వినాయకచవితికి బీఎస్ఎన్ఎల్ ఆఫర్లు
గుంటూరు మెడికల్: వినాయకచవితి సందర్భంగా బీఎస్ఎన్ఎల్ మొబైల్ సర్వీస్‌లో ప్రత్యేక టారిఫ్ ఓచర్లు ప్రవేశపెట్టినట్లు జిల్లా టెలికం మేనేజర్ ఎంఎల్ఎన్ రావు చెప్పారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఈ నెల 3 నుంచి వచ్చిన ఫెండ్స్,్ర ఫ్యామిలీ స్పెషల్ టారిఫ్ ఓచర్లు 90 రోజులపాటు అమలులో ఉంటాయని తెలిపారు. కేవలం 97 రూపాయలతో 60 నిమిషాలు ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాల్స్ చేసుకోవచ్చన్నారు. 16 రూపాయల రీఛార్జితో అన్ని ఎస్టీడీ కాల్స్ మూడు నిమిషాలకు 1.3 పైసల చొప్పున 30 రోజులపాటు చేసుకోవచ్చని తెలిపారు.
ఇలాంటి ఆఫర్లు మరిన్ని ఉన్నాయని చెప్పారు. మీసేవ కేంద్రాల్లో ల్యాండ్‌లైన్, పోస్టుపెయిడ్ మొబైల్ బిల్లులు చెల్లించుకునే సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. దీనికి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. నెలసరి స్థిర చార్జీలు రూ.500, అంతకన్నా ఎక్కువ ఉన్న అన్లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ కాంబోప్లాన్లు ఎన్నుకుని సొంత మోడెమ్ ఉన్న వినియోగదారులకు రెండో బిల్లింగ్ సైకిల్ నుంచి నెలకు 150 చొప్పున 3 నెలలపాటు అదనపు ఉచిత కాల్స్ చేసుకునే అవకాశం ఇస్తున్నామన్నారు. ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు అమల్లో ఉంటుందని చెప్పారు. సమావేశంలో అదనపు జనరల్ మేనేజర్ ఎ.గోపాలకృష్ణారావు, డీజీఎంలు బి.చంద్రసేన, ఎ.ప్రభాకర్, పి.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.