Dil raju
-
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ విక్టరీ వేడుక (ఫొటోలు)
-
ఓటీటీలో 'గేమ్ ఛేంజర్'.. అనుకున్న దానికంటే ముందే స్ట్రీమింగ్
రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ మూవీని దిల్ రాజు నిర్మించారు. అయితే, సినిమా విడుదల రోజు నుంచే నెగటివ్ టాక్ రావడంతో భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. కలెక్షన్ల పోస్టర్ విషయంలోనూ తప్పుడు లెక్కలు వేశారంటూ పెద్ద ఎత్తున నెట్టింట ట్రోల్ జరిగిన విషయం తెలిసిందే.సినిమా విడుదలైన నెల రోజుల్లోనే గేమ్ ఛేంజర్ ఓటీటీలోకి వచ్చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫిబ్రవరి 7న ఈ మూవీ విడుదల కానుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. వాస్తవంగా ఈ చిత్రం విడుదలైన 30 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని డీల్ ఉంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 14న స్ట్రీమింగ్కు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ, అనుకున్న సమయం కంటే ముందే గేమ్ ఛేంజర్ చిత్రాన్ని అమెజాన్ విడుదల చేస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే, హిందీ వర్షన్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.కథేంటంటే..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి( శ్రీకాంత్) ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు పూర్తిగా మారిపోతాడు. రాష్ట్రంలో ఇకపై అవినీతి జరగొద్దని, నిజాయితీగా పని చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశిస్తాడు. సీఎం నిర్ణయం ఆయన కొడుకు, మైనింగ్ మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి(ఎస్జే సూర్య)కి నచ్చదు. ముఖ్యమంత్రికి తెలియకుండా అవినీతిని కొనసాగిస్తుంటాడు. అంతేకాదు తండ్రిని తప్పించి సీఎం సీటులో కూర్చోవాలని కుట్ర చేస్తుంటాడు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో ఐపీఎస్‌గా విధులు నిర్వర్తిస్తూ.. సివిల్స్ పరీక్ష మళ్లీ రాసి ఐఏఎస్‌గా సెలెక్ట్ అయిన రామ్ నందన్(రామ్ చరణ్).. విశాఖపట్నం కలెక్టర్‌గా బాధ్యతలు చేపడతాడు. జిల్లాలో అవినీతి, దౌర్జన్యాలు మానేయాలని రౌడీలకు, వ్యాపారులకు వార్నింగ్ ఇస్తాడు.ఈ క్రమంలో మంత్రి మోపిదేవి, కలెక్టర్ మధ్య వైరం ఏర్పడుతుంది. మరోవైపు సీఎం సత్యమూర్తి చివరి కోరిక అంటూ ఓ భారీ ట్విస్ట్ ఇస్తాడు. అదేంటి? అసలు సీఎం సత్యమూర్తిలో మార్పుకు గల కారణం ఏంటి? అప్పన్న(రామ్ చరణ్) ఎవరు? పార్వతి(అంజలి)తో కలిసి ఆయన పోరాటం ఏంటి? కలెక్టర్ రామ్‌కి అప్పన్నకు ఉన్న సంబంధం ఏంటి? సీఎం సీటు కోసం మోపిదేవి చేసిన కుట్రలను రామ్ ఎలా అడ్డుకున్నాడు? ఒక ఐఏఎస్ అధికారిగా తనకున్న పవర్స్‌ని ఉపయోగించి రాష్ట్ర రాజకీయాలను ఎలా మార్చాడు? దీపిక(కియారా అద్వానీ)తో రామ్ ప్రేమాయణం ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
ఐటీ ఎదుట దిల్ రాజు
-
ఐటీ ఆఫీస్‌లో ముగిసిన దిల్ రాజు విచారణ
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు (Dil Raju) తాజాగా ఆదాయపు పన్ను శాఖ అధికారుల ఎదుట విచారణలో పాల్గొన్నారు. సుమారు రెండు గంటల పాటు ఆయన్ను ఐటీ అధికారులు విచారించారు. ఈ మధ్య కాలంలో తన బ్యానర్ నుంచి విడుదలైన సినిమాల నిర్మాణ వ్యయం, ఆదాయం గురించి వారు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆయనకు సంబంధించిన వ్యాపారాల అకౌంట్స్ అన్నీ అధికారులు తణిఖీలు చేశారని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్మెంట్లను ఐటీ అధికారులకు అందించినట్లు సమాచారం. విచారణ అనంతరం బషీర్‌బాగ్‌లోని ఐటీ కార్యాలయం నుంచి దిల్ రాజు తిరిగి వెళ్లిపోయారు. అయితే, ఆయన్ను మరోసారి విచారిస్తారా..? లేదా..? అనే విషయం గురించి ఎలాంటి సమాచారం లేదు. -
ఐటీ అధికారుల ఎదుట హాజరైన నిర్మాత దిల్ రాజ్
