ఆంధ బాలల చితకబాదిన ఘటనపై కమిషన్ సీరియస్!
న్యూఢిల్లీ: కాకినాడ గ్రీన్ఫీల్డ్ ఘటనపై జాతీయ మానవహక్కుల సంఘం మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. సామర్లకోట మండలం అచ్చంపేట జంక్షన్ సమీపంలోని గ్రీన్ఫీల్డ్ అంధుల పాఠశాలలో పిల్లలను కరస్పాండెంట్, ప్రిన్సిపాల్లు చితకబాదిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిల్లా కలెక్టర్, 6 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. బాలల హక్కుల ఉల్లంఘనేనని ఈ ఘటనపై మానవహక్కుల సంఘం వ్యాఖ్యలు చేసింది.
అల్లరి చేస్తున్నారన్న నెపంతో కరస్పాండెంట్ కేవీ రావు, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఆ ముగ్గురినీ ఈ నెల 18న నిర్దాక్షిణ్యంగా చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘాతుకాన్ని ఓ వ్యక్తి రహస్యంగా సెల్ఫోన్లో చిత్రీకరించిన దృశ్యాలు సోమవారం సాక్షి టెలివిజన్ చానళ్ తోపాటు ప్రసారం కావడంతో అందరూ నివ్వెరపోయారు.