godavari tribunal
-
పోలవరం విద్యుత్ కేంద్రం.. ఓ దిష్టిబొమ్మే!
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకే కూటమి ప్రభుత్వం కుదించడంతో 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రం ప్రశ్నార్ధకంగా మారింది. ఏడాది పొడవునా కారు చౌకగా విద్యుత్తునందించే ఈ కేంద్రం ఇప్పుడు దిష్టిబొమ్మలా మారనుంది. దీనివల్ల ప్రజలు చౌక విద్యుత్‌ను కోల్పోయి, ఈమేరకు విద్యుత్‌ను బయట కొనుగోలు చేస్తే ప్రజలపై చార్జీల భారం పడుతుందని, పారిశ్రామికాభివృద్ధికి విఘాతం కలిగి, ఉపాధి అవకాశాలూ దెబ్బ తింటాయని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. గోదావరి ట్రిబ్యునల్ ఆమోదించిన డిజైన్ ప్రకారం 45.72 మీటర్ల ఎత్తులో పోలవరం ప్రాజెక్టు నిర్మించి, 194.6 టీఎంసీల నీటిని నిల్వ చేస్తే హిమాలయ నదులపై ఉన్న విద్యుత్ కేంద్రాల తరహాలో ఇక్కడి జల విద్యుత్ కేంద్రంలోనూ కరెంటు ఉత్పత్తి చేయవచ్చని నిపుణులు అంచనా వేశారు. రాష్ట్ర అభివృద్ధిలో అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు ఎత్తును కేవలం 41.15 మీటర్లకే కుదించడం ద్వారా చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రాజెక్టు లక్ష్యాలన్నింటికీ గండి కొట్టేసింది. కేవలం ఓ బ్యారేజ్‌గా మార్చేస్తోంది. దీనివల్ల ‘హెడ్’ తగ్గిపోయి జల విద్యుదుత్పత్తికి విఘాతం కలుగుతుందని నిపుణులు తేల్చిచెబుతున్నారు. గోదావరికి భారీగా వరద వచ్చే రోజుల్లో మాత్రమే అదీ.. అరకొరగా విద్యుదుత్పత్తికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. బాబు కమీషన్ల కక్కుర్తితో ఖజానాపై రూ.4,124.64 కోట్ల భారంవిభజన నేపథ్యంలో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది. 960 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రంతో సహా పోలవరం ప్రాజెక్టును పూర్తిగా తామే నిర్మించి ఇస్తామని విభజన చట్టం ద్వారా కేంద్రం హామీ ఇచ్చింది. ఇందులో పోలవరం జల విద్యుత్ కేంద్రం అంచనా వ్యయం రూ.4,124.64 కోట్లు. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు.. కమీషన్ల కక్కుర్తితో 2016, సెప్టెంబరు 7న ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టి పోలవరం నిర్మాణ బాధ్యతలను దక్కించుకుంది. దీంతో పోలవరం జల విద్యుత్కేంద్రం నిర్మాణ వ్యయాన్ని ఇవ్వబోమని కేంద్రం చెబితే.. దానికీ చంద్రబాబు అంగీకరించారు. తద్వారా రాష్ట్ర ఖజానాపై రూ.4,124.64 కోట్ల భారాన్ని చంద్రబాబు మోపారు.రివర్స్ టెండరింగ్‌తో రూ.560 కోట్లు ఆదాపోలవరం జల విద్యుత్ కేంద్రం టెండర్లను ‘ఈనాడు’ రామోజీరావు వియ్యంకుడికి చెందిన నవయుగకు 4.8 శాతం అధిక ధరకు 2018లో చంద్రబాబు ప్రభుత్వం కట్టబెట్టింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అక్రమంగా కట్టబెట్టిన ఆ కాంట్రాక్టును రద్దు చేశారు.టీడీపీ సర్కారు నిర్ణయించిన కాంట్రాక్టు విలువనే రూ.3216.11 కోట్లు అంచనా వ్యయంగా నిర్ధారించి 2019లో అప్పటి సీఎం వైఎస్ జగన్ రివర్స్ టెండర్ నిర్వహించారు. దీని ద్వారా 12.6 శాతం తక్కువ ధరకు పనులు చేసేందుకు మేఘా సంస్థ ముందుకొచ్చింది. దాంతో ఖజానాకు రూ.550 కోట్లు ఆదా అయ్యాయి. ఆ తర్వాత పోలవరం జలవిద్యుత్ కేంద్రం పనులను పరుగులెత్తించారు. ప్రెజర్ టన్నెళ్లతో సహా కీలకమైన పనులు 2024 మే నాటికే పూర్తయ్యాయి.గోదావరి సిగలో కలికితురాయిని దిష్టిబొమ్మగా మార్చేశారుపోలవరం ప్రధాన డ్యాంకు ఎడమ వైపున ఒక్కోటి 80 మెగావాట్ల చొప్పున 12 యూనిట్లతో మొత్తం 960 మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రాజెక్టులో 35.52 మీటర్ల స్థాయి నుంచి విద్యుదుత్పత్తి చేసేలా టర్బైన్లను అమర్చుతారు. 12 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తికి 1,40,291.04 క్యూసెక్కులు అవసరం. ప్రాజెక్టులో గరిష్ట స్థాయిలో అంటే 45.72 మీటర్ల స్థాయిలో 194.6 టీఎంసీల నీరు నిల్వ ఉంటేనే హెడ్ పెరుగుతుంది. అప్పుడే ఏడాది పొడవునా విద్యుదుత్పత్తి చేయవచ్చు. అందుకే ఈ విద్యుత్ కేంద్రాన్ని గోదావరి సిగలో కలికితురాయిగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు కుదించడం వల్ల విద్యుదుత్పత్తి జరగదని, ఈ విద్యుత్ కేంద్రాన్ని దిష్టిబొమ్మగా మార్చేశారని విద్యుత్ రంగ నిపుణులు మండిపడుతున్నారు. -
కావేరికి గోదావరి.. ఇచ్ఛంపల్లి నుంచి లేనట్లే!
సాక్షి, అమరావతి : గోదావరి ట్రిబ్యునల్ అవార్డు.. ఛత్తీస్‌గఢ్ అభ్యంతరాల నేపథ్యంలో ఇచ్ఛంపల్లి నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలన్న ప్రతిపాదనను జాతీయ జలవనరుల అభివృద్ధి (ఎన్‌డబ్ల్యూడీఏ) సంస్థ పునఃసమీక్షిస్తోంది. ఇచ్ఛంపల్లికి దిగువన సమ్మక్క బ్యారేజ్, కంతనపల్లి, పోలవరం ప్రాజెక్టుల నుంచి కావేరికి గోదావరి జలాలను తరలించడంపై తాజాగా అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఇచ్ఛంపల్లి నుంచి 141.3 టీఎంసీల గోదావరి జలాలను కావేరికి తరలించేలా రెండున్నరేళ్ల క్రితం ప్రతిపాదించిన ఎన్‌డబ్ల్యూడీఏ.. పరీవాహక ప్రాంతం (బేసిన్) పరిధిలోని రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపింది. కానీ, ఇచ్ఛంపల్లి నుంచి 85 టీఎంసీలను మించి ఉమ్మడి రాష్ట్రం వాడుకోవడానికి వీల్లేదని 1975, డిసెంబర్ 19న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి మధ్యప్రదేశ్, మహారాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇదే అంశాన్ని గోదావరి ట్రిబ్యునల్ అవార్డు స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో.. ఇచ్ఛంపల్లి నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపడితే న్యాయపరమైన ఇబ్బందులు వస్తాయని న్యాయనిపుణులు స్పష్టంచేస్తున్నారు.ఛత్తీస్‌గఢ్ అభ్యంతరాలు..ఇచ్ఛంపల్లి వద్ద 118 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణానికి గోదావరి ట్రిబ్యునల్ అనుమతిచ్చింది. ఆ తర్వాత మహారాష్ట్ర, ఉమ్మడి మధ్యప్రదేశ్ అభ్యంతరాలతో ఇచ్ఛంపల్లి బ్యారేజ్ ఎత్తును 108 మీటర్లకు 1986–88లో తగ్గించారు. నదుల అనుసంధానంలో భాగంగా ఇచ్ఛంపల్లి బ్యారేజ్ ఎత్తును 87 మీటర్లకు ఎన్‌డబ్ల్యూడీఏ తగ్గించింది. బ్యారేజ్ ఎత్తును 87 మీటర్లకు తగ్గించినా ఛత్తీస్‌గఢ్‌లో నాలుగు గ్రామాలు ముంపునకు గురవుతాయి. దీనిపై ఛత్తీస్‌గఢ్ అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. నదుల అనుసంధానంలో భాగంగా గోదావరి బేసిన్లో ఇంద్రావతి సబ్ బేసిన్‌లోని తమ కోటాలో వాడుకోని జలాలను కావేరికి ఎలా తరలిస్తారని ఎన్‌డబ్ల్యూడీఏని నిలదీసింది. కాదూ కూడదని తరలిస్తే న్యాయపోరాటం చేస్తామని తేల్చిచెప్పింది.