బెల్ సెంచరీ: ఇంగ్లండ్ 399
ఆంటిగ్వా: వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 110.4 ఓవర్లలో 399 పరుగులకు ఆలౌటయింది. ఇయాన్ బెల్ (143) సెంచరీ చేశాడు. రూట్ (83), స్టోక్స్ (79) అర్ధసెంచరీలతో ఆకట్టుకున్నారు. వెస్టిండీస్ బౌలర్లలో రోచ్ 4, టేలర్ మూడు వికెట్లు తీసుకున్నారు. రెండో రోజు మంగళవారం కడపటి వార్తలు అందే సమయానికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 26 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. బ్రాత్‌వైట్ 32, శ్యామ్యూల్స్ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు.