యువకుడు పాపకు జన్మనిచ్చాడు..!
లండన్: బ్రిటన్‌కు చెందిన 21ఏళ్ల యువకుడు పండంటి బిడ్డకు జన్మనిచ్చాడు. హేడెన్ క్రాస్ అనే యువకుడు లింగమార్పిడి చేయించుకొని ఓ పాపకు జన్మనిచ్చిన తొలి పురుషుడిగా రికార్డు సృష్టించాడు. స్త్రీగా పుట్టిన హేడెన్ లింగమార్పిడి చేయించుకుని పురుషుడిలా మారాడు. మూడేళ్ల నుంచి ఆమె అతడిలా మారి జీవిస్తున్నాడు. పురుషుడిగా మారేందుకు హార్మోన్ల మార్పిడి చికిత్స చేయించుకున్నాడు. దాంతో భవిష్యత్తులో బిడ్డలను కనలేనని ముందుగానే బిడ్డను కనాలని నిర్ణయించుకున్నాడు. దీంతో వీర్యం దానం చేయాల్సిందిగా ఫేస్బుక్లో కోరాడు. ఓ దాత ముందుకు వచ్చి వీర్యం దానం చేయడంతో హేడెన్ గర్భం దాల్చాడు. ఈ వార్త అప్పట్లో సంచలనం సృష్టించింది.
జూన్ 16న గ్లోసెస్టేర్ రాయల్ ఆసుపత్రిలో హేడెన్ బిడ్డకు జన్మనిచ్చాడు. ఆ పాపకు పైగే అని పేరు కూడా పెట్టుకున్నాడు. తండ్రిని అయినందుకు ఎంతో గర్వంగా ఉంది అని హేడెన్ తెగ సంతోష పడిపోతున్నాడు. పురుషుడిగా మారిన తర్వాత ఓ బిడ్డకు జన్మనిచ్చిన తొలి వ్యక్తి ఇతనే అనేందుకు సరైన ఆధారాలు లేవు. ప్రపంచంలోనే తొలిసారిగా గర్భం దాల్చిన వ్యక్తిగా అమెరికాకు చెందిన థామస్ బెయిటీ నిలిచాడు. వీర్యదాత ద్వారా గర్భం దాల్చిన థామస్‌కు ప్రస్తుతం ముగ్గురు పిల్లలు.