demolitions
-
ఎన్నిసార్లు చెప్పినా మారరా?
సాక్షి, హైదరాబాద్: ‘ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా? అక్రమ నిర్మాణమని శుక్రవారం నోటీసులిచ్చి.. శనివారం హాజరుకు ఆదేశాలిచ్చి.. ఆదివారం కూల్చివేస్తారా? అంత తొందరేముంది? కూల్చి వేతలు చేపట్టే ముందు సహేతుక సమయం ఇవ్వాలి కదా?’ అని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ గ్రామంలోని తన ఆస్తుల కూల్చివేతను సవాల్ చేస్తూ సామ్రెడ్డి బాల్‌రెడ్డి హైకోర్టులో ఆదివారం హౌజ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా నోటీసులు చట్టవిరుద్ధమని, వాటిని రద్దు చేస్తూ ఆదేశాలివ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్‌కు న్యాయమైన అవకాశం ఇవ్వకుండా తదుపరి చర్యలు తీసుకోవద్దని హైడ్రాను ఆదేశించారు. అవసరమైన పత్రాలు సమర్పించడానికి పిటిషనర్‌కు ఒక వారం సమయం ఇచ్చారు. ముఖ్యంగా సెలవు దినాల్లో కూల్చివేతలు చేపట్టవద్దని, కాదని చేపడితే కఠిన చర్యలు ఉంటాయని హైడ్రాను హెచ్చరించారు. ఒక్కరోజులో పత్రాలు సమర్పించటం ఎలా సాధ్యం?..: తన ఆస్తులకు సంబంధించిన పత్రాలు సమర్పించేందుకు హైడ్రా ఒక్క రోజే సమయం ఇచ్చిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ‘అక్రమ నిర్మాణమని శుక్రవారం అధికారులు నోటీసులు జారీ చేశారు. వ్యక్తిగతంగా హాజరుకావాలని శనివారం సమయం ఇచ్చారు. ఆ వెంటనే ఆదివారం కూల్చివేత ప్రక్రియ చేపట్టారు. టైటిల్ లింక్ పత్రాలు, పట్టాదార్ పాస్‌బుక్, ఇతర అన్ని డాక్యుమెంట్లతో రావాలని ఆదేశించిన అధికారులు.. ఒక్క రోజే సమయం ఇచ్చారు. అధికారుల తీరు చట్టవిరుద్ధం. నోటీసులను నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వండి’ అని కోరారు. దీంతో హైడ్రా తీరుపై అసహనం వ్యక్తంచేసిన ధర్మాసనం.. వారంలోగా అధికారులకు డాక్యుమెంట్లు అందజేయాలని ఆదేశించింది. వాటిని పరిశీలించి చట్టప్రకారం చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిస్తూ విచారణను వాయిదా వేసింది. -
హైదరాబాద్‌లో మరోసారి హైడ్రా భారీ కూల్చివేతలు.. ఈసారి ఎక్కడంటే?
సాక్షి,హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది.తమ ప్లాట్లలో ఫామ్‌హౌస్ కట్టారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ వందల మంది బాధితులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఆశ్రయించారు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ బాధితుల సమస్యల్ని విన్నారు. బుల్డోజర్లతో రంగంలోకి దిగారు. అక్రమ నిర్మాణాల్ని తొలగించేస్తున్నారు.తాజాగా, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ కోహెడలో హైడ్రా భారీ కూల్చివేతలకు శ్రీకారం చుట్టింది. కోహెడ సర్వే నెంబర్ 951, 952లో 7.28 గుంటల భూమిని రియల్టర్ సంరెడ్డి బాల్‌రెడ్డి కబ్జా చేశాడు. కబ్జా చేసిన ప్లాట్లలో ఫాం హౌస్ నిర్మించాడు. దీంతో 170 మంది ప్లాట్ల యజమానులు హైడ్రాను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చి వేతలకు ఉపక్రమించింది.రంగనాథ్ వార్నింగ్మొన్నటికి మొన్న శంషాబాద్ మున్సిపాలిటీలో శుక్రవారం(ఫిబ్రవరి7) హైడ్రా కొరడా ఝలిపించింది. రోడ్డుపై అనుమతులు లేకుండా ఏర్పాటుచేసిన 39 హోర్డింగ్‌లను తొలగించింది. హోర్డింగ్‌లు ఏర్పాటు చేసిన యజమానులపై చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఇటీవలే హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సంపత్ నగర్, ఊట్పల్లిలో అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను, అలాగే రోడ్లపై అడ్డుగా కట్టిన నిర్మాణాలను తొలగించింది.సంపత్ నగర్లో ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి కొందరు అక్రమ కట్టడాలను నిర్మించారు. అలాగే ఊట్పల్లిలో రోడ్డుకు అడ్డంగా ఓ గేటును ఏర్పాటు చేశారు. వీటితో పాటు మరికొన్ని నిర్మాణాలను తొలగించే చర్యలు చేపట్టింది. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు, పార్క్ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది.ఈ క్రమంలో శంషాబాద్ మున్సిపాలిటీని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. శంషాబాద్ మున్సిపాలిటీలో చెరువులు కుంటలు కూడా కబ్జా అయినట్లు తన దృష్టికి వచ్చిందని వాటి పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కూటమి ప్రభుత్వ అరాచకాలకు అవధుల్లేవు: భూమన
సాక్షి,తిరుపతి:కూటమి సర్కార్ ఆదేశాలతో అధికారులు సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. శనివారం(ఫిబ్రవరి1) తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో భూమన మాట్లాడారు. ‘అధికారులు కూటమి నేతల డైరెక్షన్లో పనిచేస్తున్నారు. సుప్రీం నిబంధనలను అధికారులు పాటించాలి. తిరుపతి పట్టణంలో కూటమి ప్రభుత్వ అరాచకాలకు అవధులు లేకుండా పోతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ తరపున డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా శేఖర్‌రెడ్డిని ప్రకటిస్తే అతడి ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలు సైతం ధిక్కరిస్తూ మేయర్ చూస్తుండగానే కట్టడాలు కూల్చి వేశారు. డిప్యూటి మేయర్ అభ్యర్థి శేఖర్‌రెడ్డిని లొంగి పోయేలా చేశారు. మీకు సత్తా లేక, మెజారిటీ లేక, మా పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కొనుగోలు చేశారు. గపూర్, లక్ష్మన్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఇళ్లు ధ్వంసం చేశారు. తిరుమలలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల వ్యాపార సముదాయాలు బెదిరింపులకు పాల్పడ్డారు. మా పాలనలో ఏ రోజు విధ్వంసం చేయలేదు. ప్రత్యర్థుల ఆస్తులు విధ్వంసానికి పాల్పడటం అనే సంస్కృతి కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన అదేశాలు సైతం ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. కూల్చివేతలకు 45 రోజుల ముందు షోకాజ్ నోటీసులు ఇవ్వాలి, కలెక్టర్‌కు మెయిల్ చేయాలి.కూల్చివేతలకు మూడు నెలల ముందు నోటీసులు ఇవ్వాలి. 15 రోజుల ముందు అప్పీలు నోటీసులు ఇవ్వాలి. కూల్చివేతల వీడియో, ఫొటోలు తీయాలి. నగర ప్రథమ మహిళ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ఆస్తులు ధ్వంసం చేశారు. ఈ అంశంపై మేయర్ సుప్రీంకోర్టుకు వెళ్తారు, కమిషనర్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై పోరాటం చేస్తాం. బీజేపీ నాయకులు, టీడీపీ నేతల అక్రమ కట్టడాల జోలికి వెళ్లకుండా వైఎస్సార్సీపీ నాయకుల ఆస్తుల విధ్వంసానికి దిగారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శేఖర్ రెడ్డి పోటీ నుంచి విరమించుకుంటే లడ్డు భాస్కర్‌రెడ్డి డిప్యూటి మేయర్ అభ్యర్థిగా పోటీలో ఉంటారు. తిరుపతి వైఎస్సార్సీపీ నేతలు కార్యకర్తలు 70 మందిని ఇప్పటివరకు అరెస్టు చేశారు. ఇలాంటి దుశ్చర్యలు చేస్తే మీకు తగిన బుద్ధి చెబుతాం. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే దీనికి పదింతలు బదులు తీర్చుకుంటాం. గత పదేళ్ళలో ఏ రోజు మేం కూటమి నాయకులపై కక్ష సాధింపు చర్యలు చేయలేదు. చంద్రబాబు దాష్టిక పాలనపై ప్రజలు తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారు. సూపర్ సిక్స్ హామీలు గాలికి వదిలేశారు. ఒక్క హామీ నెరవేర్చలేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీని పాతాళానికి తొక్కివేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’అని భూమన అన్నారు. -