దిగువన కట్టాలని తెలంగాణ ప్రతిపాదన..ఇక ఇచ్ఛంపల్లికి 24 కిమీల దిగువన తెలంగాణ సర్కార్ ఇప్పటికే గోదావరిపై సమ్మక్క బ్యారేజ్‌ను నిర్మించింది. గోదావరిపై ఇచ్ఛంపల్లి వద్ద బ్యారేజ్ నిర్మిస్తే.. గరిష్ఠంగా వరద వచ్చినప్పుడు ఆకస్మికంగా దిగువకు విడుదల చేస్తే సమ్మక్క బ్యారేజ్‌కు ప్రమాదం వాటిల్లే అవకాశముందని తెలంగాణ సర్కార్ ఆందోళన వ్యక్తంచేసింది. ఇచ్ఛంపల్లి నుంచి కాకుండా సమ్మక్క బ్యారేజ్ లేదా కంతనపల్లి నుంచి గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని విజ్ఞప్తి చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ సర్కార్ పోలవరం నుంచి అనుసంధానం చేపట్టాలని సూచించింది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సర్కార్ల అభ్యంతరాలతో ఇచ్ఛంపల్లి నుంచి కావేరికి గోదావరి తరలింపుపై ఎన్‌డబ్ల్యూడీఏ పునరాలోచనలో పడింది. -
గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటుకు కసరత్తు
సాక్షి, అమరావతి: గోదావరి నదీ జల వివాదాల ట్రిబ్యునల్ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి రాష్ట్ర పరిధిలో గోదావరిలో నీటి లభ్యతను తేల్చి.. జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి అంతరాష్ట్ర నదీ జల వివాదాల (ఐఎస్ఆర్ డబ్ల్యూడీ) చట్టం–1956లో సెక్షన్–3 ప్రకారం ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని నవంబర్ 6న కేంద్ర జల్‌శక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై కేంద్ర న్యాయశాఖ అభిప్రాయాన్ని కేంద్ర జల్‌శక్తి శాఖ కోరింది. న్యాయశాఖ అభిప్రాయం ఆధారంగా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్ర జల్‌శక్తి నిర్ణయం తీసుకుంటుందని అధికారవర్గాలు వెల్లడించాయి. గోదావరి ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను ఇప్పటిదాకా రెండు రాష్ట్రాలకు కేటాయించలేదు. నీటి వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య అవగాహన ఒప్పందం కూడా కుదరలేదు. కానీ.. జీడబ్ల్యూడీటీ అవార్డు, విభజన చట్టాన్ని తుంగలో తొక్కి తెలంగాణ సర్కార్ 714.13 టీఎంసీలు వినియోగించుకోవడానికి అక్రమంగా ఏడు ప్రాజెక్టులను నిర్మిస్తోందని.. దీని వల్ల రాష్ట్ర హక్కులకు విఘాతం కలుగుతుందని అనేకసార్లు కేంద్ర జల్‌శక్తి శాఖ దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లింది. కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ 2020, అక్టోబర్ 6న నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్ ఎత్తిచూపారు. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడానికి ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. కొత్త ట్రిబ్యునల్ కోసం ప్రతిపాదన పంపితే న్యాయసలహా తీసుకుని నిర్ణయం తీసుకుంటామని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అప్పట్లో హామీ ఇచ్చారు. -
నదుల అనుసంధానానికి ట్రిబ్యునళ్ల అవార్డులే అడ్డంకి!
