడు. ఆడు మగాడ్రా బుజ్జి..! Beware of #Fake #Facebook profile frauds @TelanganaDGP @TelanganaCOPs @cyberabadpolice @hydcitypolice @RachakondaCop @actorbrahmaji pic.twitter.com/oph4oL7Aoe — Cyber Crimes Wing Cyberabad (@CyberCrimePSCyb) October 4, 2021 తద్వారా ఫేక్ ఫేస్బుక్ ప్రొఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సందేశం ఇచ్చారు పోలీసులు. పనిలో పనిగా నటుడు బ్రహ్మాజీని సైతం ట్యాగ్ చేసి పడేశారు సైబరాబాద్ సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు. సాధారణంగానే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బ్రహ్మాజీ.. ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు కూడా. ఇక సోషల్ మీడియా వాడకంలో పోలీసులది డిఫరెంట్ పంథా. కరెక్ట్ టైమింగ్, రైమింగ్‌తో ప్రజల్ని అప్రమత్తం చేయడం, అవగాహన కల్పించడం వాళ్ల విధిగా మారింది. ఈ క్రమంలో నవ్వులు పూయించే మీమ్స్‌ను సైతం వాడేస్తున్నారు. కేరళ, ముంబై పోలీసుల్లాగే.. తెలంగాణ పోలీసుల సోషల్ మీడియా వింగ్ సైతం హ్యూమర్‌ను పంచుతోంది. చదవండి: అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ!! -
లేడీస్ హాస్టల్లో అకృత్యం
►సహచరురాలి నగ్న ఫొటోలు తీసి కంపెనీ మేనేజర్‌కు వాట్సాప్‌లో చేరవేత ►ఇద్దరిని అరెస్టు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సిటీబ్యూరో/భాగ్యనగర్‌కాలనీ : హాస్టల్లోనే ఉంటూ తోటి యువతి నగ్న ఫొటోలు, వీడియోలు తీసిన మహిళతో పాటు వాటిని వాట్సాప్‌లో అందుకొని వేధింపులకు గురిచేసిన వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..కూకట్పల్లి సర్కిల్ అడ్డగుట్ట సొసైటీలోని పూజిత ఉమెన్స్ డీలక్స్ హాస్టల్లో పొద్దుటూరుకు చెందిన 32 ఏళ్ల యువతితోపాటు బాధితురాలు గత రెండేళ్లుగా ఉంటున్నారు. వీరిద్దరి మధ్య పరిచయం ఉండటంతో ఆమె నిందితురాలితో కలిసి హైమా కన్సల్టెన్సీ కొన్నిరోజుల పాటు పనిచేసి మానేసింది. ఆ తర్వాత నగరంలోని ఓ కంపెనీలో ఫార్మా ఎగ్జిక్యూటివ్‌గా చేరింది. కన్సల్టెన్సీలో పనిచేస్తున్న సమయంలో వేధింపులకు గురిచేసిన హైమా కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ అలపాటి శివయ్య ఆ తర్వాత బాధితురాలి రూమ్మేట్ సహకారంతో ఆమె నగ్న వీడియోలు, చిత్నాలు రికార్డు చేసి పంపాలని కోరాడు. ఈ మేరకు సదరు యువతి బాధితురాలు డ్రెస్సు మార్చుకుంటున్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి అతడి వాట్సాప్ నంబర్‌కు పంపింది. నకిలీ ఫేస్బుక్ ఖాతా క్రియేట్ చేసి బాధితురాలి ఫొటోలు ఆప్‌లోడ్ చేసింది. దీనిపై అనుమానం వచ్చిన బాధితురాలు నిందితురాలి సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లో తనిఖీ చేయగా తన నగ్నచిత్రాలు, వీడియోలు కనిపించాయి. దీంతో బాధితురాలు నిలదీయగా హైమా కన్సల్టెన్సీ మేనేజింగ్ డైరెక్టర్ అలపాటి శివయ్య ఆదేశాల మేరకే ఇదంతా చేసినట్లు చెప్పడంతో బాధితురాలు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదుచేసిన సైబరాబాద్ ఇన్స్పెక్టర్ పి.రవీందర్ రెడ్డి నేతృత్వంలోని బృందం శివయ్యతో పాటు వీడియోలు, ఫొటోలు తీసిన మహిళను అరెస్టు చేసి కూకట్పల్లి పదహరో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వారిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
‘ఫ్యాన్సీ’ ఫ్రాడ్!
