economy condition
-
సవాళ్లపై భారత్ అప్రమత్తత అవసరం
న్యూఢిల్లీ: సవాళ్లకు సంబంధించి దేశం అప్రమత్తత పాటించాల్సిన అవసరం ఉందని ఆర్థికమంత్రిత్వశాఖ నెలవారీ సమీక్ష స్పష్టం చేసింది. వ్యవసాయ ఉత్పత్తి తగ్గుదల, ధరల పెరుగుదలకు అవకాశం, భౌగోళిక ఉద్రిక్తతల వంటి పలు అంశాలను ఈ సందర్భంగా ఆర్థికశాఖ ప్రస్తావించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 6.5 శాతం ఉంటుందన్న కేంద్ర అంచనాలను ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) నివేదికలు బలపరుస్తున్నప్పటికీ వృద్ధి ధోరణిపై సవాళ్లూ ఉన్నాయని సూచించింది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం విషయంలో ఎదురయ్యే సవాళ్లను ఆర్థికశాఖ ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఎల్ నినో పరిస్థితులు కరువు పరిణామాలకు దారితీయడం, వ్యవసాయోత్పత్తి తగ్గే అవకాశాలు, ధరలు పెరగడం, భౌగోళికంగా రాజకీయ అనిశ్చితి, ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి సవాళ్ల వంటి అంశాల్లో భారత్ అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమని విశ్లేషించింది. సమీక్షలో మరికొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. 2022–23లో సవాళ్లను తట్టుకున్నాం.. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, మహమ్మారి సవాళ్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రతికూలతలు ఉన్నప్పటికీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ మార్చితో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో మంచి పనితీరు కనబరిచింది. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే ఎక్కువగా 7 శాతం వృద్ధి అంచనా ఉంది. తద్వారా ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా పురోగమిస్తోంది. ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్– దేశంలోకి ఒక నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) వంటి స్థూల ఆర్థిక అంశాల విషయంలో భారత్ స్థిరత్వంతో కూడిన పురోగతిని నమోదుచేసుకుంది. బ్యాం‘కింగ్’ వడ్డీరేట్లను పెంచినప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా నిలద్రొక్కుకుంది. వృద్ధి స్థిరత్వానికి ఇది సంకేతం. బ్యాంకులపై వేర్వేరుగా ‘స్ట్రస్ టెస్ట్’ల నిర్వహణ కూడా జరుగుతోంది. ముఖ్యంగా డిపాజిట్ల విభాగమూ పటిష్టంగా ఉంది. బ్యాంకుల్లో డిపాజిట్లు సురక్షితం అని డిపాజిటర్లు భావిస్తున్నందున, డిపాజిట్లలో 63 శాతం వేగంగా విత్‌డ్రా (ఉపసంహరణ) అవడానికి అవకాశాలు లేవు. ఇది బ్యాంకింగ్ పట్ల డిపాజిట్లకు ఉన్న విశ్వాసంతో పాటు, ఎకానమీ స్థిరత్వానికి దోహదపడే అంశం. ఈ కారకాలన్నీ భారతీయ బ్యాంకులను అమెరికా, యూరోపియన్ యూనియర్ బ్యాంకుల కన్నా భిన్నంగా ఉంచుతున్నాయి. ఆయా దేశాల్లోని బ్యాంకులు కఠినమైన ద్రవ్య విధానం ఉపసంహరణ నేపథ్యంలో తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం ప్రస్తుతం అదుపులో.. ధరల పరిస్థితిని పరిశీలిస్తే.. పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉంది. టోకు ధరల ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం మార్చిలో 29 నెలల కనిష్టానికి దిగి వచ్చింది. 