‘గ్రేట్’ హారిస్...
ముంబై: పురుషుల లీగ్‌కు ఏమాత్రం తీసిపోని మ్యాచ్ మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)కు వన్నెలద్దింది. ఉత్తరప్రదేశ్ (యూపీ) వారియర్స్ ‘హిట్టర్’ గ్రేస్ హారిస్ (26 బంతుల్లో 59 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆఖరి ఓవర్ మెరుపులతో మ్యాచ్ ఫలితాన్నే మార్చింది. 170 లక్ష్యం ఛేదించే క్రమంలో యూపీ ఒకదశలో 105/7 స్కోరుతో ఓటమికి దగ్గరైంది. ఈ దశలో సోఫీ ఎకిల్‌స్టోన్ (12 బంతుల్లో 22 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) అండతో హారిస్ ధనాధన్ ‘గ్రేట్’ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించింది.
అబేధ్యమైన 8వ వికెట్‌కు ఈ ఇద్దరు 4.1 ఓవర్లలో 70 పరుగులు జోడించి యూపీని గెలిపించారు. ఆఖరి ఓవర్లో యూపీకి 19 పరుగుల కావాల్సి ఉండగా.. అనాబెల్ వేసిన ఈ ఓవర్లో గ్రేస్ వరుసగా 6, వైడ్, 2, 4, వైడ్, 4, 6లతో ఏకంగా 24 పరుగులు పిండుకుంది. దీంతో యూపీ 3 వికెట్లతో గుజరాత్ జెయింట్స్‌పై గెలిచింది. అంతకుముందు గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 169 పరుగులు చేసింది.
హర్లీన్ డియోల్ (32 బంతుల్లో 46; 7 ఫోర్లు) రాణించగా, సబ్బినేని మేఘన (15 బంతుల్లో 24; 5 ఫోర్లు), ఆష్లే గార్డ్నర్ (19 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్), హేమలత (13 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడారు. యూపీ బౌలర్లలో సోఫీ ఎకిల్‌స్టోన్, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన యూపీ వారియర్స్ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసి గెలిచింది. కిమ్ గార్త్ (5/36) యూపీని బెంబేలెత్తించినా ఫలితం లేకపోయింది.
స్కోరు వివరాలు
గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్: మేఘన (సి) శ్వేత (బి) సోఫీ 24; సోఫియా (బి) దీప్తి 13; హర్లిన్ (సి) తాలియా (బి) అంజలి శర్వాణి 46; అనాబెల్ సదర్లాండ్ (సి) అంజలి (బి) సోఫీ 8; సుష్మ (సి) శ్వేత (బి) తాలియా 9; గార్డ్నర్ (స్టంప్డ్) హీలీ (బి) దీప్తి 25; హేమలత (నాటౌట్) 21; స్నేహ్ రాణా (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 169.
వికెట్ల పతనం: 1–34, 2–38, 3–50, 4–76, 5–120, 6–142. బౌలింగ్: రాజేశ్వరి 4–0–30–0, అంజలి శర్వాణి 4–0–43–1, దీప్తి 4–0–27–2, సోఫీ 4–0–25–2, తాలియా 2–0–18–1, దేవిక 2–0–24–0.
యూపీ వారియర్స్ ఇన్నింగ్స్: హీలీ (సి అండ్ బి) గార్త్ 7; శ్వేత (సి) మాన్సి (బి) గార్త్ 5, కిరణ్ నవ్‌గిరే (సి) సుష్మ (బి) గార్త్ 53; తాలియా (సి) హేమలత (బి) గార్త్ 0; దీప్తి (బి) మాన్సి 11; గ్రేస్ హారిస్ (నాటౌట్) 59; సిమ్రన్ (బి) గార్త్ 0; దేవిక (సి) హేమలత (బి) అనాబెల్ 4; సోఫీ (నాటౌట్) 22; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (19.5 ఓవర్లలో 7 వికెట్లకు) 175.
వికెట్ల పతనం: 1–13, 2–19, 3–20, 4–86, 5–88, 6–88, 7–105. బౌలింగ్: కిమ్ గార్త్ 4–0–36–5, తనూజ 4–0–29–0, గార్డ్నెర్ 4–0–34–0, అనాబెల్ 3.5–0–41–1, స్నేహ్ రాణా 2–0–16–0, మాన్సి 2–0–15–1.
♦ డబ్ల్యూపీఎల్‌లో నేడు
ముంబై ఇండియన్స్ Vs బెంగళూరు రాత్రి గం. 7:30 నుంచి
స్పోర్ట్స్ 18 చానెల్లో, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం