లేడీస్‌ హాస్టల్‌లో అకృత్యం | hostel negligence in Ladies | Sakshi
Sakshi News home page

లేడీస్‌ హాస్టల్‌లో అకృత్యం

Published Mon, Mar 20 2017 11:44 PM | Last Updated on Tue, Sep 5 2017 6:36 AM

లేడీస్‌ హాస్టల్‌లో అకృత్యం

లేడీస్‌ హాస్టల్‌లో అకృత్యం

సహచరురాలి నగ్న ఫొటోలు తీసి కంపెనీ మేనేజర్‌కు వాట్సాప్‌లో చేరవేత
ఇద్దరిని అరెస్టు చేసిన సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు


సిటీబ్యూరో/భాగ్యనగర్‌కాలనీ : హాస్టల్‌లోనే ఉంటూ తోటి యువతి నగ్న ఫొటోలు, వీడియోలు తీసిన మహిళతో పాటు వాటిని వాట్సాప్‌లో అందుకొని వేధింపులకు గురిచేసిన వ్యక్తిని సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..కూకట్‌పల్లి సర్కిల్‌ అడ్డగుట్ట సొసైటీలోని పూజిత ఉమెన్స్‌ డీలక్స్‌ హాస్టల్‌లో పొద్దుటూరుకు చెందిన 32 ఏళ్ల యువతితోపాటు బాధితురాలు గత రెండేళ్లుగా ఉంటున్నారు. వీరిద్దరి మధ్య పరిచయం ఉండటంతో ఆమె నిందితురాలితో కలిసి హైమా కన్సల్టెన్సీ కొన్నిరోజుల పాటు పనిచేసి మానేసింది. ఆ తర్వాత నగరంలోని ఓ కంపెనీలో ఫార్మా ఎగ్జిక్యూటివ్‌గా చేరింది.

కన్సల్టెన్సీలో పనిచేస్తున్న సమయంలో వేధింపులకు గురిచేసిన హైమా కన్సల్టెన్సీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అలపాటి శివయ్య ఆ తర్వాతhttp://img.sakshi.net/images/cms/2017-03/61490034271_Unknown.jpg బాధితురాలి రూమ్మేట్‌ సహకారంతో ఆమె నగ్న వీడియోలు, చిత్నాలు రికార్డు చేసి పంపాలని కోరాడు. ఈ మేరకు సదరు యువతి బాధితురాలు డ్రెస్సు మార్చుకుంటున్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి అతడి వాట్సాప్‌ నంబర్‌కు పంపింది. నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా క్రియేట్‌ చేసి బాధితురాలి ఫొటోలు ఆప్‌లోడ్‌ చేసింది. దీనిపై అనుమానం వచ్చిన బాధితురాలు నిందితురాలి సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లో తనిఖీ చేయగా తన నగ్నచిత్రాలు, వీడియోలు కనిపించాయి.

దీంతో బాధితురాలు నిలదీయగా హైమా కన్సల్టెన్సీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అలపాటి శివయ్య ఆదేశాల మేరకే ఇదంతా చేసినట్లు చెప్పడంతో బాధితురాలు సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదుచేసిన సైబరాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ పి.రవీందర్‌ రెడ్డి నేతృత్వంలోని బృందం శివయ్యతో పాటు వీడియోలు, ఫొటోలు తీసిన మహిళను అరెస్టు చేసి కూకట్‌పల్లి పదహరో మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. వారిని జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement