గొడ్డలితో హెయిర్ కట్.. షాకింగ్ వీడియో!
సాధారణంగా హెయిర్ కట్ అంటే ఎలా చేస్తారు? కత్తెర, దువ్వెన పట్టుకుని చేస్తారు. అదే గుండు గీయాలంటే బ్లేడు ఉపయోగిస్తారు. అంతవరకు మాత్రమే మనకు తెలుసు. కానీ, ఎక్కడో తెలియదు గానీ ఒక దేశంలో గొడ్డలి, సుత్తి పట్టుకుని హెయిర్ కట్ చేస్తున్న వీడియో సంచలనం రేపుతోంది. ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో ఇది వైరల్‌గా షేర్ అవుతోంది. ఒక కుర్రాడు హెయిర్ కటింగ్ సెలూన్‌కు వెళ్లి కూర్చుంటే, అక్కడి వ్యక్తి ఒక గొడ్డలికి బాగా పదును పెట్టి, దాన్ని సుత్తితో కొడుతూ కుర్రాడికి హెయిర్ కట్ చేస్తాడు. అతడు కూడా ఏమాత్రం భయం లేకుండా అలాగే చేయించుకుంటాడు.
ఏమాత్రం గొడ్డలి కోణం మారినా, సుత్తి దెబ్బ కాస్త గట్టిగా తగిలినా కుర్రాడి ప్రాణాలకే ప్రమాదం. అయినా కూడా ఇద్దరూ ఏమాత్రం చలించకుండా అలాగే హెయిర్ కట్ మొత్తం పూర్తి చేసేశారు. అది కూడా చుట్టూ బాగా తక్కువ జుట్టు ఉంచి, మంచి షేప్‌లో కట్ చేయడం విశేషం. గత కొంత కాలంగా ఈ వీడియో షేర్ అవుతోందని ఫేస్బుక్ యూజర్లు చెబుతున్నారు. అయితే ఎప్పుడూ ఇలా గొడ్డలి సాయంతో హెయిర్ కట్ చేసేవాళ్లను మాత్రం ప్రత్యక్షంగా చూడలేదని అంటున్నారు.