Glass Door
-
ఎంత ఘోరం.. గాజు డోర్ మీద పడటంతో మూడేళ్ల చిన్నారి మృతి
లుధియానా: పంజాబ్‌లో విషాదం చోటుచేసుకుంది. గ్లాస్ డోర్‌తో ఆడుకొంటున్న చిన్నారికి ఆ తలుపే మృత్యువుగా మారింది. భారీ గాజు తలుపు మీద పడటంతో మూడేళ్ల చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. లుధియానా ఘుమర్ మండి మార్కెట్లో ఈ దుర్ఘటన జరిగింది. ఊహించని ఘటనలో చిన్నారి ప్రాణాలు కోల్పోయిన దృశ్యాలు దృశ్యాలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి. వివరాలు.. మూడేళ్ల చిన్నారితో కలిసి ఓ కుటుంబం వస్త్ర దుకాణంలో కొనుగోలు కోసం వచ్చారు. తల్లిదండ్రులు వారి పనిలో నిమగ్నమై ఉండగా.. చిన్నారి దుకాణం ఎంట్రన్స్ వద్ద ఉన్న తలుపు హ్యాండిల్‌ను పట్టుకొని అటు ఇటూ ఊగుతూ ఆడుకుంటుంది. ఈ క్రమంలో ఒక్కసారిగా గ్లాస్ డోర్ మొత్తం ఊడిపోయి అమాంతం ఆమెపై పడిపోయింది. బోల్టులు వదులుగా ఉండటంతో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే గమనించిన తల్లిదండ్రులు, షోరూమ్ సిబ్బంది హుటాహుటిన బాలికను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అణ్యం పుణ్యం తెలియని చిన్నారిని, డోర్ బలితీసుకున్న దృశ్యాలు నెటిజన్ల హృదయాలను పిండేస్తున్నాయి. అయితే ఈ ఘటనపై తల్లిదండ్రుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు. చదవండి: Video: హెల్మెట్‌లో దూరిన పాము.. జస్ట్ మిస్ PUNJAB | A three-year-old girl died in Punjab's Ludhiana after a giant glass door at a showroom fell on top of her. The incident took place at the Ghumar Mandi Market in the city, and the girl was rushed to a hospital soon after, where she was declared dead. The incident was… pic.twitter.com/WSiUtpmEyx— ℝ𝕒𝕛 𝕄𝕒𝕛𝕚 (@Rajmajiofficial) November 28, 2023 -
FaceBook : జుకర్‌బర్గ్‌కి ఎసరు పెట్టిన ట్రంప్
కాలిఫోర్నియా: వరుస వివాదాలకు కారణమైన ట్రంపరితనం చివరకు ఫేస్బుక్ సీఈవో మార్క్ జూకర్‌బర్గ్‌కి ఎసరు తెచ్చింది. గతేడాది కాలంలో విద్వేష పూరిత వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్‌ను నిలువరించడంలో ఫేస్బుక్ ఉదాసీనంగా వ్యవహరించిందనే అభిప్రాయం ఆ సంస్థ ఉద్యోగులే వ్యక్తం చేశారు. దీంతో గ్లాస్‌డోర్ సంస్థ ప్రకటించిన టాప్ 100 సీఈవో లిస్టులో జుకరబర్గ్ స్థానం కోల్పోయారు. టాప్‌లో దక్కని చోటు ప్రముఖ కంపెనీలకు సీఈవోల పనితీరుపై ఆయా సంస్థలకు చెందిన చెందిన ఉద్యోగుల అభిప్రాయం సేకరించి ప్రతీ ఏడు 100 అత్యుత్తమ సీఈవోల జాబితాను గ్లాస్‌డోర్ సంస్థ ప్రకటిస్తోంది. 2013 నుంచి వరుసగా ప్రతీ ఏడాది ఈ జాబితాలో జుకర్‌బర్గ్‌కి చోటు దక్కింది. అయితే ఈ ఏడాది టాప్ 10 సీఈవో లిస్టులో చోటు దక్కించుకోలేకపోయాడు జుకర్‌బర్గ్. గ్లాస్‌డోర్ ప్రకటించిన టాప్ 100 సీఈవో లిస్టులో మైక్సోసాఫ్ట్ సత్య నాదేళ్ల 97 శాతం రేటింగ్ సాధించగా ఆపిల్ సీఈవో టిమ్‌కుక్ 95 శాతం రేటింగ్ సాధించారు. మార్క్ జుకర్‌బర్గ్‌కి 88 శాతం రేటింగ్ సాధించారు. ట్రంపరితనమే కారణం అమెరికా అధ్యక్ష