1.34 శాతానికి పరిమితమైంది. గత 10 నెలల నుంచి తగ్గుతూ వస్తోంది. ద్రవ్యోల్బణం రేటు తగ్గడానికి ప్రధానంగా ప్రాథమిక లోహాలు, టెక్స్టైల్స్, ఆహారయేతర ఆర్టికల్స్, ఖనిజాలు, రబ్బర్.. ప్లాస్టిక్ ఉత్పత్తులు, క్రూడ్ పెట్రోలియం .. సహజ వాయువు, పేపర్ .. పేపర్ ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడమే కారణం. అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు 2022 గరిష్టాల నుంచి దిగివస్తుండటం, దేశీయంగా సానుకూల బేస్ ఎఫెక్ట్‌ల ప్రభావంతో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం రాబోయే రోజుల్లో మరింత తగ్గొచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.2 శాతం స్థాయిలో ఉండొచ్చని ఆర్బీఐ అంచనా వేస్తోంది. 2023 మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల కనిష్ట స్థాయి 5.66 శాతానికి దిగివచ్చింది. నవంబర్, డిసెంబర్ మినహా 2022 జనవరి నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం ఎగువనే కొనసాగింది. 2021–22లో సగటున వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.5 శాతంగా ఉంది. 2022–23లో 6.7 శాతానికి పెరిగింది. అయితే గడచిన ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలలూ చూస్తే, సగటు ద్రవ్యోల్బణం 6.1 శాతంగా ఉండడం గమనార్హం. మొదటి ఆరు నెలల్లో ఈ రేటు ఏకంగా 7.2 శాతంగా ఉంది. అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు తగ్గడం, సరఫరాల చైన్ మెరుగుదలకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఆర్బీఐ అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానం (2022 మే తర్వాత బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో 2.5 శాతం పెరిగి 6.5 శాతానికి ఎగసిన సంగతి తెలిసిందే) వంటి అంశాలు ద్రవ్యోల్బణం అదుపులోనికి రావడానికి దోహదపడింది. ఇదే ధోరణి కొనసాగుతుందన్న అంచనాలు ఉన్నాయి. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2023–24లో 5.3 శాతం ఉంటుందని ఫిబ్రవరి ఆర్బీఐ పాలసీ అంచనా వేస్తే, ఏప్రిల్ మొదట్లో జరిగిన పాలసీ సమీక్ష ఈ అంచనాలను 5.2 శాతానికి తగ్గించడం వృద్ధికి దారితీసే మరో హర్షణీయ పరిణామం. భారత్ ప్రస్తుత ఫారెక్స్ నిల్వలు దాదాపు భారత్ ప్రస్తుత ఫారెక్స్ నిల్వలు దాదాపు 12 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. ప్రస్తుత నిల్వలు భారత్ ఎకానమీకి భరోసాను ఇస్తున్నాయి. 2021 అక్టోబర్‌లో భారత్ ఫారెక్స్ నిల్వలు 645 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గరిష్ట స్థాయి నుంచి 100 బిలియన్ డాలర్లుకుపైగా పడిపోయాయి. అయితే అటు తర్వాత తిరిగి కొంత స్థిరంగా కోలుకుంటున్నాయి. ఈ పరిమాణం ఏప్రిల్ 14వ తేదీతో ముగిసిన వారంలో 586.412 బిలియన్ డాలర్లకు చేరాయి. ఫారిన్ ఫోర్టిఫోలియో ఇన్వెస్ట్మెంట్ల (ఎఫ్‌పీఐ) ఫారెక్స్ పెరుగుదలకు దోహదపడుతున్నాయి. దీనితో గడచిన ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో కరెంట్ అకౌంట్‌లోటు (క్యాడ్) కట్టడిలో ఉంది. -