సాక్షి, అమరావతి: కడలిపాలవుతోన్న నదీ జలాలను.. నీటి కొరత ఉన్న నదులకు మళ్లించడం ద్వారా దేశంలో కరవు పరిస్థితులను రూపుమాపవచ్చుననే లక్ష్యంతో చేపట్టిన నదుల అనుసంధానానికి నదీ జల వివాదాల ట్రిబ్యునళ్ల అవార్డులే ప్రతిబంధకంగా మారాయని కేంద్రానికి జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ(ఎన్‌డబ్ల్యూడీఏ) నివేదించింది. ట్రిబ్యునళ్ల అవార్డులను చూపి.. నదీ పరీవాహక ప్రాంతాల(బేసిన్)లోని రాష్ట్రాలు వాటా కోసం పట్టుబడుతున్నాయని పేర్కొంది. నదుల అనుసంధానానికి వాటి బేసిన్ల పరిధిలోని రాష్ట్రాలతో పలుమార్లు సంప్రదింపులు జరిపినా ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో కెన్–బెటా్వమినహా మిగతా అనుసంధానాలు ప్రతిపాదన దశను దాటడం లేదని వివరించింది. ఈ అంశంలో విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని కోరుతూ కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌కు ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్ సింగ్ ఇటీవల నివేదిక ఇచ్చారు. దేశంలో హిమాలయ నదుల అనుసంధానానికి 14.. ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడానికి 16 లింక్‌లను ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదించింది. నదుల అనుసంధానాన్ని వేగవంతం చేయడానికి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి అధ్యక్షతన అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, కార్యదర్శులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. నదుల అనుసంధానంపై బేసిన్ల పరిధిలోని రాష్ట్రాలను ఒప్పించేందుకు సంప్రదింపులు జరుపుతోంది. కాగా, పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించే 80 టీఎంసీల గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో మహారాష్ట్ర 14, కర్ణాటక 21 టీఎంసీలను అదనంగా వాడుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. మిగతా 45 టీఎంసీలను నాగార్జునసాగర్‌కు ఎగువన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలను అదనంగా వాడుకోవడానికి అనుమతి ఇచ్చింది. కావేరి, కృష్ణా జల వివాదాల పరిష్కారానికి ఏర్పాటైన ట్రిబ్యునళ్లు కూడా ఇదే రీతిలో నిర్ణయాలను ప్రకటించాయి. ఇప్పుడు ఆ ట్రిబ్యునళ్ల అవార్డులను చూపుతున్న రాష్ట్రాలు.. నదుల అనుసంధానం ద్వారా మళ్లించే నీటిలో అదనపు వాటా కోసం పట్టుబడుతున్నాయి. గోదావరి–కావేరి అనుసంధానం తొలి దశలో 141 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా(నాగార్జునసాగర్), పెన్నా(సోమశిల) మీదుగా కావేరికి తరలించేందుకు ఎన్‌డబ్ల్యూడీఏ ప్రతిపాదన అమలు చేస్తే.. కృష్ణా జలాల్లో అదనపు వాటా కావాలంటూ మహారాష్ట్ర, కర్ణాటకలు పట్టుబడుతున్నాయి. కావేరికి మళ్లించే గోదావరి జలాలకుగానూ కావేరి జలాల్లో అదనపు వాటా ఇవ్వాలంటూ కర్ణాటక, కేరళ డిమాండ్ చేస్తున్నాయి. దాంతో ఈ అనుసంధానంపై ఏకాభిప్రాయం సవాల్‌గా మారింది. విధానపరమైన నిర్ణయం తీసుకుంటేనే..: నీటి లభ్యత అధికంగా ఉన్న నదుల నుంచి నీటి కొరత తీవ్రంగా ఉన్న నదులకు మళ్లించే నీటి విషయంలో రాష్ట్రాలతో సంప్రదించి, కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకుంటేనే నదుల అనుసంధానం పట్టాలెక్కే అవకాశం ఉందని ఎన్డబ్ల్యూడీఏనే స్పష్టం చేస్తోంది. ఒక నది నుంచి మళ్లించిన నీటికిగానూ.. మరొక నదిలో అదనపు వాటా వాడుకోవడానికి ట్రిబ్యునళ్లు ఇచ్చిన అనుమతిని నదుల అనుసంధానానికి మినహాయిస్తేనే నదుల అనుసంధానం సాకారమవుతుందని సాగునీటిరంగ నిపుణులు తేల్చిచెబుతున్నారు. -
