దళిత నేతల అరెస్ట్
భీమవరం : అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు సందర్భంగా పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించడంలో, దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ విమర్శించారు. గరగపర్రు బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ శనివారం చలో గరగపర్రు కార్యక్రమం చేపడితే పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పరిహారం అందని 32 మందికి ఆర్థిక సహాయం అందించకపోతే ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని రాజేష్ హెచ్చరించారు. గరగపర్రు గ్రామంలో సెక్షన్ 144 అమలులో ఉండగా ధిక్కరించిన నేరానికి మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్, తానేటి పుష్పరాజు, పల్లపు వేణు, దారం సురేష్, తోటే సుందరంతో సహా 25 మందిని అరెస్ట్ చేసినట్లు పాలకోడేరు ఎస్సై వి.వెంకటేశ్వరరావు చెప్పారు.