farmers committee
-
AP: రైతుకు విత్తన భరోసా
సాక్షి, అమరావతి: అన్నదాతకు మరింత భరోసా ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు ముందుకు వేసింది. దేశంలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నూతన విత్తన విధానం (సీడ్ పాలసీ) తీసుకొచ్చింది. భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా జన్యుపరంగా అభివృద్ధి చేసిన నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాన్ని సకాలంలో రైతులకు అందజేయడమే ఈ విధానం లక్ష్యం. తద్వారా రైతన్నకు భరోసా, భద్రత లభించనుంది. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో 92.45 లక్షల ఎకరాల్లో, రబీ సీజన్లో 58.65 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు.. 44.60 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. వ్యవసాయ పంటలకు 22.81 లక్షల క్వింటాళ్లు.. పత్తి, మొక్కజొన్న, జొన్న, బాజ్రా పంటలకు 72 వేల క్వింటాళ్లు, ఉద్యాన పంటలకు సంబంధించి కూరగాయలు, మిరప పంటలకు 1.20 లక్షల క్వింటాళ్లు కలిపి మొత్తం 24.73 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరం. 9.20 లక్షల క్వింటాళ్ల విత్తనాలను ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ, 11.33 లక్షల క్వింటాళ్లు ప్రైవేటు కంపెనీలు ఉత్పత్తి చేస్తుంటే 3.13 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రైతు సంఘాలు తయారు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో ఏటా రూ.1400 కోట్ల నుంచి రూ.1500 కోట్ల విలువైన విత్తన వ్యాపారం జరుగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ఫలితంగా రైతుల విత్తన కష్టాలకు తెర పడింది. దీనికి తోడు విత్తన పాలసీ వల్ల మరింత మేలు జరగనుంది. రైతుల భాగస్వామ్యంతో విత్తనోత్పత్తి ► ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా ప్రస్తుతం 450 గ్రామాల్లో 2 వేల మంది రైతులు 15 రకాల పంటలకు సంబంధించి 5 లక్షల క్వింటాళ్ల విత్తనోత్పత్తి చేస్తున్నారు. విత్తన పాలసీ ద్వారా కొత్తగా మరో 1,000 గ్రామాల్లో 5 వేల మంది రైతుల ద్వారా వ్యవసాయ, ఉద్యాన, పసుగ్రాస.. ఇలా 20 రకాల పంటలకు సంబంధించి 12 లక్షల క్వింటాళ్ల పౌండేషన్, సర్టిఫైడ్, హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేయబోతున్నారు. ► దశల వారీగా కనీసం 10 వేల మంది రైతుల ద్వారా 2 వేల గ్రామాల్లో 15 లక్షల క్వింటాళ్ల విత్తనోత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు. విత్తనోత్పత్తిలో రైతులతో పాటు 15–20 మంది రైతులతో ఏర్పాటయ్యే రైతు సంఘాలను ప్రోత్సహించనున్నారు. తయారైన విత్తనాల నాణ్యతను నాలుగు దశల్లో ధ్రువీకరిస్తారు. ► వరి, శనగలు, మినుములు, పెసలు, వేరుశనగ, జొన్నలు, మొక్కజొన్న, పత్తి మూల విత్తనాన్ని 2023–24 కల్లా 100 శాతం మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైబ్రీడ్ పంటల మూల విత్తనాన్ని ఏటా మార్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ► ప్రస్తుతం ఉన్న 18 ప్రాసెసింగ్ యూనిట్లకు తోడు కొత్తగా 33 సీడ్ ప్రొసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. విజయనగరం జిల్లా మెట్టవలస ఆర్బీకేలో తీసుకున్న విత్తనాలతో రైతులు రూ.50 కోట్లతో విత్తన జన్యు కేంద్రం ► వందేళ్ల నాటి విత్తనాలతో పాటు రాష్ట్రంలో డిమాండ్ ఉన్న విత్తన రకాల మూల విత్తనం నుంచి మేలు జాతి విత్తనాలు తయారు చేయడమే లక్ష్యంగా రూ.50 కోట్లతో విత్తన జన్యు కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. వర్సిటీలు అభివృద్ధి చేసిన బ్రీడర్ సీడ్ నుంచి మూల విత్తనోత్పత్తి చేస్తారు. షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ స్టోరేజ్ పద్దతుల్లో 3 నుంచి 50 ఏళ్ల వరకు మూల విత్తనాన్ని ఈ జెన్ బ్యాంక్‌లో భద్రపరుస్తారు. ► సీడ్ పాలసీలో భాగంగా ఏపీ స్టేట్ విత్తన పరిశోధనా, శిక్షణా సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. వారణాసిలోని జాతీయ విత్తన పరిశోధన కేంద్రానికి దీటుగా దీన్ని తీర్చిదిద్దబోతున్నారు. రైతులతో పాటు వ్యవసాయ డిప్లమో, బీఎస్సీ అగ్రి విద్యార్థులకు విత్తన తయారీపై సర్టిఫికెట్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. కర్నూలు జిల్లా తంబాలపల్లిలో వేరుశనగ విత్తనాలను పరిశీలిస్తున్న అధికారులు విత్తన పాలసీ ప్రధాన లక్ష్యాలు ఇవీ ► అంతర్జాతీయ ప్రమాణాలతో జన్యుపరంగా మేలు జాతి విత్తనాల అభివృద్ధి. ► రైతుల ద్వారా గ్రామ స్థాయిలోనే వ్యవసాయ, ఉద్యాన, పశుగ్రాస పంటల విత్తనోత్పత్తి. ► విత్తనోత్పత్తిలో రైతులను ప్రోత్సహించడం, దశల వారీగా నూరు శాతం విత్తన మార్పిడి, విత్తన పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేయడం. ► పెట్టుబడులను నియంత్రిస్తూ అధిక దిగుబడులను సాధించే వంగడాలను అందుబాటులోకి తీసుకురావడం. ► నాణ్యమైన, ధ్రువీకరించిన విత్తనాన్ని ఆర్బీకేల ద్వారా రైతులకు అందుబాటులో ఉంచడం. ► విస్తృత స్థాయిలో విత్తన పరిశోధనలు. విత్తనోత్పత్తి చేసే కంపెనీలను నియంత్రిస్తూ.. వాటికి విత్తనాలు సరఫరా చేసే రైతులకు భద్రత కల్పించడం. ► రైతులతో పాటు ఈ రంగంలోకి వచ్చే ప్రతి ఒక్కరికి విత్తనోత్పత్తిపై అత్యుత్తమ శిక్షణ. ► ఈ మేరకు ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా విత్తన పాలసీ అమలుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. -
రైతు సంఘాలతో కేంద్రం చర్చలు విఫలం
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం మంగళవారం చర్చలు జరిపింది. ముగ్గురు కేంద్ర మంత్రులతో కూడిన బృందం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మూడు వ్యవసాయ చట్టాలపై చర్చించేందుకు ఒక కమిటీని వేద్దామని కేంద్ర మంత్రులు ప్రతిపాదించగా రైతు సంఘాల నేతలు ఏకపక్షంగా తిరస్కరించారు. ఈ కమిటీలో కేంద్ర ప్రభుత్వ అధికారులు, వ్యవసాయరంగ నిపుణులు ఉంటారని, రైతు సంఘాల నుంచి ఎవరు ప్రతినిధులుగా ఉంటారో పేర్లు ఇవ్వాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ కోరగా రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. ఈ దశలో తాము కమిటీకి ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతకముందు ఎటువంటి షరతులు లేకుండా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించడంతో చర్చలకు వెళ్లాలని రైతు సంఘాల నాయకులు నిర్ణయించుకున్నారు. (చదవండి: షరతులతో చర్చలకు ఒప్పుకోం) మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 35 మంది రైతు సంఘాల నాయకుల బృందంతో ముగ్గురు కేంద్ర మంత్రులు చర్చలు జరిపారు. అయితే చర్చల్లో ఏ విషయం తేలకపోవడంతో గురువారం మళ్లీ చర్చించాలని నిర్ణయించకున్నారు. పంజాబ్, ఉత్తరఖండ్, ఉత్తరప్రదేశ్, హరియాణ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రులు తోమర్, పియూష్ గోయల్, సోమ్ ప్రకాశ్ చర్చలు జరిపారు. తమ డిమాండ్లు తీరే వరకు వెనక్కి తగ్గేది లేదని, పంజాబ్, హరియాణ నుంచి రైతులు ఇంకా వస్తున్నారని, ఏడాది పాటైనా బైఠాయించేందుకు సిద్దపడి వచ్చామని రైతు సంఘాల నేతలు చెప్పారు. -
సెక్షన్ 30.. సెక్షన్ 144 పెట్టినప్పుడు ఏమయ్యారు?
సాక్షి, అమలాపురం: ‘గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏడాది పొడువునా సెక్షన్ 30 పెట్టారు. రైతుల సమావేశం అంటే 144 సెక్షన్ ఉందని హెచ్చరించేవారు. సమావేశం పెట్టుకుంటే పోలీసులు వచ్చి మైకులు విరగ్గొట్టారు. సాగు సమ్మె చేయమని పిలుపునిస్తే చూస్తూ ఊరుకోబోమని సాక్షాత్తూ నాటి హోంశాఖ మంత్రి హెచ్చరించారు. అప్పుడెందుకు ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేయలేదు. మాకెందుకు మద్దతుగా నిలవలేదు. ఇప్పుడెందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు?’ అంటూ కొంతమంది రైతు సంఘం నాయకులు నిలదీయడంతో టీడీపీ అనుకూల రైతు సంఘం నాయకులకు నోరు పెగల్లేదు. అమరావతి రైతులకు అనుకూలంగా తీర్మానం చేయించాలనే ఉద్దేశంతో టీడీపీ అనుకూల రైతులు కోనసీమ రైతు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రైతు సమావేశం నిర్వహించగా వారికి ఝలక్ తగిలింది. స్థానిక విద్యుత్ నగర్లో బుధవారం కోనసీమ రైతు పరిరక్షణ సమితి, భారతీయ కిసాన్ సంఘల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో అమరావతి రైతుల పోరాటానికి మద్దతు తీర్మానంతోపాటు ధాన్యం సొమ్ములు రావడం లేదని, నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నామనే తీర్మానాలు చేయాలని టీడీపీ అనుకూల రైతులు తలపోశారు. ఈ విషయాలు తెలుసుకున్న రైతు సంఘం నాయకులు కొంతమంది స్పందించారు. స్థానిక సమస్యలపై చర్చిద్దాం.. ‘ఎక్కడో రైతుల సమస్యలు తరువాత.. ముందు ఇక్కడ విషయాలు మాట్లాడదాం?’ అని బీకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముత్యాల జమ్మి అన్నారు. కొంతమంది రైతులు ఇటీవల ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం సొమ్ములు రాలేదని ప్రస్తావించగా ‘ధాన్యం బాగానే పండింది. ప్రభుత్వం మంచిగానే కొనుగోలు చేసింది. సొమ్ములు రేపో, ఎల్లుండో వస్తాయి. 2011 సాగు సమ్మె తరువాత నుంచి ఇప్పటి వరకు చాలా ప్రభుత్వాల నుంచి మనకు పంట నష్టం పరిహారం ఇవ్వలేదు. రైతు రుణమాఫీ సొమ్ములు పూర్తిగా అందలేదు. పనిలో పని వాటి మీద కూడా చర్చిస్తే మంచిది’ అని జమ్మి తేల్చిచెప్పారు. విజయవాడలో రైతులకు కాని, రైతు కూలీలకు కాని నష్టం జరిగితే మాట్లాడదాం, అంతేకాని రాజధాని మార్పు విషయం గురించి ఇక్కడ మాట్లాడతామంటే కుదరదు’ అని తెగేసి చెప్పాడు. ఆయనకు రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ సభ్యుడు జిన్నూరి రామారావు (బాబి), డీసీసీబీ మాజీ డైరెక్టర్ గోదాశి నాగేశ్వరరావు తదితరులు దన్నుగా నిలిచారు. గోదాశి నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పోలీసులు కేసుల నమోదు, అప్పటి ఆర్డీవో కార్యాలయంలో రైతులతో జరిగిన చర్చలో రైతు సంఘం నాయకుడు రంబాల బోస్‌కు జరిగిన అవమానం గుర్తు చేయడంతో కొంతమంది టీడీపీ అనూకూల రైతులు అభ్యంతరం చెప్పారు. జరిగిన విషయం చెప్పుకుంటే మీకు ఉలికెందుకని కొంతమంది ప్రశ్నించడంతో టీడీపీ అనుకూల రైతులు మిన్నకుండా ఉండిపోయారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు యెర్నేని నాగేంద్ర వివిధ కారణాలతో ప్రభుత్వం భూములు తీసుకున్న రైతులకు న్యాయం చేయాలంటూ ముక్తసరిగా మాట్లాడారు. అనంతరం ధాన్యం అమ్మకాలు చేసిన రైతులకు సొమ్ములు విడుదల చేయాలని, రబీకి నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని తీర్మానాలు చేశారు. ఈ సమావేశానికి కోనసీమ రైతు పరిరక్షణ సమితి అధ్యక్షుడు అధ్యక్షుడు యాళ్ల బ్రహ్మానందం అధ్యక్షత వహించారు. రైతు పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు రంబాల బోస్, బీకేఎస్ నాయకుడు ఉప్పుగంటి భాస్కరరావు, రైతు సంఘం నాయకులు రాయుపురెడ్డి జానకీరామయ్యతోపాటు పలువురు పాల్గొన్నారు. -
రాజధాని రైతులు
-
సీఎం జగన్ మాకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు
-
రిజర్వ్ జోన్లను కూడా ఎత్తివేస్తామని సీఎం హామీ ఇచ్చారు
-
మార్క్‌ఫెడ్ ‘ఔట్’!