ట్రిబ్యునల్ అవార్డు ప్రకారమే పోలవరం నిర్మాణం
సాక్షి, అమరావతి: గోదావరి ట్రిబ్యునల్ అవార్డు (జీడబ్ల్యూడీటీ) ప్రకారమే పోలవరం ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోందని కేంద్రం స్పష్టం చేసింది. జీడబ్ల్యూడీటీ అవార్డుకు విరుద్ధంగా పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నారన్న తెలంగాణ, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల వాదనలను తోసిపుచ్చింది. పోలవరం ప్రాజెక్టు కట్టక ముందు వెనుక భాగంలో వరద నీటి మట్టం ఎంత ఉంటుందో, ప్రాజెక్టు పూర్తయ్యాక కూడా అంతే ఉంటుందని తేల్చి చెప్పింది. బ్యాక్ వాటర్‌పై అధ్యయనం చేశాకే ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చినట్లు గుర్తు చేసింది. ముంపు ప్రభావంపై సాంకేతికంగా వాస్తవాలను వివరించి, ప్రభావిత రాష్ట్రాల అనుమానాలను నివృత్తి చేయడానికి ఈనెల 7న ఢిల్లీలో ఏపీ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ ఈఎన్సీలతో సమావేశం నిర్వహించాలని సీడబ్ల్యూసీని ఆదేశించింది. ఈ సమావేశంలో వెల్లడైన అంశాల ఆధారంగా ఇచ్చిన నివేదికను సుప్రీం కోర్టుకు నివేదిస్తామని వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల సమస్యపై ప్రభావిత రాష్ట్రాలతో నెలాఖరులోగా చర్చించి నివేదిక ఇవ్వాలని ఈనెల 6న కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. దాంతో గురువారం ఏపీ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు (సీఎస్‌లు), పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధికారులు, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శులతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి రామేశ్వర్ గుప్తా వర్చువల్‌గా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ అధికారి శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, పోలవరం సీఈ సుధాకర్‌బాబు, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్‌ల అధికారులు పాల్గొన్నారు. మూడు రాష్ట్రాల ఒప్పందం మేరకే.. పోలవరం నిర్మాణానికి అంగీకరిస్తూ 1978 ఆగస్టు 7న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి మధ్యప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరిందని, దీనిని జీడబ్ల్యూడీటీ ఆమోదించిందని ఏపీ అధికారులు గుర్తు చేశారు. దాని ప్రకారమే ప్రాజెక్టు నిర్మిస్తున్నామన్నారు. గోదావరికి వందేళ్లలో గరిష్టంగా 28.5 లక్షల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చిందని, అదే స్థాయిలో పోలవరం స్పిల్ వే నిర్మిస్తే సరిపోతుందన్నారు. గోదావరికి 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు వదిలేసేలా స్పిల్ వే డిజైన్‌ను సీడబ్ల్యూసీ డిజైన్‌ను ఆమోదించిందన్నారు. ఆ డిజైన్ ప్రకారమే కేంద్రం అటవీ, పర్యావరణ సహా అన్ని అనుమతులను 2009 నాటికే ఇచ్చిందని.. ఆ మేరకే ప్రాజెక్టు నిర్మిస్తున్నామని స్పష్టంచేశారు. ఒడిశా, చత్తీస్‌గఢ్‌లలో ముంపు నివారణకు సీలేరు, శబరి నదులకు కరకట్టల నిర్మాణానికి ఆ ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని వందల సార్లు ఆ రాష్ట్రాలకు లేఖలు రాశామని, అయినా స్పందన లేదని చెప్పారు. ఈ కరకట్టల నిర్మాణానికి మార్గం సుగమం చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ అధ్యయనమే ప్రామాణికం పోలవరం ప్రాజెక్టు డిజైన్ మారిన నేపథ్యంలో పర్యావరణ అనుమతిని పునఃసమీక్షించే వరకు పనులు నిలిపివేయాలని ఒడిశా, చత్తీస్‌గఢ్ కోరడంపై సీడబ్ల్యూసీ సభ్యుడు కుశ్వీందర్ వోహ్రా, పీపీఏ సీఈవో చంద్రశేఖర్ అయ్యర్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. డిజైన్ ఏమాత్రం మారలేదని స్పష్టం చేశారు. బ్యాక్ వాటర్ ప్రభావంపై హైదరాబాద్ ఐఐటీ చేసిన అధ్యయనంలో భద్రాచలం, మణుగూరు భారజల కర్మాగరం, భద్రాద్రి విద్యుత్కేంద్రం, గ్రామాలు ముంపునకు గురవుతాయని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ చెప్పారు. దీనిపై ఏపీ అధికారులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. జాతీయ స్థాయిలో సీడబ్ల్యూసీ అత్యున్నత సంస్థ అని, అది చేసిన బ్యాక్ వాటర్ సర్వేనే ప్రామాణికమని స్పష్టంచేశారు. బ్యాక్ వాటర్‌తో ముంపు ఉండదని సీడబ్ల్యూసీ అధ్యయనంలో తేల్చిందని చెప్పారు. గోదావరికి గరిష్ఠంగా 58 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని, దాన్ని పరిగణలోకి తీసుకుని బ్యాక్ వాటర్ ప్రభావంపై థర్ట్ పార్టీతో అధ్యయనం చేయించాలని తెలంగాణ కోరగా, ఆ స్థాయిలో గోదావరికి వరద వచ్చే అవకాశమే లేదని ఏపీ అధికారులు తేల్చిచెప్పారు. పోలవరం ప్రాజెక్టులో ఈ ఏడాది నీటిని నిల్వ చేయడం వల్ల శబరి, సీలేరు ద్వారా వరద ఎగదన్ని తమ ప్రాంతం ముంపునకు గురైందన్న ఒడిశా వాదనను పీపీఏ సీఈవో కొట్టిపారేశారు. ఈ ఏడాది ప్రాజెక్టులో నీటినే నిల్వ చేయలేదని, అందువల్ల వరద ఎగదన్నిందని చెప్పడం సబబు కాదని అన్నారు. ఈ ఏడాది వరదలకు తమ రాష్ట్రాంలోనూ గిరిజన ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని చత్తీస్‌గఢ్ అధికారులు చెప్పగా.. ఇంద్రావతి వరదల వల్లే ఆ ప్రాంతం ముంపునకు గురైందని సీడబ్ల్యూసీ అధికారులు తేల్చిచెప్పారు. -
మూడు అంశాలే ప్రామాణికం!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 అమల్లోకి వచ్చిన తేదీ నాటికి ఉమ్మడి రాష్ట్రంలో పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ప్రాతిపదికన గోదావరి జలాల పంపిణీకి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నీటి లభ్యత 75 శాతం కంటే అధికంగా ఉన్న మిగులు జలాలపై పూర్తి అధికారాన్ని దిగువ రాష్ట్రానికే బచావత్ ట్రిబ్యునల్ కట్టబెట్టడాన్ని ప్రస్తావించనుంది. విభజన నేపథ్యంలో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కే మిగులు జలాలపై పూర్తి హక్కులు కల్పించడాన్ని కూడా గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటుకు ప్రాతిపదికగా తీసుకోవాలని కోరాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య గోదావరి, కృష్ణా నదీ జలాల వినియోగంలో తలెత్తిన విభేదాలను పరిష్కరించేందుకు ఈనెల 6న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశాన్ని నిర్వహించిన విషయం విదితమే. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం(ఐఆర్డబ్ల్యూడీఏ)–1956 ప్రకారం ప్రతిపాదనలు పంపితే గోదావరి జలాల పంపిణీకి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని షెకావత్ పేర్కొన్నారు. ఇందుకు ఏపీ, తెలంగాణ సీఎంలు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కె.