టాలీవుడ్ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) తాజాగా ఆదాయపు పన్ను శాఖ అధికారుల ఎదుట హాజరయ్యారు. కొద్దిరోజుల క్రితం సుమారు నాలుగురోజుల పాటు ఆయన ఇళ్లు, ఆఫీసులలో ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన వ్యాపారాలకు సంబంధించిన అకౌంట్స్ అన్నీ అధికారులు తణిఖీలు చేశారని దిల్ రాజు కూడా చెప్పారు. అయితే, అదే సమయంలో దిల్ రాజు వ్యాపారాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఐటీ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. ఆయన వ్యాపారాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమలో తన సినిమాలకు అయిన ఖర్చు ఎంత..? ఎగ్జిబిటింగ్ లెక్కలతో పాటు మూవీ విడుదల తర్వాత వచ్చే లాభాల వ్యవహారంపై ఐటీ అధికారలు ఆరా తీయనున్నారు. సంక్రాంతి సందర్భంగా భారీ బడ్జెట్ సినిమాలను దిల్ రాజు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలోనే ఆయనపై ఐటీ సోదాలు జరిగినట్లు తెలుస్తోంది. దిల్ రాజ్‌తో పాటు పలువురు నిర్మాత, దర్శకుడు ఇళ్లలో కూడా ఐటీ సోదాలు నిర్వహించింది.ఐటీ సోదాలు అంశంలో ఎవరూ ఎక్కువగా ఊహించుకొవద్దని దిల్ రాజు గతంలోనే అన్నారు. ఎలాంటి హాడావుడి లేకున్నా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇండస్ట్రీలో అంతా ఆన్లైన్లో టికెట్ బుకింగ్ కొనసాగుతుంది అన్నారు. దీంతో వ్యాపారా ట్రాన్సాక్షన్సె కూడా ఆన్లైన్ జరుగుతున్నాయి అన్నారు. అయితే, ఫిబ్రవరి 3న ఐటీ అధికారులు కలవమన్నారని ఆ సమయంలో తమ ఆడిటర్స్ వెళ్లి కలుస్తారని దిల్ రాజు తెలిపిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రస్తుతం వారు వెళ్లినట్లు తెలుస్తోంది. -
వసంత పంచమి.. అక్షరాభ్యాసం
నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లా బాసర సరస్వతీదేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలు కొనసాగుతున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే బాసర గోదావరి నదీతీరంలో భక్తులు కనిపించారు. పుణ్యస్నానాలు ఆచరించి, సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు జరిపించారు. అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. తెలంగాణ ఫిలిమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్‌రాజు కుటుంబ సమేతంగా బాసరకు వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తన కుమారుడికి అక్షరాభ్యాసం చేయించారు. సాయంత్రం కలెక్టర్ అభిలాష అభినవ్ వసంత పంచమి ఏర్పాట్లను పరిశీలించారు. ఎస్పీ జానకీషర్మిల బందోబస్తును పర్యవేక్షించారు. కాగా, సోమవారం భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భక్తులకు తగినట్లుగా ఏర్పాట్లు చేయాలని ఆలయ సిబ్బందికి ఉన్నతాధికారులు సూచించారు. -
'గేమ్ ఛేంజర్' ఫస్ట్ డే కలెక్షన్ల పోస్టర్‌పై దిల్ రాజు కామెంట్స్
రామ్ చరణ్ (Ram Charan), శంకర్ (Shankar) కాంబినేషన్లో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన పొలిటికల్ డ్రామా చిత్రం 'గేమ్ ఛేంజర్'. జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం తొలిరోజే రూ. 186 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మేకర్స్ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే, అదంతా ఫేక్ కలెక్షన్స్ అంటూ నిర్మాత దిల్ రాజుపై నెటిజన్లు కామెంట్ చేశారు. ఇదే సమయంలో గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే నాడు కేవలం రూ. 80 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టిందని పలు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా జరిగిన మీడియా సమావేశంలో గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్స్ పోస్టర్ గురించి ఆయన రెస్పాండ్ అయ్యారు.‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా భారీ విజయం అందుకోవడంతో డిస్ట్రిబ్యూటర్స్ గ్రాటిట్యూడ్ మీట్ పేరుతో మేకర్స్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్కడ నిర్మాత దిల్ రాజుకు ఒక ప్రశ్న ఎదురైంది. సంక్రాంతి పండుగ సమయంలో మీరు రెండు సినిమాలు విడుదల చేస్తే.. ఒక సినిమాకు మొదటిరోజు కలెక్షన్ల వివరాలు మాత్రమే చెప్పి.. రెండో సినిమాకు చాలా పోస్టర్లతో ఆ వివరాలు చెప్పడం వెనుకున్న కారణం ఏంటి అని విలేఖరి ప్రశ్నించారు. అందుకు దిల్ రాజు కాస్త అసహనంగానే ఇలా చెప్పారు. 'ఈ విషయంలో మాకు కొన్ని బలహీనతలు ఉంటాయి. మీకు కూడా (మీడియా) తెలుసు కదా..! మళ్లీ నన్నెందుకు అడుగుతున్నారు. ప్రతి సినిమా కలెక్షన్ల వివరాలు మీ వద్దే ఉంటాయని అందరూ అంటున్నారు. ఇక నుంచి కలెక్షన్ల వివరాలు కూడా మీరే ప్రకటించండి.' అని అసహనంగా దిల్ రాజు అన్నారు. అయితే ఇదే సమయంలో ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా కలెక్షన్స్ పోస్టర్స్ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. మేకర్స్ విడుదల చేస్తున్న కలెక్షన్ల పోస్టర్స్‌ను చూసి ప్రేక్షకులు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.pic.twitter.com/NVwAIJW0HG— Out of Commentary (@OutofContestTel) February 1, 2025 -
భీమవరంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ సంబరాలు (ఫొటోలు)
-
ఐటీ సోదాలపై దిల్ రాజు స్పందన
-
ఐటీ రైడ్స్‌పై స్పందించిన నిర్మాత 'దిల్ రాజు'
టాలీవుడ్ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) నివాసంలో ఐటీ అధికారుల సోదాలు దాదాపు ముగిశాయి. గత ఐదురోజులుగా ఆయన ఇళ్లు, ఆఫీసులలో సోదాలు జరిగాయి. ఈ క్రమంలో తాజాగా ఐటీ సోదాలు గురించి ఆయన రియాక్ట్ అయ్యారు.'ఐటీ రైడ్స్ జరిగినప్పుడు మా వద్ద రూ. 20 లక్షలు ఉన్నాయి. మా అకౌంట్ బుక్స్ అన్నీ ఐటీ అధికారులు చెక్ చేశారు. వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఇలాంటి ఐటీ సోదాలు సర్వసాధారణం. మా దగ్గర డబ్బు , డాకుమెంట్స్ తీసుకున్నారని వార్తలు వేశారు. అందులో నిజం లేదు. గత ఐదేళ్ల నుంచి నేను ఎక్కడా కూడా పెట్టుబడులు పెట్టలేదు. నా దగ్గర డబ్బు, ఆస్తి పత్రాలు వంటివి దొరకలేదు. అయితే, నా దగ్గర నుంచి రూ. 5 లక్షలు, శిరీష్ దగ్గర నుంచి రూ. 4.50 లక్షలు ఐటీ అధికారులు తీసుకున్నారు. మేము క్లీన్‌గా ఉండొచ్చు.. కానీ, మా దగ్గర డబ్బు తీసుకున్న వారు కూడా క్లీన్‌గా ఉండాలి కదా. 2008లో ఒకసారి నా ఆఫీసులో సెర్చ్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు జరిగింది. మా అకౌంట్స్ అన్నీ చెక్ చేసిన ఐటీ డిపార్ట్మెంట్ అధికారులు ఆశ్చర్యపోయారు. దిల్ రాజు దగ్గర ఏదో ఎక్స్పెక్ట్ చేశాం. కానీ, ఇక్కడ అన్ని లెక్కలు నీట్‌గా ఉన్నాయని వారే చెప్పారు. మా అమ్మ కు సడెన్‌గా దగ్గు వస్తే హాస్పిటల్ తీసుకెళ్లాం. కానీ, హార్ట్ అటక్ అని ప్రచారం చేశారు. అందులో ఎలాంటి నిజం లేదు. సినిమా ఇండస్ట్రీలో చాలామందిపై ఐటీ రైడ్స్ జరిగాయి. నన్ను ఎవరు టార్గెట్ చేయలేదు.' అని ఆయన అన్నారు.కలెక్షన్స్ ఎక్కువ చెప్పడం తప్పే: దిల్ రాజుఐటీ సోదాలు అంశంలో ఎవరూ ఎక్కువగా ఊహించుకొవద్దని దిల్ రాజు అన్నారు. ఎలాంటి హాడావుడి లేకున్నా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇండస్ట్రీలో అంతా ఆన్లైన్లో టికెట్ బుకింగ్ కొనసాగుతుంది అన్నారు. దీంతో వ్యాపారా ట్రాన్సాక్షన్సె కూడా ఆన్లైన్ జరుగుతున్నాయి అన్నారు. ఇండస్ట్రీ అంతటా రైడ్స్ జరిగాయి కదా అని గుర్తు చేశారు. సినిమాల కలెక్షన్స్ ఎక్కువ చేసి చూపించటంపై ఇండస్ట్రీ అంతా కూర్చొని మాట్లాడాతామని దిల్ రాజు పేర్కొన్నారు. ముమ్మాటికి ఈ విధానం తప్పు అని అన్నారు. అందరూ ఈ తీరు మార్చుకొవాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి 3న ఐటీ అధికారులు కలవమన్నారని ఆ సమయంలో తమ ఆడిటర్స్ వెళ్లి కలుస్తారని దిల్ రాజు తెలిపారు. -
దిల్‌రాజు వాంగ్మూలం నమోదు చేసిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్ దిల్‌రాజు ఇల్లు, కార్యాలయాలపై వరుసగా నాలుగో రోజూ ఆదాయపన్నుశాఖ అధికారుల సోదాలు కొనసాగాయి. మంగళవారం నుంచి పలువురు టాలీవుడ్ నిర్మాతలు, నిర్మాణ సంస్థలకు చెందిన వ్యక్తులు, ఫైనాన్షియర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల బృందాలు తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సుకుమార్ సహా పలువురి ఇళ్లలోనూ గురువారం వరకు సోదాలు జరిగాయి.దిల్ రాజు ఇంట్లో మాత్రం ఐటీ సోదాలు శుక్రవారంతో ముగిశాయి. 5 రోజుల సెర్చ్ వారెంట్‌తో ప్రారంభించిన సోదాలకు సంబంధించి శుక్రవారం దిల్ రాజు వాంగ్మూలం నమోదు చేశారు. ఈ క్రమంలో ఐటీ అధికారులు దిల్ రాజును శ్రీనగర్ కాలనీలోని శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్‌కు తీసుకెళ్లారు. ఆయన సమక్షంలోనే డాక్యుమెంట్లను పరిశీలించి వాటిని స్వా«దీనం చేసుకున్నారు. గేమ్‌ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సహా ఇటీవల నిర్మించిన సినిమాల గురించి ఆరా తీసినట్లు తెలిసింది.డాకు మహారాజ్ సినిమాకు దిల్‌రాజు డి్రస్టిబ్యూటర్‌గా ఉండటంతో ఆ సినిమా కలెక్షన్లపైనా కొన్ని వివరాలు తీసుకున్నట్టు సమాచారం. అనంతరం పలు డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీలు, సినిమాలకు ఖర్చు చేసిన సొమ్ము, వచ్చిన లాభాలు వంటి అంశాలపై ఐటీ అధికారులు దిల్ రాజుతోపాటు ఎస్వీసీ ఆడిటర్, అకౌంటెంట్ వాంగ్మూలాలను నమోదు చేసినట్లు తెలిసింది. ఆదాయ పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలకు సంబంధించి వివరణ కోరినట్లు సమాచారం. సినీ ప్రముఖుల ఇళ్లలో ముగిసిన ఐటీ సోదాలుసినీ ప్రముఖుల ఇళ్లలో నాలుగు రోజుల పాటు కొనసాగిన ఐటీ సోదాలు.. శనివారం తెల్లవారుజామున ముగిశాయి. ఈ సోదాల్లో కీలక ాడాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. -