సాక్షి, హైదరాబాద్: రైతు సమన్వయ సమితిలో మార్క్‌ఫెడ్‌ను విలీనం చేస్తున్నారా? తద్వారా రైతు సమన్వయ సమితిని బలోపేతం చేస్తారా? ఇక నుంచి పంట ఉత్పత్తుల సేకరణ, ఎరువుల సరఫరా బాధ్యత రైతు సమితే తీసుకుం టుందా? అంటే అవుననే అంటు న్నాయి వ్యవసాయ శాఖ వర్గాలు. ఆ దిశగా కీలక అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది. రెండ్రోజుల కిందట వ్యవ సాయ శాఖకు చెందిన ఇద్దరు కీలక ప్రజా ప్రతినిధుల మధ్య ఈ అంశంపై సీరియస్‌గా చర్చలు జరిగాయని, ఈ చర్చల అనంతరం ఒక ప్రజాప్రతినిధి ‘విలీనం జరిగే అవకాశాలు మెం డుగా కనిపిస్తున్నాయ’ని తమ వద్ద ప్రస్తావించినట్లు మార్క్‌ఫెడ్ ఉద్యోగులు చెబుతున్నారు. అంతేకాదు ‘మార్క్‌ఫెడ్ గత ఖరీఫ్‌లో యూరియా సరఫరాలో ఘోరంగా విఫలమైంది. పంట ఉత్పత్తుల కొను గోలులోనూ అనేక అవకతవకలు జరుగు తున్నాయి. మొక్కజొన్న విక్రయాల పైనా విమర్శలు వచ్చాయి. దీంతో మార్క్‌ఫెడ్‌పై ఉన్నత స్థాయి వర్గాలు గుర్రుగా ఉన్నాయ’ని ఆయన ప్రస్తా వించారని తెలిసింది. దీంతో మార్క్ ఫెడ్లో పనిచేసే ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇక మార్క్‌ఫెడ్ ఎరువులను సరఫరా చేస్తుండగా, తాజాగా ఆగ్రోస్‌ను కూడా అడిషనల్ నోడల్ ఏజెన్సీగా నియమించారు. అంటే ఇక నుంచి ఆగ్రోస్ కూడా తమ ఆగ్రో రైతు సేవా కేంద్రాల ద్వారా కంపెనీల నుంచే నేరుగా ఎరువులను సరఫరా చేయనుంది. ఇప్పటికే దానికి సంబం ధించి తాజాగా వ్యవసాయశాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇలా మార్క్ ఫెడ్‌ను రోజురోజుకూ నిర్వీర్యం చేస్తున్నారని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. రైతు సమితిలో మార్క్‌ఫెడ్‌ను విలీనం చేస్తే దానిలో ఉన్న సమితి సభ్యులతో తాము పనిచేయడం కష్టంగా మారుతుందని అంటున్నారు. ఏది చేయాలన్నా సమస్యలు వచ్చే అవకాశం ఉందన్న భావన ఉద్యోగుల్లో నెలకొంది. పరిపాలనా విభాగం ఏర్పాటే లక్ష్యం.. రైతు సమన్వయసమితి ఏర్పాటై ఇన్నాళ్లయినా దానికి సంబంధించి పూర్తిస్థాయి కార్యక్రమాలు ప్రారంభంకాలేదు. గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రస్థాయిలో రైతు సమన్వయ సమితుల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లక్షలన్నర మందికిపైగా కిందినుంచి పైస్థాయి వరకు సభ్యులున్నారు. దానికి చైర్మన్ గా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని సర్కారు నియమించిన సంగతి తెలిసిందే. అంతకు ముందు దానికి గుత్తా సుఖేందర్‌రెడ్డి చైర్మన్‌గా వ్యవహరించారు. రైతు దుక్కి దున్ని పంట పండించి, మార్కెట్‌కు తీసుకెళ్లే వరకూ సమితి సభ్యులు అండగా ఉండాలనేది సర్కారు ఉద్దే శం. రైతుబంధు నిధులు అందేలా చేయడం, బ్యాంకుల్లో పంట రుణాలు ఇప్పించేలా కృషి చేయడం, పంట పండించాక దాన్ని మద్దతు ధరకు విక్రయించే ఏర్పాట్లు చేయడం, దేశంలో ఎక్కడెక్కడ ఏ స్థాయిలో మంచి ధరలున్నాయో గుర్తించి అక్కడికి పంట ఉత్పత్తులు తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవడం వంటి అనేక కీలకమైన బాధ్యతలు సమన్వయ సమితి చేయాలనేది సర్కారు లక్ష్యం. అంతేకాదు ఎరువులు, విత్త నాలు సకాలంలో రైతులకు అందించేలా చేయ డం, నాసిరకం విత్తనాలు అమ్మకుండా అడ్డుకో వడం, పంట పండించాక మార్కెట్లో ఇబ్బందు లు తలెత్తకుండా సమితి సభ్యులు కృషి చేయా లని కూడా సీఎం కేసీఆర్ వారికి అప్పట్లో దిశానిర్దేశం చేశారు. అయితే రైతు సమన్వయ సమితికి ఇవన్నీ చేసే పరిపాలనా విభాగం లేదు. అధికారులు, ఉద్యోగులు, ఇతరత్రా వ్యవస్థ ఏర్పాటు కాలేదు. కేవలం చైర్మన్లు, సభ్యులు మాత్రమే ఉన్నారు. దీనికి ఎటువంటి అధికారాలు, పరిపాలనా యంత్రాంగం, చెక్ పవర్ వంటివేవీ లేవు. ఈ పరిస్థితిని మార్చాల నేది సర్కారు ఉద్దేశం. ఇటు రైతు సమన్వయ సమితి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రకా రమే మార్క్‌ఫెడ్ రైతులకు యూరియా, ఇతర ఎరువులను సరఫరా చేస్తుంది. పంట ఉత్ప త్తులను కొనుగోలు చేస్తుంది. కాబట్టి మార్క్ ఫెడ్‌ను విలీనం చేస్తే, ఆ పరిపాలనా యం త్రాంగం మొత్తం రైతు సమితిలోకి వచ్చి పరి పుష్టిగా ఉంటుందనేది ఆ ఇద్దరు కీలక ప్రజా ప్రతినిధులు భావించినట్లు సమాచారం. మార్క్‌ఫెడ్‌లో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 150 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో పటిష్టమైన యంత్రాంగం, విభాగం ఉంది. దానికి చైర్మన్, ఎండీ, జనరల్ మేనేజర్ కూడా ఉన్నారు. కానీ దాన్ని సక్రమంగా నడిపించడం లేదన్న ఆరోపణలు న్నాయి. రైతు సమన్వయ సమితిలో మార్క్‌ఫెడ్ విలీనంపై వివరణ ఇవ్వడానికి అటు అధికారులు, ఇటు సంబంధిత ప్రజాప్రతినిధులు సుముఖంగా లేరు. -
చంద్రబాబుపై రాజధాని రైతుల ఆగ్రహం
సాక్షి, గుంటూరు : ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రాజధాని రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒక పథకం ప్రకారం రాజధానిలో రైతులను చంద్రబాబు రెచ్చగొడుతున్నారని ధ్వజమెచ్చారు. రైతుల మధ్య చిచ్చు పెడుతున్నారని, రాజధాని కోసం భూములు తీసుకునేటప్పుడు అనేక హామీలు ఇచ్చారని, వాటిలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఇచ్చిన స్థలాలు ఎక్కడున్నాయో కూడా తమకు తెలియడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు తమని అన్ని విధాలా మోసం చేశారని రాజధాని రైతులు వ్యాఖ్యానించారు. ఈ నెల 28న రాజధాని పర్యటన పేరుతో చంద్రబాబు గ్రామాలలో పర్యటిస్తానని ప్రకటించారని, ఆయన ఏ ముఖం పెట్టుని తమ వద్దకు వస్తారని సూటిగా ప్రశ్నించారు. రాజధాని పేరుతో తమను మోసం చేసినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని రైతులు డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పిన తర్వాతే రాజధానిలో అడుగుపెట్టాలని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తమకు అన్యాయం జరిగిందని ఆయనతో మొర పెట్టుకున్నామని, అప్పట్లో తమ బాధలు వినడానికి సీఎం జగన్ ప్రతపక్ష నేత హోదాలో రాజధాని పర్యటిస్తే చంద్రబాబు పసుపు నీళ్లు చల్లించారని రైతులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరి రైతులను కూడా మోసం చేసిన చంద్రబాబు రాజధానిలో పర్యటిస్తే తాము ఏ నీళ్లు చల్లాలో చంద్రబాబే సమాధానం చెప్పాలన్నారు. రాజధాని పేరుతో అన్నివిధాలా మోసం చేసిన చంద్రబాబు ముందు రాజధాని రైతులకు క్షమాపణ చెప్పాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు హెచ్చరించారు. -
పెద్దపల్లి జిల్లాలో రైతుల ఇబ్బందులు
-
ఊరంతా దాచి కేశవరెడ్డి చేతిలో పెడితే...ఇప్పుడేమో?
