ప్రతి క్షణం ఉత్కంఠ!
సస్పెన్స్, హారర్, కామెడీ నేపథ్యంలో వినయ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మాయ చిత్రం’. వినయ్రాజ్, రుక్షా జంటగా జి. వెంకటేశ్వర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లా డుతూ -‘‘ప్రతి సన్నివేశం ఉత్కంఠగా ఉంటుంది. 20 నిమిషాల పాటు సాగే గ్రాఫిక్స్ అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. మిస్ ఇండియా గుజరాతీ వైశాలి పటేల్ చేసిన ప్రత్యేక పాత్ర ఓ హైలైట్. ఈ చిత్రం పోస్టర్స్ చూసి, హిందీ అనువాద హక్కులను సూపర్ గుడ్ బాలాజీ, మంజునాథ్ తీసుకున్నారు. ఇంకా తమిళ, కన్నడ, మలయాళ భాషలవారు కూడా సంప్రదిస్త్తున్నారు. నవంబర్ 15న పాటలను, డిసెంబర్లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.