ఎస్వీసీ ఆఫీస్‌కు దిల్ రాజును తీసుకెళ్లిన ఐటీ అధికారులు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) ఇళ్లు, ఆఫీసులలో నాలుగోరోజు కూడా ఐటీ సోదాలు(Income Tax Officer) జరుగుతున్నాయి. తనిఖీల్లో భాగంగా ఇప్పటికే భారీగా పలు డాక్యుమెంట్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా దిల్రాజును ఆయన నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌కు సంబంధించిన ఆఫీస్‌కు ఆదాయపన్ను శాఖ అధికారులు తీసుకెళ్లారు.దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు దాదాపు ముగిశాయి. నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ సోదాలలో పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక మహిళా అధికారి సమక్షంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. దిల్ రాజు నివాసం నుంచి వారు తాజాగా సాగర్ సొసైటీలోని తన ఎస్వీసీ కార్యాలయానికి వెళ్లారు. తమ వాహనంలోనే దిల్ రాజును వారు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎస్వీసీ ఆఫీస్‌లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు దిల్ రాజు సోదరుడు శిరీశ్ నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. వారు నిర్మించిన పలు సినిమాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపుల విషయంలో అవకతవకలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ రైడ్స్ గురించి అధికారులు ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి విషయాలు ప్రకటించలేదు. -
టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో మూడోరోజు ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: సినీప్రముఖుల ఇళ్లలో వరుసగా మూడోరోజు ఐటీ సోదాలు (Income Tax department Raids) కొనసాగుతున్నాయి. నిర్మాతలతో పాటు నిర్మాణ సంస్థలకు ఫైనాన్స్ చేసిన వారి నివాసాలు, ఆఫీసుల్లోనూ అధికారులు తనిఖీ చేస్తున్నారు. దర్శకుడు సుకుమార్, నిర్మాత నెక్కింటి శ్రీదర్, దిల్ రాజు (Dil Raju) ఇళ్లు, కార్యాలయల్లో సోదాలు కొనసాగుతున్నాయి. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి.టాలీవుడ్‌పై టార్గెట్తెలుగు సినీ నిర్మాతల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ మంగళవారం సోదాలు మొదలుపెట్టింది. దాదాపు 55 బృందాలతో ఈ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లో, ప్రముఖ గాయని సునీత భర్త రామ్‌కు చెందిన మ్యాంగో మీడియా ఆఫీస్‌లోనూ సోదాలు చేశారు. పుష్ప 2 సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టిన నేపథ్యంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యాంకు లావాదేవీలను పరిశీలించారు. వసూళ్లకు తగ్గట్లుగా ఆదాయపన్ను చెల్లించలేదని గుర్తించారు.బుధవారం నాడు సుకుమార్ ఇంటికీ ఐటీ అధికారులు వెళ్లారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన సుకుమార్‌ను నేరుగా ఇంటికి తీసుకెళ్లిన అధికారులు ఆయన బ్యాంకు లావాదేవీలు, లాకర్ల గురించి ఆరా తీశారు. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్ ఇంట్లోనూ సోదాలు చేశారు. దిల్ రాజు కూతురు హన్సిత, సోదరుడు నర్సింహ ఇంట్లోనూ తనిఖీలు చేశారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ వారం రోజుల్లో రూ. 203 కోట్లు వసూళ్లు చేసిందని, కానీ లాభాలకు తగ్గట్లు పన్నులు చెల్లించలేదని ఐటీ శాఖ గుర్తించింది.మరోవైపు ఈ వ్యవహారంపై దిల్‌రాజు బుధవారం స్పందిస్తూ.. ఐటీ రైడ్స్ తన ఒక్కడిపైనే0 జరగట్లేదని.. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నట్లు తెలిపారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు అధికారులకు సహకరిస్తున్నారని చెప్పారు. -
రెండోరోజూ ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు రెండోరోజూ కొనసాగాయి. ప్రముఖ నిర్మాత, తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి మండలి చైర్మన్ దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌తోపాటు మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థల కార్యాలయాలు, కొందరు సినీ ఫైనాన్షియర్ల ఇళ్లలో మంగళవారం ఉదయం నుంచి మొదలైన సోదాలు, బుధవారం రాత్రి వరకు కొనసాగాయి. భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందించే వారిపై ఐటీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. అధికారులు 55 బృందాలుగా మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఈ సోదాలు సాగించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో సోదాలు కొనసాగాయి. దిల్‌రాజు, ఆయన కూతురు హన్సిత, సోదరుడు శిరీష్ నివాసాల్లో సోదాలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయం, నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఇళ్లు, మ్యాంగో సంస్థల యజమాని యరపతినేని రామ్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. సినీ ఫైనాన్షియర్స్ సత్య రంగయ్య, అభిషేక్ అగర్వాల్ ఇళ్లల్లోనూ సోదాలు జరిపారు. ఆయా సంస్థల బ్యాలెన్స్ షీట్స్, బ్యాంకు లావాదేవీలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం. తనిఖీలు జరిగిన ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. ఐటీ దాడులపై దిల్‌రాజు స్పందించారు. తన ఒక్కరి ఇళ్లు, కార్యాలయాల్లోనే సోదాలు జరగడం లేదని.. సినీ ఇండస్ట్రీ మొత్తంపై జరుగుతున్నాయని తెలిపారు. -
మొత్తం ఇండస్ట్రీ పై రైడ్లు జరుగుతున్నాయి: దిల్‌రాజు
-
ఐటీ రైడ్స్ పై స్పందించిన దిల్ రాజు
తన ఇంటిపై ఐటీ శాఖ అధికారుల జరుపుతున్న సోదాలపై ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju)స్పందించారు. ఐటీ రైడ్స్ తన ఒక్కడిపైన మాత్రమే జరగట్లేదని.. ఇండస్ట్రీ మొత్తం మీద ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారని ఆయన అన్నారు. వారికి తనతో పాటు తన కుటుంబ సభ్యులు మొత్తం సహకరిస్తున్నామని అని చెప్పారు. బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాకు అభివాదం చేస్తూ పై వ్యాఖ్యలు చేశారు. కాగా, టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మంగళవారం ఉదయం మొదలైన ఈ సోదాలు.. బుధవారం కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే దిల్‌రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా కార్యాలయాల్లోనూ తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు.సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్(sukumar) ఇంటిపై కూడా ఐటీ అధికారులు సోదాలు(IT Rids) నిర్వహించారు. . శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సుకుమార్‌ను ఐటీ అధికారులు నేరుగా ఇంటికి తీసుకెళ్లారు. ఆయనకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, లాకర్లు వంటి వివరాల గురించి ఆరా తీస్తున్నారు. పుష్ప2 చిత్రం రూ. 1850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఆదాయ పన్నుశాఖ అధికారులు ఈ లెక్కలపైనే ప్రధానంగా గురి పెట్టారు.వెలుగులోకి కీలక ఆంశాలు..ఐటీ సోదాల్లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లను కూడా ఐటీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. పుష్ప 2 మూవీ వసూళ్లకు తగ్గట్లుగా ఐటీ చెల్లింపులు జరగలేదని నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. అలాగే దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్స్ విషయంలో అవకతవకలు జరిగినట్లు వస్తుంది. ఈ సినిమా వారం రోజుల్లో రూ.203 కోట్లు వసూళ్లు సాధించినట్లు అధికారులు గుర్తించారు. అయితే వచ్చిన లాభాలకు తగ్గట్లుగా ఐటీ చెల్లింపులు జరగలేదని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలతో కేసు నమోదు చేశాకే సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 55 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. -
డైరెక్టర్ సుకుమార్ ఇంట ఐటీ రైడ్స్