సాక్షి, నంద్యాల(కర్నూలు) : పాణ్యం మండలం నెరవాడ వద్ద ఉన్న కేశవరెడ్డి స్కూల్ ఎదుట యాళ్లూరు గ్రామానికి చెందిన రైతు సంఘం నాయకులు శుక్రవారం నిరసన చేపట్టారు. గ్రామానికి ఇవ్వాల్సిన డబ్బు ఇస్తేనే ఇక్కడి నుంచి వెళ్లేదని భీష్మించుకు కూర్చున్నారు. పాణ్యం సీఐ వంశీకృష్ణ జోక్యం చేసుకుని కేశవరెడ్డి కుమారుడు మంగళవారం నాటికి వాయిదా కోరాడని చెప్పడంతో నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేశారు. అనంతరం యాళ్లురు రైతుసంఘం మాజీ అధ్యక్షులు బెక్కెం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 2015లో కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డికి రూ.24 లక్షలు అప్పుగా ఇచ్చామని తెలిపారు. అ డబ్బంతా గ్రామనికి చెందిన మాతా అరవిందమ్మ ఆశ్రమం, దేవాలయం, గ్రామ అభివృద్ధికి దాచుకున్నదని తెలిపారు. రూ.24 లక్షలకు రూ.2 వడ్డీ ప్రకారం ఏటా చెల్లిస్తానని చెప్పడంతో గ్రామపెద్దలందరూ కలిసి అప్పుగా ఇవ్వడం జరిగిందన్నారు. తీసుకున్న తర్వాత రెండేళ్లు వడ్డీ చెల్లించి తర్వాత సంవత్సరం నుంచి డబ్బులు చెల్లించడం నిలిపివేశాడన్నారు. గ్రామస్తులు వడ్డీ చెల్లించాలని అడిగితే శ్రీకాకుళంలో వెంచర్ వేశామని, అది అమ్ముడు పోతే మొత్తం నగదు చెల్లిస్తానని నమ్మబలికాడని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అప్పటి నుంచి వడ్డీ, అసలు చెల్లించకుండా గడువు చెబుతూ కాలం వెల్లదీశాడని చెప్పుకొచ్చారు. కొంత కాలం తర్వాత గ్రామపెద్దలంతా కేశవరెడ్డిని గట్టిగా నిలదీస్తే రూ.6లక్షలు ఇచ్చి మిగతా సొమ్మంత కొంత వ్యవధిలోనే పూర్తిగా చెల్లిస్తానని నమ్మబలికాడన్నారు. తర్వాత కేశవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారని, ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఎటువంటి సొమ్ము ఇవ్వలేదని తెలిపారు. సీఐ ఇచ్చిన హామీ మేరకూ మంగళవారం కేశవరెడ్డి కుమారుడు అప్పు చెల్లించకపోతే బుధవారం స్కూల్ గేట్‌కు తాళాలు వేసి నిరసన తెలుపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు బెక్కెం బాలతిమ్మారెడ్డి, బెక్కెం చిన్నరామకృష్ణారెడ్డి, కైప జగన్నాథరెడ్డి, గంగుల వెంకటచంద్రారెడ్డి, గంగుల తిమ్మారెడ్డి, బెక్కెం మధుసుదన్‌రెడ్డి, బెక్కెం చంద్రశేఖర్‌రెడ్డి , పోగుల వెంకట రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ధన్యజీవి అన్నదాత
-
జాతీయ రహదారిపై అన్నదాతల ఆందోళన
-
‘పెప్సీ’ని వదిలే ప్రసక్తే లేదు
సాక్షి, అమరావతి: రైతుల్ని వేధించినందుకు పెప్సీ కంపెనీ నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. గుజరాత్ రైతులపై కేసులు ఉపసంహరించుకుంటే సరిపోదని, మరెక్కడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని తీర్మానించాయి. ఈ వ్యవహారమై విజయవాడలో త్వరలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించి రైతుల్ని చైతన్య పరచాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఇదిలా ఉంటే పెప్సీ కంపెనీ నుంచి తమకు పరిహారం ఇప్పించాలంటూ బంగాళదుంప రైతులు కేసు వేయడంతో ఈ వ్యవహారం కొత్తమలుపు తిరిగింది. చదవండి: (కేసులు పెడతావా.. పరిహారం చెల్లించు) గుజరాత్లో ఎఫ్‌సీ–5 రకం బంగాళదుంపను సాగు చేసినందుకు గత రెండేళ్లలో 9 మంది రైతులపై పెప్సీ కంపెనీ ఇండియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఒక్కో రైతు నుంచి ఒక కోటీ రెండు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని డిమాండ్ చేస్తూ వ్యాజ్యాన్ని వేసింది. దీనిపై దేశ వ్యాప్తంగా రైతులు, రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో వెనక్కు తగ్గిన పెప్సీ కంపెనీ రైతులపై పెట్టిన కేసుల్ని వెనక్కు తీసుకుంటామంటూ కొన్ని ఆంక్షలు విధించింది. అయితే బాధిత రైతులకు మద్దతు తెలుపుతున్న రైతు సంఘాల ఐక్య వేదిక పలు రాష్ట్రాల్లో అవగాహన సదస్సులు, సభలు నిర్వహించతలపెట్టింది. దీనికి అనుగుణంగా త్వరలో ఏపీలోని పలు ప్రాంతాలలో సదస్సులు జరుగనున్నాయి. -
1,000 కోట్లతో ‘రివాల్వింగ్ ఫండ్’
సాక్షి, హైదరాబాద్: రైతులకు మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రానున్న వ్యవసాయ సీజన్ నుంచే దీన్ని అమలు చేసేందుకు పక్కా ప్రణాళిక రచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వివిధ పంటల కొనుగోళ్లకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటిస్తున్నా పూర్తిస్థాయిలో కొనుగోళ్లు జరపకపోతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని గ్రహించిన ప్రభుత్వం అందుకు పరిష్కార మార్గాలు వెతుకుతోంది. అందులో భాగంగానే పంటల కొనుగోళ్ల కోసం ‘రివాల్వింగ్ ఫండ్’ను ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనికోసం రానున్న పూర్తిస్థాయి బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లను కేటాయించనున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ, అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. రైతుబంధుతో సంతృప్తి... మద్దతు ధర లేక అసంతృప్తి విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు, అలాగే సాగు ఖర్చుల కోసం ప్రభుత్వం రైతు బంధు కింద పెట్టుబడి సాయం అందజేస్తున్న సంగతి తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరంలో ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి ఒక్కో రైతుకు ఎకరాకు రూ. 8 వేలు ఇచ్చింది. అలా రెండు సీజన్లకు కలిపి రూ. 10 వేల కోట్లకుపైగా రైతుల ఖాతాల్లో జమ చేసింది. వచ్చే ఖరీఫ్, రబీ సీజన్లలో ఆ సొమ్మును రూ. 10 వేలకు పెంచింది. దీనికోసం బడ్జెట్లో రూ. 12 వేల కోట్లు కేటాయించింది. దీంతో రైతులకు ఎంతో ఊరట వస్తున్నా కొంత అసంతృప్తి ఉంది. రైతులకు ముందుగా ఇలా ఆర్థిక సాయం చేసినా పంట పండించాక దాన్ని సరైన మద్దతు ధరకు కొనకుంటే అసంతృప్తి ఉంటుందని కేసీఆర్ భావించారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని పంటలను కొద్ది మొత్తంలో కొనుగోలు చేస్తున్నా.. పూర్తిస్థాయి పరిష్కారం దొరకడంలేదు. దీంతో రైతులు తమ పంటలను దళారులకు తెగనమ్ముకుంటున్నారు. ఉదాహరణకు 2018–19 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల కందులు ఉత్పత్తి అయ్యాయి. కందికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎంఎస్పీ క్వింటాకు రూ. 5,675... కానీ కేంద్రం పండిన పంటనంతటినీ కాకుండా కేవలం 70,300 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని షరతు విధించింది. మిగిలిన కందులను రైతులు దళారులకు అమ్ముకోవాల్సిన దుస్థితిని కేంద్రమే కల్పించింది. మరికొంత కొనాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా కేంద్రం పట్టించుకోలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి మార్క్‌ఫెడ్, హాకాల ద్వారా 24,729 మెట్రిక్ టన్నులు ఎంఎస్పీ ఇచ్చి కొనుగోలు చేసింది. దీనికోసం ప్రభుత్వం రూ. 140 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. ఇక మొక్కజొన్న క్వింటాలుకు రూ.1,700 ఎంఎస్పీని కేంద్రం నిర్ణయించింది. కానీ కేంద్రం కొనుగోళ్లు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వమే రూ.708 కోట్లు పెట్టి మార్క్‌ఫెడ్ ద్వారా 4.16 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది. అలాగే శనగలను రూ.103 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. బ్యాంకుల వద్ద అప్పులు చేసి వీటిని కొంటున్నా పూర్తిస్థాయిలో కొనలేని పరిస్థితి నెలకొంది. మొక్కజొన్న 17 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి కాగా, కేవలం 4.16 లక్షల మెట్రిక్ టన్నులే కొనుగోలు చేయాల్సి వచ్చింది. కందులు 3 లక్షల మెట్రిక్ టన్నులకు గాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి లక్ష మెట్రిక్ టన్నులు కూడా కొనలేకపోయాయి. అందుకే వెయ్యి కోట్ల రూపాయలతో రివాల్వింగ్ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తుంది. మార్క్‌ఫెడ్‌లో మార్పులు... మరోవైపు మార్క్‌ఫెడ్‌లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాలని సర్కార్ భావిస్తోంది. 33 జిల్లాలకుగాను ప్రస్తుతం మార్క్‌ఫెడ్‌కు కేవలం 15 చోట్ల మాత్రమే జిల్లాస్థాయి అధికారులున్నారు. దీంతో పంట సేకరణ, కొనుగోళ్లు సక్రమంగా నిర్వహించడంలో లోపాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీ జిల్లాకు ఒక అధికారిని నియమించాలన్న ఆలోచనలో సర్కారు ఉంది. దీనికోసం అవసరమైతే వ్యవసాయ, సహకార శాఖల నుంచి కొందరిని డిప్యుటేషన్‌పై తీసుకోవాలని యోచిస్తున్నారు. అలాగే మార్క్‌ఫెడ్‌కు పూర్తిస్థాయి ఎండీ లేరన్న భావన ఉంది. వేర్‌హౌజింగ్ కార్పొరేషన్ ఎండీనే మార్క్‌ఫెడ్, హాకాలకు కూడా ఎండీగా అదనపు బాధ్యతలు ఇచ్చారు. కాబట్టి పూర్తిస్థాయి ఎండీని నియమించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు కంది, మొక్కజొన్న వంటి కొనుగోళ్ల కోసం కేంద్రాలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడంలేదన్న విమర్శలున్నాయి. సిబ్బంది కొరత తదితర కారణాలతో ఈ పరిస్థితి నెలకొంది. అందువల్ల రానున్న సీజన్ల నుంచి ఎన్ని అవసరమైతే అన్నిచోట్లా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. తద్వారా దళారుల ఇష్టారాజ్యానికి చెక్ పెడతారు. ఆన్లైన్లో తక్షణ చెల్లింపులు... రైతుల నుంచి కొనుగోళ్లు జరపడం ఒక ఎత్తైతే, సకాలంలో వాళ్లకు డబ్బులు చెల్లించడం మరో ఎత్తు. దీనిలో ఘోరంగా విఫలమవుతుండటంతో రైతులు దళారులకు అమ్ముకోవడమే మేలన్న దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రైతుబంధు కోసం రైతుల వివరాలు సేకరించారు. మరోవైపు ప్రస్తుతం రైతుల సమగ్ర సమాచార సేకరణ జరుపుతున్నారు. వారి బ్యాంకు ఖాతాలతోపాటు వారు పండించే పంటలన్నీ కూడా అందులో నమోదవుతాయి. ఆ వివరాల ఆధారంగా ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి కొనుగోళ్లు జరిపిన వెంటనే రైతుల ఖాతాల్లోకి సొమ్ము 24 గంటల్లోగా వెళ్లేలా ఏర్పాటు చేయాలని సర్కారు యోచిస్తోంది. మార్క్‌ఫెడ్ ద్వారానే ఈ వ్యవహారం అంతా నడుస్తుంది. ఆ సంస్థనే నోడల్ ఏజెన్సీగా ఉంచాలని భావిస్తున్నారు. -
వారణాసికి చేరిన పసుపు రైతులు
వారణాసి(ఉత్తర్ ప్రదేశ్): ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి లోక్‌సభ స్థానంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పసుపు రైతులు సోమవారం నామినేషన్లు వేయనున్నారు. పసుపు బోర్డు ఏర్పాటు అనే ప్రధాన డిమాండ్‌తో వీరు మోదీపై పోటీకి దిగారు. పసుపు రైతుల రాష్ట్ర అధ్యక్షులు నర్సింహనాయుడు, జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి తదితరులు వారణాసి కలెక్టరేట్‌కు వెళ్లి నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. ఈ నెల 29న సుమారు 50 మంది పసుపు రైతులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. నిజామాబాద్ రైతులకు మద్ధతుగా తమిళనాడుకు చెందిన ఈరోడ్ రైతన్నలు శనివారం కలెక్టర్ ఆఫీస్‌కు వచ్చారు. తమకు ఏ పార్టీతో సంబంధం లేదని, పసుపు బోర్డు సమస్యను జాతీయస్థాయిలో నేతలు గుర్తించేలా చేసేందుకు పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల తొలిదశలో భాగంగా నిజామాబాద్‌లో సిట్టింగ్ ఎంపీ కవితపై 175 మంది రైతులు పోటీ చేసిన విషయం తెల్సిందే. అటు వెలిగొండ ప్రాజెక్టు సాధనకు ప్రకాశం జిల్లా అన్నదాతలు వారణాసి నుంచి బరిలోకి దిగుతున్నారు. నామినేషన్ వేసేందుకు వెలిగొండ ప్రాజెక్టు సాధన సమితి నేతలు వడ్డే శ్రీనివాసులు, కొల్లూరు రవికిరణ్ వర్మ ఇప్పటికే కాశీ వెళ్లారు. -
రోడ్డెక్కిన అన్నదాతలు
-
రైతు పోరాటం ఆరంభమే
ఆర్మూర్: రైతులు నామినేషన్లు వేసింది గెలుపు కోసం కాదని, తమ కడుపు మంట పాలకుల దృష్టికి తీసుకెళ్లడానికేనని మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్రావు వ్యాఖ్యానించారు. ఈ పోరాటం ఆరంభం మాత్రమేనని చెప్పారు. మంగళవారం ఆర్మూర్‌లో నిర్వహించిన నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి నామినేషన్లు వేసిన 178 మంది రైతుల ఐక్యత సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పసుపు, ఎర్రజొన్న రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం చాలా చిన్న విషయమని పేర్కొన్నారు. రైతులు ఆత్మహత్యల నుంచి ఎన్నికల్లో పోటీ చేసే స్థాయికి పోరాటాన్ని తీసుకురావడం అభినందనీయమని చెప్పారు. కేవలం పసుపు బోర్డును సాధించుకోవడంతో ఆపేయకుండా పసుపు, ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర, రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని సూచించారు. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల రైతాంగం చేస్తున్న పోరాటం యావత్ దేశంలోని రైతులకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఐదు రూపాయలకు కిలో టమాటలు లభించే సమయంలో సూపర్మార్కెట్లో టమాట పచ్చడి వంద రూపాయలకు లభిస్తోందని, అంటే పంట పండించిన రైతులకు కాకుండా ఆ పంటపై వ్యాపారం చేసే వ్యాపారస్తులకే అధిక లాభాలు రావడం విచారకరమన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి రైతుల డిమాండ్లను పరిష్కరించలేని వారు ఇప్పుడు రైతులు నామినేషన్లు వేయగానే అధికారంలోకి వచ్చిన ఐదు రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇవ్వడం రైతుల విజయమన్నారు. ‘స్థానిక’ఎన్నికల్లోనూ నామినేషన్లు వేయాలి నామినేషన్లు వేసిన రైతులకే ఓటు వేయాలని తీర్మానించారు. పసుపు పంట క్వింటాలుకు 15 వేల రూపాయలు, ఎర్రజొన్న పంట క్వింటాలుకు 3,500 రూపాయలకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిషన్‌ను అమలు చేయాలని, సమస్యలపై రైతులంతా ఒక్కటిగా ఉండి పోరాటాన్ని కొనసాగించాలని, ఎన్నికల వేళ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక రైతుల సమస్యలు పరిష్కరించని రాజకీయ పార్టీలను గ్రామాల్లోకి రానివ్వకుండా బహిష్కరించాలని తీర్మానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం రైతులు నామినేషన్లు వేసి నిరసన తెలపాలని, రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని, మల్లాపూర్, ముత్యంపేట, బోధన్ షుగర్ ఫ్యాక్టరీలను పునరుద్ధరించాలని, రైతుల ఓట్లు రైతులకే వేయాలని తీర్మానాలు చేశారు. ఈ సభలో సుమారు ఐదు వేల మంది రైతులు పాల్గొన్నారు. -
అన్నదాతలకు బాబు ఎగ‘వాత’లు!