ఆకర్షణీయమైన సెల్‌ఫోన్ నెంబర్ల పేరుతో టోకరా వారం రోజుల్లో 14 మంది నుంచి రూ.5 లక్షలు స్వాహా సూత్రధారి ఏపీకి చెందిన వ్యక్తిగా అనుమానం సిటీబ్యూరో: ఫ్యాన్సీ నెంబర్లంటే చాలా మందికి క్రేజ్... న్యూమరాలజీ అంటే మరికొందరికి నమ్మకం... అందుకే ఆర్టీఏ నిర్వహించే వేలంలో కొన్ని నెంబర్లు భారీ రేటు పలుకుతుంటాయి... సరిగ్గా ఇదే అంశాన్ని క్యాష్ చేసుకున్నాడో ఏపీ వాసి. ఫ్యాన్సీ సెల్‌ఫోన్ నెంబర్లు తక్కువ ధరకు విక్రయిస్తున్నామంటూ నగరంలోని అనేక మంది కి సంక్షిప్త సందేశాలు పంపాడు. స్పందించిన వారి నుం చి ఆన్లైన్లో అందినకాడికి దండుకున్నాడు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ తరహా నేరాలకు సం బంధించి వారం రోజుల్లో 14 ఫిర్యాదులు అందాయి. ప్రాథమిక ఆధారాలు ప్రకారం ఈ స్కామ్‌కు సూత్రధారి ఒక్కరేనని గుర్తించినట్లు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ మహ్మద్ రియాజుద్దీన్ తెలిపారు. డిస్కౌంట్ సేల్ పేరుతో ఎర... ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్, సైబరాబాద్‌లోని అనేక మంది సెల్‌ఫోన్ వినియోగదారులకు అనేక ఫ్యాన్సీ, వీఐపీ సెల్‌ఫోన్ నెంబర్లు విక్రయిస్తున్నట్టు ఎస్సెమ్మెస్‌లు వచ్చాయి. సాధారణంగా ఇలాంటి ప్రీమియం నెంబర్ల ను ఆయా కంపెనీలో వేలం ద్వారా విక్రయిస్తుంటాయి. అయితే రేట్లు మాత్రం భారీగా ఉంటాయి. ఈ సందేశా లు పంపిన వ్యక్తి మాత్రం తనను సంప్రదించిన వారితో ఆక్షన్‌లో అమ్మగా మిలిగిన నెంబర్లు తాము ఖరీదు చేశామని, డిస్కౌంట్లో విక్రయిస్తున్నామంటూ నమ్మబలికా డు. దీంతో అనేకమంది ఆకర్షితులయ్యారు. బాధితులంతా విద్యాధికులే... ఆయా ఫ్యాన్సీ నెంబర్లు కావాలంటే తాను చెప్పిన బ్యాంకు ఖాతాలోకి నగదు జమ చేయాలని చెప్పాడు. దీంతో హైదరాబాద్, సైబరాబాద్‌లకు చెందిన అనేక మంది ఆ వ్యక్తి చెప్పిన బ్యాంకు ఖాతాల్లో రూ.25 వేల నుంచి రూ.75 వేల వరకు జమ చేశారు. డబ్బు డిపాజిట్/ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అవతలి వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. సంక్షిప్త సందేశం పంపడం, సంప్రదింపులు జరపడానికి వినియోగించిన సెల్‌ఫోన్ కూడా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో మోసపోయామని గుర్తించి బాధితుల్లో 14 మంది వారం రోజుల వ్యవధిలో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు. వీరంతా విద్యాధికులు, ఎగువ మధ్యతరగతికి చెందిన వారే కావడం గమనార్హం. ఏపీ కేంద్రంగా సాగిన దందా... బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైమ్ పోలీసులు ప్రాథమిక ఆధారాలను బట్టి ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఈ దందా జరిగిందని, ఒకే వ్యక్తి సూత్రధారని గుర్తించారు. నేరగాడు వినియోగించిన సెల్‌ఫోన్ నెంబర్ విజయవాడ సమీపంలోని చిరునామాతో రిజిస్టరై ఉన్నట్లు తేలింది. బాధితుల నుంచి నగదు డిపాజిట్/ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి ఉపయోగించిన ఖాతా తిరుపతిలోని ఓ బ్యాంకులో తెరిచినట్లు గుర్తించారు. బాధితులతో సైబర్ నేరగాడు తెలుగులో మాట్లాడటంతో పాటు ఈ ఆధారాల నేపథ్యంలో ఆ రాష్ట్రంపై దృష్టిపెట్టి దర్యాప్తు చేస్తున్నారు. అయితే సెల్ఫోన్లో తప్పుడు వివరాలు, చిరునామాతో తీసుకున్న ప్రీయాక్టివేటెడ్ సిమ్‌కార్డు వాడి ఉంటారని, బ్యాంకు ఖాతా సైతం డమ్మీ వ్యక్తులదో, దళారులదో అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఎవరూ సర్వీస్ ప్రొవైడర్లను సంప్రదించలేదు: ప్రీమియం నెంబర్లుగా పిలిచే ఫ్యాన్సీ నెంబర్లను ఆయా సర్వీస్ ప్రొవైడర్లే వేలం ద్వారా విక్రయిస్తారు. ఈ 14 మంది బాధితుల్లో ఏ ఒక్కరూ తమకు వచ్చిన ఎస్సెమ్మెస్ నిజమేనా అనే అంశాన్ని సర్వీసు ప్రొవైడర్లు, డీలర్లను సంప్రదించి నిర్థారించుకోలేదు. మరోపక్క ఫ్యాన్సీ నెంబర్ల క్రయవిక్రయ లావాదేవీలన్నీ ఆయా సర్వీసు ప్రొవైడర్ల అధికారిక ఖాతా ద్వారానే జరుగుతాయి. ఇక్కడ వ్యక్తిగత ఖాతాలో డబ్బు డిపాజిట్ చేయమని నిందితుడు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ తరహా నేరాలకు ప్రజలు అప్రమత్తతోనే పూర్తిస్థాయిలో చెక్ చెప్పగలం. - మహ్మద్ రియాజుద్దీన్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్, సైబరాబాద్