చంద్రశేఖరరావు అంగీకరించారు. సీఎంల ఒప్పందాలే ప్రాతిపదికగా.. దేశవ్యాప్తంగా నదీ జలాల వివాదాలను పరిష్కరించి పరీవాహక ప్రాంతాలకు నీటిని కేటాయించేందుకు 1969 ఏప్రిల్ 10న ఆర్ఎస్ బచావత్ నేతృత్వంలో డీఎం బండారీ, డీఎం సేన్ సభ్యులుగా ట్రిబ్యునల్ ఏర్పాటైంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చేసుకున్న ఒప్పందాలు ప్రాతిపదికగా బచావత్ ట్రిబ్యునల్ గోదావరి జలాలను పంపిణీ చేసింది. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు 1,430 టీఎంసీల నికర జలాలను కేటాయిస్తూ 1980లో ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పర్ గోదావరి(జీ–1) నుంచి శబరి(జీ–12) వరకు నదీ పరీవాహక ప్రాంతాన్ని 12 ఉప పరీవాహక ప్రాంతాలుగా ట్రిబ్యునల్ విభజించింది. ప్రతి ఉప పరీవాహక ప్రాంతంలో రాష్ట్రాలకు కేటాయించగా మిగులుగా ఉన్న నికర జలాలను వినియోగించుకునే వెసులుబాటును దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు కట్టబెట్టింది. 75 శాతం కంటే అధికంగా నీటి లభ్యత ఉన్న మిగులు జలాలపై పూర్తి హక్కును ఆంధ్రప్రదేశ్‌కే కలి్పంచింది. 25 ఏళ్ల పాటు ఈ తీర్పు అమల్లో ఉంటుందని, ఆ తర్వాత సమీక్షించుకోవచ్చని సూచించింది. రెండో జీడబ్ల్యూడీటీ తెరపైకి.. అపెక్స్ కౌన్సిల్ రెండో భేటీలో తీసుకున్న నిర్ణయంతో జీడబ్ల్యూడీటీ–2 తెరపైకి వచ్చింది. జీడబ్ల్యూడీటీ–2 ఏర్పాటుకు ప్రాతిపదికగా తీసుకోవాల్సిన అంశాలపై కేంద్రానికి మూడు ప్రతిపాదనలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ ప్రతిపాదనలు ఇవీ.. ► ఉమ్మడి రాష్ట్రం విడిపోయే నాటికి అంటే 2014 జూన్ 2 నాటికి గోదావరి జలాల్లో 660 టీఎంసీలను వినియోగించుకునేందుకు ఆంధ్రప్రదేశ్, 472 టీఎంసీలు వినియోగించుకోవడానికి తెలంగాణ ప్రాజెక్టులను పూర్తి చేశాయి. మరో 116 టీఎంసీలను వాడుకునే సామర్థ్యంతో ఆంధ్రప్రదేశ్, 178 టీఎంసీలు ఉపయోగించుకునేలా తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. అంటే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు 776, తెలంగాణకు 650 వెరసి 1,426 టీఎంసీలను కేటాయించాలి. ► బచావత్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల మేరకు జీ–1 నుంచి జీ–12 వరకు పరీవాహక రాష్ట్రాలకు కేటాయించగా మిగులుగా ఉన్న నికర జలాలను దిగువ రాష్ట్రమైన ఏపీకే కేటాయించాలి. ► 75 శాతం కంటే నీటి లభ్యత అధికంగా ఉండే మిగులు జలాలపై పూర్తి అధికారాన్ని బచావత్ ట్రిబ్యునల్ దిగువ రాష్ట్రమైన ఏపీకే ఇచ్చింది. ఆ మేరకు నీటి కేటాయింపులు చేస్తే, జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదించిన మేరకు నదుల అనుసంధానం ప్రాజెక్టు పనులు చేపడతాం. -
ముడుపుల యావ తప్ప ముందుచూపేదీ?
గోదావరి ట్రిబ్యునల్ నిబంధనలు పట్టని సీఎం సాక్షి, హైదరాబాద్: గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం జరిగితే బేసిన్ మారుతుంది కనుక గోదావరి ట్రిబ్యునల్ ఎగువ రాష్ట్రాలకు అదనంగా కొన్ని హక్కులు కల్పించింది. 7 (ఇ), 7 (ఎఫ్) క్లాజుల ప్రకారం ఆ హక్కులు సంక్రమిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలోని 13 జిల్లాలకు తాగు, సాగునీరు అందించడానికి అవకాశం ఉంటుంది. కృష్ణా డెల్టాకు, రాయలసీమకు నమ్మకంగా నీరందించవచ్చు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యుసీ) అనుమతి మంజూరైన మరుక్షణం కృష్ణాజలాల్లో కర్ణాటక, మహారాష్ర్టకు 35 టీఎంసీల నీటిని వాడుకునే స్వేచ్ఛ ఉంటుంది. అందుకే ప్రాజెక్టు అనుమతుల కంటే ముందుగానే కాల్వల పనులను శరవేగంగా పూర్తిచేయడానికి, అనుమతులు రాగానే పోలవరం ప్రాజెక్టును కూడా వేగంగా పూర్తి చేయడానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాధాన్యమిచ్చారు. 