సాక్షి, అమరావతి : అన్నదాతలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఐదేళ్లుగా కుచ్చుటోపీ పెడుతున్నారు. ఎన్నికల ముందు కూడా ఆయన ఇదే వైఖరి అవలంబిస్తుండటంపట్ల రైతులు మండిపడుతున్నారు. 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే రైతులకు రూ.2,350 కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిలు ఎగవేసింది. ఇది చాలాదన్నట్లు 2014 ఖరీఫ్‌లో రైతులకు రూ.1,067.77 కోట్ల పెట్టుబడి రాయితీ అందించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించింది. తర్వాత దానిని రూ.692.67 కోట్లకు కుదించి రైతులకు రూ.375 కోట్ల మేర కోత వేసింది. వెరసి విపత్తు బాధిత రైతులకు బాబు సర్కారు ఎగవేసిన పెట్టుబడి రాయితీ మొత్తం రూ.2,725 కోట్లకు పెరిగింది. దీంతో చంద్రబాబు ‘ఏరు దాటేదాక ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నదాతలు మండిపడుతున్నారు. అంతేకాక.. ఐదేళ్లుగా వరుస దుర్భిక్ష పరిస్థితులవల్ల పంటలు కోల్పోయినా వారికి పెట్టుబడి రాయితీ ఎగవేయడమే కాక, కరువు మండలాలను తక్కువగా ప్రకటించారు. కాగా, ఎన్నికల నేపథ్యంలో అసత్య హామీలిస్తున్న బాబు.. రైతులకు ఇవ్వాల్సిన బకాయిల విడుదలకు మాత్రం చర్యలు తీసుకోవడంపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. రూ.13,280 కోట్ల రైతుల బిల్లులు పెండింగ్‌లో.. ఇదిలా ఉంటే.. విలాసవంతులు, సంపన్నులు తిరిగే విమానాలకు చంద్రబాబు సర్కారు ఇంధన సబ్సిడీ ఇస్తోంది. ఇది చాలదన్నట్లు విజయవాడ నుంచి తిరిగే విమానాలకు గిట్టుబాటుకాకపోతే ప్రభుత్వమే లోటు పూడ్చుతోంది. ఫైవ్‌స్టార్ హోటళ్లు, లక్షల్లో ఫీజులు వసూలు చేసే విద్యా సంస్థలు, ఫక్తు వ్యాపార దృక్పథంతో ఏర్పాటుచేస్తున్న పరిశ్రమలకే కాకుండా.. కాగితాలకే పరిమితమైన వాటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల రాయితీలు ఇస్తోంది. కానీ, ఆరుగాలం కష్టపడే రైతులకు చెల్లించాల్సిన బకాయిలను మాత్రం పెండింగ్‌లో పెడుతోంది. తద్వారా వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తోందని వ్యవసాయ నిపుణులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 2014 ఎన్నికలకు ముందు ఉన్న రైతుల రుణం మొత్తం రూ.87,612 కోట్లు మాఫీ చేస్తామని ప్రకటించిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే కోటయ్య కమిటీ పేరుతో రకరకాల షరతులు విధించి రూ.63,000 కోట్లకు పైగా ఎగవేశారు. అంతేకాక.. సర్కారు లెక్కల ప్రకారమే మూడు, నాలుగు విడతల రుణమాఫీ కింద చెల్లించాల్సిన సొమ్ము కూడా ఇప్పటివరకూ రైతుల ఖాతాల్లో జమకాలేదు. ఇదిలా ఉంటే.. 2015–16లో చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విజయనగరం, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 4,96,890 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. బాధిత రైతులకు ఇవ్వాల్సిన రూ.270 కోట్ల పెట్టుబడి రాయితీ బకాయిలను ఇప్పటికీ సర్కారు పెండింగులోనే పెట్టింది. గత ఏడాది ఖరీఫ్‌లో కరువువల్ల పంటలు కోల్పోయిన రైతులకు రూ.1,832 కోట్ల పెట్టుబడి రాయితీ ఇంకా చెల్లించలేదు. 2018 రబీ సీజన్లో ప్రభుత్వం 257 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. 450 మండలాల్లో దుర్భిక్షం ఉన్నప్పటికీ 257 మండలాలను కరువు ప్రాంతాల జాబితాలో చేర్చడంపై విమర్శలు రావడంతో జిల్లాల కలెక్టర్లు మరో 90 మండలాలను కరువు జాబితాలో ప్రకటించాలన్న ప్రతిపాదనలు పంపినప్పటికీ ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేదు. దీంతో 2018 రబీ సీజన్లో దుర్భిక్ష బాధిత రైతులకు ప్రభుత్వం మరో రూ.750 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా. వ్యవసాయోత్పత్తుల బిల్లులూ చెల్లించని బాబు రైతులకు రావాల్సిన రకరకాల బిల్లులను బాబు సర్కారు పెండింగులో పెట్టింది. కరువు కాలంలో అష్టకష్టాలు పడి పండించిన వ్యవసాయోత్పత్తులను విక్రయించిన రైతులకు సర్కారు మొండిచేయి చూపించింది. అలాగే.. ►మొక్కజొన్నను ప్రభుత్వానికి విక్రయించిన వారికి రూ.200 కోట్లు పైగా బిల్లులు చెల్లించలేదు. ఈ డబ్బుకోసం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కర్నూలు తదితర జిల్లాల రైతులు వ్యవసాయ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. ►పౌరసరఫరాల శాఖ గత ఖరీఫ్‌లో ధాన్యం విక్రయించిన వారికి ఇప్పటికీ డబ్బులివ్వలేదు. ►విపత్తు బాధిత రైతులూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ►బిందు, తుంపర సేద్యం, వ్యవసాయ పనిముట్లకు సంబంధించిన సబ్సిడీ బిల్లులు కూడా పెండింగులోనే ఉన్నాయి. ►ట్రాక్టర్ల కొనుగోలు, పొలాల్లో షెడ్ల నిర్మాణం, చిన్నచిన్న నీటి చెరువుల ఏర్పాటు తదితరాల కోసం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ బిల్లులను కూడా పెండింగులో పెట్టింది. -
‘‘పచ్చ’’ ఇసుకాసురులు
సాక్షి, వెల్దుర్తి: మండలంలో టీడీపీ నాయకుల సహజవనరుల యధేచ్ఛ దోపిడి ఆ పార్టీ ప్రభుత్వం గద్దెనెక్కిన కాలం నుంచి కొనసాగుతోంది. అరికట్టాల్సిన అధికారులు అధికారం మందు తలవంచేశారు. మండల పరిధిలోని టీడీపీ నాయకుడు బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు చెరుకులపాడు, కొసనాపల్లె గ్రామాల పరిధిలోని పాలహంద్రీలో, నార్లాపురం, బొమ్మిరెడ్డిపల్లె, మల్లెపల్లె వంకల్లోని ఇసుక రవాణాను ఐదేళ్లుగా తన అనుచర, బంధు గణంతో చేయిస్తూ రూ.కోట్లకు పడగలెత్తినట్లు మండల ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. మండల కేంద్రంలోని టీడీపీ నాయకుడు మాజీ ఎంపీపీ ఎల్ఈ జ్ఞానేశ్వర్‌గౌడ్ స్థానిక ఈరన్న గట్టు కొండను కరిగిస్తూ గ్రావెల్ అక్రమ తరలింపులో రికార్డు కెక్కాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో పాటు ఎర్ర చెరువు పూడిక మట్టిని ఉలిందకొండ ఇటుకల బట్టీలకు తరలిస్తూ రూ.లక్షలు గడిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇసుక, గ్రావెల్, పూడిక మట్టి తరలింపులో ఈ నాయకులు పాత్రధారులు కాగా నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ కేఈ శ్యాంబాబు, ఎంఎల్సీ కేఈ ప్రభాకర్ సూత్రధారులనే ఆరోపణలున్నాయి. ఏదేమైనా ప్రభుత్వ పథకాల్లో అవినీతి, అక్రమాలు, పర్సెంటేజీలతో పాటు సహజవనరులను కొల్లగొట్టి టీడీపీ నాయకులు బాగానే సంపాదించారని, ఈ దఫా ఎన్నికల్లో ఎంతైనా ఖర్చు చేసి నియోజకవర్గంలో గెలుపు సాధించాలనే దిశగా పావులు కదుపుతున్నట్లు రాజకీయ మేధావులు అభిప్రాయపడుతున్నారు. మట్టిని కూడా వదలడంలేదు టీడీపీ నాయకులు ప్రభుత్వ పథకాల్లో అవినీతి అక్రమాలతో పాటు కొండ మట్టి, చెరువు మట్టిని కూడా వదలడం లేదు. మాజీ ఎంపీపీ ఎల్ఈ జ్ఞానేశ్వర్‌గౌడ్ ఇదే తరహాలో అక్రమంగా రూ.లక్షలు కూడబెట్టుకుంటున్నాడు. డబ్బే ప్రధానమైన ఇతను ప్రజలకు, రైతులకు అవసరమయ్యే మట్టిని వ్యాపారులకు తరలింపజేస్తూ అన్యాయం చేస్తున్నాడు. ఇలాంటి వారు నేడు తమ పార్టీకి ఓటేయాలని అడిగితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. – వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ వెంకట్‌నాయుడు, వెల్దుర్తి ఇసుక మాఫియా అంతా ఇంతా కాదు మా గ్రామ, కొసనాపల్లె, బొమ్మిరెడ్డిపల్లె ఇలా ఏ వంక, వాగు, హంద్రీలలోనైనా ఇసుక మాఫియా అంతా ఇంతా కాదు. ఈ మాఫియా చెరుకులపాడు నారాయణరెడ్డిని సైతం బలిగొన్నది. ఈ మాఫియాకు పాత్రధారులు, సూత్రధారులు అందరూ బొమ్మిరెడ్డిపల్లె సుబ్బరాయుడు అనుచరులు, డిప్యూటీ సీఎం కుటుంబీకులే. రూ.కోట్ల సంపాదనతోనే నేడు ఎన్నికలలో ఓట్లను కొనేందుకు పన్నాగాలు పన్నుతున్నారన్నది వాస్తవం. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. – శివ, చెరుకులపాడు -
ఇటు ఎర్రజొన్న..అటు పోలీసన్న
కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో పసుపు, ఎర్రజొన్న రైతులు దిగాలు పడుతూ.. ఉద్యమాలకు శ్రీకారం చుడుతుంటే మరోవైపు పోలీసులు పల్లెల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పహారా కాస్తున్నారు. ప్రభుత్వం కొను గోలుకు స్పందించక పోవడంతోనే ఎర్రజొన్న పంట ధర మరింత దిగజారిపోతోందని, వ్యాపారులు అవకాశంగా తీసుకుంటున్నారని రైతన్నలు వాపోతున్నారు. ఫలితంగా పల్లెల్లో రోడ్లపై ఆరబెట్టిన ఎర్రజొన్న కుప్పలుగా కనిపిస్తోంది. సాక్షి, మోర్తాడ్(బాల్కొండ): ఎర్రజొన్నల కొనుగోళ్లకు ప్రభుత్వం ముందుకు రాకపోగా, సీడ్ ఇచ్చిన వ్యాపారులూ గిట్టుబాటు ధర ఇవ్వక పోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మార్కెట్లో ఎర్రజొన్నలకు డిమాండ్ ఉన్నా తమ నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ మొత్తంలో లాభాలను ఆర్జించాలనే ఉద్దేశంతో వ్యాపారులు వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. గతంలో క్వింటాలు ఎర్రజొన్నలకు రూ.3,500 ధర చెల్లించిన వ్యాపారులు క్రమక్రమంగా ధరను తగ్గిస్తున్నారని రైతులు పేర్కొన్నారు. పంటల సాగుకు పెట్టుబడులు ఏటేటా పెరుగుతుండగా తాము పండించిన పంటలకు మాత్రం ధర ఎలా పడిపోతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఎర్రజొన్నలకు డిమాండ్ ఉన్నా గతంలో మాదిరిగా ప్రభుత్వం కొనుగోలు చేయదని గుర్తించిన వ్యాపారులు కావాలని ధరను తగ్గిస్తున్నారని రైతులు అంటున్నారు. ఎర్రజొన్నలకు గిట్టుబాటు కల్పించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని తాము ఉద్యమం ఆరంభించిన మొదట్లో ఎక్కువ ధరకు వాటిని కొనుగోలు చేస్తామని వ్యాపారులు మాట ఇచ్చారని రైతులు చెబుతున్నారు. అటు ఎర్రజొన్న.. క్వింటాలుకు రూ.2,300 వరకు ధర ఒప్పందం చేసుకున్న వ్యాపారులు ప్రభుత్వ ధోరణి స్పష్టం కావడంతో ఇప్పుడు మాట మార్చారని రైతులు అంటున్నారు. నిన్న మొన్నటి వరకు క్వింటాలు ఎర్రజొన్నలకు రూ.2000 నుంచి రూ.2,300 వరకు ధర చెల్లించడానికి ముందుకు వచ్చిన వ్యాపారులు ఇప్పుడు ధరను మరింత తగ్గించారు. క్వింటాలు ఎర్రజొన్నలకు రూ.1,800 ధరనే చెల్లిస్తామని వ్యాపారులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రతి క్వింటాలుకు ఆరు కిలోల తరుగుగా లెక్కించి సొమ్ము చెల్లిస్తామని కూడా వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. ఈ లెక్కతో ఒక క్వింటాలు ఎర్రజొన్నలకు రూ.1,690 మాత్రమే రైతుకు లభిస్తాయి. అంటే గతంలో చెల్లించిన ధరలో సగం ధర మాత్రమే ఎర్రజొన్నలకు లభిస్తుంది. దీంతో ఎర్రజొన్నలను సాగు చేసిన రైతులు ఎక్కువ మొత్తంలో నష్టపోతారు. ఒక పక్క రైతుల ఉద్యమం కొనసాగుతుండగా గ్రామాలలో తమ ఏజెంట్లను తిప్పుతున్న వ్యాపారులు తాము సూచించిన ధరకు ఎర్రజొన్నలు విక్రయిస్తే వెంటనే నగదు చెల్లిస్తామని కూడా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధరను ప్రకటించి గతంలో మాదిరిగా ఎర్రజొన్నలను కొనుగోలు చేస్తే వ్యాపారులు కూడా ఎక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉందని రైతులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎర్రజొన్నల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అటు పోలీసన్న.. ఉద్యమాన్ని కొనసాగిస్తారని గుర్తించిన పోలీసులు గ్రామాలలోకి బలగాలను దించారు. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట్, జగిత్యాల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, వరంగల్ తదితర జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పించారు. సివిల్ పోలీసులతో పాటు ప్రత్యేక బెటాలియన్ పోలీసులు కూడా గ్రామాలలో విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులు గ్రామాలలోకి చేరుకోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు జాతీయ రహదారిపై నిరసన కార్యక్రమాలను నిర్వహించినా తాము శాంతియుతంగానే ఉద్యమం నిర్వహించామని రైతులు చెబుతున్నారు. కాని పోలీసులు పల్లె ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడానికి పికెట్లను కొనసాగించడం సరికాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉద్యమానికి తరలివచ్చిన రైతులు ఏగ్రామానికి చెందిన వారు అని గుర్తించి ఆ గ్రామాలపై పోలీసులు ఎక్కువ దృష్టి సారించారు. అలాగే జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామాలలో ఎక్కువ మంది పోలీసులను నియమించారు. ఏ క్షణంలోనైనా ఉద్యమాన్ని అడ్డుకోవడానికి తాము సిద్ధమే అనే విధంగా పోలీసులు ఎక్కడ అంటే అక్కడ పికెట్ నిర్వహిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు బలగాలను గ్రామాలలో దింపడంపై రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆందోళనలు సద్దుమణగని ఈ తరుణంలో పోలీసుల పికెట్లు నిర్వహించడం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందోనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
రైతు పాదయాత్ర భగ్నం
పెర్కిట్/జక్రాన్‌పల్లి: తమ డిమాండ్ల సాధన కోసం రైతులు చేపట్టిన పాదయాత్రను మంగళవారం పోలీసులు భగ్నం చేశారు. ఎర్రజొన్న, పసుపు పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ కొంతకాలంగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా మంగళవారం చలో అసెంబ్లీ పేరిట పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. జక్రాన్‌పల్లి నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రలో రెండు వేల మంది రైతులు పాల్గొన్నారు. జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. ఐదు కిలో మీటర్ల వరకు సాఫీగా సాగిన పాదయాత్రకు పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. సికింద్రాపూర్ వద్ద జాతీయ రహదారికి అడ్డంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. భారీగా బలగాలను మోహరించారు. పాదయాత్రకు అనుమతి లేదని, 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఆందోళన విరమించాలని రైతులకు సూచించారు. దీంతో రైతులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తమ నిరసనను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లడానికే శాంతియుతంగా పాదయాత్ర చేపట్టామని, తమ ఆవేదనను అర్థం చేసుకోవాలని రైతులు వేడుకున్నారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు అడ్డుకోవడంతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఒక దశలో బారికేడ్లను దాటుకుని ముందుకు కదిలారు. దీంతో పోలీసులు కొందరు రైతులను అరెస్ట్ చేసి సమీపంలోని స్టేషన్లకు తరలించారు. కేశ్‌పల్లి ఎక్స్ రోడ్డు వద్ద మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు. పంట పొలాల వైపు పరుగెత్తిన రైతుల వద్దకు కమిషనర్ కార్తికేయ వెళ్లి మాట్లాడి సముదాయించి వారిని వెనక్కి పంపించారు. -
నిజామాబాద్‌లో కలెక్టర్‌ను కలిసిన రైతులు
-
గిట్టుబాటు కోసం రైతుల కలెక్టరేట్ ముట్టడి
ఇందూరు (నిజామాబాద్ అర్బన్): ఎర్రజొన్న, పసుపు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ సోమవారం రైతులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. సుమారు రెండు వేల మంది రైతులు తరలిరాగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. చివరకు కొంత మంది రైతు సంఘం నాయకులను లోనికి ప్రవేశం కల్పించడంతో వారు కలెక్టర్ రామ్మోహన్‌రావును కలసి వినతిపత్రం సమర్పించారు. ఎర్రజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేసి క్వింటాలుకు రూ.3,500 చెల్లించాలని, పసుపు క్వింటాలుకు రూ.15,000 ధర ఇప్పించాలని కోరారు. ప్రభుత్వం ఆదుకోకపోతే పెట్టిన పెట్టుపడి కోల్పోయి అప్పులపాలయ్యే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై కమిటీ వేస్తున్నట్లు కలెక్టర్ రామ్మోహన్రావు రైతులకు హామీ ఇచ్చారు. కాగా, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై చర్చించుకున్న రైతులు, ఈ నెల 20న ఎమ్మెల్యేలను కలసి సమస్యను విన్నవించాలని, వారు స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తీర్మానించారు. -
సర్కారుపై రైతన్న కన్నెర్ర
-
నిజమైన సం.. క్రాంతి!
సం..క్రాంతి.. పండుగ కాంతి.. మట్టి పిసికే రైతు ఒంటరిగా ఉంటే విఫణిలో బేలగా నిలబడాల్సి వస్తుంది.. వ్యాపారుల నిలువు దోపిడీకి గురవ్వాల్సి వస్తుంది.. విత్తనాలు, ఎరువులు వ్యాపా రులు చెప్పిన (చిల్లర) ధరకు కొనాల్సి వస్తుంది.. దళారులు చెప్పిన (టోకు) ధరకే పంటను తెగనమ్మాల్సి వస్తుంది...! అటువంటి రైతులే, చేయీ చేయీ కలిపితే మహత్తర శక్తిగా మారొచ్చని జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్ రైతన్నలు రుజువు చేశారు. ఐకమత్యంతో కదులుతూ చరిత్రను తిరగరాస్తున్నారు. పెద్ద పండుగ వేళ లక్ష్మీపూర్ రైతన్నల ఆచరణ నుంచి మనమూ స్ఫూర్తి పొందుదాం.. ఒక్కతాటిపైకి వచ్చిన అన్నదాతలకు నిండు మనసుతో శుభాకాంక్షలు చెబుదాం.. లక్ష్మీపూర్ రైతులు రాజకీయాలకు అతీతంగా చేయి చేయి కలిపి.. సమష్టి శక్తిగా ఎదిగారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో ఓ చిన్న గ్రామం లక్ష్మీపూర్. తొలుత సహకార సంఘంగా ఏర్పడిన రైతులు అనతి కాలంలోనే ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీని కూడా ఏర్పాటు చేసుకుని శభాష్ అనిపించుకుంటున్నారు. లక్ష్మీపూర్ సొసైటీ 2016 డిసెంబర్లో రిజిస్టరైంది. సొసైటీ కన్నా మెరుగైన ప్రయోజనాల కోసం లక్ష్మీపూర్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ (ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ)ని రైతులు నాబార్డ్ తోడ్పాటుతో సెప్టెంబర్ 2018లో రిజిస్టర్ చేసుకున్నారు. ఈ కంపెనీకి కేంద్ర వాణిజ్య శాఖ గుర్తింపు కూడా ఇటీవలే లభించింది. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలను, రాయితీలను, రుణాలను అందుకోవడానికి.. తమ ఉత్పత్తులను దేశ విదేశాల్లో ఎక్కడైనా అమ్ముకోవడానికి లక్ష్మీపూర్ రైతులకు ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా అవకాశం ఏర్పడింది. సంఘ సభ్యులందరికీ ఎలాంటి ఇబ్బందులూ కలుగకుండా ఒకే చోట విత్తనాలు, ఎరువులు, పురుగుమందులను తక్కువ ధరకే సంఘం రైతులకు అందుబాటులో ఉంచుతున్నది. ప్రభుత్వ సబ్సిడీ విత్తనాలు సైతం నేరుగా సంఘానికి వస్తాయి. దీనివల్ల రైతులకు రవాణా భారం, ఖర్చులు తగ్గాయి. వరి, పసుపు, మొక్కజొన్న, నువ్వులు.. ఆ గ్రామంలో 90 శాతం రైతు కుటుంబాలే. దాదాపు 8 వేల జనాభా. వ్యవసాయాన్ని కష్టంగా కాకుండా ఇష్టపడి చేస్తూ, ప్రతి పంటలోను తోటి గ్రామాల రైతుల కంటే అధిక దిగుబడులు సాధిస్తుంటారు. వరి, పసుపు, మొక్కజొన్న, నువ్వులు, టమాటోలు తదితర కూరగాయలు ఎక్కువగా పండిస్తారు. వేరుశెనగ, కంది పంటలను తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తారు. ప్రతి భూమిలో కనీసం రెండు, మూడు పంటలు పండిస్తారు. ఎన్నికలప్పుడు ఎవరి పార్టీ వారిదే. ఎన్నికలయ్యాక మాత్రం అందరూ ఒక్కటిగా మెలుగుతున్నారు. ఒకప్పుడు అందరు రైతుల మాదిరిగానే ఆ రైతులు పంట అమ్ముకునేందుకు నానా ఇబ్బందులు పడేవారు. అటువంటి పరిస్థితుల్లో రిటైర్డ్ ఎ.డి. అశోక్‌కుమార్ తోడై, రైతుల ఐకమత్యంతో ఏమేమి సాధించవచ్చో నూరిపోశారు. ఈ నేపథ్యంలో నుంచి పుట్టుకొచ్చిందే లక్ష్షీ్మపూర్ రైతుల పరస్పర సహకార సంఘం. సభ్యత్వ రుసుము రూ. 3,500 తొలుత ఐదుగురు సభ్యులు సహకార సంఘానికి బీజం వేశారు. వారి ఆలోచనలు నచ్చిన గ్రామంలోని రైతులందరు సంఘంలో సభ్యులైనారు. కేవలం నెలలోపే, ఎవరి ప్రమేయం లేకుండా 312 మంది రైతులు సభ్యులుగా చేరడం రాష్ట్ర స్థాయిలో ప్రథమంగా చెపుతుంటారు. రెండెకరాల రైతుకు అప్పట్లో సభ్యత్వ రుసుము రూ. 2,300 ఉండేది, ప్రస్తుతం రూ. 3,500కు పెరిగింది. సభ్యులందరి సహకారంతో సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించి, మూడు నెలలకొకసారి సర్వసభ్య సమావేశం నిర్వహిస్తారు. సంఘం చైర్మన్‌తో పాటు 11 మంది సభ్యులను ప్రతి రెండేళ్ల కొకసారి ఎన్నుకుంటారు. వీరు సంఘం నిర్మాణం, పటిష్టత, వ్యాపారాలపై ప్రతి 15 రోజులకొకసారి సమావేశమవుతుంటారు. చైర్మన్ సహా ప్రతి సభ్యుడూ సంఘ నియమాలకు కట్టుబడి ఉంటామని సభ్యులందరి ముందు ప్రమాణం చేస్తారు. ప్రభుత్వ నిబంధనలతో పాటు సంఘానికి ప్రత్యేక నిబంధనలు రాసుకుని ముందుకు వెళ్తుండటంతో సొసైటీ విజయపథాన నడుస్తోంది. సర్వసభ్య సమావేశానికి రాకపోతే రూ. 500 జరిమానా, సంఘ డైరెక్టర్లు సమావేశానికి వెళ్లకపోతే రూ. 100 జరిమానా విధిస్తుంటారు. దీంతో, ప్రతి సమావేశానికి సభ్యులందరూ వచ్చి తమకు తోచిన సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో సంఘానికి ఆదాయం తెస్తూనే, సంఘ సభ్యుడైన రైతులకు లాభం ఉండేలా తొలుత ‘లక్ష్షీ్మపూర్ రైస్’ను తెర మీదకు తెచ్చి, సఫలీకృతులయ్యారు. ఆ కోవలోనే గ్రామ రైతులు పండించిన విత్తనాన్ని తోటి రైతులకు అందించాలనే ఆకాంక్షతో ‘లక్ష్మీపూర్ సీడ్’ను అమ్ముతున్నారు. ఇదే వరుసలో తాజాగా ‘లక్ష్మీపూర్ నువ్వుల’ను సైతం మార్కెట్లోకి తీసుకువచ్చారు. క్వింటాలుకు రూ. వెయ్యి అదనపు రాబడి గ్రామంలో ఎక్కువగా బీపీటీ, హెచ్ఎంటీ, జై శ్రీరాం వరి రకాలను సాగు చేస్తుంటారు. ఈ గ్రామస్తులు అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటిస్తుండటంతో, ఎకరాకు 28–30 క్వింటాళ్ల దిగుబడి తీస్తుంటారు. రైతులు ఎవరికివారే వరి ధాన్యాన్ని బాగా ఆరబెట్టి, గ్రామంలోని మిల్లులో మర ఆడిస్తారు. అప్పుడు సంఘ ప్రతినిధి బృందం పరిశీలించి, బాగున్నాయనుకుంటేనే సంఘం తీసుకుని, గోదాములో నిల్వ చేస్తుంది. మార్కెట్ రేటు కంటే తక్కువకే నేరుగా వినియోగదారులకు అమ్ముతుంటారు. బియ్యం అమ్మగా వచ్చిన డబ్బులో కొంత సంఘానికి జమ చేసి, మిగతా డబ్బులను వెంటనే రైతులకు చెల్లిస్తుంటారు. దీని వల్ల గ్రామంలోని రైతులందరూ సన్న ధాన్యాన్ని బియ్యంగా మార్చుతుండటంతో, ధాన్యాన్ని అమ్మిన దాని కంటే, బియ్యం అమ్మగా రైతులకు క్వింటాల్‌కు అదనంగా రూ. 500 నుంచి వెయ్యి వరకు లాభపడుతున్నారు. లక్ష్మిపూర్ సీడ్‌కు ఆదరణ గ్రామ రైతులు ప్రతి సీజన్లో లక్షల రూపాయలు పెట్టి రక రకాల కంపెనీల వరి విత్తనాన్ని తీసుకువచ్చి పంటే వేసేవారు. కానీ, విత్తనాల్లో నాణ్యత లేకపోవడం వల్ల పంట దిగుబడులు వచ్చేవి కాదు. దీంతో, రైతులందరం కలిసి మన విత్తనాన్ని మనమే తయారు చేసుకోవడం కాదు, తోటి రైతులకు కూడా అందించాలని లక్ష్షీ్మపూర్ సీడ్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. పొలాస పరిశోధనా స్థానం నుంచి వరిలో కొత్త దొడ్డు రకం జెజిఎల్–24423ని దాదాపు 1000 ఎకరాల్లో సాగు చేసి, ఆ విత్తనాన్ని తోటి రైతులకు అమ్ముతున్నారు. వీటితో పాటు ఐఆర్–64, బతుకమ్మ, ఎంటియు–1010 రకాలను కూడా విక్రయిస్తున్నారు. విత్తన రైతులకు మార్కెట్ ధర కంటే రూ. 200 వరకు ఎక్కువ ధర వస్తున్నది. లక్ష్మీపూర్ రైతులు పసుపు పంట తర్వాత నువ్వులు వేస్తుంటారు. గ్రామంలో దాదాపు వెయ్యి క్వింటాళ్ల వరకు నువ్వులు పండుతాయి. నువ్వులు నాణ్యంగా ఉన్నప్పటికీ, దళారులు రంగ ప్రవేశం చేసి కిలో రూ 70–100 వరకు కొనుగోలు చేసేవారు. దీంతో, రైతులకు సరైన ఆదాయం రాక నష్టపోతుండేవారు. సీడ్స్, రైస్‌తో లక్ష్మీపూర్‌కు బ్రాండ్ ఇమేజ్ వచ్చినందున, నువ్వులను సైతం విక్రయిస్తున్నారు. ప్రజలు విశేషంగా స్పందిస్తున్నారు. లక్ష్మీపూర్ రైతులు ఐకమత్యంతో చేస్తున్న ప్రతి పనికి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ తోడ్పాటునిస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ చొరవ వల్ల గ్రామంలో రూ. 4 కోట్లతో విత్తన శుద్ధి ప్లాంట్ ఏర్పాటైంది. సంఘ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న చైర్మన్ తిరుపతి రెడ్డి రెండుసార్లు ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. 2017లో రూ. 11 లక్షల బియ్యం, రూ. 8 లక్షల వరి విత్తనాలు, 2018లో రూ. 14 లక్షల బియ్యం, రూ. 8 లక్షల వరి విత్తనాలు అమ్మారు. సంఘం ప్రారంభించిన రెండేళ్లలోనే దాదాపు రూ. 4 కోట్ల టర్నోవర్‌తో శభాష్ అనిపించుకుంటున్నారు. రైతులు పండించే కూరగాయల అమ్మకానికి లక్ష్మీపూర్ క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంఘటితం కావడం వల్ల రైతులు అధికాదాయం పొందుతున్నారు. సరసమైన ధరకు నాణ్యమైన వ్యవసాయోత్పత్తులు దొరుకుతుండటంతో వినియోగదారులూ సంతోషపడుతున్నారు. (వివరాలకు.. సంఘ ప్రతినిధులు మోహన్ రెడ్డి(95020 26069), రాంరెడ్డి(99484 52429) పంట పండించిన ప్రతి రైతూ లాభపడాలి పంట పండించిన ప్రతి రైతూ లాభపడాలన్నదే మా సంఘం ప్రధాన ఉద్దేశం. ఇందుకు అవసరమైన సలహాలు, సూచనలు తీసుకుంటూనే సంఘాన్ని ముందుకు తీసుకెళుతున్నాం. యువ రైతులను, ఖాళీగా ఉండే వెనుకటి పెద్ద మనుషులను సంఘ సలహాదారులు నియమించుకుంటున్నాం. రైతులకు అవసరమైన అన్ని రకాల సేవలను ఒక చోట అందిస్తూనే, ముఖ్యంగా రైతులు పండించిన ప్రతి పంటను ఎలా మార్కెటింగ్ చేయాలన్న దానిపైనే చర్చిస్తున్నాం. అదే మాదిరిగా వినియోగదారులకు సైతం తక్కువ ధరలో ఉత్పత్తులు అందేందుకు ప్రయత్నిస్తున్నాం. – పన్నాల తిరుపతి రెడ్డి, చైర్మన్(93915 28529), లక్ష్మీపూర్ రైతుల సహకార సంఘం, జగిత్యాల జిల్లా సంకల్ప బలమే సక్సెస్‌కు కారణం లక్ష్మీపూర్ సొసైటీ రైతు లోకానికి మార్గదర్శిగా మారింది. ఇక్కడి రైతులు రాజకీయాలను పక్కన పెట్టి ముందుకు వెళ్తుండటంతో, చాలా గ్రామాల రైతులు సైతం లక్ష్మీపూర్ రైస్ మాదిరిగా ఆయా గ్రామాల పేర్లతో రైస్ విక్రయించడం జరుగుతుంది. ఇక్కడి రైతుల్లో సంకల్పం, పట్టుదల, విజయం సాధిస్తామన్న నమ్మకం మెండుగా ఉంది. అందువల్లే ప్రతి పనిలోనూ సక్సెస్ కాగలుగుతున్నారు. – అశోక్‌కుమార్ (85004 28578), జిల్లా వ్యవసాయ శాఖ సలహాదారు, జగిత్యాల ∙‘లక్ష్మీపూర్ నువ్వుల’ను మార్కెట్లోకి విడుదల చేస్తున్న జిల్లా కలెక్టర్ శరత్ నువ్వులు విక్రయిస్తున్న సంఘ సభ్యులు – పన్నాల కమలాకర్, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ -
రబీలో వరి వద్దు
సాక్షి, హైదరాబాద్: రబీలో వరి సాగు వద్దని, ఇతర ప్రత్యామ్నాయ పంటలకు వెళ్లాలని వ్యవసాయశాఖ రైతులకు పిలుపునిచ్చింది. కాలం కలసి రాకపోవడం, అనేక చోట్ల బోర్లు, బావులు, చెరువుల్లో నీరు అడుగంటి పోవడంతో వరి వేస్తే ప్రయోజనం ఉండదని తెలిపింది. ఈ మేరకు వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా జిల్లా వ్యవసాయాధికారులతో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నీటి వనరులున్నచోట మాత్రమే వరికి వెళ్లాలని, మిగిలిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచిస్తున్నట్లు రాహుల్ బొజ్జా ‘సాక్షి’కి తెలిపారు. ఈ మేరకు రైతులను చైతన్యపరచాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన వివరించారు. రాష్ట్రంలో 18 జిల్లాల్లో వర్షాభావం నెలకొంది. దీంతో రబీలో అనుకున్న స్థాయిలో వరి నాట్లు పడలేదు. వరి నాట్లు పుంజుకోలేదు. రబీలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 33.45 లక్షల ఎకరాలుకాగా ఇప్పటివరకు కేవలం 10 లక్షల ఎకరాలకే సాగు పరిమితమైంది. రబీ వరి సాధారణ సాగు విస్తీర్ణం 17.62 లక్షల ఎకరాలుకాగా ఇప్పటివరకు లక్ష ఎకరాల లోపే నాట్లు పడ్డాయి. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 4.15 లక్షల ఎకరాలుకాగా 2 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అలాగే మొక్కజొన్నపై కత్తెర పురుగు దాడి చేస్తుంది. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, నిర్మల్, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో ఈ పురుగు కారణంగా మొక్కజొన్న నాశనమై పోయింది. దీంతో పరిస్థితిని గమనించిన వ్యవసాయశాఖ ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఆరుతడి పంటలే మేలు... వరికి ప్రత్యామ్నాయంగా శనగ, వేరుశనగ, పొద్దు తిరుగుడు, ఆముదం, నువ్వులు తదితర పంటలను సాగు చేసేలా రైతులను అధికారులు ప్రోత్సాహించనున్నారు. సిద్దిపేట జిల్లా వ్యవసాయశాఖ, కలెక్టర్ ఇప్పటికే ‘రబీలో వరి వద్దు... ఆరుతడి పంటలే మేలంటూ’పెద్ద ఎత్తున కరపత్రాలు వేసి రైతుల్లో చైతన్యం నింపుతున్నారు. సాగునీటి వనరులు లేకపోవడంతో వరి వైపు వెళ్లి నష్టపోకూడదని వ్యవసాయశాఖ సూచిస్తోంది. ఎకరా వరి సాగయ్యే నీటితో కనీసం మూడెకరాల ఆరుతడి పంటలను రైతులు సాగు చేసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. డ్రిప్ ద్వారానైతే ఐదారు ఎకరాలూ సాగు చేసుకోవచ్చు. పైగా పంటల మార్పిడి వల్ల చీడపీడల ఉధృతి కూడా ఉండదని వ్యవసాయశాఖ చెబుతోంది. వరి కంటే కూడా పొద్దు తిరుగుడు, శనగ, నువ్వుల పంటకాలం కూడా తక్కువుంటుందని, పైగా ఆరుతడి పంటలకే మద్దతు ధర అధికంగా ఉందని వ్యవసాయశాఖ చెబుతోంది. వరి మద్దతు ధర క్వింటాలుకు రూ. 1,770 అయితే, పొద్దు తిరుగుడు మద్దతు ధర రూ. 5,388 ఉందని తెలిపింది. సాగు ఖర్చు కూడా తక్కువని పేర్కొంది. ప్రస్తుతం రబీ కోసం 4.72 లక్షల క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో జిల్లాల్లో ఇప్పటివరకు 80 వేల క్వింటాళ్లు అందుబాటులో ఉంచారు. వాటిలో 65 వేల క్వింటాళ్లే అమ్ముడుపోయాయి. ఇక రబీ వరి విత్తనాలు 2.22 లక్షల క్వింటాళ్లు సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రత్యామ్నాయ ప్రణాళికకు వెళ్లాల్సి ఉన్నందున ఇతర విత్తనాలను కూడా ఆగమేఘాల మీద అందుబాటులో ఉంచాలని రాహుల్ బొజ్జా అధికారులను ఆదేశించారు. -
బడ్జెట్ కోటాలో రైతు వాటా ఎంత?
