Giridhari Constructions
-
హ్యాపీ గృహాలు! ఎటుచూసినా హ్యాపీనెస్సే
సాక్షి, హైదరాబాద్: ఆఫీసులో పని ఒత్తిడి నుంచి బయటికి రాగానే ట్రాఫిక్ జాంలు, రణగొణధ్వనులు.. వీటన్నింటి నుంచి తప్పించుకొని కాసేపు సేదతీరాలంటే సొంతిల్లు ఆహ్లాదకరంగా ఉండాల్సిందే. చుట్టూ పచ్చని చెట్లు, స్వచ్ఛమైన గాలి, నీటి పరవళ్ల సప్పుళ్లు, ఎటు చూసినా మెదడును ఉత్తేజ పరిచే చిహ్నాలు, బొమ్మలు, కొటేషన్స్, మధుర జ్ఞాపకాలను పదిల పరుచుకునే మెమొరీ బ్యాంక్.. ఆహా ఊహించుకుంటే ఎంతో బాగుంది కదూ! ఎస్.. అచ్చం ఇలాంటి ప్రాజెక్ట్‌కే శ్రీకారం చుట్టింది గిరిధారి హోమ్స్. థీమ్ ప్రాజెక్ట్‌లకు కేరాఫ్ అడ్రస్ అయిన గిరిధారి మరో వినూత్న ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. మనిషి ఆనందంగా ఉండాలంటే ఆదాయం, పెట్టుబడులు మాత్రమే రెట్టింపయితే చాలదు.. వారి సంతోషాలూ డబులవ్వాలి. అంటే ఉండే పరిసరాలు ఆరోగ్యకరంగా, ఆహ్లాదకరంగా ఉండాలి. ఇదే థీమ్‌గా హ్యాపీనెస్ హబ్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టామని గిరిధారి హోమ్స్ ఎండీ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. విదేశాల్లో ప్రాచుర్యం పొందిన హ్యాపీనెస్ కాన్సెప్ట్‌తో కిస్మత్పూర్లో ఐదున్నర ఎకరాలలో ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. జీ+5 అంతస్తులలో మొత్తం 567 ఫ్లాట్లుంటాయి. ప్రారంభ ధర రూ.60 లక్షలు. 1,033 చ.అ. నుంచి 1,601 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. 2025 డిసెంబర్ నాటికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతుంది. ఎటుచూసినా హ్యాపీనెస్సే: హ్యాపీనెస్ హబ్‌లో ఎటు చూసినా ఆనందాన్ని సూచించే సంకేతాలు, మనస్సును ఆహ్లాదపరిచే ప్రకృతి, పక్షుల కిలకిలారావాలు ప్రతిదీ సంతోషాన్ని రెట్టింపు చేసేలా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్‌కు 200 మీటర్ల దూరంలో ఈసా రివర్ ఉంటుంది. హ్యాపీ బాడీ, మైండ్, సోల్, హార్ట్ అనే సరికొత్త కాన్సెప్ట్‌తో 20 వేల చ.అ.లలో క్లబ్‌హౌస్ ఉంటుంది. రెండు బ్యాడ్మింటన్ కోర్టులకు ఉత్సాహ, ఉల్లాస అని నామకరణం చేశారు. ఇలా నలభైకి పైగా పేర్లు, హ్యాపీనెస్‌ను ప్రేరేపించే చిహ్నాలను ఎంచుకున్నారు. స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్ గేమ్స్, 2 కి.మీ. జాగింగ్, వాకింగ్ ట్రాక్ వంటి అన్ని రకాల వసతులుంటాయి. ప్రధాన్‌మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం కూడా ఈ ప్రాజెక్ట్‌కు వర్తిస్తుంది. దీంతో రూ.2.5 లక్షల వరకు వడ్డీ రాయితీ పొందవచ్చు. లో రైజ్ అపార్ట్మెంట్ కారణంగా కొనుగోలుదారులకు అవిభాస్య స్థలం (యూడీఎస్) ఎక్కువ వస్తుంది. ప్రతి వెయ్యి చ.అ.కు 40 గజాల స్థలం వస్తుంది. మెమొరీ బ్యాంక్: ఈ ప్రాజెక్ట్‌లో నివాసితులకు వినూత్న అనుభూతిని కలిగించేందుకు తొలిసారిగా మెమొరీ బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో ప్రతి ఒక్క కొనుగోలుదారులకు ఒక లాకర్‌ను ఇస్తారు. ఇందులో వారి మధుర జ్ఞాపకాలను భద్రపరుచుకోవచ్చు. కొన్నేళ్ల తర్వాత వాటిని చూసుకుంటే అప్పటి మధుర క్షణాలు కళ్లముందు సాక్షాత్కారమవుతాయి. ఇప్పటివరకు గిరిధారి హోమ్స్ కిస్మత్పూర్లో 2 వేల గృహాలను పూర్తి చేసి, కొనుగోలుదారులకు అందించింది. వచ్చే 12 నెలల్లో మరో 30 లక్షల చ.అ.లలో ప్రాజెక్ట్‌లను ప్రారంభించనుంది. -
రూపుదిద్దుకుంటున్న మురారీ, కమల్ నారాయణ్!