మళ్లీ అమీన్పూర్లో ‘హైడ్రా’ కూల్చివేతలు
సాక్షి,హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా మరోసారి పంజా విసిరింది. ఇక్కడ హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. అమీన్పూర్ చెరువులో ఏపీకి చెందిన నేత అక్రమ నిర్మాణాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేసినట్లు హైడ్రాకు ఫిర్యాదులందాయి. దీనిపై విచారణ జరిపిన హైడ్రా అక్రమాలు జరిగింది నిజమేనని నిర్ధారించుకుని కూల్చివేతలకు దిగింది. గతంలోనూ అమీన్పూర్ మునిసిపాలిటీ పరిధిలో హైడ్రా పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అయితే ఇక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో కూల్చివేతలు కొనసాగించాలని నిర్ణయించింది. అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందేనని హైడ్రాకు ప్రభుత్వం ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. -
పోచారంలో కూల్చివేతలపై స్పందించిన హైడ్రా కమిషనర్
సాక్షి, హైదరాబాద్: పోచారంలో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ (Hydra Commissioner) స్పందించారు. భద్రత పేరిట 200 ఎకరాల చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టారని.. అన్ని విషయాల్లో నిబంధనలు ఉల్లంఘించారని రంగనాథ్ తెలిపారు. పదుల ఎకరాల్లో ప్రభుత్వ భూమిని లాక్కొని.. ఎన్ఎంఆర్ సంస్థ కాంపౌండ్ వాల్ కట్టింది. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగుతోందన్నారు.కాగా, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీలో కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పలు కాలనీలకు, నివాస ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా నిర్మించిన దివ్యనగర్ లే అవుట్ చుట్టూ ఉన్న ప్రహరీ గోడను అధికారులు తొలగిస్తున్నారు. పోచారం మున్సిపాలిటీలో ఉన్న దివ్య లే అవుట్ మొత్తం విస్తీర్ణం 200 ఎకరాల వరకూ ఉంటుంది. ఇందులో మొత్తం 2218 ప్లాట్లు వేశారు. ఈ ప్లాట్లలో 30 శాతం నల్ల మల్లారెడ్డివేనంటూ ఆరోపణలు ఉన్నాయి.ఇక, దివ్యనగర్ లే అవుట్ చుట్టూ ఉన్న ప్రహరీ కూల్చివేతతో మార్గం సుగమం అయిన కాలనీలు.. ఏకశిలా లే ఔట్, వెంకటాద్రి టౌన్షిప్, సుప్రభాత్ వెంచర్ -1 , మహేశ్వరి కాలనీ, కచ్చవాణి సింగారం, ఏకశిలా - పీర్జాదిగూడ రోడ్డు, బాలాజీనగర్, సుప్రభాత్ వెంచర్ -4 , వీజీహెచ్ కాలనీ, ప్రతాప్ సింగారం రోడ్డు, సుప్రభాత్ వెంచర్ -2, 3, సాయిప్రియ, మేడిపల్లి, పర్వతపురం, చెన్నారెడ్డి కాలనీ, హిల్స్ వ్యూ కాలనీ, ముత్తెల్లిగూడగా ఉన్నాయి.ఇదీ చదవండి: తెలంగాణలో మరో సంచలనం.. ఇంద్రసేనా రెడ్డి ఫోన్ ట్యాప్! -
HYDRA: హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
-
HYD: యాప్రాల్‌లో ‘హైడ్రా’ కూల్చివేతలు
సాక్షి,హైదరాబాద్: కొంత కాలం గ్యాప్ తర్వాత హైడ్రా మళ్లీ తన జేసీబీలకు పని చెప్పింది. మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పరిధిలోని యాప్రాల్‌లో హైడ్రా శుక్రవారం (డిసెంబర్6) అక్రమ కట్టడాలపై కూల్చివేతలు చేపట్టింది. సర్వే నెంబర్ 32,14లో ఉన్న ఫంక్షన్‌హాల్‌ను హైడ్రా అధికారులు కూల్చి వేశారు. ప్రభుత్వ భూమిలో నిర్మించినందుకు ఫంక్షన్హాల్లో కూల్చివేతలు చేపట్టామని హైడ్రా అధికారులు తెలిపారు.కూల్చివేతలు వివాదాస్పదమైనందున హైడ్రా తన దూకుడు కొద్దిగా తగ్గించింది. హైకోర్టు చివాట్లతో తన స్పీడుకు బ్రేకులు వేసింది. అక్రమ నిర్మాణాలని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే కూల్చివేతలకు రంగంలోకి దిగుతోంది. తాజాగా హైడ్రా కూల్చివేతలు చేపట్టిన జవహర్‌నగర్ ప్రాంతంలో చాలా వరకు భూ కబ్జాలతో పాటు అక్రమ నిర్మాణాలున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం వద్ద ఫిర్యాదులున్నాయి. -
బుల్డోజర్ సంస్కృతిపై వేటు!
‘చావుకి పెడితే లంఖణానికి వస్తార’ని నానుడి. కొన్నేళ్లుగా ప్రజాస్వామ్యంలో బుల్డోజర్ స్వామ్యాన్ని జొప్పించి మురిసి ముక్కలవుతున్నవారికి సర్వోన్నత న్యాయస్థానం కీలెరిగి వాత పెట్టింది. నేరం రుజువై శిక్షపడిన లేదా నిందితులుగా ముద్రపడినవారి ఆవాసాలను కూల్చటం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. అలాంటి చేష్టలకు పాల్పడే ప్రభుత్వాధికారులు బాధితులకు పరిహారం చెల్లించటంతోపాటు వారి ఇళ్ల పునర్నిర్మాణానికయ్యే మొత్తం వ్యయాన్ని వ్యక్తిగతంగా భరించాల్సి వుంటుందని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం తేల్చిచెప్పింది. కూల్చివేతలకు ఏ నిబంధనలు పాటించాలో వివరించే మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని ఉల్లంఘించే అధికారులపై కోర్టు ధిక్కార నేరం కింద చర్యలు తీసుకోవటంతోపాటు వ్యాజ్యాలు కూడా మొదలవుతాయని హెచ్చరించింది. ‘ఇళ్లు కూల్చినప్పుడల్లా నిశిరాత్రిలో నడిరోడ్లపై చిన్నా రులూ, ఆడవాళ్లూ విలపిస్తున్న దృశ్యాలు అరాచకానికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఒకప్పుడు అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కొన్ని విధివిధానాలు పాటించేవారు. నోటీసులిచ్చి సంజాయిషీలు తీసుకుని ఆ తర్వాత చర్యలు ప్రారంభించేవారు. కీడు శంకించినవారు న్యాయస్థానాలను ఆశ్రయించటం, వారికి ఊరట దొరకటం కూడా రివాజే. తమకు నచ్చని అభిప్రాయాలున్నా, ఏదో ఉదంతంలో నిందితులుగా ముద్రపడినా వారి ఇళ్లూ, దుకాణాలూ కూల్చే పాపిష్టి సంస్కృతి ఇటీవలి కాలపు జాడ్యం. సినిమా భాషలో చెప్పాలంటే ఇది ‘పాన్ ఇండియా’ సంస్కృతి! దీనికి ఆద్యుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఉత్తర ప్రదేశ్‌లో నేర సంస్కృతిని అరికట్టడంలో, సంక్షేమ పథకాలు అర్హులకు అందించటంలో ఆయన విజయం సాధించారని బీజేపీ చెబుతుంటుంది. కానీ అంతకన్నా ‘బుల్డోజర్ బాబా’గా పిలిపించుకోవటం యోగికి, అక్కడి బీజేపీకి ఇష్టం. చూస్తుండగానే ఇది అంటువ్యాధిలా పరిణమించింది. మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, కర్ణాటకల్లో బీజేపీ ప్రభుత్వాలు బుల్డోజర్లతో విధ్వంసానికి దిగాయి. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకున్నాక బాబు ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయాలను బుల్డోజర్లతో కూల్చాలని చూసింది. ఒకటి రెండుచోట్ల ఆ పనిచేసింది కూడా. ఇక తమకు వ్యతిరేకంగా పనిచేశారన్న కక్షతో దిక్కూ మొక్కూలేని పేదల ఇళ్లు సైతం ఇదే రీతిలో ధ్వంసం చేసింది. రాజస్థాన్‌లో 2022లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా బీజేపీ ఏలుబడిలో ఉన్న రాజ్‌గఢ్ మున్సిపాలిటీ పరిధిలో ఈ దుశ్చర్య చోటు చేసుకుంది. మహారాష్ట్రలో శివసేన–కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి సర్కారు హయాంలో నిందితుల ఇళ్లనూ, దుకాణాలనూ కూల్చారు. కేంద్రం మాటే చెల్లుబాటయ్యే ఢిల్లీలో జహంగీర్‌పురా ప్రాంతంలో మతఘర్షణలు జరిగినప్పుడు అనేక ఇళ్లూ, దుకాణాలూ నేలమట్టం చేశారు. బాధితులు సుప్రీంకోర్టు ఉత్తర్వులు పొందేలోగానే విధ్వంసకాండ పూర్తయింది. 2020 నుంచి ముమ్మరమైన ఈ విష సంస్కృతిపై సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరిస్తూనే వచ్చింది. ‘నిందితులు మాత్రమే కాదు, శిక్ష పడినవారి ఇళ్లను సైతం కూల్చడానికి లేదు. ఈ విషయంలో చట్టనిబంధనలు పాటించి తీరాలి’ అని స్పష్టం చేసింది. కానీ ఆ చేష్టలు తగ్గిన దాఖలా లేదు. చుట్టూ మూగేవారు ‘ఆహా ఓహో’ అనొచ్చు. అవతలి మతంవారి ఇళ్లు, దుకాణాలు కూలుతున్నాయంటే తన్మయత్వంలో మునిగే వారుండొచ్చు. ఆఖరికి ఇళ్లు కూల్చిన ఉదంతాల్లో పాలుపంచుకున్న అధికారులు విందులు చేసుకున్న ఉదంతాలు కూడా వెల్లడయ్యాయి. కానీ సమాజంలో అరాచకం ప్రబలకూడదన్న ఉద్దేశంతో రాజ్య వ్యవస్థ ఏర్పడినప్పుడూ... రాజ్యాంగమూ, చట్టాలూ ఉన్నప్పుడూ... రాజ్యవ్యవస్థే తోడేలుగా మారితే దిక్కెవరు? సుప్రీంకోర్టు వద్దుగాక వద్దని చెప్పాక కూడా ఈ పోకడ ఆగలేదంటే ఏమను కోవాలి? ఒక వ్యక్తి నిజంగా తప్పు చేశాడనుకున్నా అతని కుటుంబమంతా అందుకు శిక్ష అనుభవించి తీరాలన్న పట్టుదల నియంతృత్వ పోకడ కాదా? సుప్రీంకోర్టు 95 పేజీల్లో ఇచ్చిన తీర్పు ఎన్నో విధాల ప్రామాణికమైనదీ, చిరస్మరణీయమైనదీ. ‘ఇల్లంటే కేవలం ఒక ఆస్తి కాదు... అది కొందరు వ్యక్తుల, కుటుంబాల సమష్టి ఆకాంక్షల వ్యక్తీకరణ. అది వారి భవిష్యత్తు. వారికి స్థిరత్వాన్నీ, భద్రతనూ చేకూరుస్తూ, సమాజంలో గౌరవం తీసుకొచ్చేది. ఇలాంటి ఇంటిని బలవంతంగా తీసుకోవాలంటే ముందుగా ఇతర ప్రత్యామ్నాయాలేవీ లేవని అధికారులు విశ్వసించాలి’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించిన తీరు అమానవీయత నిండిన పాలకులకు ఏమేరకు అర్థమైందో సంశయమే. ఆ మాటెలా వున్నా కఠిన చర్యలుంటాయన్న హెచ్చరిక వారిని నిలువరించే అవకాశం ఉంది. దేశంలో దిక్కూ మొక్కూలేని కోట్లాదిమంది సామాన్యులకు ఊరటనిచ్చే ఈ తీర్పులో హిందీ భాషా కవి ప్రదీప్ లిఖించిన కవితకు కూడా చోటు దక్కింది. దాని సారాంశం – ‘ఇల్లు, పెరడు ప్రతి ఒక్కరి స్వప్నం. ఆ కలను కోల్పోవడానికి సిద్ధపడతారా ఎవరైనా?’ బ్రిటన్ న్యాయకోవిదుడు లార్డ్ డెన్నింగ్ చేసిన వ్యాఖ్యలను కూడా తీర్పులో ఉటంకించారు. ‘రాజ్యా ధికారాన్ని ధిక్కరించి అతి సామాన్యుడు వేసుకున్న గుడిసె చిరుగాలికే వణికేంత బలహీనమైనది కావొచ్చు. ఈదురుగాలికి ఇట్టే ఎగిరిపోవచ్చు. దాన్ని వర్షం ముంచెత్తవచ్చు. కానీ చట్టనిబంధన అనుమతిస్తే తప్ప ఆ శిథిల నిర్మాణం వాకిలిని అతిక్రమించటానికి ఇంగ్లండ్ రాజుకు సైతం అధికారంలేదు’ అని లార్డ్ డెన్నింగ్ అన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చూశాకైనా తమపై ఏ స్థాయిలో విశ్వాసరాహిత్యం ఏర్పడిందో ప్రభుత్వాలు గ్రహించాలి. నీతిగా, నిజాయితీగా, రాజ్యాంగానికి అనుగుణంగా పాలించటం నేర్చుకోవాలి. -
ఇళ్ల కూల్చివేతలపై.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
-
‘హైడ్రా’పై కేఏ పాల్ వాదనలు.. హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: హైడ్రాపై కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం(అక్టోబర్ 23) హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో బెంచ్ ముందు పాల్ తానే స్వయంగా వాదనలు వినిపించారు. పాల్ వాదనలు విన్న కోర్టు హైడ్రాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టవద్దని హైడ్రాను ఆదేశించింది.నిర్వాసితులు ప్రత్యామ్నాయం చూసుకునేంతవరకు బాధితులకు సమయం ఇవ్వాలని సూచించింది. మూసీ బాధితులకు ఇల్లు కట్టించిన తర్వాతే కూల్చివేతలు చేపట్టాలని హైకోర్టు స్పష్టం చేసింది. బాధితులకు ఇల్లు కేటాయించిన తర్వాతే కూల్చివేస్తున్నామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. -
మూసీ నివాసితులను వెంటాడుతున్న కూల్చివేతల భయం
సాక్షి, హైదరాబాద్: మూసీ నది నివాసితులను కూల్చివేతల దడ వెంటాడుతూనే ఉంది. నదీ ప్రక్షాళన రాజకీయ కేంద్ర బిందువుగా మారి తాత్కాలికంగా కూల్చివేతల ప్రక్రియ నిలిచినా.. భవిష్యత్తులో మళ్లీ వీటి బెడద తప్పదనే హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో నివాసితులు తమ ఇళ్లను రక్షించుకునేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకుంటుండగా.. మరికొందరు సామాజిక కమిషన్లను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు పోరాటం ఆందోళనలు సైతం ఉద్ధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇంకోవైపు అధికారేతర రాజకీయ పక్షాలు అండగా తామున్నామంటూ పరీవాహక ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేయిస్తున్నాయి. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల పర్యటనలు మరింత వేడిని పుట్టిస్తున్నాయి.కోర్టును ఆశ్రయించిన నివాసితులు మూసీ పరీవాహక ప్రాంతంలోని తమ ఇళ్లను కూల్చివేయొద్దంటూ హైకోర్టును ఆశ్రయించారు. గ్రేటర్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 2,166 నివాసాలు నదీ గర్భంలో ఉన్నట్లు డ్రోన్ సర్వే ద్వారా అధికారులు గుర్తించారు. రెవెన్యూ అధికారుల బృందం ఇప్పటి వరకు గుర్తించిన వాటిలో 68 శాతం ఇళ్లకు మార్కింగ్ చేశారు. కొన్ని గృహాలను కూలీల సహకారంతో కూల్చివేశారు. దీంతో కొందరు మూసీ నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు. చైతన్యపురి, కొత్తపేటలోని దాదాపు 620 కుటుంబాలు కోర్డులో పిటిషన్లు దాఖలు చేయగా, వారిలో 400 నివాసాలకు స్టే వచ్చింది. మరోవైపు ఇటీవల వేసిన ఆర్బీ మార్క్‌ను సైతం ఇళ్ల యజమానులు తొలగిస్తున్నారు. తమ ఇళ్లను కూల్చివేయద్దంటూ ఇళ్ల ముందు హైకోర్టు స్టే బోర్డులను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎస్సీ కమిషన్‌కు దళిత కుటుంబాలు మూసీ పరివాహకంలో నివాసాలు కూల్చకుండా ఆదేశాలు జారీ చేయాలని ఎస్సీ కమిషన్‌ను దళిత కుటుంబాలు ఆశ్రయించాయి. కూలిపనులు చేసుకొని జీవనం సాగించే తమ ఇళ్లను అర్ధాంతరంగా కూల్చివేస్తే రోడ్డున పడతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. చాదర్‌ఘాట్, శంకర్ నగర్, చైతన్యపురి, కొత్తపేట తదితర ప్రాంతాలకు చెందిన దళితులు ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. మరోవైపు పోస్టుకార్డు ఉద్యమం మూసీరివర్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రపతి, గవర్నర్‌తో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌లకు పోస్టు కార్డులు రాసి పంపించారు. గతంలో చేపట్టిన డ్రోన్ సర్వేపై ఆధారపడకుండా తిరిగి భౌతికంగా సర్వే చేస్తే మూసీకి దగ్గరలో ఎంతమంది ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మూసీ సుందరీకరణ కోసం తమ ఇళ్లను వదిలే ప్రసక్తిలేదని నివాసితులు తేల్చి చెబుతున్నారు. న్యాయపోరాటం చేయడానికి సిద్ధమని పేర్కొంటున్నారు.