Division of the state of Andhra Pradesh
-
బాబూ! ఏదీ ప్రత్యేక హోదా?
సందర్భం మోదీ, బాబుల అభివృద్ధికి అర్థం... దేశాన్ని, రాష్ట్రాన్ని కార్పొరేటు గుత్తాధిపతుల భోజ్యంగా మార్చేయడమే. ప్రత్యేక హోదా వల్ల కేంద్రం నుంచి లభించే రాయితీలు, నిధులు దుర్వినియోగం కాకుండా ఉద్యమకారులు జాగ్రత్త వహించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం ఏపీకి వాగ్దానం చేసిన ప్రత్యేక హో దాను కోరుతూ రాష్ట్ర వ్యాప్త విస్తృత ప్రజా ఉద్యమాలు ఆరంభమైనాయి. ప్రత్యేక హో దా సాధన కోసం మొదటి నుంచి చొరవతో కృషి చేస్తున్న వైఎస్సార్సీపీ ఢిల్లీలో నిర్వ హించిన భారీ ధర్నా ఈ సమస్యకు జాతీయ స్థాయి గుర్తింపును తెచ్చింది. కాగా, తిరుపతిలో మునికోటి విషాదకరమైన రీతిలో ఆత్మాహుతికి పాల్పడి ప్రాణాల ర్పించడంతో ప్రత్యేక హోదా ఉద్యమం ఊపందుకుంది. దీంతో గాలివాటం మాటకు మారుపేరైన చంద్రబాబు సైతం అదే పాట అందుకున్నారు. 14 నెలలుగా ప్రత్యేక హోదా ఊసే ఎత్తని బాబు నిద్రాహారాలు మాని ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తున్నారని ‘తెలుగు’ తమ్ముళ్ల భజన మొదలైంది. సింగపూర్, జపాన్, చైనా, ఇస్తాం బుల్ తదితర ప్రపంచ నగరాలను తలదన్నేలా నిర్మించే రాజధానీ, అందులో పుట్టుకురానున్న ఆకాశహార్మ్యాలు, ఫ్లైఓవర్లు, మెట్రోలు, నదీ విహార విలాసాలు, పర్యాటక కేంద్రాలు, షాపింగ్ మాల్స్, ఫైవ్‌స్టార్ హోటళ్ల గోల తప్ప బాబు నోట మరే మాటా రాష్ట్ర ప్రజ విని ఉండ లేదు. హఠాత్తుగా ఆయన ప్రత్యేక హోదా అనడం విడ్డూరమే. వైఎస్సార్సీపీ శ్రేణులు, ఆ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి ఇంతకాలం ఓపికగా ప్రజలకు విభజన వలన కలిగిన నష్టాలను అధిగమించడానికి ప్రత్యేక హోదా ఎలా, ఎంతగా తోడ్పడుతుందో వివరించారు. అదే సమ యంలో టీడీపీ మంత్రులు, నేతలంతా కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ తెస్తామని చెబుతూ వచ్చారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ ఒకటేనన్నట్టు ప్రజలను మభ్య పెట్టాలని చూశారు. కేంద్రంలో అధికారం తమదేనని ఏమైనా సాధించగలమని మాట్లాడారు. ఇప్పుడు ప్రజల నాడిని గ్రహించి ప్రత్యేక హోదా పల్లవి అందుకున్నారు. హక్కుగా నిలదీసి సాధించుకోవాల్సిన ప్రత్యేక హోదా కోసం ‘మ్యావ్! మ్యావ్!’ అంటున్నారు. మోదీ చుట్టూ తోకాడించుకుంటూ తిరగడానికి ఢిల్లీ ప్రయాణాలు క డుతున్నారు. ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీతో పాటూ సీపీఐ, సీపీఎంలేగాక కాంగ్రెస్, సినీ నటుడు శివాజీ ఈ ప్రత్యేక హోదా ఉద్యమంలో ఉన్నారు. చేగువేరాకు, మోదీకి సులువుగా ముడిపెట్టేయగల ‘రాజకీయ వేత్త’ గా రాటుదేలిన పవన్ కల్యాణ్ తన ‘జనసేన’తో సహా తాజాగా ఈ ఉద్యమంలో చేరారు. ముందు ముందు ఈ ఉద్యమం ఒకప్పటి ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ ఉద్యమంలా వ్యాపించేట్టు కనిపి స్తోంది. ఈ దృష్ట్యా ఉద్యమంలో పాల్గొంటున్న పార్టీలు, ప్రజలు ఒక విషయంలో జాగరూకులై ఉండాల్సి ఉంది. ఒకప్పుడు మనం సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగా రం ప్రభుత్వ రంగంలో ఉండి. రాష్ట్రాభివృద్ధికి, ప్రజలకు ఉపయోగపడింది. కానీ మోదీ, బాబు చెప్పే అభివృద్ధికి అర్థం ఒక్కటే... దేశాన్ని, రాష్ట్రాన్ని కార్పొరేటు గుత్తాధి పతుల భోజ్యంగా మార్చేయడమే. పెరుగుతున్న ఆర్థిక అంతరాలు, ‘అభివృద్ధి’ కోసం భూములు కోల్పోయి దిక్కులేనివారయ్యే రైతులు, రోజు కూలీల స్థాయికి దిగ జారుతున్న పారిశ్రామిక కార్మికులు, ప్రైవేటు ఉద్యో గులు, ప్రభుత్వరంగ కాంట్రాక్టు కూలీలు, పెరుగుతున్న నిరుద్యోగులు వారికి కనబడరు. ఇలాంటి పరిస్థితిలో ప్రత్యేక హోదాను పోరాడి సాధించుకున్నా అది ఈన గాచి నక్కల పాలు చేసిన చందం కాకుండా చూసు కోవాల్సి ఉంది. ప్రత్యేక హోదా వల్ల కేంద్రం నుంచి లభించే రాయితీలు, నిధులు దుర్వినియోగం కాకుండా జాగ్రత్త వహించాలి. జాతీయ హోదాతో, కేంద్రం నిధు లతో నిర్మించాల్సిన పోలవరాన్ని పక్కనబెట్టి, అస్మదీ యులకు లాభం చేకూర్చే పట్టిసీమను నిర్మిస్తున్న ఘను లు వీళ్లు, ఏమైనా చేయగలరు! ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలకు చేరేలా జాగ్రత్త వహించాల్సిన బాధ్యత ఉద్యమిస్తున్న ప్రజలు, పార్టీలు, నేతలదే. ‘రుణ మాఫీ’ వాగ్దానంతో నమ్మించి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రైతులకు, డ్వాక్రా మహిళలకు మొండి చెయ్యి చూపిన వైనం ఎవరూ మరచిపోలేదు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి మొదలైన టీడీపీ ప్రభుత్వ వాగ్దాన భంగాల జాబితాను రాయాలంటే రామకోటం త. పైగా ‘‘నేను నిప్పుని, నిప్పుని’’అని నిత్య జపం చేసే బాబు, ఆయన అస్మదీయుల అవినీతి అడుగడుగునా కనిపిస్తూనే ఉంది. ‘ఓటుకు కోట్లు’ కుంభకోణంలో ‘‘నికార్సయిన నిప్పు’’ ‘‘ఆంధ్రా హజారే’’ బాబు భ్రష్ట చరిత్రను ప్రజలంతా కళ్లారా చూశారు, చెవులారా విన్నారు. అయినా సిగ్గు విడిచి ఎంఎల్ఏలను కొంటూ రెండ్ హ్యాండెడ్‌గా దొరికిన తమ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డికి బ్రహ్మరథం పట్టాడు. చేసిన సిగ్గుచేటు పనికి పశ్చా త్తాపం ప్రకటించడానికి బదులు అక్రమంగా ఫోన్ ట్యాపింగ్‌లు చేశారంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఎదు రు దాడికి దిగిన ఘనుడు చంద్రబాబు. పన్నెండే ళ్లకోసారి వచ్చే గోదావరి పుష్కరాలు సైతం తన ఘనత వల్లే వచ్చాయన్నట్టుగా ప్రచారం చేసుకోగలిగిన అల్ప త్వం ఆయనది. ఆ అల్పత్వానికి దాదాపు ముప్పయి నిండు ప్రాణాలు బలి కావాల్సి వచ్చింది. రాజకీయ సన్యాసం స్వీకరించాల్సినంతటి మహా నేర భారాన్ని మోస్తూ కూడా.. ఇదేమి ఘోరమంటే, ‘శవ రాజకీ యాలు చేస్తున్నార’ని ఎదురు దాడి చేయగల అమా నవీయత బాబుకే స్వంతం. అందుకే ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న వారంతా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే చీమలు చేసిన పుట్టలో పాములు దూరిన చం దం అయ్యే ప్రమాదం ఉంది. ఈ జాగరూకతతో ప్రత్యేక హోదా కోసం ఉద్యమం మహోధృతంగా సాగాలని కోరుకుందాం. ఏపీ విఠల్ వ్యాసకర్త ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులు ఫోన్: 98480 69720 -