చిత్ర పరిశ్రమపై ఆదాయ పన్నుశాఖ అధికారులు గురి పెట్టారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో విడుదలైన చిత్రాలకు సంబంధించిన నిర్మాతలు, దర్శకుల ఇళ్లు, ఆఫీసులలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పుష్ప2 డైరెక్టర్ సుకుమార్ నివాసంలో కూడా నేడు ఐటి సోదాలు జరుగుతున్నాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సుకుమార్‌ను ఐటీ అధికారులు నేరుగా ఇంటికి తీసుకెళ్లారు. ఆయనకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు, లాకర్లు వంటి వివరాల గురించి ఆరా తీస్తున్నారు.ఇప్పటికే ప్రముఖ గాయని సునీత భర్త రామ్‌కు చెందిన మ్యాంగో మీడియా సంస్థలోనూ ఐటీ సోదాలు కొనసాగినట్టు తెలిసింది. అంతేకాదు భారీ బడ్జెట్ సినిమాలకు ఫైనాన్స్ చేసే సత్య రంగయ్య, అభిషేక్ అగర్వాల్‌ల ఇళ్లలోనూ సోదాలు చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే మొదలైన ఈ ప్రక్రియే రెండో రోజు కూడా కొనసాగుతుంది. గత రెండు నెలల్లో విడుదలైన చిత్రాలకు సంబంధించిన వారినే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి సహా నగరంలోని ఎనిమిది చోట్ల 55 బృందాలతో తనిఖీలు నిర్వహించినట్టు సమాచారం.దిల్ రాజ్ కూతురు ఇంట్లో సోదాలుదిల్ రాజ్ కూతురు హన్సితారెడ్డి ఇంట్లో కూడా రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆమె సమక్షంలో డిజిటల్ లాకర్లను ఐటి అధికారులు ఓపెన్ చేశారు. మరికొద్ది సేపట్లో ఆమెకు సంబంధించిన బ్యాంకు లాకర్లను అధికారులు ఓపెన్ చేయనున్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ లోని ఆమె నివాసానికి హన్సితా రెడ్డి కుటుంబ సభ్యులు చేరుకున్నారు. -
చిత్ర పరిశ్రమలో ఐటీ సోదాలు.. కీలక అంశాలు వెలుగులోకి
తెలుగు సినీ నిర్మాతల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయ పన్నుశాఖ (Income Tax Officer) అధికారులు రెండో రోజు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత దిల్‌రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లోనూ తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. సంక్రాంతి రేసులో దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు విడుదలయ్యాయి. రీసెంట్గా మేత్రీ మేకర్స్ నిర్మించిన పుష్ప2 చిత్రం రూ. 1850 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఆదాయ పన్నుశాఖ అధికారులు ఈ లెక్కలపైనే ప్రధానంగా గురి పెట్టారు.ఐటీ సోదాల్లో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకులు రవిశంకర్, నవీన్‌లను తాజాగా ఐటీ అధికారులు విచారించారు. వారు నిర్మించిన పుష్ప2 మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ లాభాలను రాబట్టినట్లు ఐటీ గుర్తించింది. అయితే, వసూళ్లు తగ్గట్టుగా ఆదాయ పన్ను చెల్లింపులు జరగలేదని అధికారులు కనుగొన్నారు. అందుకోసం మైత్రి మూవీ మేకర్స్ బ్యాంక్ లావాదేవీలను వారు పరిశీలిస్తున్నారు.నిర్మాత దిల్ రాజ్, కూతురు హన్సితా రెడ్డి, సోదరుడు నర్సింహ రెడ్డి , నిర్మాత శిరీష్ ఇంట్లో కూడా రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వారి నిర్మాణ సంస్థ నుంచి భారీ బడ్జెట్ మూవీ గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం విడుదల అయ్యాయి. రెండు మూవీల ఆదాయ వ్యయాలపై ఐటీ అధికారలు విచారిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం మూవీ వారం రోజుల్లో రూ. 203 కోట్లు వసూళ్లు చేసినట్లు గుర్తించారు. వచ్చిన లాభాలకు చెల్లించిన పన్నులకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. -
'పుష్ప2, గేమ్ ఛేంజర్' కలెక్షన్స్ ప్రకటనపై ఐటీ అధికారుల ఫోకస్
తెలుగు సినీ నిర్మాతల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయ పన్నుశాఖ(Income Tax Officer) అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ) చైర్మన్, నిర్మాత దిల్‌రాజు ఇల్లు, కార్యాలయాలతోపాటు.. పుష్ప–2 చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నివాసాల్లో, మైత్రీ మూవీస్ సంస్థ కార్యాలయాల్లోనూ తనిఖీలు చేపట్టారు. ప్రముఖ గాయని సునీత భర్త రామ్‌కు చెందిన మ్యాంగో మీడియా సంస్థలోనూ ఐటీ సోదాలు కొనసాగినట్టు తెలిసింది. అంతేకాదు భారీ బడ్జెట్ సినిమాలకు ఫైనాన్స్ చేసే సత్య రంగయ్య, అభిషేక్ అగర్వాల్‌ల ఇళ్లలోనూ సోదాలు చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి సహా నగరంలోని ఎనిమిది చోట్ల 55 బృందాలతో తనిఖీలు నిర్వహించినట్టు సమాచారం.సినిమాల ఆదాయం లెక్కలపై ఫోకస్ ఇటీవల విడుదలైన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను దిల్‌రాజు నిర్మించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలకు అయిన ఖర్చు, వచ్చిన వసూళ్లు తదితర అంశాలపై ఐటీ అధికారులు ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. దిల్‌రాజు ఇంటితోపాటు ఆయన సోదరుడు శిరీశ్, కుమార్తె హన్సితరెడ్డి నివాసాల్లోనూ ఐటీ సోదాలు కొనసాగాయి. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలను, ఐటీ చెల్లింపులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు స్టేట్మెంట్లను ఐటీ అధికారులు స్వాదీనం చేసుకున్నట్టు సమాచారం. (ఇదీ చదవండి: సైఫ్ అలీఖాన్‌కు రక్షణగా 'జై లవకుశ' నటుడి టీమ్)ఇక పుష్ప–2 సినిమా నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు చెందిన మైత్రీ నవీన్, యలమంచిలి రవిశంకర్, సీఈఓ చెర్రీ, మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లలోనూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగాయి. పుష్ప–2 సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,800 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఐటీ చెల్లింపులకు సంబంధించి అధికారులు పలు ఆధారాలు సేకరించినట్టు తెలిసింది. ముఖ్యంగా పుష్ప2(Pushpa 2) , గేమ్ ఛేంజర్(Game Changer Movie) కలెక్షన్ల ప్రకటనతో అందుకు సంబంధించిన చెల్లింపుల వివరాల గురించి వారు పరిశీలించినట్లు తెలుస్తోంది.సాధారణంగా జరిగే సోదాలే: దిల్‌రాజు భార్య వైగారెడ్డి తనిఖీల్లో భాగంగా ఐటీ అధికారులు దిల్‌రాజు సతీమణి వైగారెడ్డిని తమ కారులో తీసుకెళ్లారు. దిల్‌రాజు, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకున్నారు. బ్యాంకు లాకర్లను పరిశీలించిన అనంతరం ఆమెను తిరిగి అదే వాహనంలో ఇంటివద్దకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఐటీ సోదాలపై వైగారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇవి సాధారణంగా జరిగే సోదాలు మాత్రమేనని చెప్పారు. బ్యాంకు ఖాతాల వివరాలు కావాలని అధికారులు అడిగారని, అవి ఇచ్చామని, బ్యాంకు లాకర్లు తెరిచి చూపించామని తెలిపారు. -
దిల్ రాజు, ఆయన సోదరుడు, కుమార్తె నివాసాల్లో ఐటీ సోదాలు
-
నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ తనిఖీలు
-
నిర్మాత దిల్ రాజు నివాసంలో ఐటీ తనిఖీలు
సాక్షి,హైదరాబాద్: నగరంలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసంలో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. దిల్‌రాజు ఆఫీస్, కుటుంబసభ్యుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్‌రాజు సోదరుడు శిరీశ్, కుమార్తె హన్సితరెడ్డి నివాసాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.ఏకకాలంలో 8 చోట్ల 55 బృందాలతో తనిఖీలు జరుగుతున్నాయి. పలు పత్రాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. తెల్లవారుజాము నుంచి ఐటీ సోదాలు చేపట్టారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలో సోదాలు నిర్వహిస్తున్నారు. నగరంలో 8 చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.కాగా, సంక్రాంతికి భారీ బడ్జెట్‌తో ‘గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాము’ సినిమాలు దిల్ రాజు ప్రొడక్షన్స్ తీసింది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో బడా ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్న దిల్ రాజు.. డిస్టిబ్యూటర్ నుంచి నిర్మాతగా ఎదిగారు. దిల్ సినిమాతో ఆయన నిర్మాతగా మారారు.బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించాం : దిల్ రాజు భార్యదిల్ రాజు భార్య తేజస్వినిని అధికారులు బ్యాంక్‌కు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తేజస్విని మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇవాళ ఉదయం నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బ్యాంకు వివరాలు కావాలని అధికారులు అడిగారు. బ్యాంకు లాకర్స్ ఓపెన్ చేసి చూపించాం’’ అని ఆమె చెప్పారు.మెత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనూ ఐటీ తనిఖీలుమెత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మైత్రీ నవీన్, సీఈవో చెర్రీ, మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పుష్ప-2 వరల్డ్ వైడ్‌గా దాదాపు 1850 కలెక్షన్లు రాబట్టింది. సింగర్ సునీత భర్త రాముకు చెందిన మ్యాంగో మీడియా సంస్థలో కూడా సోదాలు చేస్తున్నారు. ఇదీ చదవండి: 'సంక్రాంతికి వస్తున్నాం' సీక్వెల్.. రిలీజ్ అప్పుడేనన్న అనిల్ రావిపూడి! -
తిరుమలలో సంక్రాంతికి వస్తున్నాం టీమ్.. (ఫోటోలు)
-
టాలీవుడ్ ను షేక్ చేస్తోన్న రూమర్స్.. మళ్ళీ దిల్ రాజు తో రామ్ చరణ్ సినిమా..