చదవండి: షాకిస్తున్న కరెంట్ బిల్లులు.. డోర్‌లాక్ పేరుతో అడ్డగోలు బాదుడుపక్కా నిర్మాణాలతోనే సమస్య.. మూసీ పరీవాహక పరిధిలోకి వచ్చే హైదరాబాద్ జిల్లాకు సంబంధించి 30 శాతం మంది నిర్వాసితులు.. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా.. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో మెజారిటీ సంఖ్యలో శాశ్వత నిర్మాణాలతో సమస్య తీవ్రమైంది. రూ.లక్షలు ఖర్చు చేసి నివాసాలు ఏర్పాటు చేసుకున్న కారణంగా ఇళ్లను ఖాళీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చేబుతున్నారు. దీంతో నిర్వాసితులను తరలించడం రెవెన్యూ అధికారులకు కొంత తలనొప్పిగా మారింది. -
హైకోర్టుకు ‘మూసీ’ బాధితులు..రేపు కీలక విచారణ
సాక్షి,హైదరాబాద్: మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు బాధితులు సోమవారం(అక్టోబర్ 14) హైకోర్టు తలుపుతట్టారు. మూసీ పరివాక ప్రాంతంలో దశాబ్దాలుగా నివసిస్తున్నామని, ఇప్పుడు మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం తమ ఇళ్లు కూలగొట్టే అవకాశం ఉందని హైకోర్టులో పిటిషన్ వేశారు.అధికారులు తమ ఇళ్లపై మార్కింగ్ వేసిన విషయాన్ని వీరంతా హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. తమ ఇళ్లు కూల్చకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్లో కోరారు. మంగళవారం హైకోర్టు ఈ పిటిషన్లను విచారించనుంది. కాగా, మూసీ సుందరీకరణ కోసం ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మూసీ రివర్‌బెడ్‌లో ఉన్న ఇళ్ల కూల్చివేతను అధికారులు ఇప్పటికే ప్రారంభించారు.ఇదీ చదవండి: తెలంగాణ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్ -
హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక తీర్పు
సాక్షి,హైదరాబాద్:హైడ్రా కూల్చివేతలను ఇప్పటికిప్పుడు ఆపలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. హైడ్రా కూల్చివేతలపై స్టే విధించాలని కేఏ పాల్ వేసిన పిటిషన్‌పై శుక్రవారం(అక్టోబర్4) హైకోర్టు విచారణ జరిపింది.హైడ్రాకు చట్టబద్దత కల్పించిన తరువాతే యాక్షన్ మొదలు పెట్టాలని కోర్టులో కేఏ పాల్ స్వయంగా వాదనలు వినిపించారు.అక్రమ కట్టడాల కూల్చివేతలకు 30 రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని పాల్ కోరారు.ఈ కేసులో ప్రతి వాదులు హైడ్రా, తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 14కి వాయిదా వేసింది.ఇదీ చదవండి: సింగిల్ జడ్జి తీర్పుపై స్టేకు నిరాకరణ -
ఇళ్లు కూల్చేందుకా ఓట్లు వేసింది: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: పోరాట యోధుడిగా ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన యోధుడు మహాత్మాగాంధీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం(అక్టోబర్2) గాంధీజయంతి సందర్భంగా తెలంగాణభవన్‌లో జాతిపితకు కేటీఆర్ నివాళులర్పించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ‘ప్రపంచం మొత్తం విశ్వగురువుగా కీర్తించిన నేత గాంధీ.మార్టిన్ లూథర్ కింగ్‌కు కూడా మహాత్మా గాంధీ ఆదర్శంగా నిలిచారు. తెలంగాణలో పేదల పట్ల ప్రభుత్వం మానవీయంగా వ్యవహరిస్తోంది.మమ్మల్ని వేరే పని అని తీసుకువచ్చి ఇల్లు కూలగొట్టమంటున్నారని కూలీలు చెప్తున్నారు.మీకు ఓట్లు వేసింది ఇళ్ళు కూలగొట్టడానికి కాదు. ఈ విషయంలో పైన ఢిల్లీలో ఉన్న గాంధీలు సోనియాగాంధీ,రాహుల్ గాంధీ ఆలోచించాలి. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: అక్రమమైనా.. ఇళ్ల జోలికి వెళ్లం: రంగనాథ్ -
బుల్డోజర్ను బొంద పెట్టండి: కేటీఆర్ పిలుపు
సాక్షి,హైదరాబాద్:పేదలు దసరా పండగ సంతోషంగా జరుపుకోలేని దుస్థితికి సీఎం రేవంత్‌రెడ్డి తీసుకొచ్చాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మంగళవారం(అక్టోబర్1)అంబర్‌పేట గోల్నాకలోని తులసీరాంనగర్‌లో పర్యటించిన కేటీఆర్ మూసీ కూల్చివేతల బాధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘పది నెలలు అయ్యింది రేవంత్ రెడ్డి వచ్చి. హైదరాబాద్ లో ఒక్క ఓటు కూడా రాలేదని మీ బతుకులు ఆగం చేశాడు. పెన్షన్లు రూ.4వేలు చేస్తా అన్నాడు. ఆరు గ్యారెంటీలు ఇస్తా అన్నాడు. ఏమీ ఇవ్వలేదు. తులం బంగారం అన్నాడు. తులం బంగారం కాదు కాగా ఇనుము కూడా రాలేదు.మూసీలో దోచుకో, ఢిల్లీలో పంచి పెట్టు అన్నట్టుగా కొత్త దుకాణం తెరిచాడు. ఇక్కడ 38 ఇళ్లకు రంగులు వేసాడట. ఏ ఇంటికి కష్టం వచ్చినా పక్కింటి వాళ్ళు అడ్డుకోవాలి. బుల్డోజర్ను బొంద పెట్టాలి. ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు.ఇందిరమ్మ చెప్పిందా? సోనియమ్మ చెప్పిందా ఇల్లు కూల్చాలని. పేదల ఇల్లు ఎవరికి దోచి పెట్టడానికి కూలుస్తున్నారు. గంగా నది ప్రక్షాళన కోసం 2400 కిలోమీటర్లు ఉన్న ప్రాజెక్ట్ రూ. 20 వేల కోట్లతో కేంద్రం చేపట్టింది. కానీ మూసి నదికి లక్షా 50 వేల కోట్లతో శుద్ధి చేస్తానన్న పేరుతో దోచుకోవడానికి రేవంత్‌రెడ్డి చూస్తున్నాడు’అని కేటీఆర్ మండిపడ్డారు. -
HYD: చాదర్‌ఘాట్‌లో ‘మూసీ’ కూల్చివేతలు షురూ
సాక్షి,హైదరాబాద్: మూసీ నది ప్రక్షాళనలో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో మొదటి విడత పునరావాస కేంద్రాలకు తరలించిన వారి ఇళ్లను అధికారులు కూల్చేస్తున్నారు. చాదర్‌ఘాట్ మూసానగర్, శంకర్‌నగర్‌లో రెడ్‌మార్క్ వేసిన ఇళ్ల కూల్చివేత ప్రారంభమైంది. చాదర్‌ఘాట్ పరిసరాల్లో 20 ఇళ్ళకు మార్కింగ్ చేసిన అధికారులు ఇప్పటికే నిర్వాసితులను తరలించారు. రెవెన్యూ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం(అక్టోబర్1) తొలిసారిగా కూల్చివేతలు జరుగుతున్నాయి. మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలతో హైడ్రాకు సంబంధం లేదని తెలుస్తోంది. ఇదీ చదవండి: మూసీ ప్రాజెక్టు కాంగ్రెస్‌కు రిజర్వు బ్యాంకు -
ముందూ వెనుక ఆలోచించకుండానే కూల్చివేతలా?