అధిక వృద్ధి బాటలోనే భారత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఏజెన్సీలు భారత వృద్ధి రేటు అంచనాల్లో స్వల్ప కోతలు విధిస్తున్నప్పటికీ ఎకానమీ అధిక వృద్ధి బాటలోనే ఉందని ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ–పీఎం) సభ్యుడు సంజీవ్ సన్యాల్ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దాదాపు 6.5 శాతం వృద్ధితో ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా అనిశ్చితుల నేపథ్యంలో మిగతా ఏ దేశంతో పోల్చి చూసినా భారత్ చాలా ముందే ఉందని సన్యాల్ పేర్కొన్నారు. ‘ఏడీబీ (ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్), ప్రపంచ బ్యాంక్ ఈ ఏడాదికి సంబంధించి వృద్ధి అంచనాలను స్వల్పంగానే కుదించాయి. ఈ అంచనాల ప్రకారం చూసినా భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా ఎదిగే ఎకానమీగా ఉంటుంది‘ అని ఆయన చెప్పారు. వినియోగం మందగించడం, అంతర్జాతీయంగా కఠిన పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్థిక వృద్ధి అంచనాలను ఇటీవలే 6.3 – 6.4 శాతం శ్రేణికి ఇటీవలే ప్రపంచ బ్యాంక్, ఏడీబీలు కుదించాయి. దీనివల్ల మనమేమీ వెనకబడిపోతున్నట్లుగా భావించాల్సిన అవసరం లేదని సన్యాల్ చెప్పారు. కేంద్రం తీసుకుంటున్న చర్యలతో 8 శాతం పైగా వృద్ధి రేటు సాధించే సత్తా ఉన్నప్పటికీ ఎగుమతులు, దిగుమతులపరంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల రీత్యా కొంత ఆచితూచి వ్యవహరించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాకా భారత్ వృద్ధి రేటు మరింత వేగవంతం కాగలదని సన్యాల్ చెప్పారు. వివిధ సంస్కరణలతో బ్యాంకింగ్ రంగాన్ని ప్రక్షాళన చేసినందున అమెరికా, యూరప్ బ్యాంకింగ్ సంక్షోభ ప్రభావాలు భారత ఆర్థిక రంగంపై ప్రత్యక్షంగా ఉండబోవని సన్యాల్ తెలిపారు. అయినప్పటికీ ప్రపంచ దేశాలన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉన్నందున అప్రమత్తత కొనసాగించాల్సి ఉంటుందన్నారు. -
ఎలన్ మస్క్‌కు బైడెన్ చురకలు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ప్రపంచంలోనే అత్యంత ధనికుడు ఎలన్ మస్క్‌కు చురకలు అంటించారు. తాను ఎప్పటికీ బైడెన్ అభిమానిని కాదంటూ ప్రకటించుకున్న ఎలన్ మస్క్.. తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు రాయిటర్స్‌లో పబ్లిష్ అయ్యాయి. శుక్రవారం మీడియాతో ముఖాముఖి సందర్భంగా బైడెన్‌కు సదరు వ్యాఖ్యలపై ప్రశ్న ఎదురైంది. దీంతో ఆయన ఆసక్తికరంగా స్పందించారు. అమెరికా ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ (Super Bad Feeling) టెస్లా ఎగ్జిక్యూటివ్స్ వ్యాఖ్యలు చేశాడు(మెయిల్ ద్వారా) ఆ కంపెనీ సీఈవో ఎలన్ మస్క్. అంతేకాదు.. పది శాతం ఉద్యోగులను తగ్గించే యోచనలో ఉన్నట్లు కూడా ప్రకటించాడు. ‘ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ నియామకాలు నిలిపివేయండి’ అంటూ మెయిల్ చేశాడు మస్క్. ఈ వ్యవహారమంతా రాయిటర్స్‌లో ప్రచురితమైంది. అయితే మస్క్ ఉద్దేశాన్ని జో బైడెన్ ముందు ప్రస్తావించింది మీడియా. దానికి బదులుగా.. ‘‘ఎలన్ మస్క్ ఇలా మాట్లాడే సమయంలో.. ఫోర్డ్ కంపెనీ తమ పెట్టుబడులను గణనీయంగా పెంచుకుంటూ పోతోంది’’ అంటూ పంచ్ వేశాడాయన. అంతేకాదు జేబులోంచి ఓ కార్డును బయటికి తీసి.. కొన్ని కంపెనీలు ఏమేర ఉద్యోగ నియామకాలు చేపట్టాయి.. ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాయనేది స్వయంగా బైడెన్ చదివి వినిపించారు కూడా. చివర్లో కార్డును మళ్లీ జేబులో పెట్టుకుంటూ.. ‘‘కాబట్టి, అతనికి(మస్క్)కు మూన్ ట్రిప్ అయినా అదృష్టాన్ని తెచ్చిపెట్టాలంటూ’’ సెటైర్ సంధించారు బైడెన్. ఇక బైడెన్ సలహాపై ఎలన్ మస్క్ సైతం స్పందించాడు. థ్యాంక్స్ మిస్టర్ ప్రెసిడెంట్ అంటూ.. నాసా తదుపరి మూన్ మిషన్‌కు స్పేస్ఎక్స్ కంపెనీని ఎంచుకోవడంతో ఉన్న కథనాన్ని ప్రచురించాడు. Thanks Mr President!https://t.co/dCcTQLsJTp — Elon Musk (@elonmusk) June 3, 2022 ఇదిలా ఉంటే.. కేవలం మస్క్ మాత్రమే అమెరికా ఆర్థిక స్థితి గురించి ఆందోళన వ్యక్తం చేయడం లేదు. ప్రముఖ పెట్టుబడిదారు మైకేల్ బర్రీ, గోల్డ్‌మాన్ సాష్కు చెందిన ల్లాయిడ్ బ్లాంక్‌ఫెయిన్, సోరోస్ ఫండ్ మేనేజ్మెంట్ సీఈవో డాన్ ఫిట్జ్‌ప్యాట్రిక్, జేపీమోర్గాన్ సీఈవో జేమీ డిమోన్ లాంటి వాళ్లు సైతం రాబోయే రోజుల్లో అమెరికా భయంకరమైన సంక్షోభాన్ని ఎదుర్కొనుందంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. -
నార్త్ కొరియా దీనస్థితి.. కిమ్ సంచలన వ్యాఖ్యలు
North Korea Economic Crisis: ఆకలి రోదనలు.. లక్షల్లో సొంత ప్రజల మరణాలు చూసి కిమ్ జోంగ్ ఉన్ గుండె కరిగిందా?. ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపించే కర్కోటకుడిగా పేరుబడ్డ నార్త్ కొరియా నియంతాధ్యక్షుడు.. ఓ మెట్టు దిగాడా? క్షిపణుల ప్రయోగం, అణ్వాయుధాల తయారీతో దాయాదులపై విరుచుకుపడే కిమ్.. ఇప్పుడు స్వరం మార్చాడు. ఇక ప్రజల గురించి ఆలోచించాల్సిన టైం వచ్చిందని ఆయన ఇచ్చిన ప్రసంగం.. అధికారులను సైతం విస్మయానికి గురి చేసింది. ఆంక్షలు, వరుస విపత్తులతో ఉత్తర కొరియా పరిస్థితి ఆర్థికంగా ఘోరంగా తయారయ్యింది. ఈ తరుణంలో ఆర్థిక వ్యవస్థ పతనం ఏ స్థాయిలో ఉన్నా సరే.. ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపర్చాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉందని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జరిగిన పార్టీ వార్షిక సమావేశంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. మరోవైపు ఏనాడూ ప్రజా సంక్షేమం గురించి పట్టించుకోని కిమ్ నోటి నుంచి ఈ స్టేట్మెంట్ వచ్చేసరికి.. స్టేజ్ మీద ఉన్న అధికారులు ఆశ్చర్యపోయారట. ఈ వ్యాఖ్యల్ని అధికారిక మీడియా హౌజ్ Korean Central News Agency ప్రసారం చేసింది. ముందు ప్రజలు.. తర్వాతే మనం! న్యూక్లియర్ వెపన్స్ తయారీ కారణంగా