-
దిల్ రాజు కోసం చరణ్ కీలక నిర్ణయం
'గేమ్ ఛేంజర్' బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలబడింది. దీంతో దిల్ రాజు (Dil Raju) కోసం చరణ్(Ram charan) ఒక కీలకనిర్ణయం తీసుకున్నారట. కొత్త ఏడాదిలో సంక్రాంతికి మూడు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. కానీ విన్నర్‌గా వెంకటేశ్ (సంక్రాంతికి వస్తున్నాం) చిత్రం నిలిచింది. సినిమా విడుదలైన రెండో రోజే సుమారు 250కి పైగా స్క్రీన్స్‌ను పెంచారు. తర్వాత బాలకృష్ణ (డాకు మహారాజ్) కూడా మంచి కలెక్షన్సే అందుకుంది. ఇప్పుడు ఎటొచ్చి కూడా రామ్ చరణ్- దిల్ రాజు కాంబినేషన్లో వచ్చిన గేమ్ ఛేంజర్‌కు కష్టాలు తప్పలేదు. ఫైనల్‌గా నిర్మాతకు ఎన్ని కోట్లు నష్టం అనేది తేలాల్సి ఉంది. సుమారు రూ. 450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి అనుకున్నంత రిటర్న్ వచ్చేలా లేదని తేలిపోయింది.సుమారు పదేళ్ల క్రితం దిల్ రాజు బ్యానర్లో ఎవడు సినిమాలో రామ్ చరణ్ నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా అనుకున్నంత సమయంలో పూర్తి కాలేదు. కానీ, సినిమా మాత్రం బాక్సాఫీస్ మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు గేమ్ ఛేంజర్ కూడా పూర్తి అయ్యేసరికి దాదాపు నాలుగేళ్లు పట్టింది. దీంతో బడ్జెట్ భారీగా పెరిగింది. అయినప్పటికీ ఖర్చు పెట్టే విషయంలో దిల్ రాజు ఎక్కడా కూడా తగ్గలేదు. సినిమాపై ఆయన పూర్తి నమ్మకంతోనే కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. కానీ గేమ్ ఛేంజర్ రిజల్ట్ మరోలా అయింది. ఈ మూవీతో దిల్ రాజు ఏ మేరకు నష్టాలు భరించబోతున్నారనేది ఇంకా తేలాల్సి ఉంది. (ఇదీ చదవండి: జాతీయ అవార్డ్ విన్నింగ్ హీరో సినిమాకు నో చెప్పిన సాయిపల్లవి)ఈ సినిమాతో పాటు సంక్రాంతికి వస్తున్నాం చిత్రం కూడా ఆయన నిర్మించారు కాబట్టి కాస్త ఊరట కలిగించే అంశం అని చెప్పవచ్చు. అయితే, రామ్ చరణ్ కూడా దిల్ రాజుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ప్లాన్‌లో ఉన్నారట. ఆయన బ్యానర్లోనే మరో సినిమా చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక మంచి కథతో గేమ్ ఛేంజర్ నష్టాన్ని పూరించాలని చరణ్ ఉన్నారట. కొద్దిరోజుల తర్వాత అధికారికంగా ప్రకటన కూడా రావచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్ చేతిలో రెండు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వీటిలో మొదట డైరెక్టర్ బుచ్చిబాబు సినిమా ఉంది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఒక భారీ బడ్జెట్ సినిమా లైన్లో ఉంది. ఈ చిత్రాల తర్వాత తప్పకుండా దిల్ రాజుతో మూవీ ఉంటుందని సమాచారం.