ఇస్రో మాజీ చీఫ్ నాయర్‌కు సమన్లు
న్యూఢిల్లీ: యాంత్రిక్స్ దేవాస్ కేసులో ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్‌కు ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు శనివారం సమన్లు జారీచేసింది. ప్రభుత్వ ఖజానాకు రూ.578 కోట్ల నష్టం కలిగించారన్న సీబీఐ కేసులో డిసెంబర్ 23న తమముందు హాజరుకావాలని ఆదేశించింది. నాయర్‌తో పాటు అప్పటి ఇస్రో డైరెక్టర్ భాస్కర్ నారాయణ రావు, యాంత్రిక్స్ ఈడీ కేఆర్ శ్రీధర్ మూర్తి, అంతరిక్ష విభాగం అదనపు కార్యదర్శి వీనా రావులకు సమన్లు జారీచేసింది. ఉపగ్రహాల్లోని నిషేధిత ఎస్–బ్యాండ్లను నిబంధనలకు విరుద్ధంగా ఇస్రో వాణిజ్య విభాగం యాంత్రిక్స్ ద్వారా వీరు ‘దేవాస్’ సంస్థకు కేటాయించారని సీబీఐ ఆరోపించింది.