తెలంగాణ రాజధాని భాగ్య నగరంలో ఏం జరుగుతోంది? ప్రక్షాళన చేస్తున్నామని, లండన్ స్థాయికి చేరుస్తున్నామని ప్రభుత్వం చెబుతూంటే.. కాపురముంటున్న ఇళ్లను కూల్చి తమ జీవితాలను ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. వరదలొస్తే ముంపు సమస్య లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కాదనడం లేదు. అనుమతుల్లేని నిర్మాణాలపై చర్యలకూ అభ్యంతరం లేదు. చెరువుల్లాంటి జల వనరుల పరిరక్షణే లక్ష్యంగా, అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన సంస్త హైడ్రా దూకుడుపై సామాన్య, మధ్య తరగతి వర్గాల నుంచి ముందుగా సానుకూలతే వ్యక్తమైంది.అయితే ధనికుల ఇళ్ల మాట ఎలా ఉన్నా.. హైడ్రా పేద, మధ్య తరగతి వర్గాలకే కేంద్రంగా చేసుకుని కూల్చివేతలకు పాల్పడుతూండటంతో గగ్గోలూ ప్రారంభమైంది. నోటీసులివ్వకుండా, అకస్మాత్తుగా.. ఇంట్లోని సామాన్లు రక్షించుకునేందుకూ సమయం ఇవ్వకుండా నేరుగా జేసీబీలతో హైడ్రా విరుచుకుపడుతూండటం సర్వత్రా విమర్శలకు గురవుతోంది. ఇళ్లు కోల్పోయిన వారు దిక్కులేని స్థితిలో పడిపోతున్నారు. అందుకే వారు అంతలా శాపనార్థాలు పెడుతున్నారు.ఇళ్ల కూల్చివేతలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చూసిన వారు ఎవరికైనా ఆవేదన కలక్క మానదు. పుస్తకాలు కూడా తీసుకోనివ్వకుండా తాముంటున్న ఇల్లు కూల్చేశారని ఐదేళ్ల పసిపాప ఏడుస్తూ చెప్పిన వైనం అందరినీ కలచివేసింది. ఇంకో మహిళ తాము రూ.కోటి పెట్టుబడి పెట్టి వర్క్‌షాప్ ఏర్పాటు చేసుకున్నామని, యంత్రాలు తరలించుకునేందుకు అవసరమైన సమయమూ ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చేశారని వాపోతూ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోసింది. కొందరు మధ్యతరగతి వారు తాము పది- పదిహేనేళ్లుగా పైసా పైసా కూడబెట్టుకని, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కష్టపడి ఇల్లో, అపార్ట్మెంటో సొంతం చేసుకున్నామని, ఇప్పుడు ప్రభుత్వ అకస్మాత్తుగా వాటిని కూల్చేస్తే ఎక్కడికెళ్లాలని ప్రశ్నిస్తున్నారు.గృహప్రవేశం చేసిన వారం కూడా కాక ముందే తమ ఇల్లు కూల్చేశారని ఓ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి సోదరుడితోపాటు ధనికులు ఎక్కువగా ఉన్న చోట్ల నోటీసులిచ్చారని.. వారు కోర్టుకు వెళితే కొంత గడువూ ఇచ్చారని.. పేద, మధ్య తరగతికి చెందిన తమకు మాత్రం అలాంటి సౌకర్యాలు ఎందుకు లేవని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులన్నీ తీసుకుని, రిజిస్ట్రేషన్లూ జరిగిన తమ ఇళ్లకు పన్నులు కూడా కడుతున్నామని, ప్రభుత్వాలు విద్యుత్తు, మురుగునీటి సౌకర్యాలు కల్పించిందని, అయినా.. చెరువు సమీపంలో ఉందనో, ఇంకేదో కారణం చేతనో కూల్చివేతలకు దిగితే తాము ఎవరికి చెప్పుకోవాలని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వ భవనాల మాటేమిటి?మూసి పరివాహక ప్రాంతంలో కాని, హుస్సేన్ సాగర్ తదితర చోట్ల ఎఫ్ టిఎల్, బఫర్ జోన్లలో ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి. వాటి సంగతేమిటన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.. వరదలలో ఉండాలని ఎవరూ కోరుకోరు. అదే టైమ్ లో ఇల్లు లేకుండా రోడ్డు మీద పడిపోయే పరిస్థితిని కూడా కోరుకోరు. ఒకవైపు ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని ప్రభుత్వం చెబుతూ, మరో వైపు వేల సంఖ్యలో పేదల ఇళ్లను పడవేస్తుంటే ప్రయోజనం ఏమి ఉంటుంది? ఏది అతి కాకూడదు. మూసి నది మధ్యలో ఉన్న ఇళ్లను తొలగించడానికి కూడా ప్రభుత్వం పూనుకుంది. అయితే ఇక్కడ వారిని మాత్రం బుజ్జగిస్తారట. వారికి మాత్రమే పునరావాసం కల్పించాకే కూల్చుతామని అధికారులు చెబుతున్నారు. కూల్చి వేయవలసిన ఇళ్ల సర్వేకి సిబ్బంది వస్తే ప్రజలు అడ్డుకున్నారు.మూసి నది బెడ్ లో ఉన్న వారికే ఇళ్లు ఇస్తే, మిగిలిన ప్రాంతాల పేదలు ఏమి చేయాలి. రోడ్డు మీదనే నివసించాలా? కూల్చివేతలకు ఇప్పుడు ఉన్న హైడ్రా సిబ్బంది చాలదట. మరో 169 మంది సిబ్బందిని తీసుకుంటారట. ఈ ఫుల్ ఫోర్స్ తో కూల్చివేతలకు దిగుతారట. అన్ని చెరువులకు ఫుల్ టాంక్ లెవెల్, బఫర్ జోన్ వంటివి నిర్ధారణ అయిందా? లేక ఏదో ఒఒక అంచనా ప్రకారం ఇళ్లను తొలగిస్తున్నారా? ఎక్కడైనా వరదలకు కారణం అవుతున్న ఇళ్లను తీయడానికి ప్రయత్నిస్తే అదో పద్దతి. అంతేకాక తగు నోటీసులు ఇచ్చి ఇళ్లు ఖాళీ చేయడానికి అవకాశం కల్పించాలి. అవేమీ అవసరం లేదని అనుకుంటే అది మానవత్వం కాదు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ కు ఓట్లు వేయలేదన్న అక్కసుతోనే రేవంత్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చుతోందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కెటిఆర్ ఆరోపించారు. అర్థం, పర్థం లేకుండా కూల్చివేతలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ కాని, ఇతర మంత్రులు కాని ప్రభుత్వ చర్యలను సమర్థించుకుంటున్నారు. హైదరాబాద్ ప్రతిష్ట పెంచేందుకు, వరదల వంటి సమస్యలు రాకుండా చేయడానికే తమ ప్రయత్నమని అంటున్నారు. కానీ ప్రభుత్వాలే లాండ్ రెగ్యులరైజేషన్, బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీములు పెట్టి వేల కోట్లు వసూలు చేసుకున్నాయని, కానీ ఇప్పుడు అందుకు విరుద్దంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కొందరు విమర్శిస్తున్నారు.మరో కోణం ఏమిటంటే ప్రస్తుత హైడ్రా కూల్చివేస్తున్న ఇళ్లు, అపార్ట్ మెంట్లు చాలావాటికి బ్యాంకులు, ప్రైవేటు ఆర్దిక సంస్థలు రుణాలు ఇచ్చాయి. ఒక అంచనా ప్రకారం ఇప్పటివరకు కూల్చిన ఇళ్లకు సంబంధించి బ్యాంకు రుణాలే రూ.