దేశంలో సంతానలేమి సమస్య తీవ్రం
బంజారాహిల్స్: దేశంలో సంతానలేమి సమస్య తీవ్రంగా ఉందని, స్టెమ్‌సెల్ పద్ధతి ద్వారా దీనికి పరిష్కారం సాధ్యమవుతుందని, ఈదిశగా సైన్స్ గణనీయ పురోగతి సాధిస్తోందని ముంబయికి చెందని ప్రముఖ సంతాన సాఫల్య నిపుణురాలు డాక్టర్ ఫిరుజాపారిఖ్ అన్నారు. ఫిక్కి లేడీస్ ఆర్గనైజేషన్ (ఫిక్కి ఫ్లో) ఆధ్వర్యంలో శనివారం బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్లో ‘గిఫ్ట్ ఆఫ్ లైఫ్’ పేరుతో నిర్వహించిన పరిచయ వేదికలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఆమె మాట్లాడుతూ దేశంలో సంతానలేమి సమస్యగా మారిందని, కనీసం 10శాతం మంది దంపతులు సంతానలేమితో బాధపడుతున్నారన్నారు. యూరప్ దేశాల్లో ప్రభుత్వాలు ఉచితంగా ఐవీఎఫ్ చికిత్సలు అందిస్తున్నాయని, మనదేశంలో కూడా ప్రభుత్వాలు ఈదిశగా ఆలోచించాలన్నారు. కార్యక్రమంలో రోబోటిక్ సర్జన్, గైనకాలజిస్ట్ డాక్టర్ రోమాసిన్హా, ఎఫ్ఎల్వో చైర్పర్సన్ పద్మారాజగోపాల్ పాల్గొన్నారు. సవితాదాటే మీనన్ కార్యక్రమం అనుసంధానకర్తగా వ్యవహరించారు.