రెండు రాష్ట్రాల్లో ఏఐఎస్ఎఫ్ కమిటీలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రా ష్ట్ర విభజన నేపథ్యంలో అఖిల భార త విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) 2 విభాగాలుగా ఏర్పడింది. బుధవారం హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో కొత్త కమిటీలను ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఓయూ విద్యార్థి నేత స్టాలిన్, ప్రధాన కార్యదర్శిగా శివరామకృష్ణ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా నెల్లూరుకు చెందిన కరీముల్లా, ప్రధాన కార్యదర్శిగా అనంతపురానికి చెందిన బయ్యన్న నియమితులయ్యారు. -
సంక్షేమంలో కోత
పడకేయనున్న పథకాలు! ఫీజు రీయింబర్స్‌మెంటుపై అనుమానాలు రేషన్ సరకులదీ అదే బాట విశాఖ రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనతో సంక్షేమ పథకాలపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కొత్త ప్రభుత్వం కొలువు తీరకముందే పథకాల అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లోటు బడ్జెట్ పేరుతో ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో కోత పడే అవకాశాలు ఉన్నాయంటూ అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. ఇప్పటికే పథకాలకు నిధుల కేటాయింపులో కోత పడుతోంది. మున్ముందు పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. రాష్ట్ర విభజన ప్రభావం ప్రభుత్వ శాఖల బడ్జెట్‌పై పడింది. పెన్షన్ల నుంచి సాల్కర్షిప్ల వరకు అన్నింటికీ అరకొర నిధులే విడుదలవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 3,21,517 మంది పింఛన్‌దారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా రూ.7.93 కోట్లు అవసరం. కానీ 1,70,413 మందికి రూ.4.66 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మిగిలిన వారు పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్నారు. స్కాలర్‌షిప్‌ల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో ఇప్పటికే గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. హామీలు నెరవేర్చేనా : దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని తరువాత ప్రభుత్వం తూట్లు పొడిచింది. ఈ పథకంలో కేటాయింపులు తగ్గించి విద్యార్థులపై భారం వేసింది. ఎన్నికలకు ముందు తెలుగుదేశంపార్టీ కేజీ నుంచి పీజీ వరకు ఉచితమని మేనిఫెస్టోలో పేర్కొంది. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కొత్త ఆశలు చిగురించాయి. అలాగే అన్ని రకాల పెన్షన్లను రూ. వెయ్యికి పెంచామని హామీలు గుప్పించారు. కానీ ఇప్పుడు రుణమాఫీ విషయంలోనే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. లోటుబడ్జెట్ పేరుతో అన్ని పథకాలును అమలు చేయడం, హామీలన్నింటినీ ఒకేసారి నెరవేర్చడం సాధ్యంకాదని టీడీపీ నాయకులు భిన్న ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్రం