బ్రిటన్ డేటా కంపెనీ చైనా కంపెనీ చేతికి?
లండన్: బ్రిటన్లో అత్యంత సంపన్నులుగా ఈ ఏడాది రికార్డు సొంతం చేసుకున్న భారత సంతతి సోదరులు తమ డేటా కంపెనీలో వాటాల విక్రయానికి తెరలేపారు. ప్రపంచంలో అతిపెద్ద కంప్యూటర్ హోస్టింట్ నెట్వర్క్లో తమకున్న వాటాలను 5 బిలియన్ పౌండ్ల (సుమారు రూ.44వేల కోట్లు)కు చైనా కంపెనీ డైలీటెక్కు విక్రయించేందుకు ఒప్పందం చేసుకోనున్నట్టు డేవిడ్, సిమన్ రూబెన్ ప్రకటించారు. డేవిడ్, సిమన్లు ఇద్దరూ ముంబైలో జన్మించినవారే. డేటా సెంటర్ల నిర్వహణను చూసే గ్లోబల్ స్విచ్ కంపెనీకి వీరు ప్రమోటర్లు. లండన్, హాంకాంగ్, సింగపూర్ తదితర దేశాల్లో పది డేటా సెంటర్లు గ్లోబల్ స్విచ్ కంపెనీకి ఉన్నాయి. ఈ కంపెనీలో సగం వాటాను చైనాకు చెందిన డైలీటెక్కు విక్రయించే విషయమై చర్చలు పురోగతిలో ఉన్నట్టు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.