రెండు వేల కోట్లు వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ కూల్చివేతల వల్ల ఆ బకాయిలు వసూలు కావని బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. దీనిపై బ్యాంకులు కేద్రానికి, ఆర్బీఐకి లేఖలు రాస్తాయట. ఈ పరిణామాలను ఆలోచించిన తర్వాత, వివిధ పరిష్కార మార్గాలను చూపి ఇళ్ల కూల్చివేతలు చేస్తే ఫర్వాలేదు. అలా కాకుండా లేడికి లేచిందే పరుగు అన్నట్లు ప్రభుత్వం, హైడ్రా, తమకు తోచిన రీతిలో ఇళ్లు కూల్చితే దాని ప్రభావం లక్షల మందిపై పడుతుంది. రేవంత్ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురి అయ్యే అవకాశం ఉంది.లక్ష్యం, ఉద్దేశం మంచిదే అయినా, అమలు తీరు సరిగా లేకపోతే కూడా నష్టం జరుగుతుంది.ఎమర్జెన్సీ టైమ్ లో ఇందిరగాంధీ రెండో కుమారుడు సంజయ్ గాంధీ ఢిల్లీ సుందరీకరణ లో భాగంగా తుర్కుమాన్ గేట్ వద్ద ఇళ్లు కూల్పించారు. దానితో వేలాది మంది నష్టపోయారు. అలాంటి చర్యల ఫలితంగా ఎమర్జెన్సీ ఎత్తివేసి 1977లో ఎన్నికలకు వెళితే డిల్లీతో సహా ఉత్తరాది రాష్ట్రాలన్నిటిలో కాంగ్రెస్ తుడుచిపెట్టుకుపోయింది. అలాంటి అనుభవాలను నేతలు గ్రహించాలి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో బాధిత ప్రజలు రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగుతున్నారు.ఇందిరాగాంధీ పేరుతో ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీ పేదలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్న విమర్శ కూడా మంచిది కాదు. ఇందిరాగాంధీ పేదల కోసం 20 సూత్రాల పధకం తో సహా, పలు కార్యక్రమాలను అమలు చేసి వారి పెన్నిదిగా పేరు తెచ్చుకున్నారు.కాని ఇప్పుడు అదే కాంగ్రెస్ పేదల వ్యతిరేక పార్టీ అని పేరు తెచ్చుకోవడం మంచిది కాదు.నిరసనలు తీవ్రమవుతున్నాయని గమనించిన రేవంత్ ప్రభుత్వం కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తోంది. పూర్తి స్థాయిలో ప్రజామోదం లేకుండా రేవంత్ కూల్చివేతలపై ముందుకు వెళితే, తీవ్రమైన పరిణామాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు..కాంగ్రెస్ లో ప్రత్యర్ధి వర్గాలు దీనిని అవకాశంగా తీసుకుని రేవంత్ పదవికి ఎసరు పెట్టవచ్చు.కనుక రేవంత్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త అని చెప్పాలి.-కొమ్మినేని శ్రీనివాసరావుసీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
భయపెట్టాలనుకుంటున్నారా?: ‘హైడ్రా’పై హైకోర్టు ఆగ్రహం
సాక్షి,హైదరాబాద్:అమీన్పూర్ కూల్చివేతలపై విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్,అమీన్పూర్ ఎమ్మార్వోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అమీన్పూర్ మండలం శ్రీకృష్ణానగర్‌లో మహమ్మద్ రఫీకి చెందిన ఆసుపత్రి భవనం కూల్చేయడంపై హైకోర్టుకు రంగనాథ్ వివరణ ఇచ్చారు. అమీన్పూర్ కూల్చివేతలతో హైడ్రాకు సంబంధం లేదని తెలిపారు. విచారణకు రంగనాథ్ సోమవారం(సెప్టెంబర్30) ఉదయం హైకోర్టు ముందు వర్చువల్‌గా హాజరయ్యారు.సెప్టెంబర్ 5వ తేదీన తాము ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఆసుపత్రి భవనాన్ని ఎలా కూల్చివేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. ఆదివారం ఎలా కూలుస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను భయపెట్టాలనుకుంటున్నారా అని నిలదీసింది. తాము అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఈ సందర్భంగా హైకోర్టు చురకంటించింది. అమీన్పూర్ గురించి అడిగితే కావేరి హిల్స్‌పై సమాధానం ఎందుకు చెప్తున్నారని సున్నితంగా మందలించింది.హైడ్రాకు కూల్చివేతలు తప్ప వేరే పాలసీ లేదని ప్రజలనుకుంటున్నారని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.అధికారుల వివరణపై సంతృప్తి చెందని హైకోర్టు అమీన్పూర్ కూల్చివేతలపై స్టే కొనసాగిస్తున్నట్లు తెలిపింది. హైడ్రాతో పాటు అమీన్పూర్ ఎమ్మార్వో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కేసు విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది.చార్మినార్ ఎమ్మార్వో చెబితే చార్మినార్ కూల్చేస్తారా..హైకోర్టు ఘాటు వ్యాఖ్యలుఎన్ని చెరువులకు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేశారుచెరువుల్లో వర్షపు నీరు చేరకపోవడంపై ఏం చర్యలు తీసుకున్నారుఅసలు విషయాలు వదిలేసి కూల్చివేతలెందుకుచార్మినార్ కూల్చేయమంటే కూల్చేస్తారాకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులో ఎలా కూల్చివేతలు చేపడతారుకూల్చివేతలు ఇలానే చేస్తే ఇంటికెళ్లిపోతారు హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏంటో చెప్పండికూల్చివేతలు తప్ప మీకు వేరే పాలసీ ఏం లేనట్లుందిఅమీన్పూర్పై మాత్రమే సమాధానం చెప్పండి కావేరిహిల్స్ గురించి మేం అడగలేదుఅనుమతులిచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టండిప్రభుత్వ భూముల్ని రక్షించండి.. మేం అండగా ఉంటాంప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేదుప్రభుత్వ శాఖలకు ఆదాయం కావాలిమీ బాస్‌లను సంతృప్తి పరిచేలా పనులు చేయొద్దుసామాన్యులు, పెద్ద వాళ్ల మధ్య వ్యత్యాసం చూపిస్తున్నారుఆదివారం కూల్చడం ఏంటి?భయపెట్టాలని చూస్తున్నారా?వీకెండ్లోనే కూల్చివేతలు ఎందుకు కూల్చివేతలపై లీగల్ ఒపీనియన్ తీసుకున్నారాచట్ట వ్యతిరేకంగా పనిచేసే అధికారులను చంచల్‌గూడ, చర్లపల్లికి పంపిస్తాంఇదీ చదవండి: కూల్చివేతలపై వెనక్కి..! -
KSR Live Show: కూల్చడం కాదు.. ప్రత్యామ్నాయం చూపించాలి
-
KSR Live Show: 2300 భవనాలు కూల్చివేత.. వరల్డ్ క్లాస్ సిటీని చేయడానికే..