రాష్ట్ర ప్రభుత్వాల రాబడిలో 90 శాతంపైగా వేతనాలు, పెన్షన్ చెల్లింపులు, చేసిన అప్పులకు వడ్డీ చెల్లింపులకు సరిపోతుండగా రైతుకు, వ్యవసాయానికి ప్రభుత్వం వెచ్చించే మొత్తం శూన్యమనే చెప్పాలి. ఖజానా వట్టిపోయాక సాంవత్సరిక బడ్జెట్ కేటాయింపులో రైతుల రుణ మాఫీలకూ, ధాన్యసేకరణ కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద డబ్బు ఎక్కడ మిగిలి ఉన్నట్లు? దేశీయ ద్రవ్య నిర్వహణ విధానాలను రైతాంగ ఉద్యమాలు అర్థం చేసుకోనంతవరకు రాజకీయ పార్టీలు దాదాపుగా అవీ ఇవీ అనే తేడా లేకుండా తమ ఎన్నికల ప్రణాళికల్లో నిష్రయోజనకరమైన వాగ్దానాలను గుప్పిస్తూనే ఉంటాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల వాగ్దానాలను కురిపిస్తున్న తరుణంలో వ్యవసాయానికి అవసరమైన డబ్బు ఎక్కడికి వెళుతోందని గట్టిగా ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశ ఆర్థిక రాడార్ తెరపై రైతులు కనిపించే ఏకైక సమయం ఎన్నికల సమయంలో మాత్రమే. ఇది సర్వసాధారణమైపోయింది. గత ముప్పై ఏళ్లుగా నేను ఈ పరిస్థితిని గమనిస్తూనే ఉన్నాను. తమ తమ సిద్ధాం తాలు ఏవైనా, ఆలోచనా రీతులు ఏవైనా దేశ రాజ కీయ పార్టీలన్నీ దాదాపుగా ఇదే వైఖరిని అనుసరి స్తుండటం విచారకరం. దేశంలో మూడు వ్యవసాయ ప్రధాన రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ కూడా ఈ ధోరణినే కొనసాగిస్తున్నాయి. పైగా వ్యవసాయదారులను ఆకర్షించడానికి అన్ని రాజకీయ పార్టీలు పరస్పరం పోటీ పడుతున్నాయి. 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండు డిమాండ్లు ప్రధానంగా అజెండాగా మారనున్నాయి. దేశంలో జరుగుతున్న ప్రతి రైతాంగ నిరసనకు ఇవే కేంద్రబిందువులుగా మారిపోయాయి. అవేమిటంటే ఒకటి, వ్యవసాయ రుణాలను మాఫీ చేయడం, రెండు, ప్రభుత్వం స్వయంగా వాగ్దానం చేసిన విధంగా కనీస మద్దతు ధర (ఎమ్ఎస్పి)ను అమలు చేయడం, స్వామినాథన్ కమిషన్ ప్రతిపాదనల మేరకు వ్యవసాయ దిగుబడులపై 50 శాతం లాభాన్ని రైతులకు ప్రభుత్వమే అందించడం. ఈ మేరకు దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ వ్యవసాయ రుణాలను మొత్తంగా మాఫీ చేస్తామని వాగ్దానం చేస్తూ వస్తున్నాయి. కానీ వాస్తవానికి, వ్యవసాయ రుణాల్లో చిన్న భాగాన్ని మాత్రమే మాఫీ చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నది అనే దానితో నిమిత్తం లేకుండా ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహా రాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని మెజారిటీ రైతులు ప్రభుత్వ సహాయం అందని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పైగా ప్రస్తుతం ఎన్నికలకు సిద్ధమవుతున్న మూడు వ్యవసాయ ప్రధాన రాష్ట్రాల్లో వ్యవసాయ రుణాలను రద్దు చేస్తారనే ఆశ మాత్రంగా కూడా నాకు కనిపించడం లేదు. ఇక రెండో డిమాండు విషయానికి వద్దాం. వ్యవసాయ ఉత్పత్తుల ధరలపై స్వామినాధన్ కమిషన్ నిర్దేశించిన ఫార్ములాను సంపూర్ణంగా అమలు చేయవలసిన అవసరం కచ్చితంగా ఉంది. ఆవిధంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలను ఉన్నపళాన పెంచినప్పటికీ అది మన రైతాంగంలోని అతి చిన్న భాగానికి మాత్రమే లబ్ధి చేకూరుస్తుంది. శాంతకుమార్ నేతృత్వంలో ఏర్పడిన అత్యున్నత అధికారిక కమిటీ ప్రకారం, 6 శాతం రైతులు మాత్రమే ఆహార సేకరణ ధరల వల్ల లబ్ధిని పొందగలుగుతున్నారు. మరో మాటలో చెప్పాలంటే, ప్రస్తుతం డిమాండు చేస్తున్న కనీస మద్దతు ధర, దిగుబడిపై 50 శాతం లాభాన్ని అమలు చేసినప్పటికీ, ఇప్పటికే ధాన్య సేకరణ ధరలను పొందుతున్న కొద్దిమంది రైతులు మాత్రమే లబ్ధి పొందే పరిస్థితి ఉంది. మరి అటు మార్కెట్ చేయదగిన అదనపు ఉత్పత్తులు పెద్దగా లేని లేక మౌలిక వసతులు లేమి కారణంగా ధాన్య సేకరణ కార్యకలాపాలకు దూరమైపోయిన 94 శాతం మంది రైతుల విషయం ఏమిటి? ఉదాహరణకు, ఒక్క మధ్యప్రదేశ్‌లోనే 94 లక్షల వ్యవసాయ కుటుంబాలు ఉన్నాయి. 2017లో గోధుమపంట సీజన్లో 10.5 లక్షల రైతులు మాత్రమే తమ ఉత్పత్తులను ధాన్య సేకరణ ధరల వద్ద అమ్ముకోగలిగారు. ఇక మిగిలిన 83 లక్షల వ్యవసాయ కుటుంబాల మాట ఏమిటి? స్వామినాధన్ కమిషన్ నివేదించిన ధరల ఫార్ములాను యథాతథంగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉండగా, రైతులు మండీలకు తరలిస్తున్న తమ ఉత్పత్తులన్నింటినీ అధికారికంగా ప్రభుత్వమే సేకరించే పరిస్థితి ఏర్పడనంతవరకు, పంటలకు అధిక ధరలను ప్రకటించినప్పటికీ పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల ప్రభుత్వాలు తగినన్ని ధాన్య సేకరణ వసతులను కల్పించడంలో విఫలమవడమే కాకుండా సమస్య పరిష్కారం విషయంలో చేతులెత్తేశాయి. ఇది రైతులను మరింతగా మండించింది. కొత్తగా అమల్లోకి వచ్చిన ప్రధానమంత్రి ఆశా పథకంలో కూడా, మార్కెట్‌కు వచ్చిన అదనపు వ్యవసాయ ఉత్పత్తులలో 25 శాతాన్ని మాత్రమే సేకరించగలనని ప్రభుత్వ స్థాయిలో తేల్చి చెప్పారు. మరి మిగిలిన 75 శాతం దిగుబడుల మాటేమిటి? మార్కెట్లో తన దిగుబడులను తక్కువ ధరకు అమ్ముకోవలసి వచ్చినప్పుడు రైతులు పొందే పెను నష్టాన్ని ఎవరు భరిస్తారు? వ్యవసాయ ఉత్పత్తుల ధరలపై జరుగుతున్న చర్చ రైతాంగం చేస్తున్న రెండు ప్రధాన డిమాండ్లకు మించి ముందుకెళ్లాల్సి ఉంది. వ్యవసాయదారులు కాస్త ఊపిరి తీసుకోవడానికి అవకాశమివ్వని దేశీయ ఆర్థిక రూపకల్పన గురించి అర్థం చేసుకునే ప్రయత్నాలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. దీన్ని ఇంకాస్త స్పష్టంగా వివరించాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని ప్రకటించిన వెంటనే, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తమ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తూ, రైతు రుణాలను మాఫీ చేయదలుస్తున్న రాష్ట్రాలు తమ సొంత ఆర్థిక వనరులను వెదుక్కోవలసి ఉంటుందని కరాఖండీగా చెప్పేశారు. వాస్తవానికి 2014 నుంచి 2018 మధ్య కాలంలో కేవలం నాలుగేళ్లలో ఇదే ప్రభుత్వం రూ. 3.16 లక్షల కోట్లకు పైగా కార్పొరేట్ రంగానికి చెందిన మొండి బకాయిలను లెక్కలోకి రాకుండా కొట్టిపడేసింది. కార్పొరేట్ రంగం అవకతవకల భారాన్ని భరించాల్సిందిగా అరుణ్ జైట్లీ ఏ రాష్ట్ర ప్రభుత్వాన్నీ ఎన్నడూ కోరిన పాపాన పోలేదు. అటు పరిశ్రమలూ, ఇటు రైతులూ అదే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుం టున్నప్పుడు, పరిశ్రమల మొండి బకాయిలు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా ఎందుకు మారలేదు అనే ప్రశ్నను వ్యవసాయ రంగ నేతలు సంధించాల్సి ఉంది. పరిశ్రమల విషయంలో సూచించినట్లుగా భారతీయ రిజర్వ్ బ్యాంకు రైతుల రుణాలను కూడా మొత్తంగా రద్దు చేయాల్సిందని జాతీయ బ్యాంకులను ఎందుకు ఆదేశించలేదు? ఆ భారాన్ని మాత్రమే రాష్ట్రాల ప్రభుత్వాలమీదికి నెట్టడం దేనికి? ఈ సమస్య మొత్తానికి కేంద్ర బిందువు ద్రవ్యపరమైన బాధ్యత – బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎమ్) చట్టం–2003లో దాగి ఉంది. స్థూల ప్రభుత్వ దేశీయ ఉత్పత్తులపై (జిఎస్డీపీ) ఒక సంవత్సరంలో తీసుకునే రుణ పరిమితిని ఈ చట్టం 3 శాతానికి కుదిం చివేసింది. ఒకసారి బడ్జెట్ నిబంధనలకేసి దృష్టి సారిస్తే, వ్యవసాయానికి కేటాయిస్తున్న డబ్బు చాలా తక్కువ స్థాయిలో ఉందని బోధపడుతుంది. ఈ విషయంలో కాస్త వివరించనివ్వండి. ఛత్తీస్‌గఢ్‌లో సవరించిన బడ్జెటరీ అంచనాల ప్రకారం రాష్ట్ర సొంత రాబడిలో 93 శాతం వరకు వేతనాలు, పెన్షన్ చెల్లిం పులు, వడ్డీ చెల్లింపులకే సరిపోతోంది. ఒక్క వేతనాలు, పెన్షన్లు మాత్రమే బడ్జెట్లో అధికభాగాన్ని హరించివేస్తున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇది 87 శాతం కాగా, రాజస్తాన్‌లో ఇది 116 శాతానికి పెరి గిపోయింది. ప్రభుత్వ వేతనాలు, పెన్షన్ల భారం ఇంత భారీగా ప్రభుత్వాలపై పడుతున్నప్పుడు రైతులతో సహా తక్కిన జనాభాకు కేటాయించదగిన వనరులు శూన్యం మాత్రమే. పైగా ఈ వేతనాలు, పింఛన్లు కేంద్ర ప్రభుత్వానివి కావు. వాస్తవానికి ఈ మూడు రాష్ట్రాల ప్రభుత్వాలూ మొత్త జనాభాలో అతి కొద్ది భాగంగా ఉన్న ఉద్యోగులను, పింఛనుదారులను సంతృప్తి పరిచేందుకు అహరహం శ్రమిస్తున్నాయి. ఉదాహరణకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2017–18లో అంచనా వేసిన మొత్తం జనాభా 8.1 కోట్లు కాగా ఆ రాష్ట్రంలో 7.5 లక్షలమంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వీరిలో 4.5 లక్షలమంది శాశ్వత ఉద్యోగులు.ఈ మొత్తం వ్యవహారాన్ని పట్టి చూస్తే అర్థమవుతున్నది ఒకటే. రైతుల రుణ మాఫీలకూ, ధాన్యసేకరణ కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద డబ్బు ఎక్కడ మిగిలి ఉన్నట్లు? దేశీయ ద్రవ్య నిర్వహణ విధానాలను వ్యవసాయదారుల ఉద్యమాలు అర్థం చేసుకోనంత వరకు రాజకీయ పార్టీలు వీరు వారూ అనే తేడా లేకుండా తమ తమ ఎన్నికల ప్రణాళికల్లో నిష్ప్రయోజనకరమైన వాగ్దానాలను గుప్పిస్తూనే ఉంటాయి. ప్రతి రాజకీయ పార్టీనుంచి రైతులు కోరవలసిన వివరాలు ఏమిటంటే, వ్యవసాయ రంగానికి ఆ పార్టీలు చేస్తున్న వాగ్దానాల అమలుకు తగిన వనరులను ఎక్కడినుంచి తీసుకొస్తాయన్నదే. దీనికి రైతులు చేయవలసిన మొదటి పని ద్రవ్యపరమైన బాధ్యత – బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎమ్) చట్టం–2003కి సవరణ తీసుకురావాలని డిమాండ్ చేయడం, దాంతోపాటుగా రాష్ట్ర రైతుల ఆదాయ కమిషన్‌ను ఏర్పర్చాల్సిందిగా ప్రభుత్వాలను డిమాండ్ చేయడం మాత్రమే. పైగా ప్రతి రైతు కుటుంబానికీ నెలకు రూ.18,000 కోట్ల ఆదాయాన్ని కల్పించాలన్నది తప్పనిసరి నిబంధనగా ఉండాలి. ఇది ప్రతి జిల్లాలోనూ సగటున రైతుల ఆదాయాన్ని వివరించేలా చేస్తుంది, తర్వాత కనీసంగా హామీ పడిన ఆదాయంలో వస్తున్న అంతరాన్ని నగదు బదలాయింపు ద్వారా పూరించేలా వీలు కలిగిస్తుంది. దేవిందర్‌శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు -
సీఎం చేతికి ‘జిల్లా సమితుల’ జాబితా
