మార్టేరు విత్తనాలకు విశ్వవ్యాప్త గుర్తింపు
మార్టేరు (పెనుమంట్ర): మార్టేరు వ్యవసాయ వరి పరిశోధనా స్థానం విత్తనా లు మేలైన విత్తనాలకు మారుపేరని అంతర్జాతీయ ఆర్థిక శాస్త్రవేత్త డాక్టర్ అల్దాస్ జనయ్య అన్నారు. గురువారం మార్టేరు వ్యవసాయ పరి శోధనా స్థానాన్ని ఆయన సందర్శించారు. ఇక్కడ ఉత్పత్తయిన స్వర్ణ, ఎంటీయూ 1010, 1001 రకాలు విశ్వవ్యాప్తంగా పేరు గడించాయన్నారు. దేశవ్యాప్తంగా వివి ధ పరిశోధనా స్థానాల్లో తయారవుతున్న విత్తనాల పరిశీలనలో భాగంగా తాను మార్టేరు వచ్చినట్టు చెప్పారు. రైతుకు తక్కువ ఖర్చుతో పాటు అధిక దిగుబడినిచ్చే విత్తనాలందించేందుకు పలు పరిశోధనా స్థానాల్లో ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. తొలుత సంస్థ డైరెక్టర్ డాక్టరు పీవీ సత్యనారాయణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వరిశోధనా స్థానం వివరాలను, నూతన వరి వంగడాల సృష్టిని వివరించారు. ఇక్కడ నిర్వహిస్తు్తన్న వివిధ కార్యక్రమాలు, వరిక్షేత్రాలను నాబార్డు ఏజీఎం కె.కల్యాణ సుందరం తిలకించారు. పలువురు శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.