-
కూల్చివేతలపై వెనక్కి!
సాక్షి, హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రక్షాళన విషయాల్లో తీవ్ర ప్రజాగ్రహం వ్యక్తమవుతోన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెనకడుగు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్ మార్కింగ్ పేరుతో మూసీపై చేస్తున్న హడావుడిని ప్రస్తుతానికి నిలిపివేయాలని, దూకుడు తగ్గించాలని సర్కారు పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. మూసీ ప్రక్షాళన పేరుతో తమ ఇళ్లను కూల్చివేస్తున్నారని, హైడ్రా ఏర్పాటు చేసి పెద్దల జోలికి వెళ్లకుండా దశాబ్దాలుగా నివాసముంటున్న తమపై ప్రభుత్వం జులుం ప్రదర్శిస్తోందంటూ పేదలు ఎక్కడికక్కడ నిరసనలకు దిగుతుండటంతో జాగ్రత్త పడాలని నిర్ణయించినట్లు తెలిసింది. చెమటోడ్చి సంపాదించుకున్న నివాసాలను నేలమట్టం చేసి తమ బతుకులను ప్రభుత్వం రోడ్డుపైకి తెస్తోందనే భావన సామాన్య ప్రజల్లో క్రమంగా బలపడుతుండడంతో ఆచితూచి ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రతిపక్షాలు కూడా హైడ్రా, మూసీ విషయాల్లో ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టడం, పేదలు..మధ్యతరగతి వారి ఇళ్ల కూల్చివేతలపై తీవ్ర నిరసన వ్యక్తం చేయడం, సొంత పార్టీలో సైతం కొంత ప్రతికూలత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి వెనక్కు తగ్గాలనే నిర్ణయానికి వల్చినట్లు తెలిసింది. అన్ని కోణాలను బేరీజు వేసుకుంటూ ముందుకెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. పేదలను ఒప్పించి, మెప్పించాకే.. మూసీ నదిపై ఉన్న ఆక్రమణల తొలగింపు రాజకీయంగా వివాదాస్పదయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండా జాగ్రత్త తీసుకోవాలని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే వారితో మాట్లాడి పునరావాస ప్యాకేజీపై వారిని ఒప్పించి మెప్పించాలని, దీనిపై విస్తృత ప్రచారం చేయాలని, ఆ తర్వాతే అడుగులు ముందుకేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతానికి చెరువుల ఆక్రమణలు, ఎఫ్టీఎల్, బఫర్జోన్ల వరకే కార్యాచరణను పరిమితం చేయాలని, హైడ్రా గుర్తించిన వాణిజ్య భవనాలు, బడాబాబుల ఫామ్‌హౌస్‌లపై చర్యలు తీసుకోవడం ద్వారా సామాన్య, మధ్య తరగతి ప్రజల్లో వ్యతిరేకత తీవ్రం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలనే నిర్ణయానికి వల్చినట్టు సమాచారం. రుణాలపై బ్యాంకర్లతో సంప్రదింపులు మూసీ నిర్వాసితులకు కల్పించే పునరావాసంపై విస్తృత ప్రచారం చేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో హైదరాబాద్ నగరానికి చెందిన ఎమ్మెల్యేలు బాహాటంగానే మాట్లాడుతుండటం గమనార్హం. పేదల ఇళ్లు కూల్చాల్సి వస్తే వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడతామని, పరిహార ప్యాకేజీని అమలు చేస్తామని, బ్యాంకర్లతో రుణాలిప్పిస్తామంటూ హామీ ఇవ్వాలని వారు సూచిస్తున్నారు. పీసీసీ కూడా దీనిపై ఒక నివేదిక ఇవ్వాలని భావిస్తోంది. వీటితో పాటు, ముఖ్యంగా పునరావాసంపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించకుండా ముందుకెళ్లడం మంచి కన్నా ఎక్కువగా చెడు చేస్తుందని, రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తగులుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేక కార్యాచరణను ప్రభుత్వం రూపొందించనున్నట్లు తెలిసింది. రుణాల విషయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లను సమాయత్తం చేస్తున్నట్టు సమాచారం. అమెరికా పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన సీనియర్ మంత్రి శ్రీధర్‌బాబు కూడా ఇదే కోణంలో వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
‘హైడ్రా’ బూచి కాదు: రంగనాథ్
సాక్షి,హైదరాబాద్: హైడ్రా బూచి కాదని, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కమిషనర్ రంగనాథ్ అన్నారు. భవిష్యత్ తరాలకోసమే అక్రమ కట్టడాలు కూలుస్తున్నామని స్పష్టం చేశారు. హైడ్రా కారణంగా ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదన్నారు. రాష్ట్ర పురపాలక,పట్టణాభివృద్ధి(ఎంఏయూడీ)శాఖ కార్యదర్శి దానకిషోర్తో కలిసి రంగనాథ్ శనివారం(సెప్టెంబర్28) సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘గతంలోనూ మూసీ నిర్వాసితులను తరలించారు.చిన్న వర్షానికే సచివాలయం ముందు వరద పోటెత్తుతోంది. భారీగా వర్షపాతం నమోదైతే అధికారులు కూడా ఏమీ చేయలేరు.మూసీని సుందరీకరించడం కోసం కూల్చివేతలు చేయడం లేదు.గతంలో మూసీ సుందరీకరణ కోసం మోక్షగుండం విశ్వేశ్వరయ్య పలు సూచనలు చేశారు’అని పురపాలక కార్యదర్శి దాన కిషోర్ తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడడమే హైడ్రా లక్ష్యం: రంగనాథ్ప్రభుత్వ ఆస్తులను కాపాడటమే హైడ్రా లక్ష్యం, 2 నెలలుగా హైడ్రా కూల్చివేతలు జరుపుతోందిచెరువుల ఆక్రమణలు తొలగించాం.. హైడ్రాపై సోషల్ మీడియాలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారువరదల నుంచి ప్రజలను కాపాడటమే హైడ్రా లక్ష్యం. ముందుగా నోటీసులు ఇచ్చి కూల్చుతున్నాంఇష్టారాజ్యంగా ఆక్రమణలు చేసుకుంటూపోతే కట్టడి చేయవద్దా?ఆక్రమణల్లో పేదవాళ్ల ఇళ్లు ఉంటే వాళ్ల జోలికి వెళ్లడం లేదుమేము కూల్చిన ఏ భవనానికి అనుమతులు లేవుభవిష్యత్తులో వరదలతో కోటి మంది ఇబ్బంది పడతారుఆస్పత్రుల్లో పేషెంట్లు లేకపోయినా ఉన్నట్లుగా చూపిస్తున్నారుకొందరి తప్పుడు ప్రచారం వల్ల బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుందిహైడ్రాను భూతంలా చూపిస్తున్నారు. తప్పు చేసిన బిల్డర్లపై క్రిమినల్ కేసులు పెడుతున్నాంహైడ్రా కారణంగా ఎవరూ ఆత్మహత్యలు చేసుకోలేదు హైడ్రాపై ఆందోళన వద్దు..నిర్వాసితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం: దానకిషోర్వందేళ్ల క్రితమే నిజాం మూసీ నది అభివృద్ధి నమూనాలు రూపొందించారు.ఈ నమూనాలు థేమ్స్ నది కంటే అద్భుతంగా ఉన్నాయి.హైదరాబాద్ నగరంలో ఇటీవల 20 నిమిషాలకే 9.1 సెంటీమీటర్ల వర్షం పడింది.20 నిమిషాల కొద్దిపాటి వర్షానికే నగరం మునుగుతోంది.