సంప్రదాయ పద్ధతిలో కాకుండా భిన్నమైన నిర్మాణాలు.. అది కూడా అందుబాటు ధరల్లో నిర్మించడం గిరిధారి కన్స్ట్రక్షన్స్ ప్రత్యేకత. ఇప్పటికే అవిఘ్న ప్రాజెక్ట్‌లో పడవ ఆకారంలో ఎలివేషన్, విల్లా ఓనిక్స్‌లో గ్రీన్ హౌస్ కాన్సెప్ట్‌తో కస్టమర్లను ఆకర్షించిన సంస్థ.. ఇప్పుడు ఎలివేషన్‌లో వర్టికల్ గార్డెన్స ఏర్పాటుతో నగరవాసుల ముందుకొచ్చింది. అప్పా జంక్షన్లో మురారీ, పద్మారావునగర్‌లో కమల్నారాయణ్ ప్రాజెక్ట్ ఎలివేషన్లను వర్టికల్ గార్డెన్సలో తీర్చిదిద్దుతోంది. సింగపూర్‌లోని రాయల్ పార్క్ హోటల్‌ను ఆదర్శంగా తీసుకొని ఈ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నామని గిరిధారి కన్స్రక్షన్స ఎండీ ఇంద్రసేనా రెడ్డి చెప్పారు. ప్రాజెక్ట్ విశేషాలను ‘సాక్షి రియల్టీ’తో పంచుకున్నారు. ⇔ ఒకవైపు 30 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం.. మరోవైపు 180 డిగ్రీల కోణంలో 60 అడుగుల ఎత్తుండే పచ్చని పచ్చదనం! ఇదీ మురారి ప్రాజెక్ట్ గురించి ఒక్కముక్కలో చెప్పాలంటే!! అప్పా జంక్షన్లో 2 ఎకరాల్లో మురారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. ఇందులో మొత్తం 155 ఫ్లాట్లొస్తారుు. 1,200-2,016 చ.అ. విస్తీర్ణాల్లో ఫ్లాట్లుంటారుు. 60 శాతం 2 బీహెచ్‌కే 40 శాతం 3 బీహెచ్‌కే ఫ్లాట్లు. ధర చ.అ.కు రూ.2,900. ప్రాజెక్ట్ ప్రారంభం కాకముందే 65 శాతం అమ్మకాలు పూర్తయ్యాయంటే ప్రాజెక్ట్ అందం, ఆకర్షణ, వసతుల గురించి అర్థం చేసుకోవచ్చు. ఇందులో 7 వేల చ.అ.ల్లో క్లబ్ హౌజ్ అది కూడా చుట్టూ నీటితో ద్వీపకల్పంలా తీర్చిదిద్దుతున్నాం. మురారీ పక్కనే ఉన్న అవిఘ్న రెండు ప్రాజెక్ట్‌కు కలిపి 70 రకాల వసతులిస్తున్నాం. 2018 చివరినాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం. ⇔ పద్మారావునగర్‌లో 3,200 గజాల్లో కమల్నారాయణ్ ప్రాజెక్ట్‌ను చేస్తున్నాం. మొత్తం 53 ఫ్లాట్లు. 1,120-1,765 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటారుు. ధర చ.అ.కు రూ.5,200. ఇందులోనూ 50 శాతం అమ్మకాలు పూర్తయ్యారుు. 2018 చివరినాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం. త్వరలోనే అప్పా జంక్షన్లో 4 ఎకరాల్లో రాజక్షేత్ర, 2 ఎకరాల్లో వ్యూ ప్రాజెక్ట్‌లను కూడా ప్రారంభించనున్నాం. రాజక్షేత్ర ప్రాజెక్ట్‌ను రాజ ప్రసాదాలు, కోటల తరహాలో, వ్యూ ప్రాజెక్ట్‌ను సాహాసోపేతమైన క్రీడలుండేలా ప్రణాళికలు రచిస్తున్నాం. ⇔ 2004లో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన గిరిధారి.. ఇష్టా, ఐసోలా, ఎగ్జిక్యూటివ్ పార్క్, సారుు ఆశ్రయ, విల్లా ఓనిక్స్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేసింది. సుమారు 750 యూనిట్స్లను కొనుగోలుదారులకు అందించింది కూడా. వచ్చే మార్చి నాటికి ఇష్టా ప్రాజెక్ట్‌లో 90 ఫ్లాట్లను కొనుగోలుదారులకు అందించనున్నాం. వచ్చే డిసెంబర్ నాటికి అవిఘ్న ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం. -
గడువు కంటే ముందే ఫ్లాట్ల అప్పగింత