ఎన్నికలు, కాపిటల్ హౌజ్‌పై దాడి సందర్భంగా ఫేస్బుక్ వేదికగా విద్వేషపూరిత వ్యాఖ్యలు ట్రంప్ చేశారు. ట్రంప్ వ్యవహరశైలిపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. ట్విట్టర్ ఏకంగా ట్రంప్ అకౌంట్ బ్యాన్ చేసింది. అయితే ఈ సమయంలో ట్రంప్‌పై చర్యలు తీసుకోవడంలో ఫేస్బుక్ సీఈవో జుకర్‌బర్గ్ మెతక వైఖరి అనుసరించారనే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత కోవిడ్ కల్లోల సమయంలోనూ తప్పుడు సమాచారం నివారించడంలో ఫేస్బుక్ విఫలమైంది. ఫేస్బుక్ వేదికగా ఆధారంలేని సమాచారం జనబాహుళ్యంలోకి వెళ్లింది. వీటిని సకాలంలో నివారించడంలో ఫేస్బుక్ సీఈవో విఫలమైనట్టు ఆ సంస్థ ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. 700 మంది ఫేస్‌బుక్‌కి ప్రపంచ వ్యాప్తంగా 60,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇందులో 700 మంది ఉద్యోగుల అభిప్రాయం గ్లాస్‌డోర్ సంస్థ సేరించింది. 2020 మే నుంచి 2021 మే వరకు సేకరించిన సమాచారం క్రోడీకరించి టాప్ సీఈవోల లిస్టును వెల్లడించింది. అయితే మరింత మంది ఉద్యోగుల నుంచి సమాచారం సేకరిస్తే జుకర్‌బర్గ్‌కి టాప్ 100 సీఈవో లిస్టులో చోటు దక్కేదని మార్క్ మద్దతుదారులు అంటున్నారు. చదవండి : ‘జెఫ్ బెజోస్ మారువేశంలో ఉన్న సూపర్ విలన్’ -
జ్యువెలరీ షాపులో చోరీ
చైతన్యపురి, న్యూస్‌లైన్: షట్టర్‌ను తొలగించి జ్యువెలరీ షాపులో చోరీకి పాల్పడిన ఘటన సరూర్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, షాపు నిర్వాహకుడు తెలిపిన వివరాల ప్రకారం... చార్మినార్‌కు చెందిన మనీష్‌కుమార్ శర్మ దిల్సుఖ్నగర్ బావర్చి హోటల్ పక్క సందులోని ఓ బిల్డింగ్‌లో కవిత జ్యువెలరీ పేరిట వన్‌గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాపును నిర్వహిస్తున్నారు. దసరా పండుగ కావటంతో రెండు రోజుల పాటు షాపును మూసి ఉంచారు. మనీష్‌కుమార్ మంగళవారం ఉదయం దుకాణానికి వచ్చి.. కింది అంతస్తులోని షట్టర్‌ను తెరిచా రు. తర్వాత మొదటి అంతస్తులోనికి వెళ్లి చూడగా దుకాణం షట్టర్ తెరిచి ఉంది. గ్లాస్ డోర్ పగిలి ఉండటంతో పాటు లోపల ఆభరణాల ఖాళీ ప్లాస్టిక్ డబ్బాలు పడి ఉన్నాయి. రెండు షోకేసుల్లోని వన్‌గ్రామ్ గోల్డ్ ఆభరణాలు, ముత్యాల దండలు, జైపూర్ జ్యువెలరీలు కనిపించలేదు. చోరీ జరిగిందని గ్రహించిన ఆయన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ సుధాకర్, ఎస్ఐ ఖలీల్ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. షట్టర్ ముందు రక్తపు మరకలు ఉన్నాయి. దొంగ అద్దాలను పగులగొట్టినప్పడు అతని చేతికి గాయమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో షట్టర్‌ను లేపేందుకు వినియోగించే ఇనుపరాడ్ లభ్యమైంది. ఇద్దరు లేక ముగ్గురు ఈ చోరీలో పాల్గొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. చోరీకి గురైన ఆభరణాల విలువ ఇంకా నిర్ధారణ కాలేదు. షాప్‌లో పెద్ద మొత్తంలో ఆభరణాల నిల్వ ఉన్నప్పటికీ రెండు షోకేసుల్లో ఉన్న ఆభరణాలను మాత్రమే దొంగలు ఎత్తుకెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.