స్త్రీలలో సంతానలేమి - ఆయుర్వేద చికిత్స
జీవితంలో ప్రతి స్త్రీ మాతృత్వం పొందటాన్ని మధురానుభూతిగా భావిస్తుంది. అలాగే పురుషుడు పితృత్వపు అనుభూతిని ఆకాంక్షిస్తాడు.
ఆయుర్వేదశాస్త్రంలో పిల్లలు పుట్టకపోవటానికి, తల్లిదండ్రుల యొక్క శుక్ర, శోణితాలు... అందలి దోషాలే ముఖ్య కారణాలని ఆయుర్వేదాచార్యులు ఎప్పుడో చెప్పారు. కాని సంతానలేమికి ఇప్పటికీ చాలామంది... స్త్రీలలోనే లోపం ఉందని చెబుతున్నారు. సంతానం కలగకపోవటానికి అనేక కారణాలు ఉంటాయి. ఆరోగ్యవంతులైన దంపతులు, ఏ విధమైన గర్భనిరోధక మాత్రలు లేకుండా ఒకటి ఒకటిన్నర సంవత్సరాలు దాంపత్య జీవితం గడిపినా పిల్లలు పుట్టకపోతే దానిని సంతానలేమిగా పరిగణించవచ్చు.
సంతానలేమికి ప్రధాన కారణాలు :
ఋతుచక్రంలో మార్పులు
కొన్ని వ్యాధుల వలన అండం సరిగా విడుదల కాకపోవడం.
గర్భాశయపు నిర్మాణంలోను, ఆకృతిలోను... పుట్టుకతో వచ్చే లోపాలు
గర్భాశయ మార్గంలో కండరాలు పెరగటం లేదా గర్భాశయ ముఖద్వారం వద్ద ఇన్ఫెక్షన్స్
గర్భాశయంలో గడ్డలు
కొన్ని ఇన్ఫెక్షన్స్ వలన ట్యూబ్స్ మూసుకొనిపోవటం, ట్యూబ్స్‌లో వాపు ఏర్పడటం.
ఆయుర్వేద శాస్త్రం గర్భధారణలో నాలుగు ప్రధాన అంశాలు ప్రస్తావించింది
1. ఋతువు: సాధారణంగా స్త్రీకి బహిష్టు మొదలైన 12వ రోజు నుండి 16 వ రోజు వరకు ఋతుకాలంగా పరిగణిస్తాం. 12 నుండి 16 రోజుల ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా అండం విడుదల కావచ్చు. అలాగే స్త్రీ యొక్క వయోపరిమితిని కూడా ఋతుకాలంగా పరిగణిస్తాం. (సాధారణంగా 21 - 35 సంవత్సరాల వరకు)
2. క్షేత్రం: కొన్నిసార్లు గర్భాశయ మార్గాలను అవరోధించే కొన్ని వ్యాధుల కారణంగా శుక్ర కణాలు అండాన్ని చేరలేక పోవచ్చు. కనుక విత్తనం మొలకెత్తటానికి భూమి సారవంతంగా ఉన్నట్లే గర్భాశయం మిగతా భాగాలు ఆరోగ్యంగా ఉండాలి.
3. అంబు: గర్భపోషణకు ఉపయోగపడే పోషకాలు, గర్భాధారణకు ఉపయోగపడే హార్మోన్లను అంబు అని ఆయుర్వేదం వర్ణించింది. ఈ హార్మోన్లలో సమతుల్యత లేకపోతే గర్భం రాదు. సంతానలేమికి శుక్రధాతువు లోపాలు కూడా ప్రధానంగా ఉంటాయి.
4. బీజం: ఆయుర్వేదంలో పురుషుల్లోని వీర్యాన్ని ‘బీజం’ అనే పదంతో సూచించారు. అండం పరిమాణం, శక్తి, శుక్ర కణంలో కదలగలిగే సామర్థ్యం, శుక్రకణం నాణ్యత మీద గర్భధారణ ఆధారపడి ఉంటుంది.
సంతానలేమికి ఆయుర్వేద చికిత్స : ఆయుర్వేద శాస్త్రంలో త్రిదోషాల ప్రాధాన్యతను బట్టి, ఔషధసేవన చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా రసాయనాలు ఇందులో ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. ఇలాగే పంచకర్మలు... ముఖ్యంగా స్నేహ, స్వేద, విరేచన, వస్తి కర్మలు అవసరాన్ని బట్టి చేయవలసి ఉంటుంది.
మానసిక ఒత్తిడి ఉంటే శిరోధార, హార్మోనల్ సమస్య ఉంటే నస్యకర్మ, తక్రధార, ట్యూబల్ బ్లాక్స్ లాంటివి ఉన్నట్లయితే ఉత్తరవస్తి, నీటి బుడగలు, కణతలు... ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే యోని పిచు, ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లయితే యోని ప్రక్షాళన (ఔషధ యుక్త కషాయాల) లాంటి శాస్త్రీయ చికిత్సా విధానాలు, చక్కని పరిష్కార మార్గాలుగా ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడినవి. ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్ర పద్ధతిలో సత్ఫలితాలు రావాలంటే క్రమం తప్పకుండా ఒక సంవత్సరం ప్రసూతి, స్త్రీ వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పద్ధతులు పాటించవలసి ఉంటుంది.
డాక్టర్ కరుణశ్రీ, ఎం.డి (ఆయుర్వేద),
స్టార్ ఆయుర్వేద, సికింద్రాబాద్,
Ph: 8977 336688