2013 జనవరిలో ప్రారంభం.. 2014 అక్టోబర్‌లో గృహ ప్రవేశం సాక్షి, హైదరాబాద్: బిల్డర్లు గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయట్లేదనే అపోహ ఉన్న ప్రస్తుత తరుణంలో ఇచ్చిన టైం కంటే ఐదు నెలలు ముందుగానే నిర్మాణాన్ని పూర్తి చేసి హైదరాబాద్ స్థిరాస్తి రంగంపై నమ్మకాన్ని పెంచుతోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. అప్పా జంక్షన్లో ఐసోలా ప్రాజెక్ట్‌ను 2013 జనవరిలో ప్రారంభించి.. ఈ ఏడాది అక్టోబర్ నుంచి కొనుగోలుదారులకు ఇంటి తాళాలందించటం మొదలుపెట్టింది. కస్టమర్ల సహకారం, సరైన సమయంలో పేమెంట్స్ అందించటం వల్లే ఇది సాధ్యపడిందంటున్నారు సంస్థ ఎండీ ఇంద్రసేనారెడ్డి. ఇంకా ఏమన్నారంటే.. కొనుగోలుదారుల అవసరాలను, ఆనందాలను దృష్టిలో పెట్టుకొని నమ్మకంగా, నాణ్యమైన ఫ్లాట్లను అందిస్తే ప్రతికూల పరిస్థితుల్లోనూ స్థిరాస్తి రంగంలో నిలబడొచ్చు. అందుకే ఐసోలా ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన 2 నెలల్లోనే 70 శాతానికి పైగా ఫ్లాట్లను విక్రయించగలిగాం. నిజానికి ఐసోలా ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాది మార్చి - జూన్ మధ్య కాలంలో అందించాలి. కానీ, రానున్న వేసవికాలాన్ని సొంతింట్లో ఆనందంగా గడిపేందుకు, పచ్చని ప్రకృతిలో విహరించేందుకుగాను గడువు కంటే ముందే ఫ్లాట్లను అప్పగిస్తున్నాం. అలాగే కస్టమర్ల పిల్లలకూ విద్యా సంవత్సరానికి అవసరమైన సమయమూ దొరుకుతుంది కదా. ఇందులో భాగంగానే ఇటీవలే తొలి కస్టమర్ అయిన శిల్ప భాస్కర్‌కు ఫ్లాట్ తాళాలను అందించాం. మిగిలిన ఫ్లాట్లను డిసెంబర్‌లోగా పూర్తి చేస్తాం. నగరంలో సొంతిల్లు అనేది ఉన్నత శ్రేణి వర్గాలకే కాదు సామాన్య, మధ్యతరగతి ప్రజలకూ ఉండాలి. అలా అని సిటీ కి దూరంగా, రవాణా సదుపాయాలు కూడా సరిగా లేని ప్రాంతాల్లో ఇల్లుండటం కాదు.. సిటీ కి దగ్గర్లో, అందుబాటు ధరల్లో ఫ్లాట్లు లభించాలి. కుటుంబంతో కలసి సెకండ్ షో సినిమా చూసి సురక్షితంగా ఇంటికి చేరుకునేలా ఉండాలి. అందుకే అప్పా జంక్షన్లో పలు ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాం. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు, గచ్చిబౌలిలోని ఐటీ కంపెనీలకు అతి దగ్గర్లో ఉంటుందీ జంక్షన్. 3 కి.మీ. దూరంలో ఎన్ఐఆర్డీ, ఎన్జీరంగా వర్సిటీ, పోలీస్ అకాడమీలూ ఉండటంతో నిత్యం జనాలతో అప్పా జంక్షన్ కిటకిటలాడుతుంది. ఎకరం విస్తీర్ణంలో ఇస్టా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం 80 ఫ్లాట్లు. 2 బీహెచ్‌కే రూ.25 లక్షలు, 3 బీహెచ్‌కే రూ.40 లక్షలుగా నిర్ణయించాం. క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్ వంటి అన్ని రకాల ఆధునిక వసతులను అందిస్తున్నాం. హిమాయత్‌సాగర్, గండిపేట జలాశయాలకు అతి దగ్గర్లో ఉండటంతో జల వనరులకు లోటే లేదు. 8.5 ఎకరాల్లో ఎగ్జిక్యూటివ్ పార్క్ రానుంది. మొత్తం 518 ఫ్లాట్లు. ఫేజ్-1లో ఇప్పటికే 318 ఫ్లాట్లలో ఆనందమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఫేజ్-2లో భాగంగా మరో 200 ఫ్లాట్లను నిర్మిస్తున్నాం. వచ్చే ఏడాది జూన్ కల్లా నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. 4 ఎకరాల్లో విల్లా ఓనిక్స్ పేరుతో ఆధునిక విల్లా ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాం. మొత్తం 44 విల్లాలు. ఒక్కో విల్లా 3 వేల చ.అ.ల్లో విస్తరించి ఉంటుంది. ధర చ.అ.కు రూ.4,500లుగా నిర్ణయించాం. వచ్చే ఏడాది జూన్ కల్లా కొనుగోలుదారులకు ఫ్లాట్లను అందిస్తాం.