సాక్షి, హైదరాబాద్: జిల్లా రైతు సమన్వయ సమితుల జాబితా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేతికి అందింది. ఇప్పటివరకు 22 జిల్లాల సమితుల జాబితా పూర్తవగా.. వాటన్నింటినీ వ్యవసాయ శాఖ సీఎంకు సోమవారం అందజేసింది. నేడో రేపో మిగిలిన జిల్లాల జాబితాను కేసీఆర్‌కు అందజేయనుంది. ఆయా జిల్లాల జాబితాల్లో మార్పులు చేర్పులు చేసి తుది జాబితాను ముఖ్యమంత్రే ప్రకటిస్తారని, ఆ తర్వాతే ఉత్తర్వులు జారీ చేస్తారని అధికారులు చెబుతున్నారు. తొలుత జిల్లా సమితులను మంత్రులు ఆమోదించగా.. వాటిపై కలెక్టర్లు తుది నిర్ణయం తీసుకొని వ్యవసాయ శాఖకు పంపించారు. వీటికి ఉత్తర్వులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తుండగా.. ముందుగా తన వద్దకు పంపాలని, ఆ తర్వాతే జీవోలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. జిల్లా సమితుల నుంచే రాష్ట్ర స్థాయి సమితి సభ్యులను నియమిస్తారు. రాష్ట్ర సమితి సభ్యులను సీఎం ఎంపిక చేసి ప్రకటిస్తారు. కార్పొరేషన్ ఏర్పాటుపై ఉత్కంఠ ఈనెల 25, 26 తేదీల్లో రెండు చోట్ల మండల, జిల్లా రైతు సమన్వయ సమితులతో ముఖ్యమంత్రి ప్రత్యేక సదస్సులు నిర్వహించనున్నారు. ఆ సదస్సుల్లోగా రాష్ట్రస్థాయి రైతు సమితి నియామకం, కార్పొరేషన్ ఏర్పాటు ఉంటుందా లేదా అన్న చర్చ జోరుగా జరుగుతోంది. ‘25, 26 తేదీల్లో జరిగే రైతు సమితి సదస్సుల నాటికి రాష్ట్రస్థాయి సమితిని ఆగమేఘాల మీద ఏర్పాటు చేయాలన్న రూలేం లేదు. ఏర్పాటైతే సరేసరి. లేకుంటే రాష్ట్ర సమితి సభ్యులు లేకుండానే మండల, జిల్లా సమితులతో సదస్సులు నిర్వహిస్తాం’అని ఇటీవలి సమావేశంలో సీఎం అన్నట్లు తెలిసింది. మంత్రులకు బాధ్యతలు జిల్లా సమన్వయ సమితుల చైర్మన్ల నియామకాల కోసం ప్రతిపాదనలను పంపాలని మంత్రులను సీఎం కోరారు. జిల్లా స్థాయిలో నాయకుల మధ్య సమతూకం, సామాజిక వర్గాల మధ్య సమతుల్యం, గతంలో జిల్లా స్థాయి పదవుల్లో కీలకంగా ఉన్నవారిని దృష్టిలో పెట్టుకుని అవకాశాలు ఇవ్వాలనే సూచనలతో జిల్లా సమితి చైర్మన్‌కు ప్రతిపాదనలు పంపాలని నిర్దేశించారు. జిల్లా పరిషత్ చైర్మన్, డీసీసీబీ, గ్రంథాలయ సంస్థ వంటి నామినేటెడ్ పదవుల్లో ఏయే వర్గాలకు అవకాశం వచ్చిందో దృష్టిలో పెట్టుకుని, ఇప్పటిదాకా అవకాశాలు రాని నాయకులకు, వర్గాలకు ప్రాధాన్యత కల్పించేలా ప్రతిపాదనలను పంపాలని సూచనలు చేశారు. జిల్లా స్థాయిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలను సమన్వయం చేసుకుంటూ ప్రతిపాదనలను పంపే బాధ్యత పాత జిల్లా ఇన్‌చార్జ్‌లకు అప్పగించారు. మెజారిటీ జిల్లా సమితులు కొలిక్కి జిల్లా సమితుల చైర్మన్ల నియామకాలకు సంబంధించి పాత మెదక్ జిల్లా నేతలతో ఇన్చార్జ్ మంత్రి టి.హరీశ్‌రావు సమావేశమై.. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలకు ఒక్కొక్క పేరును ప్రతిపాదించినట్టుగా తెలిసింది. అలాగే పాత రంగారెడ్డి జిల్లాకు సంబంధించి పట్నం మహేందర్‌రెడ్డి.. వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు పేర్లను ప్రతిపాదించారు. మేడ్చల్ జిల్లాలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన అనుచరుని కోసం పట్టుబట్టి సాధించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక పాత మహబూబ్‌నగర్ జిల్లా విషయంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి మధ్య కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా, ఒక్కొక్క పేరుతోనే ప్రతిపాదనలను పంపినట్టుగా సమాచారం. పాత నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల నుంచి కూడా ప్రతిపాదనలు అందాయి. వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని సమితుల విషయంలో ఇంకా ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తోంది. కొత్తగూడెం విషయంలోనూ ఇంకా స్పష్టత రాలేదు. ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, కనకయ్య తమ వారి కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. నాలుగైదు జిల్లాలు మినహా అన్ని సమితులపై స్పష్టత వచ్చినట్టేనని సమాచారం. జిల్లాకో పర్యవేక్షణాధికారి ఇక ఈనెల 25, 26 తేదీల్లో జరిగే రైతు సమితుల సదస్సులను విజయవంతం చేసేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. జిల్లాకో రాష్ట్ర వ్యవసాయాధికారిని పర్యవేక్షణాధికారిగా నియమించింది. వారి ఆధ్వర్యంలోనే రైతు సభ్యులు, ఇతర అధికారులు సదస్సులకు తరలివస్తారు. వారిని తరలించేందుకు 344 బస్సులను సిద్ధం చేస్తున్నారు. 17,026 మందికి ఆహ్వానాలు పంపారు. 25వ తేదీన హైదరాబాద్ సభకు 13 జిల్లాల నుంచి తరలివస్తారు. మిగిలిన జిల్లాలకు చెందినవారు 26వ తేదీన కరీంనగర్లో జరిగే సభకు తరలివస్తారు. కార్పొరేషన్ చైర్మన్‌గా గుత్తా! రైతు కార్పొరేషన్ చైర్మన్‌గా ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఖరారైనట్లేనని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. సమితులపై ఇటీవలి సీఎం సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కాకుండా గుత్తా సుఖేందర్‌రెడ్డిని ఆహ్వానించారంటే ఆయనే చైర్మన్ అని సంకేతం పంపినట్లేనని అంటున్నారు. మరోవైపు రాష్ట్ర సమితిలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులకు కూడా చోటు ఇవ్వాలని సీఎం నిర్ణయించినందున వారు ఎవరనే చర్చ జరుగుతోంది. వ్యవసాయ వర్సిటీకి చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు, ఇతర నిపుణులు ఉంటారని చెబుతున్నారు. మొత్తం 42 మందితో కూడిన రాష్ట్ర సమితిలో 30 మందిని జిల్లా సమితుల నుంచి తీసుకుంటారని, మిగిలిన 12 మంది.. నేతలు, నిపుణులు, వ్యవసాయ శాస్త్రవేత్తలను సీఎం నామినేట్ చేస్తారని చెబుతున్నారు. -
పిల్లల్ని ఎలా సాదేది?
* రైతుల ఆత్మహత్యతో కకావికలమైన కుటుంబాలు * తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన చిన్నారులు * అప్పులు, ఎండిన పంటలతోనే మరణాలు * లోకాయుక్తకు గోడు వెళ్లబోసుకున్న మహిళలు * స్వతంత్ర కమిటీ వేయాలన్న రైతుసంఘం * ఆత్మహత్యల పిటిషన్‌పై విచారణ వచ్చేనెల 24 కు వాయిదా సాక్షి, హైదరాబాద్: పంటలు ఎండి, అప్పుల భారం పెరిగి రైతన్నలు ప్రాణాలను తీసుకుంటున్నారు. ఖరీఫ్‌లో కరవు పరిస్థితులు రైతుల్లో మానసిక స్థైర్యాన్ని దెబ్బతీశాయి. చనిపోయినవారిలో ఎక్కువమంది యువరైతులే ఉన్నారు. దీంతో తమ పిల్లలను ఎలా పెంచాలో తెలియక తల్లులు ఆవేదన చెందుతున్నారు. పంటలు పండుతాయన్న ఆశతో అప్పులు చేసి సాగుచేస్తే వర్షాలు రాక ఎండిపోయాయని, వడ్డీవ్యాపారులు బాకీలకోసం వేధిస్తున్నారని బాధితులు తల్లడిల్లుతున్నారు. సర్కారు తమకు న్యాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. అంతేకాక మంగళవారం లోకాయుక్త జస్టిస్ సుభాషణ్ రెడ్డికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం వేసిన పిటిషన్‌పై లోకాయుక్తలో జరిగిన విచారణకు బాధితకుటుంబాల వారు హాజరయ్యారు. బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇప్పించాలని, అనాథలైన పిల్లలకు ప్రభుత్వ ఖర్చుతోనే విద్య చెప్పించాలని రైతుసంఘం ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ కోరారు. ఆత్మహత్యలపై ప్రభుత్వం ఒక స్వతంత్ర కమిటీ వేసి వివరాలు సేకరించాలని కోరారు. అయితే, రైతుల ఆత్మహత్యలపై ఆదిలాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ల నుంచే నివేదికలు అందాయనీ, మిగతా జిల్లాల నుంచి రావాల్సి ఉన్నందున విచారణను వచ్చే నెల 24వ తేదీకి లోకాయుక్త వాయిదా వేసిందని ఆమె చెప్పారు. కుటుంబసభ్యులను కోల్పోయిన మహిళలను ‘సాక్షి’ పరామర్శించి వివరాలు సేకరించింది. వారి మనోవేదన వారి మాటల్లోనే... నా కొడుకూ కోడలు ఇద్దరూ చనిపోయారు నా వయస్సు 78 ఏళ్లు. నా కోడలు యాదమ్మ (30) ఆర్థిక సమస్యలు, అనారోగ్యం కారణంగా చనిపోయింది. ఆమె చనిపోయిన 10 రోజుల్లోనే కొడుకు నరసింహులు (35) పత్తి, మొక్కజొన్న, వరి ఎండిపోవడంతో గత నెల 18న పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మా కుటుంబం చిన్నాభిన్నమైంది. నా మనవళ్లు శ్రీశైలం (7), శ్రీకాంత్ (4)లను అనాధలయ్యారు. నాకు పింఛన్ కూడా రావడంలేదు. నా కొడుకు చేసిన రూ. 2 లక్షల అప్పులు చెల్లించాలంటూ వడ్డీ వ్యాపారులు వేధిస్తున్నారు. ఏం చేయాలి దేవుడా? మమ్మల్ని ప్రభుత్వమే కాపాడాలె. - చంద్రమ్మ, సిరంగపురం, మహబూబ్‌నగర్ జిల్లా పంటలు ఎండిపోవడంతో.. నా భర్త రాజేందర్ (35) పంటలు ఎండిపోయి, అప్పులు పెరిగి గత నెల 20న బావి దగ్గర ఉరేసుకున్నడు. మూడెకరాల భూమిలో పత్తి ఏసిండు. మొలకెత్తకపోతే రెండుమూడుసార్లు విత్తనాలు నాటిండు. కౌలుకు తీసుకున్న ఇంకో 3 ఎకరాల్లో మొక్కజొన్న ఏసిండు రూ. 4 లక్షల అప్పు చేసిండు. పంటలు ఎండిపోయి, అప్పు మిగిలిపోగా ఆత్మహత్యే దిక్కనుకున్నడు. నన్ను ఒంటరి దాన్ని చేసిపోయిండు. నాకు ఏడాది కొడుకు, 13 ఏళ్ల బిడ్డ ఉంది. వాళ్లను ఎట్లా సాదాలే. అప్పులెట్ల తీర్చాలే. - విజయ, పీచుపల్లి, బెజ్జంకి మండలం, కరీంనగర్ జిల్లా పురుగుమందు తాగి నా భర్త శ్రీహరి (63) రెండెకరాల్లో పత్తి, ఒక ఎకరంలో వరి వేశాడు. పత్తి సరిగా మొలకెత్తకపోతే నాలుగుసార్లు విత్తాడు. అయినా అది ఎండిపోయి, రూ. 3.7 లక్షల అప్పులు కావడంతో మనోవేదనకు గురై చేనులోనే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. - కొల్లిపాక భాగ్యలక్ష్మి, వరంగల్ జిల్లా పత్తి ఎండిపోయి.. అప్పులు పెరిగి నా భర్త అంజయ్య (35) రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి వేశాడు. పత్తి మొదటిసారి మొలకెత్తకపోవడంతో రెండోసారి వేశాడు. అయినా నీరు లేకపోవడంతో పత్తిపంట పోయింది. సాగు కోసం రూ. 2.50 లక్షలు అప్పులు చేశాడు. పంట ఎండి, అప్పులు పెరిగి మానసిక వేదనకు గురై జూలై 23వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు ఒక పాప, ఒక బాబు ఉన్నారు. వారిద్దరూ చిన్నారులే. నా జీవితం అంధకారమైంది. - అనూష, వరంగల్ జిల్లా పదెకరాలు కౌలుకు తీసుకుంటే.. నా భర్త నరసింహులు పంటలు ఎండిపోవడంతో 20 రోజుల క్రితం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 10 ఎకరాలు కౌలుకు తీసుకొని, రూ. 2.5 లక్షలు అప్పు చేసి మొక్కజొన్న వేశాడు. వర్షాలు లేక మొత్తం ఎండిపోయింది. నా జీవితం చీకటిమయం అయింది. - విమల, కొందుర్గు మండలం, మహబూబ్‌నగర్ జిల్లా