dahanu
-
మహారాష్ట్రలో పడవ ప్రమాదం విద్యార్ధుల మృతి
-
విహారయాత్రలో విషాదం.. విద్యార్థుల మృతి
దహను : వీకెండ్లో సరదాగా చేసిన విహారయాత్ర.. చివరికి విషాదంగా ముగిసింది. అరేబియా సముద్రంలో బోటు తలకిందులైన ఘటనలో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో తీరపట్ణమైన దహనులో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. విహారయాత్రలో భాగంగా ఓ పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థులు దహను బీచ్ నుంచి సముద్రంలోనికి వెళ్లారు. తీరం నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంగా.. బోటు ఒక్కసారిగా తలకిందులైంది. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ సిబ్బంది.. బోటువద్దకు చేరుకుని విద్యార్థులను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే నలుగురు ప్రాణాలు విడిచారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 36 మంది విద్యార్థులను కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చారు. సహాయక చర్యల్లో స్థానిక అధికారులతోపాటు నౌకాదళం కూడా పాలు పంచుకుంది. -
170 ఆంగ్ల పదాలతో 50లక్షల వాక్యాలు
దహాను: ఈ మధ్య టీచర్లంటే ప్రయోగాల్లో కంటే వార్తల్లోనే కనిపిస్తున్నారు.. అది కూడా పిల్లలను చితక్కొట్టాడనో..ఇంకేవో దుశ్చర్యలకు పాల్పడ్డారనో.. కానీ, చాలా కాలం తర్వాత మహారాష్ట్రకు చెందిన ఓ ఉపాధ్యాయుడు గొప్ప పేరుతో వార్తల్లో నిలిచాడు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆంగ్ల భాష నేర్చుకునేందుకు పడుతున్న తంటాలు చూసి వారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రయత్నించి అందులో విజయం సాధించి వార్తల్లోనే కాక ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా చోటు సంపాధించాడు. ప్రస్తుతం గన్నీస్ దిశగా ముందుకెళుతున్నాడు. ఆ ఉపాధ్యాయుడి పేరు బాలాసాహెబ్ చవాన్(37). దహాను ప్రాంతంలోని ఓ సెకండరీ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చవాన్ కేవలం 170 ఆంగ్ల పదాలను ఉపయోగించి మొత్తం 50లక్షల వాక్యాలు సిద్ధం చేసి ఔరా అనిపించారు. ఆ వాక్యాలన్నీ కూడా విద్యార్థులకు తేలికగా వచ్చేలా. దీనిపై అతనే స్వయంగా వివరాలు చెబుతూ కేఎల్ పాండా హైస్కూల్లో 2010లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సమయంలోనే విద్యార్థులు ఆంగ్ల భాషలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు గమనించి 170 పదాల ప్రాజెక్టు ప్రారంభించాడట. ముఖ్యంగా వారి పాఠశాల పూర్తి గ్రామీణ నేపథ్యంతో ఉండటం కూడా ఆ పరిస్థితికి కారణం అని గుర్తించి తేలికైనా పదాలతో వ్యాఖ్యాలు నిర్మించి ఈ ఘనత సాధించాడు. -
గ్యాస్ ట్యాంకర్ పేలి 8 మంది సజీవ దహనం
ఠాణే జిల్లా డహాను తాలూకాలో గ్యాస్ ట్యాంకర్ శనివారం ప్రమాదానికి గురైంది. వాహనానికి నిప్పంటుకోవడంతో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. చుట్టుపక్కలా ఎనిమిది వాహనాలు దగ్ధమయ్యాయి. ముంబై - అహ్మదాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఘటనాస్థలి నుంచి సుమారు 150 మీటర్ల వరకు ముందుజాగ్రత్తగా ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిలో కాసా పోలీసు స్టేషన్ పరిధిలోని చారోటి ప్రాంతంలో గ్యాస్‌తో నిండిన ట్యాంకర్ బోల్తాపడింది. దీంతో ఆ ట్యాంకర్‌కు మంటలు అంటుకున్నాయి. అగ్ని కీలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల పరిసరాల వరకు వ్యాపించాయి. అనేక వాహనాలు దగ్ధమయ్యాయి. ఇది తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనస్థలానికి చేరుకున్నారు. సమీపంలోని షాపులు, ప్రజలను ఖాళీ చేయిం చారు. యుద్దప్రతిపాదికన మంటలను ఆర్పి క్షతగాత్రులను రక్షించేందుకు ప్రయత్నించారు. కానిస్టేబుల్‌తోపాటు పలువురికి గాయాలయ్యాయి.