నార్త్ కొరియాపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అటుపై కరువు, భారీ వర్షాలు, వరదలు.. కొరియా ఆర్థిక వ్యవస్థను దారుణంగా దిగజార్చాయి. వీటికి కరోనా తోడవ్వడం, చైనా నుంచి పూర్తిగా వర్తకం నిలిచిపోవడంతో పరిస్థితి ఘోరమైన సంక్షోభానికి దారితీసింది. మునుపెన్నడూ లేనివిధంగా ఆహార-మందుల కొరతను ఎదుర్కొంటున్నారు అక్కడి ప్రజలు. ఆకలి చావులు సంభవిస్తుండగా.. ఐరాస మానవ హక్కుల విభాగపు దర్యాప్తు సంస్థ కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. ఈ తరుణంలో ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం కంటే ముందు ప్రజల జీవన విధానం మెరుపరిచే ప్రయత్నం ముమ్మరం చేశాడు అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్!. పార్టీ వార్షికోత్సవ సమావేశంలో మాట్లాడుతూ.. ఇకపై పార్టీ మూకుమ్మడిగా పని చేయాలని పిలుపు ఇచ్చాడు. ‘‘ఈ విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోందాం. కలిసి కట్టుగా ముందుకు వెళ్దాం. ప్రజల సంక్షేమమే మన తొలి ప్రాధాన్యం. మిగతావి తర్వాత. అయితే మీరు చేసే పనులు ప్రజలకు మేలు చేస్తాయా? లేదంటే వాళ్ల హక్కుల్ని కాలరాస్తాయా? అనేది సమీక్షించుకోవాలి. ప్రజాశ్రేయస్సుకు విఘాతం కలిగించే పనులు చేస్తే సహించే ప్రసక్తే లేదు’’ అని అధికారులకు హెచ్చరిక జారీ చేశాడాయన. ఆర్భాటాలకు దూరంగా.. వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా 76వ వార్షికోత్సవ సమావేశం ఆదివారం రాజధాని ప్యాంగ్ యాంగ్లో జరిగింది. సమావేశానికి ముందు ఆనవాయితీగా వేడుకలు నిర్వహించాల్సి ఉండగా.. ఈసారి ఆర్భాటానికి దూరంగా వేడుకలు విశేషం. సాధారణంగా ఎలాంటి సందర్భంలోనైనా.. మిలిటరీ పరేడ్‌తో తన దర్పాన్ని ప్రపంచానికి ప్రదర్శించుకుంటాడు కిమ్. అలాంటిది సాదాసీదాగా నిర్వహించడం బహుశా ఇదే ప్రప్రథమం. అమెరికా తిట్టిన తర్వాత.. ఇక ఉత్తర కొరియాలో ఇంత దారుణమైన సంక్షోభానికి కిమ్ నియంతృత్వ పాలనే కారణమని అమెరికా తిట్టిపోసింది. ఈ మేరకు గురువారం అమెరికా విదేశాంగ శాఖ.. కిమ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజలను అక్కడి(నార్త్ కొరియా) ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోంది. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. ప్రజల కోసం వెచ్చించాల్సిన నిధుల్ని.. మారణాయుధాల తయారీకి మళ్లిస్తున్నారంటూ వైట్‌హౌజ్ ప్రతినిధి నెడ్ ప్రైస్ ఆరోపించారు. ఒకవేళ అవసరం సాయం కోరితే నార్త్ కొరియాను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు కూడా. ఈ తరుణంలో కిమ్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలోనూ ఆసక్తికర చర్చకు దారి తీశాయి. చదవండి: కిమ్ ఇంట అధికార కుంపటి.. సోదరితో వైరం! -
చీకటి నుంచి చీకటికి
