గడువు కంటే ముందే ఫ్లాట్ల అప్పగింత | Before expired submission of flats | Sakshi
Sakshi News home page

గడువు కంటే ముందే ఫ్లాట్ల అప్పగింత

Published Sat, Nov 1 2014 12:05 AM | Last Updated on Thu, Oct 4 2018 4:27 PM

గడువు కంటే ముందే ఫ్లాట్ల అప్పగింత - Sakshi

గడువు కంటే ముందే ఫ్లాట్ల అప్పగింత

2013 జనవరిలో ప్రారంభం.. 2014 అక్టోబర్‌లో గృహ ప్రవేశం
సాక్షి, హైదరాబాద్: బిల్డర్లు గడువులోగా నిర్మాణాలు పూర్తి చేయట్లేదనే అపోహ ఉన్న ప్రస్తుత తరుణంలో ఇచ్చిన టైం కంటే ఐదు నెలలు ముందుగానే నిర్మాణాన్ని పూర్తి చేసి హైదరాబాద్ స్థిరాస్తి రంగంపై నమ్మకాన్ని పెంచుతోంది గిరిధారి కన్‌స్ట్రక్షన్స్. అప్పా జంక్షన్‌లో ఐసోలా ప్రాజెక్ట్‌ను 2013 జనవరిలో ప్రారంభించి.. ఈ ఏడాది అక్టోబర్ నుంచి కొనుగోలుదారులకు ఇంటి తాళాలందించటం మొదలుపెట్టింది. కస్టమర్ల సహకారం, సరైన సమయంలో పేమెంట్స్ అందించటం వల్లే ఇది సాధ్యపడిందంటున్నారు సంస్థ ఎండీ ఇంద్రసేనారెడ్డి. ఇంకా ఏమన్నారంటే..
     
కొనుగోలుదారుల అవసరాలను, ఆనందాలను దృష్టిలో పెట్టుకొని నమ్మకంగా, నాణ్యమైన ఫ్లాట్లను అందిస్తే ప్రతికూల పరిస్థితుల్లోనూ స్థిరాస్తి రంగంలో నిలబడొచ్చు. అందుకే ఐసోలా ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన 2 నెలల్లోనే 70 శాతానికి పైగా ఫ్లాట్లను విక్రయించగలిగాం. నిజానికి ఐసోలా ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాది మార్చి - జూన్ మధ్య కాలంలో అందించాలి. కానీ, రానున్న వేసవికాలాన్ని సొంతింట్లో ఆనందంగా గడిపేందుకు, పచ్చని ప్రకృతిలో విహరించేందుకుగాను గడువు కంటే ముందే ఫ్లాట్లను అప్పగిస్తున్నాం. అలాగే కస్టమర్ల పిల్లలకూ విద్యా సంవత్సరానికి అవసరమైన సమయమూ దొరుకుతుంది కదా. ఇందులో భాగంగానే ఇటీవలే తొలి కస్టమర్ అయిన శిల్ప భాస్కర్‌కు ఫ్లాట్ తాళాలను అందించాం. మిగిలిన ఫ్లాట్లను డిసెంబర్‌లోగా పూర్తి చేస్తాం.
     
నగరంలో సొంతిల్లు అనేది ఉన్నత శ్రేణి వర్గాలకే కాదు సామాన్య, మధ్యతరగతి ప్రజలకూ ఉండాలి. అలా అని సిటీ కి దూరంగా, రవాణా సదుపాయాలు కూడా సరిగా లేని ప్రాంతాల్లో ఇల్లుండటం కాదు.. సిటీ కి దగ్గర్లో, అందుబాటు ధరల్లో ఫ్లాట్లు లభించాలి. కుటుంబంతో కలసి సెకండ్ షో సినిమా చూసి సురక్షితంగా ఇంటికి చేరుకునేలా ఉండాలి. అందుకే అప్పా జంక్షన్‌లో పలు ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాం. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు, గచ్చిబౌలిలోని ఐటీ కంపెనీలకు అతి దగ్గర్లో ఉంటుందీ జంక్షన్. 3 కి.మీ. దూరంలో ఎన్‌ఐఆర్‌డీ, ఎన్జీరంగా వర్సిటీ, పోలీస్ అకాడమీలూ ఉండటంతో నిత్యం జనాలతో అప్పా జంక్షన్ కిటకిటలాడుతుంది.
     
ఎకరం విస్తీర్ణంలో ఇస్టా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం 80 ఫ్లాట్లు. 2 బీహెచ్‌కే రూ.25 లక్షలు, 3 బీహెచ్‌కే రూ.40 లక్షలుగా నిర్ణయించాం. క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్ వంటి అన్ని రకాల ఆధునిక వసతులను అందిస్తున్నాం. హిమాయత్‌సాగర్, గండిపేట జలాశయాలకు అతి దగ్గర్లో ఉండటంతో జల వనరులకు లోటే లేదు.
     
8.5 ఎకరాల్లో ఎగ్జిక్యూటివ్ పార్క్ రానుంది. మొత్తం 518 ఫ్లాట్లు. ఫేజ్-1లో ఇప్పటికే 318 ఫ్లాట్లలో ఆనందమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఫేజ్-2లో భాగంగా మరో 200 ఫ్లాట్లను నిర్మిస్తున్నాం. వచ్చే ఏడాది జూన్ కల్లా నిర్మాణాన్ని పూర్తి చేస్తాం.
     
4 ఎకరాల్లో విల్లా ఓనిక్స్ పేరుతో ఆధునిక విల్లా ప్రాజెక్ట్  నిర్మిస్తున్నాం. మొత్తం 44 విల్లాలు. ఒక్కో విల్లా 3 వేల చ.అ.ల్లో విస్తరించి ఉంటుంది. ధర చ.అ.కు రూ.4,500లుగా నిర్ణయించాం. వచ్చే ఏడాది జూన్ కల్లా కొనుగోలుదారులకు ఫ్లాట్లను అందిస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement