పిబరే రామరసం
అమలాపురం టౌన్ :
రామనామ విశిష్టతను తెలియజెప్పి.. అద్వైత తత్వాలను సంస్కృతంలో రచించిన కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు సదాశివ బ్రహ్మేంద్రయోగి విరచిత ‘పిబరే రామరసం’ను విద్యార్ధులు అక్షరాకృతిలో ఆవిష్కరించారు. అమలాపురం గౌతమ మహర్షి గో సంరక్షణ సమితి గోశాల చేపడుతున్న 108 కోట్ల శ్రీరామ నామ లిఖిత యజ్ఞంలో భాగంగా సర్ సీవీ రామన్ పబ్లిక్ స్కూలు ప్రాంగణంలో గురువారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ‘పిబరే రామరసం’ అనే ఎనిమిది అక్షరాలకు సంబంధించి ఒక్కో అక్షరాన్ని 15 అడుగుల ఎత్తుతో రాసి అందులో 100 మంది విద్యార్థులను కూర్చోబెట్టారు. ఇలా ఎనిమిది అక్షరాలకు 800 మంది విద్యార్ధులను తెల్లటి దుస్తులతో కూర్చోబెట్టారు. మరో 400 మంది విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోశాల వ్యవస్థాపకుడు పోతురాజు రామకృష్ణారావు పర్యవేక్షణలో సర్ సీవీ రామన్ పబ్లిక్ స్కూలు డైరెక్టెర్లు పరసా రాజా, రవణం రాంబాబు, ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీరామచంద్రమూర్తి ఈ ఏర్పాట్లు చేశారు.