విభజన పర్యవసానంగా దాదాపు 90,000 వేల కోట్ల అప్పుల భారంతో 15,000 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో కొత్త సంసారాన్ని ప్రారంభిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా సంక్షోభంలో పడింది. తెలుగు జాతి ఆశా సౌధంగా నిర్మించుకొన్న ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలయ్యింది. రాష్ర్ట విభజనతో దగాపడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర, మధ్య దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల ప్రజలు తీవ్రమైన ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. రాయలసీమ మనుగడ ప్రశ్నార్థకమయ్యింది. రాష్ర్ట విభజనలో కాంగ్రెస్‌కు ఎంత భాగస్వామ్యమున్నదో, భారతీయ జనతాపార్టీకి కూడా అంతే భాగస్వామ్యమున్నది. కాబట్టి ప్రస్తుతం అధికారం చేపట్టిన మోడీకి ఆంధ్రులకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయవలసిన బాధ్యత ఉంది. అభివృద్ధికి కేంద్రంగా, ఆదాయానికి నెలవుగా, ఉపాధికి కల్పవృక్షంగా ఉన్న హైదరాబాద్ మహానగరాన్ని కోల్పోయిన కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజానీకానికి ఉపాధికల్పనతో కూడిన ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధి తక్షణావసరం. విభజన పర్యవసానంగా దాదాపు 90,000 వేల కోట్ల అప్పుల భారంతో 15,000 వేల కోట్ల లోటు బడ్జెట్‌తో కొత్త సంసారాన్ని ప్రారంభిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా సంక్షోభంలో పడింది. శ్రీకాకుళం నుండి నెల్లూరు జిల్లా వరకు 900కిలో మీటర్లకుపైగా విస్తరించి ఉన్న సముద్ర తీరాన్ని ఉపయోగించుకొని కొత్త ఓడరేవుల నిర్మాణం విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖ- కాకినాడల మధ్య పెట్రో కారిడార్, కృష్ణా-గోదావరి సహజవాయువు ఆధారంగా ఎరువుల కర్మాగారాలు, విద్యుదుత్పాదనా కేంద్రాలు వగైరా పరిశ్రమలను నెలకొల్పడానికి చర్యలు చేపట్టనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. విభజన చట్టంలో పొందుపరచిన అంశాలను ప్రాతిపదికగా తీసుకొని నేడు చర్చంతా విశాఖ- నెల్లూరు జిల్లాల మధ్య విస్తరించి ఉన్న ప్రాంతంపై కేంద్రీకరించారు. పర్యవసానంగా భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ కృత్రిమ ‘హైప్’ను తగ్గించి, వాస్తవికతకు దగ్గరగా ప్రజలు ఆలోచించేలా మొదట నిర్మాణాత్మకమైన చర్యలను చేపట్టాలి. విద్యుత్ పంపిణీలోనూ ఆంధ్రప్రదేశ్ తీవ్ర అన్యాయానికి గురయ్యింది. ఆస్తులను అప్పులను, జనాభా ప్రాతిపదికపై పంపిణీ చేసి, విద్యుత్తును మాత్రం ప్రస్తుత వినియోగం ఆధారంగా పంపిణీ చేశారు. ఫలితంగా దాదాపు రెండువేల మెగావాట్ల విద్యుత్తును ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. తాత్కాలికంగా కేటాయిస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ శాశ్వతంగా నష్టపరచి, నూతన పరిశ్రమల రాకకు అవరోధం కల్పించడం ఏ మేరకు సమంజసం? విద్యుత్ అవసరాల కోసం ప్రత్యామ్నాయంగా సౌర విద్యుత్, పవన విద్యుత్ ఉత్పత్తికి పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తే సత్పలితాలుంటాయి. భవిష్యత్తు తరాల తలరాతలతో ముడిపడి ఉన్న మౌలిక సమస్యల పరిష్కారానికి నడుం బిగించాలి. నేడు జరుగుతున్న చర్చల సరళిని పరిశీలిస్తే లోపభూయిష్టమైన కేంద్రీకృత అభివృద్ధి ప్రణాళికలే మళ్లీ అమలులోకి వచ్చేలా సూచనలు కనబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 1956 నాటికి విశాఖలో హిందుస్థాన్ షిప్‌యార్డు, హైదరాబాద్ ఆల్విన్, నిజామాబాద్‌లో నిజాం చక్కెర పరిశ్రమలు మాత్రమే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ రంగ సంస్థలు ఉండేవి. 