190 టీఎంసీల నీటిని నిల్వ చేసుకుని ఉపయోగించుకోవడానికి వీలు కల్పించే పోలవరం వంటి భారీ ప్రాజెక్టు వల్ల 35 టీఎంసీల నీటిని ఎగువ రాష్ట్రాలకు కోల్పోయినా పరవాలేదు కానీ.. పట్టిసీమ వంటి 4 టీఎంసీల పిల్ల ప్రాజెక్టుతో ఇపుడు 35 టీఎంసీల నీటిని కోల్పోయే ప్రమాదమేర్పడడమే విచారకర అంశం. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనాలోచిత నిర్ణయ ఫలితమేనని సాగునీటి రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ముడుపుల యావలో రాష్ట్రానికి జరుగుతున్న ఈ నష్టాన్ని చంద్రబాబు పట్టించుకోకుండా వదిలేశారని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శిస్తున్నారు. వైఎస్ ముందుచూపు వల్లే వేగంగా కుడికాల్వ పనులు కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) అనుమతి మంజూరైన మరుక్షణం కృష్ణా జలాల్లో 35 టీఎంసీల నీటిని వాడుకొనే స్వేచ్ఛ ఎగువ రాష్ట్రాలకు దక్కుతుందనే నిబంధన దృష్ట్యా.. అనుమతి వచ్చిన వెంటనే పనులు ముమ్మరం చేసి ఆఘమేఘాల మీద పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలి. లేదంటే కృష్ణా జలాల్లో ఎగువ రాష్ట్రాలు 35 టీఎంసీలు వాడుకుంటే.. ఏపీ తీవ్రంగా నష్టపోతుంది. అందుకే ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాకముందే కుడికాల్వ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి భావించారు. పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా దక్కిన నేపథ్యంలో.. ప్రాజెక్టు పూర్తిచేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం.. అందుకు భిన్నంగా పట్టిసీమ లిఫ్ట్ ద్వారా కుడికాల్వకు నీరు మళ్లించడానికి పూనుకొంది. రెండు నదుల్లోనూ ఒకేసారి వరద.. నిల్వకు లేని అవకాశం ‘ఇటు గోదావరి, అటు కృష్ణా.. రెండు నదుల్లోనూ దాదాపు ఒకే సమయంలో వరదలు ఉంటాయి. కృష్ణాలో వరద నీరు ప్రవహిస్తున్నప్పుడు గోదావరి నుంచి నీళ్లు మళ్లించడంలో అర్థం లేదు. కృష్ణాలో వరద లేనప్పుడు గోదావరిలో కూడా ప్రవాహం పెద్దగా ఉండదు. ఫలితంగా లిఫ్ట్ చేయడం సాధ్యం కాదు. కుడికాల్వకు నీళ్లు మళ్లించిన తర్వాత.. నీటిని నిల్వ చేయడానికి ఎక్కడా అవకాశం లేదు. కృష్ణా డెల్టాలో నీరు అవసరం ఉన్నప్పుడే, అవసరం ఉన్నంత మేరకే గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు గోదావరిలో ప్రవాహం ఉండే అవకాశం లేనందున, కృష్ణా డెల్టాకు నీళ్లివ్వడం సాధ్యం కాదు. అంటే.. లిఫ్ట్ వల్ల కృష్ణా డెల్టాకు అదనంగా వచ్చే ప్రయోజనం పెద్దగా ఉండదని నిపుణులు చెబుతున్నారు. గోదావరి ట్రిబ్యునల్ తీర్పును అడ్డం పెట్టుకొని.. ఎగువ రాష్ట్రాలు వాటా కోసం పట్టుబడితే.. కృష్ణా జలాల్లో మనకు ఉన్న నికర జలాల నుంచి 35 టీఎంసీల నీటిని కోల్పోవాల్సి ఉంటుంది. అదే జరిగితే.. రాష్ట్రానికి, ప్రత్యేకించి రాయలసీమ, కృష్ణా డెల్టాకు తీవ్ర నష్టం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 7(ఇ) క్లాజ్: ‘పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) అనుమతి వచ్చిన వెంటనే, కుడికాల్వకువాస్తవంగా నీటిని ఎప్పుడు మళ్లిస్తారనే విషయంలో నిమిత్తం లేకుండా, కృష్ణా జలాల్లో ఏపీకి ఉన్న కేటాయింపుల్లో 35 టీఎంసీల నీటిని వాడుకొనే స్వేచ్ఛ కర్ణాటక,మహారాష్ట్రకు ఉంటుంది. 7(ఎఫ్)క్లాజ్: 80 టీఎంసీల కంటే ఎక్కువ నీటిని కుడికాల్వకుమళ్లిస్తే.. ఆ నీటిలోనూ ఎగువ రాష్ట్రాలకు అదే దామాషాలో వాటా ఉంటుంది.