రూపుదిద్దుకుంటున్న మురారీ, కమల్ నారాయణ్!
సంప్రదాయ పద్ధతిలో కాకుండా భిన్నమైన నిర్మాణాలు.. అది కూడా అందుబాటు ధరల్లో నిర్మించడం గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రత్యేకత. ఇప్పటికే అవిఘ్న ప్రాజెక్ట్‌లో పడవ ఆకారంలో ఎలివేషన్, విల్లా ఓనిక్స్‌లో గ్రీన్ హౌస్ కాన్సెప్ట్‌తో కస్టమర్లను ఆకర్షించిన సంస్థ.. ఇప్పుడు ఎలివేషన్‌లో వర్టికల్ గార్డెన్స ఏర్పాటుతో నగరవాసుల ముందుకొచ్చింది. అప్పా జంక్షన్లో మురారీ, పద్మారావునగర్‌లో కమల్నారాయణ్ ప్రాజెక్ట్ ఎలివేషన్లను వర్టికల్ గార్డెన్సలో తీర్చిదిద్దుతోంది. సింగపూర్‌లోని రాయల్ పార్క్ హోటల్‌ను ఆదర్శంగా తీసుకొని ఈ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నామని గిరిధారి కన్స్రక్షన్స ఎండీ ఇంద్రసేనా రెడ్డి చెప్పారు. ప్రాజెక్ట్ విశేషాలను ‘సాక్షి రియల్టీ’తో పంచుకున్నారు.
⇔ ఒకవైపు 30 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం.. మరోవైపు 180 డిగ్రీల కోణంలో 60 అడుగుల ఎత్తుండే పచ్చని పచ్చదనం! ఇదీ మురారి ప్రాజెక్ట్ గురించి ఒక్కముక్కలో చెప్పాలంటే!! అప్పా జంక్షన్లో 2 ఎకరాల్లో మురారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. ఇందులో మొత్తం 155 ఫ్లాట్లొస్తారుు. 1,200-2,016 చ.అ. విస్తీర్ణాల్లో ఫ్లాట్లుంటారుు. 60 శాతం 2 బీహెచ్‌కే 40 శాతం 3 బీహెచ్‌కే ఫ్లాట్లు. ధర చ.అ.కు రూ.2,900. ప్రాజెక్ట్ ప్రారంభం కాకముందే 65 శాతం అమ్మకాలు పూర్తయ్యాయంటే ప్రాజెక్ట్ అందం, ఆకర్షణ, వసతుల గురించి అర్థం చేసుకోవచ్చు. ఇందులో 7 వేల చ.అ.ల్లో క్లబ్ హౌజ్ అది కూడా చుట్టూ నీటితో ద్వీపకల్పంలా తీర్చిదిద్దుతున్నాం. మురారీ పక్కనే ఉన్న అవిఘ్న రెండు ప్రాజెక్ట్‌కు కలిపి 70 రకాల వసతులిస్తున్నాం. 2018 చివరినాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం.
⇔ పద్మారావునగర్‌లో 3,200 గజాల్లో కమల్నారాయణ్ ప్రాజెక్ట్‌ను చేస్తున్నాం. మొత్తం 53 ఫ్లాట్లు. 1,120-1,765 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటారుు. ధర చ.అ.కు రూ.5,200. ఇందులోనూ 50 శాతం అమ్మకాలు పూర్తయ్యారుు. 2018 చివరినాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం. త్వరలోనే అప్పా జంక్షన్లో 4 ఎకరాల్లో రాజక్షేత్ర, 2 ఎకరాల్లో వ్యూ ప్రాజెక్ట్‌లను కూడా ప్రారంభించనున్నాం. రాజక్షేత్ర ప్రాజెక్ట్‌ను రాజ ప్రసాదాలు, కోటల తరహాలో, వ్యూ ప్రాజెక్ట్‌ను సాహాసోపేతమైన క్రీడలుండేలా ప్రణాళికలు రచిస్తున్నాం.
⇔ 2004లో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన గిరిధారి.. ఇష్టా, ఐసోలా, ఎగ్జిక్యూటివ్ పార్క్, సారుు ఆశ్రయ, విల్లా ఓనిక్స్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసింది. సుమారు 750 యూనిట్స్లను కొనుగోలుదారులకు అందించింది కూడా. వచ్చే మార్చి నాటికి ఇష్టా ప్రాజెక్ట్‌లో 90 ఫ్లాట్లను కొనుగోలుదారులకు అందించనున్నాం. వచ్చే డిసెంబర్ నాటికి అవిఘ్న ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం.