చూసిన రోజునే...
మనోజ్‌నందన్, స్మితికాచార్య జంటగా బాల.జి దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ ప్రేమకథా చిత్రం ‘ఏ రోజైతే చూశానో’. ఆర్.యస్.క్రియేషన్ప్, శ్రీ శివపార్వతి కంబైన్స్ పతాకాలపై తన్నీరు సింహాద్రి, సిందిరి గిరి నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది.
ఇటీవల విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కొత్త ఏడాది మొదటి వారమే మా చిత్రం విడుదలవుతుండడం సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘నేటి తరం యువతకు మా చిత్రం నచ్చేలా తీశాం. ప్రేమ, వినోదం.. ఇలా అన్ని అంశాలూ ఉంటాయి. స్మితికా చార్య కొత్త అమ్మాయి అయినా అనుభవం ఉన్నవారిలా నటించారు. చూసిన రోజునే ప్రేమలో పడే ఓ జంట కథ ఇది. ఈ ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది’’ అని దర్శకుడు పేర్కొన్నారు.