కలిసున్నప్పుడే సంక్షేమ పథాకల్లో కోతలు పడగా రాష్ట్ర విభజన తరువాత బడ్జెట్ లేదన్న సాకుతో కొనసాగుతున్న పథకాలను మరింత కుదించే ప్రమాదం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రేషన్‌దుకాణాల ద్వారా సరఫరా కావాల్సిన నిత్యావసరాలు సక్రమంగా విడుదల కావడం లేదు. జిల్లాకు కేటాయింపులు కూడా గణనీయంగా తగ్గిపోయాయి. పామాయిల్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో తెల్లరేషన్‌కార్డుదారులు బహిరంగ మార్కెట్లో వస్తువులు కొనుగోలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు. గత నెల 16న ఓట్ల లెక్కింపు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు కొత్త ప్రభుత్వం కొలువుతీర లేదు. దీంతో సంక్షేమ పథకాల పరిస్థితి దారుణంగా మారింది. ఆదివారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో సంక్షేమ పథకాలపై ఎటువంటి ప్రకటనలు చేస్తారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. -
రైతులు ఉద్యమించాలి : భాను
విజయవాడ, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల జరిగే నష్టాన్ని అడ్డుకునేందుకు అన్ని వర్గాలూ ఆందోళనలోకి రావాలని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను శనివారం ఒక ప్రకటనలో కోరారు. ముఖ్యంగా సాగు, తాగు నీరు విషయంలో సీమాంధ్రకు తీరని అన్యాయం జరుగుతుందని, సమైక్యాంధ్రను కాపాడుకునేందుకు రైతులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరిట ఏపీ ఎన్జీవోలు హైదరాబాద్‌లో సభను విజయవంతం చేసినందుకు ఆయన వారికి అభినందనలు తెలిపారు. ఇదే తరహాలో అన్ని రంగాల వారు రోడ్డెక్కి సభల ద్వారా ఆయా రంగాలకు జరగబోయే నష్టాలను ప్రజలకు వివరించి చైతన్యపర్చాలని కోరారు. కృష్ణా డెల్టాకు ప్రథమ వినియోగ హక్కుగా జూన్‌లో కాల్వలకు నీటిని విడుదల చేసే సంప్రదాయం ఉందన్నారు. ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్సార్ సీఎంలుగా ఉండగా నాగార్జునసాగర్‌లో ఏ నీటిమట్టం ఉన్నా జూలై ఒకటి నాటికి ముందుగా డెల్టాకు మాత్రమే నీటిని విడుదల చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు సీఎంగా ఉండగా తెలంగాణకు చెందిన కడియం శ్రీహరి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో డెల్టాకు సెప్టెంబర్ 15 వరకు నీటిని విడుదల చేయకుండా జూరాల ప్రాజెక్టు కింద ముందుగా సాగుకు నీటిని విడుదల చేశారని చెప్పారు. ఇది డెల్టా చరిత్రలో ప్రథమ వినియోగపు హక్కును కాలరాసిన మొట్టమొదటి చర్య అని తెలిపారు. ఇరిగేషన్ మంత్రులుగా పనిచేసిన మండవ వెంకటేశ్వరరావు, సుదర్శన్‌రెడ్డి వంటివారు కూడా ఇదే పనిచేశారన్నారు. రాష్ట్ర విభజన జరిగితే డెల్టా శాశ్వతంగా బీడుబారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాగుకు కూడా నీరు లేక ప్రజలు మొత్తం వలసపోవల్సి వస్తుందన్నారు. ఫలితంగా జల యుద్ధాలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. అందుకే అన్నివర్గాల వారూ ఆందోళనలు ఉధృతం చేయాలన్నారు.