Dark Lips
-
పెదాలకు ఇది రాసుకుంటే గులాబీ రంగులోకి మారతాయి
హార్మోన్ల మార్పులు, విటమిన్ల లోపం, ధూమపానం, హైపర్ పిగ్మేంటేషన్ వంటి పలు కారణాల వల్ల పెదాలు నల్లగా మారుతుంటాయి. ఆ నలుపుదనం తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు కొబ్బరి నూనె, తేనెలో పంచదార కలపండి. ఈ మిశ్రమాన్ని పెదవులపై స్క్రబ్‌గా ఉపయోగించండి. ఇది పెదవులపై చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. పెదాలను మృదువుగా, అందమైన రంగులోకి మారుస్తుంది. రెగ్యులర్‌గా లిప్‌స్టిక్ వాడేవాళ్ల పెదాలు నల్లగా మారుతుంటాయి. అందుకే లిప్‌స్టిక్‌ను ఎక్కువసేపు ఉంచుకోవచ్చు. బయటి నుంచి రాగానే ఆలివ్ ఆయిల్ లేదా బాదం ఆయిల్‌తో లిప్‌స్టిక్‌ను తొలగించుకోవాలి. విటమిన్ ఈ టాబ్లెట్స్ అనేవి గ్రేట్ రెమెడీగా పనిచేస్తాయి.విటమిన్ ఈ అప్లై చేయడం వల్ల పెదాలు మృదువుగా మారతాయి. గులాబీ నీళ్లను ప్రతిరోజూ పెదాలకు రాసుకోవడం వల్ల లేత గులాబీ రంగులోకి మారతాయి. పెదాలకు లిప్‌బామ్ ఎంచుకునేటప్పుడు ఎస్పీఎఫ్ 30 ఉండేలా చూసుకోవాలి. దీనిని రెగ్యులర్‌గా వాడటం వల్ల మీ పెదాలు అందంగా మెరుస్తాయి. పెదవులు పగిలి బాధ పెడుతుంటేనేతిని కొద్దిగా వేడి చేసి, పెదవులపై మృదువుగా పూయాలి. ఇరవై నిమిషాల పాటు అలానే ఉంచి, గోరువెచ్చని నీటితో కడగాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల సమస్య తగ్గిపోతుంది. స్ట్రాబెర్రీని పేస్ట్‌లా చేసి, అందులో కాస్త పాల క్రీమ్ వేసి కలపాలి. దీన్ని పడుకోబోయేముందు పెదవులకు అప్లై చేసి, ఉదయాన్నే శుభ్రంగా కడుక్కోవాలి. నల్లని పెదవులు ఉన్నవారు తరచూ ఇలా చేస్తూ ఉంటే... నలుపు పోయి, పెదవులు గులాబీ రంగులోకి మారతాయి -
బ్యూటీ ఇన్ మినిట్స్..
బ్యూటిప్స్ రెండు స్ట్రాబెర్రీ పండ్లను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో ఒక టీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమంతో ముఖంపై ప్యాక్ వేసుకొని, 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. స్ట్రాబెర్రీలు స్కిన్ ఇన్ఫెక్షన్స్ను నివారిస్తాయి. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు వేసుకుంటే ముఖం ఎప్పుడూ నిగనిగలాడుతుంది. * డార్క్ లిప్స్‌తో బాధ పడేవారికి ఇది సులువైన చిట్కా. మార్కెట్లో దొరికే లిప్‌బామ్స్ కంటే ఇంట్లోనే దాన్ని తయారు చేసుకోండి. తయారీకి గ్లిజరిన్, బీట్రూట్ పౌడర్, పెట్రోలియం జెల్లీ చాలు. ఒక చిన్న గిన్నెలో పెట్రోలియం జెల్లీని వేసి వేడి చేయాలి. అది ద్రవంగా మారగానే, అందులో టీ స్పూన్ గ్లిజరిన్, అర టీ స్పూన్ డ్రై బీట్రూట్ పౌడర్ వేసి కలపాలి. చల్లారాక దాన్ని ఒక చిన్న బాటిల్లో తీసుకొని రోజూ అప్లై చేసుకుంటే పింక్ లిప్స్ మీ సొంతం. * కొందరి జుట్టు నల్లగా కాకుండా రాగి రంగులో కనిపిస్తుంది. అలాంటి వారు పావుకప్పు కొబ్బరి నూనెలో మూడు స్పూన్ల మందార రేకుల పొడిని వేసి మరిగించాలి. ఆ వేడి చల్లారక ముందే, అందులో ఒక టేబుల్ స్పూన్ ఆముదం కలపాలి. గోరువెచ్చని ఆ నూనెను రాత్రి నిద్రపోయే ముందు తలకు పట్టించాలి. ఉదయం లేచిన వెంటనే హెర్బల్ షాంపూతో తల స్నానం చేయాలి. వారానికి మూడు సార్లైనా ఇలా చేస్తే జుట్టు నల్లగా మారుతుంది.