grivence cell
-
సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్‌సెల్
పర్లాకిమిడి : సమస్యలు పరిష్కరిచేందుకే గ్రీవెన్స్‌సెల్ నిర్వహిస్తున్నామని కలెక్టర్ అనుపమ సాహా అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారుల ఆధ్యర్యంలో సోమవారం గీవెన్స్‌సెల్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి సమస్యను నిశితంగా పరిశీలించి ఆయా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. జిల్లాలోని గుసానినువగాం, పర్లాకిమిడి తహసీల్దార్ పరిధిలోని పలు గ్రామాల నుంచి వినతులు అందినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యల గురించి మొత్తం 77 వినతులు అందాయని, వీటిలో వ్యక్తిగత ఫిర్యాదులకు సంబంధించి 58, ఇతర ఫిర్యాదులకు సంబంధించి 18 వినతులు వచ్చాయని వివరించారు. వీటిల్లో ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు ఇద్దరు వ్యక్తులు దరఖాస్తు చేసుకోగా, రెడ్‌క్రాస్ సహాయం కోసం మరొకరు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. పీఎఫ్ ఖాతాపై ఫిర్యాదు అలాగే స్థానిక మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల నుంచి పీఎఫ్ (ప్రావిడెంట్ ఫండ్) కోసం వసూలు చేసిన సొమ్ము తమ ఖాతాలో జమ చేయలేదంటూ భువనేశ్వర్‌కు చెందిన అభిరాం కేర్ టేకింగ్ అండ్ ఎక్స్పర్ట్ సర్వీసస్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్‌పై ఫిర్యాదు నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో పాటు భవననిర్మాణంలో క్షతగాత్రుడైన స్థానిక ఎస్పీ వీధికి చెందిన ఎస్.చంద్రశేఖర్‌కు ప్రకటించిన ఆర్థికసాయం రూ.4లక్షలు ఇంతవరకు అందలేదన్నట్లు ఒక ఫిర్యాదు అందిందని అధికారులు తెలిపారు. గ్రీవెన్స్‌సెల్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుపమ సాహాతో పాటు సబ్‌కలెక్టర్ వీరేంద్ర కొరకొరా, తహసీల్దార్ కేదార్నాథ్ భయి, సీడీఎంఓ డాక్టర్ పాణిగ్రాహి, సబ్‌కలెక్టర్ రజనీకుమార్ స్వంయి, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ప్రజల వద్దకే కలెక్టర్
గుంటూరు వెస్ట్, గుంటూరు: ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని, అక్కడిక్కడే పరిష్కరించే అవకాశమున్న ‘గ్రీవెన్స్’ కార్యక్రమమంటే తనకెంతో ఇష్టమని కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. సోమవారం స్థానిక జెడ్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏ ఒక్కరూ అసంతృప్తిగా వెనుతిరిగినా అధికారాలకు అర్థమే లేదన్నారు. గ్రీవెన్స్‌ను మరింత మెరుగుపరిచేలా కృషి చేస్తామని చెప్పారు. అనంతరం ప్రత్తిపాడు మండలం కోండ్రుపాడు గ్రామానికి చెందిన వికలాంగురాలైన ఇవాంజిలికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక చేయూనందించారు. క్యాన్సర్ బాధితునికి ఇంటి స్థలం మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 350 మంది ఫిర్యాదుదారులను స్వయంగా పరిశీలించారు. కార్యక్రమంలో జేసీ ఏఎండీ ఇంతియాజ్, డీఆర్వో నాగబాబు, జెడ్పీ సీఈవో జే అరుణ తదితరులు పాల్గొన్నారు. ఇంకెన్నాళ్లు.. మండల కేంద్రంలో ఎన్ని సార్లు అర్జీలు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో ప్రజలు జిల్లా కేంద్రాలకు తరలి వస్తున్నారు. ప్రతి వారం జిల్లా గ్రీవెన్స్‌కు వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. సోమవారం కూడా జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌కు భారీ సంఖ్యలో అభాగ్యులు తరలివచ్చారు. తమ సమస్యలను కలెక్టర్ కోన శశిధర్ వద్ద మొర పెట్టుకున్నారు. రూ. వందలు ఖర్చు పెట్టుకుని.. మండల కేంద్రంలో పలుమార్లు అర్జీలు పెట్టుకున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదంటూ జిల్లా కేంద్రానికి వస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. అ«ధికారులు పట్టించుకోక పోవడంతో కలెక్టర్‌కు విన్నవించుకుంటే అయినా సమస్యలు తీరుతాయనే రూ. వందలు ఖర్చు పెట్టుకుని వృద్ధులు, దివ్యాంగులు, రైతులు జిల్లా కేంద్రానికి వస్తున్నారు. ఉద్యోగ భద్రత లేదు మేమంతా దాదాపు 20 మంది సీఎం ఆరోగ్య కేంద్రాల కాంట్రాక్టు ఉద్యోగులం. ఎంతో కాలంగా గ్రామాల్లో తిరిగి పని చేసుకుంటున్నాం. నెలకు రూ.17 వేలు రావాల్సి ఉండగా రూ.6 వేలు ఇస్తున్నారు. మూడు నెలలుగా జీతాలు అందడం లేదు. ఇందులో తొమ్మిది మందే ఉండాలి. మిగతా వారు మానేయాలని చెబుతున్నారు. అలా జరిగితే రోడ్డున పడతాం. కలెక్టర్ దృష్టికి సమస్య తీసుకురావడంతో మాకు భరోసా ఇచ్చారు. – ఎం.శైలజ తదితరులు ఇళ్ల మధ్యలో సెల్ టవర్ మేమంతా ఏటీ ఆగ్రహారంలో నివసిస్తున్నాం. ఈ ప్రాంతంలో వహీదుల్లా అనే ప్రభుత్వ ఉద్యోగి తన ఇంటిపై సెల్ టవర్ నిర్మిస్తున్నాడు. ఎంత మంది చెబుతున్నా వినడంలేదు. అనుమతులు కూడా లేవు. రేడియేషన్ వల్ల అనారోగ్యం పాలవుతారని వైద్యులంటున్నారు. వెంటనే నిర్మాణాన్ని ఆపించాలి.– శ్రీనివాసరావు, తదితరులు -
సమస్యల బారులు..
హన్మకొండ : కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ప్రజలు పెద్ద ఎత్తున బారులుదీరారు. హరితహారం కార్యక్రమం కారణంగా గత రెండు వారాలు ప్రజావాణిని అధికారులు రద్దు చేశారు. దీంతో ఈ వారం ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి తమ సమస్యలతో కూడిన వినతిపత్రాలను అధికారులకు అందజేశారు. జిల్లా రెవెన్యూ అధికారి శోభ ప్రజలను నుంచి దరఖాస్తులను స్వీకరించారు. దాదాపు 450కిపైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.