1965-75 మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రంగా ఇ.సి.ఐ.ఎల్., బి.హెచ్.ఇయల్., ఐ.డి.పి.ఎల్, హెచ్.యం.టి, మిథాని, యన్.యం.డి.సి., యన్.యఫ్.సి., విశాఖపట్నంలో బి.హెచ్.పి.వి., జెన్కో లాంటి భారీ పరిశ్రమలను ప్రభుత్వ రంగంలోనూ, కోరమాండల్ ఎరువుల కర్మాగారాన్ని ప్రైవేటు రంగంలోనూ నెలకొల్పడంతో పారిశ్రామికాభివృద్ధి ఊపందుకొన్నది. ప్రభుత్వ పెట్టుబడులతో భారీ పరిశ్రమలు, మౌలిక సదుపాయాల కల్పన పర్యవసానంగా ముఖ్యంగా హైదరాబాద్, కొంత వరకు విశాఖపట్నం కేంద్రాలలో పారిశ్రామికాభివృద్ధికి బలమైన పునాదులు పడినాయి. ప్రయివేటు పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా తరలి వచ్చి అభివృద్ధికి పాలుపంచుకొన్నాయి. కానీ నేడు సరళీకృత ఆర్థిక విధానాల అమలు మూలంగా ప్రభుత్వం పెట్టుబడులు పెట్టి పరిశ్రమలను నెలకొల్పే విధానానికి స్వస్తి చెప్పారు. ఈ పూర్వరంగంలో పారిశ్రామికాభివృద్ధికి కేవలం ప్రైవేటు పెట్టుబడులపైనే ఆధారపడవలసిన అనివార్య పరిస్థితి. కానీ రాయలసీమ లాంటి ప్రాంతాలలో ప్రభుత్వ పెట్టుబడులతో పారిశ్రామికాభివృద్ధి చేయకుంటే ఎండమావిగానే మిగిలిపోతుంది. శ్రీకాళహస్తి సమీపంలోని మన్నవరం వద్ద బి.హెచ్.ఇ.యల్., యన్.టి.పి.సి సంస్థలు సంయుక్తంగా నెలకొల్పుతున్న విద్యుత్ పరికరాల పరిశ్రమను సత్వరం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించడానికి చర్యలు చేపట్టాలి. తిరుపతి కేంద్రాన్ని ఉన్నత విద్యా కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు, చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఐ.టి. తదితర పారిశ్రామికాభివృద్ధికి అనువైన వాతావరణాన్ని నిర్మించాలి. ఒకవైపున చెన్నై, రెండవ వైపున బెంగళూర్, అలాగే కృష్ణపట్నం ఓడరేవుకు సమీపంలో ఉండడం వల్ల మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. కడప జిల్లాలో ప్రైవేటు రంగంలోస్థాపించ తలపెట్టి అర్థాంతరంగా ఆగిపోయిన బ్రహ్మణి ఉక్కు కర్మాగారం స్థానంలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను స్థాపించవచ్చు. అనంతపురం జిల్లాలో నెలకొల్పి తలపెట్టి మూలనపడిన లేపాక్షి పారిశ్రామికవాడ ప్రతిపాదనను ఆచరణలోకి తీసుకురావచ్చు. రేణిగుంట రైల్వే వ్యాగన్ రిపేర్ కర్మాగారం స్థాయిని పెంచవచ్చు. కర్నూలు జిల్లాలో ఖనిజాధార పరిశ్రమలకు పుష్కలంగా అవకాశాలున్నాయి. కడప జిల్లాలోని యర్రగుంట్ల, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి పరిసరాలలో సిమెంటు కర్మాగారాలు మినహాయిస్తే చెప్పుకోతగ్గ పరిశ్రమలే రాయలసీమలో లేవు. ఈ ప్రాంతాన్ని వేధిస్తున్న అతి పెద్ద సమస్య నీరు. దానికి పరిష్కారాన్ని కనుగొనాలి.