మరో 20 నిమిషాలు వర్షం పడితే మేము కూడా ఏమీ చేయలేని పరిస్థితిమూసీ ఒడ్డున కూల్చివేతలు సుందరీకరణ కోసం మాత్రమే కాదు..ప్రమాదం నుంచి కాపాడేందుకు కూడాపేద ప్రజలు నీళ్ళల్లో ఉండొద్దు అనే ఉద్దేశంతోనే మూసీ ప్రక్షాళనప్రపంచంలో అభివృద్ధి చెందిన నగరాల పర్యటన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో అక్టోబర్‌లో ఉంటుంది.మూసీ నీళ్ల శుద్ధి కోసం 3800 కోసం కొత్త ఎస్టీపీలు తీసుకువస్తాం.మూసీ నీళ్లను మంచి నీళ్ళుగా మార్చేందుకు రూ. 10వేల కోట్లతో పలు కార్యక్రమాలు త్వరలో ప్రారంభమవుతాయి.మూసీ పరీవాహక ప్రాంతం ప్రజలు డబుల్ బెడ్ కోసం ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారు.10వేల కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తే వెళ్తామని మాతో చెప్పారు..కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి.మూసీ బాధితులకు ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుంది.. ఈ విషయమై కమిటీ వేశాం.మూసీ నదీ పరివాహక ప్రాంత వాసులను 14 ప్రాంతాలకు తరలించాలనుకుంటున్నాం.పిల్లల చదువుల కోసం తల్లితండ్రులు ఆందోళన అవసరం లేదు.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం.23 లోకేషన్లలో నిర్వాసితులు మానసికంగా ఆందోళన చెందకుండా కౌన్సెలింగ్ ఇస్తారు.సీనియర్ అధికారులతో కాంప్స్ ఏర్పాటు చేస్తాం.50 కుటుంబాలను ఇప్పటికే షిఫ్ట్ చేశారు... మరో 150 కుటుంబాలు షిఫ్ట్ చేస్తున్నారు.హైడ్రా వస్తుంది కూలుస్తుంది అనేది అవాస్తవం...ప్రజలు ఆందోళన అవసరం లేదు.ఏ కుటుంబాలను బలవంతంగా షిఫ్ట్ చేయించడం లేదు..స్వచ్చందంగా ప్రజలు సహకరించాలినష్టపరిహారం ఇవ్వాల్సిన ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం 2013 చట్టం ప్రకారం ఇస్తుంది. ఇదీచదవండి: హైడ్రా బాధితుల తరపున కొట్లాడతాం: బీఆర్ఎస్ -
మూసీలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సిద్ధమవుతున్న సర్కార్
-
మళ్లీ హైడ్రా పంజా
పటాన్చెరు: ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేశారంటూ హైడ్రా అధికారులు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కిష్టారెడ్డిపేట్, పటేల్‌గూడలలో భవంతులను నేలమట్టం చేశారు. అమీన్పూర్ రెవెన్యూ అధికారుల నివేదిక మేరకు హైడ్రా అధికారులు ఆయా నిర్మాణాలను కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఉదయం నుంచి కూల్చివేతల ప్రక్రియను చేపట్టారు. కిష్టారెడ్డిపేట్‌లో మూడు పెద్ద భవనాలను, పటేల్‌గూడలో 22 విల్లాలను కూల్చివేశారు. ఈ ప్రక్రియ ఆదివారం రాత్రి వరకూ కొనసాగుతూనే ఉంది. కూల్చివేతల కోసం భారీ క్రేన్లను వినియోగించారు. అమీన్పూర్ రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు కూల్చివేత ప్రక్రియలో పాల్గొన్నారు. పటాన్చెరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పటేల్‌గూడలో విల్లాలు నిర్మించిన యజమాని అధికారులతో వాగ్వాదానికి దిగారు. నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయని చెప్పారు. అయితే తాము ప్రభుత్వ భూమి పరిధిలోకి వచ్చే నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తున్నామని తహసీల్దార్ రాధ ఆయనకు వివరించారు. విల్లాల నిర్మాణానికి సర్వే నంబర్ 6 పరిధిలో అనుమతులు తీసుకొని సర్వే నంబర్ 12లో నిర్మిస్తున్నట్లు గుర్తించామని ఆమె స్పష్టం చేశారు. కాబట్టి ఎలాంటి కోర్టు స్టే ఆర్డర్ కూల్చివేతల ప్రక్రియలకు అడ్డుకాదని చెప్పారు. కిష్టారెడ్డిపేట్‌లో సర్వే నంబర్ 164లో మూడు భవంతుల నిర్మాణాలు జరిగాయని, వాటిని కూడా తొలగిస్తున్నట్లు తెలిపారు. కిష్టారెడ్డిపేట్‌లో సర్వే నంబర్ 164లో ప్రభుత్వ భూములలో నిర్మాణాలు చేశారని వారికి నోటీసులు ఇచ్చి తొలగిస్తున్నామని స్పష్టం చేశారు. కూల్చివేత ప్రక్రియకు ముందే హైడ్రా, రెవెన్యూ అధికారులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వ భూమి పరిధిలోకి వచ్చే ప్రాంతాన్ని పరిశీలించి కూల్చివేతలకు ఉపక్రమించారు. సామాన్య ప్రజలకు, పరిసర నివాసితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కూల్చివేతల్లో ఒక డాక్టర్ భవనం కూడా ఉండటం గమనార్హం. మరో భవనం ఏపీలోని ఒక ఎమ్మెల్యేకు సంబంధించిందని చెబుతున్నారు. ఈ సందర్భంగా బాధితులు తాము మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము పాట్లను కొనుగోలు చేసి నిర్మాణాలు చేశామే తప్ప.. కబ్జా చేసి బహుళ అంతస్తులు నిర్మించలేదని వాదిస్తున్నారు. మరిన్ని కూల్చివేతలు.. కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. కిష్టారెడ్డిపేట్ పరిసర గ్రామాల పరిధిలో ప్రభుత్వ స్థలాల్లో జరిగిన నిర్మాణాల కూల్చివేతకు అధికారులు నివేదిక రూపొందించినట్లు తెలిసింది. పొరుగు గ్రామాల ప్రభుత్వ భూముల్లో కిష్టారెడ్డిపేట్ పంచాయతీ అనుమతులతో జరిగిన నిర్మాణాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. అదే గ్రామంలో చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలను కూడా రెవెన్యూ అధికారులు గుర్తించి హైడ్రాకు నివేదిక ఇచ్చి నట్టు సమాచారం. -
HYD: సుచిత్రలో అక్రమ కట్టడాల కూల్చివేత
సాక్షి,హైదరాబాద్:సికింద్రాబాద్ కంటోన్మెంట్లో అక్రమంగా నిర్మించిన వాణిజ్య భవనాలను కంటోన్మెంట్ అధికారులు శుక్రవారం(సెప్టెంబర్20) కూల్చివేశారు. రక్షణ శాఖ భూముల్లో నిర్మించినందునే వీటిని కూల్చివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.కంటోన్మెంట్ పరిధిలోని సుచిత్ర మార్గంలో నాలా ఫుట్‌పాత్‌ను ఆక్రమిస్తూ కొందరు దుకాణాలు నిర్మించారు. ఈ నిర్మాణాల వల్ల ట్రాపిక్కు ఇబ్బందవుతోందని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో బుల్డోజర్లతో రంగంలోకి దిగిన అధికారులు దుకాణాలను నేలమట్టం చేశారు. కాగా, హైదరాబాద్ నగరంలో నాలాలు, చెరువులను ఎంతటివారు ఆక్రమించినా వదిలేది లేదని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేసిన విషయం తెలిసిందే. ఇదే బాటలో కంటోన్మెంట్ కూడా అక్రమ కొట్టడాలపై చర్యలు ప్రారంభించడం గమనార్హంఇదీ చదవండి.. ప్రజాభవన్ చుట్టూ కంచెలు ఎందుకు: కేటీఆర్